Fear
-
జార్ఖండ్‌లో భూకంపం.. వణికిన రాంచీ, జంషెడ్పూర్
రాంచీ: జార్ఖండ్‌లో భూకంపం సంభవించింది. రాజధాని రాంచీ, జంషెడ్‌పూర్‌తో పాటు చుట్టుపక్కల పలు జిల్లాల్లో శనివారం ఉదయం భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.జార్ఖండ్‌లోని ఖర్సావాన్ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం 9:20 గంటలకు భూకంపం వచ్చింది. వెంటనే జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: దాడిలో భర్త మృతి.. గర్భిణి భార్య చేత బెడ్ శుభ్రం చేయించి.. -
పాక్‌కు మోదీ అంటే భయం..: అమిత్ షా
మెంఢర్: ‘‘ప్రధాని నరేంద్ర మోదీ అంటే పాకిస్తాన్ భయపడుతోంది. అందుకే జమ్మూకశీ్మర్‌లో సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా భారత్ సమాధానం ఎంత తీవ్రంగా ఉంటుందో పాక్‌కు తెలుసన్నారు. సరిహద్దుల్లోని పూంఛ్ జిల్లాలో శనివారం ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మంత్రి మాట్లాడారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని యువకులకు తుపాకులు, రాళ్ల స్థానంలో ల్యాప్‌టాప్‌లను అందించడం ద్వారా ఇక్కడ తీవ్రవాదాన్ని తుడిచిపెట్టామన్నారు. 1990ల్లో తరచూ చోటుచేసుకున్న సీమాంతర ఉగ్రవాదం నేడు కనిపిస్తోందా అని ప్రజలను ప్రశ్నించారు. ‘‘గతంలో ఇక్కడి పాలకులు పాకిస్తాన్‌ను చూసి భయపడేవారు. ఇప్పుడు మోదీని చూసి పాక్‌కు భయం పట్టుకుంది. కాల్పులకు దిగేందుకు సాహసించడం లేదు. జమ్మూకశీ్మర్‌లో 1990ల్లో మొదలైన ఉగ్రవాదానికి 2014 నాటికి 40 వేల మంది బలయ్యారు. దాన్ని ఆపడంలో ఆ మూడు (అబ్దుల్లా, ముఫ్తీ, నెహ్రూ) కుటుంబాలు విఫలమయ్యాయి. పైపెచ్చు, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టాయి. జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం వేళ్లూనడానికి వాళ్లు ఎప్పుడూ ప్రయతి్నంచలేదు. ఆ మూడు కుటుంబాల పాలనకు ముగింపు పలికేలా అసెంబ్లీ ఎన్నికల్లో తీరి్పవ్వండి’’ అని అమిత్ షా పిలుపునిచ్చారు.ఉగ్రవాదంతో ఎవరికీ లాభం లేదు ‘ఉగ్రవాదం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. తుపాకులను మన పిల్లలకు అందజేద్దాం. మన యువతను ఆర్మీ, పోలీసు విభాగాల్లోకి పంపేందుకు ప్రయతి్నద్దాం. ఇందుకోసం సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ డ్రైవ్‌లను ఏర్పాటు చేస్తాం’’ అని అమిత్ షా ప్రకటించారు. ‘‘కేంద్రంలో 2014లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడకుంటే ఇక్కడ పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగేవే కావు, 30 వేల మంది పంచాయతీ సభ్యుల ఎన్నికయ్యే వారే కాదు. ప్రజలపై ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్ పారీ్టల మూడు కుటుంబాల పెత్తనం మరింత పెరిగి ఉండేది’’ అని అమిత్ షా దుయ్యబట్టారు. గుజరాత్‌కు చెందిన ఒక నేత నియంత్రణ రేఖకు అతి సమీపంలోని మెంఢర్‌కు వచ్చి ఉండేవారే కాదని తన పర్యటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 1947లో సరిహద్దులను కాపాడిన పహాడీలు, బకర్వాలాలు, గుజ్జర్లను చూసి జాతి గరి్వస్తోందన్నారు. -
Allahabad High Court: సమ్మతి ఉన్నా, భయపెడితే అత్యాచారమే
ప్రయాగ్‌రాజ్: సమ్మతితో లైంగిక సంబంధం పెట్టుకున్నాసరే ఆ సంబంధం భయంతో కొనసాగితే అత్యాచారంగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళ వేసిన కేసు విచారణ సందర్భగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో విచారణ ఆపాలంటూ తమను ఆశ్రయించిన రాఘవ్ కుమార్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువరించింది. బాధితురాలు సివిల్ సరీ్వసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో రాఘవ్ పరిచయమయ్యాడు. ఆమెను అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత పెళ్లిచేసుకుంటానని నమ్మించి బలవంతంగా ఆ బంధాన్ని కొనసాగించాడంటూ బాధితురాలు ఆగ్రా జిల్లా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు ఆగ్రా జిల్లా కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీన్ని సవాలు చేస్తూ రాఘవ్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ అనీస్ కుమార్ గుప్తా సారథ్యంలోని అలహాబాద్ హైకోర్టు బెంచ్ కొట్టేసింది. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఫియర్’.. వేదిక ఫస్ట్‌లుక్ రిలీజ్
వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫియర్’. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. విడుదలకు ముందే ఈ చిత్రం వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది .(చదవండి: అభిమాని చివరి కోరిక తీర్చిన తారక్)తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ని స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఒక చీకటి గదిలో హీరోయిన్ భయపడుతూ చూస్తున్న స్టిల్ తో డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన "ఫియర్" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. -
మజిల్స్ రిలాక్సయితే మనసూ రిలాక్సవుతుంది! ఎలా అంటే..?
ప్రపంచం పరుగెడుతోంది. ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణమయ్యాయి. వీటిని ఎదుర్కొనే అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటే ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ (PMR). అమెరికన్ వైద్యుడు ఎడ్మండ్ జాకబ్సన్ 1920లో అభివృద్ధి చేసిన ఈ పద్ధతి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతోంది. ఆయన పేరు మీదే దీన్ని జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ (PMR) అంటున్నారు.శరీరం, మనసు వేర్వేరు కాదని, రెండూ ఒకటిదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయనే ఆలోచనపై ఈ టెక్నిక్ ఆధారపడి ఉంటుంది. ఇది ఒక సులువైన, శక్తిమంతమైన టెక్నిక్. దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ. మన శరీరంలోని కండరాల (మజిల్స్)ను నిర్దిష్ట క్రమంలో టెన్షన్ చేయడం, రిలాక్స్ చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతతను సాధించడమే జేపీఎమ్మార్ (PMR). ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది. దీర్ఘకాలిక నొప్పులున్న వారికి ఉపయోగపడుతుంది. ఈ టెక్నిక్ ద్వారా పబ్లిక్ స్పీకింగ్, పరీక్షలు లేదా మెడికల్ టెస్టుల సమయంలో కలిగే ఒత్తిడినీ తగ్గించుకోవచ్చు. అదెలా చేయాలో తెలుసుకుందాం.ఎలాంటి అంతరాయం కలగని ప్రశాంతమైన, సౌకర్యవంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి. రిలాక్సింగ్ చైర్ లేదా మంచం మీద పడుకోవాలి.వదులుగా ఉండే, సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలి. మన కదలికలకు ఇబ్బంది కలిగించే వస్తువులను తీసేయాలి.నిండుగా ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టాలి. ఇది శరీరాన్ని, మనసును విశ్రాంతికి సిద్ధం చేస్తుంది.పాదాల నుంచి తల దాకా ప్రతిభాగంలోని కండరాలను ఐదు నుంచి పది సెకన్ల వరకు వీలైనంత గట్టిగా పట్టి ఉంచాలి. తర్వాత నిదానంగా సడలించాలి.దాదాపు 20 నుంచి 30 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవాలి. నెమ్మదిగా నిండుగా ఊపిరి తీసుకోవాలి. కండరాలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించాలి.అన్ని కండరాల సమూహాలను సడలించిన తర్వాత, పూర్తి విశ్రాంతిని ఆస్వాదించడానికి కొంత సమయం కేటాయించాలి. మెల్లగా.. నిండుగా ఊపిరి తీసుకోవడం ద్వారా ఒత్తిడి నెమ్మదిగా కరిగిపోతుంది.కాసేపటి తర్వాత నెమ్మదిగా కళ్లు తెరచి, శరీరాన్ని సున్నితంగా కదిలించడం మొదలపెట్టాలి. మైకంగా ఉంటే మరి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.మంచి ఫలితాలు పొందడానికి ఈ ఎక్సర్సైజ్ ను క్రమం తప్పకుండా రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ప్రాక్టీస్ చేయాలి.టెన్షన్, రిలాక్సేషన్ సమయాల్లో శరీరం, మనసు ఎలా స్పందిస్తున్నాయో గమనించాలి.అవసరాన్ని బట్టి, సౌకర్యానికి అనుగుణంగా కండరాలకు ఒత్తిడిని, విశ్రాంతినిచ్చే సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలి. JPMR ప్రాక్టీస్ చేయడమిలా..– కాలి వేళ్లను గట్టిగా ముడుచుకుని, ఆపై వాటిని రిలాక్స్ చేయాలి.– కాలి వేళ్లను తల వైపు లాగుతూ కండరాలను బిగించి, తర్వాత నిదానంగా సడలించాలి.– మీ తొడ కండరాలను బిగించి, ఆపై సడలించాలి.– కడుపు కండరాలను బిగించి, నిదానంగా సడలించాలి.– నిండుగా ఊపిరి తీసుకుని.. అలాగే పట్టి ఉంచాలి. కాసేపటి తర్వాత శ్వాస వదిలి విశ్రాంతి తీసుకోవాలి.– వీపును కొద్దిగా వంచి, ఆపై నిదానంగా యథాస్థితికి రావాలి.– పిడికిలిని గట్టిగా బిగించి, ఆపై వదలాలి.– మోచేతులను వంచి, కండరాలను బిగించి, ఆ తర్వాత సడలించాలి.– భుజాలను చెవుల వైపు లేపి.. ఆపై వదలాలి.– తలను సున్నితంగా వెనక్కి నొక్కాలి. గడ్డాన్ని ఛాతీ మీదకు లాగాలి. ఆపై విశ్రాంతి తీసుకోవాలి.– కనుబొమలను పైకి లేపడం ద్వారా నుదిటిని బిగించి, ఆపై వదిలేయాలి.– కళ్లు గట్టిగా మూసుకొని, ఆ తర్వాత నెమ్మదిగా వదిలి విశ్రాంతి తీసుకోవాలి.– దవడను బిగించి, ఆపై విశ్రాంతి తీసుకోవాలి.– పెదాలను గట్టిగా ఒత్తి పట్టి, ఆపై వదిలేయాలి.– సైకాలజిస్ట్ విశేష్ఇవి చదవండి: ఇమామ్ కజిన్ : ఓ సిటీలోని ఒక కాలనీలో.. -
ఏదో మిస్ అవుతున్నానబ్బా అని.. పదే పదే ఈ సందేహమా?
సారిక ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం ఆమెకు మానుకోలేని అలవాటుగా మారింది. తన ఫ్రెండ్స్, ఆన్లైన్ ఫ్రెండ్స్ పెట్టిన వెకేషన్ పోస్టులు, కెరీర్ సక్సెస్ పిక్స్ లాంటివి చూసి ఆందోళన చెందుతోంది, అసంతృప్తికి లోనవుతోంది.కెరీర్లో అవకాశాలు పోతాయనే భయంతో విపరీతంగా పనిచేస్తోంది. అయినా వెనుకబడిపోతాననే ఆందోళన. కొలీగ్స్ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు బిజినెస్ మీటింగ్స్ అంటే ఉత్సాహంగా వెళ్లేది. ఈ మధ్య ఇతరుల ప్రెజెంటేషన్లతో పోల్చుకుని ఆందోళన చెందుతోంది. తరచుగా బిజినెస్ మీటింగ్స్‌కు డుమ్మా కొడుతోంది. అది ఆమె ఒంటరితనాన్ని మరింత పెంచుతోంది.ఏదో మిస్ అవుతున్నాననే బాధతో గిటార్‌ను, పెయింటింగ్‌ను పక్కన పడేసింది. ఏం చేయాలో తెలియక సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూంటుంది. అలా అర్ధరాత్రి వరకూ మేల్కొంటోంది. ఆ తర్వాత కూడా సరిగా నిద్ర పట్టడం లేదు. పగలంతా చికాకుగా ఉంటోంది. ఇవన్నీ ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులతో సంబంధాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ప్రయత్నించింది. అయినా ఫలితం కనిపించకపోవడంతో ఫ్రెండ్ సలహాతో కౌన్సెలింగ్‌కు వచ్చింది.‘నేను తప్ప అందరూ నాకంటే ఎక్కువ సక్సెస్ సాధిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. నేను అన్నీ మిస్ అవుతున్నాను’ అని చెప్పింది. సారిక ‘ఏదో మిస్ అవుతన్నాననే భయం (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–ఫోమో)తో బాధపడుతోందని అర్థమైంది. సారికలానే ఈ జనరేషన్లో చాలామంది ఈ సమస్యతో సతమతమవుతుంటారు.కారణాలు..– ప్రతి మనిషి జీవితంలోనూ కష్టం, సుఖం ఉంటాయి. జయాపజయాలు ఉంటాయి. కానీ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఆనందకరమైన అంశాలను మాత్రమే పంచుకుంటారు. ఇవి వాస్తవికతను వక్రీకరిస్తాయి. ఫోమోకు కారణమవుతాయి. – సారిక తన జీవితాన్ని ఆన్లైన్లో చూసే పర్ఫెక్ట్ లైఫ్‌లతో పోల్చుకుంటోంది. తనకలాంటి జీవితం లేదని అసంతృప్తి, తానలా సాధించలేకపోతున్నాననే అసమర్థతా భావనలతో కుంగిపోతోంది. – నిజ జీవితంలో కంటే కూడా సోషల్ మీడియాలో అందరూ తనను ఆమోదించాలని, మెచ్చుకోవాలని కోరుకుంటోంది. తన పోస్ట్‌లకు, ఫొటోలకు లైక్స్ రాకపోతే తీవ్ర నిరాశ చెందుతోంది.లక్షణాలు..– సోషల్ మీడియా అప్డేట్స్ను నిరంతరం చెక్ చేయాలనే ఆలోచన, చెక్ చేయకుండా ఉండలేకపోవడం ఫోమో ప్రధాన లక్షణం..– ఏదో మిస్ అవుతున్నాననే భయం, ఆందోళన..– సోషల్ మీడియా సెలబ్రిటీలతో పోల్చుకోవడం వల్ల తానలా లేననే దిగులు, డిప్రెషన్..– ఇంటి పనులు, ఆఫీసుపనులపై దృష్టి పెట్టలేకపోవడం..– తనకన్నా మంచి జీవితం గడుపుతున్నట్లు కనిపించే ఇతరుల పట్ల అసూయ..– అర్ధరాత్రి వరకూ సోషల్ మీడియా వాడకం వల్ల నిద్రలేమి..సెల్ప్ హెల్ప్ టిప్స్..– సోషల్ మీడియాను చెక్ చేయడానికి నిర్దిష్ట సమయాలను పెట్టుకోండి. – చెక్ చేయాలనే కోరికను తగ్గించుకోవడానికి మీ స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా యాప్స్‌ను తొలగించండి. కనీసం నోటిఫికేషన్స్‌ను ఆపేయండి. – మీ జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టండి. ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉండాల్సిన విషయాలను రాయండి. – మీకు స్ఫూర్తినిచ్చే, ఆనందాన్ని అందించే అకౌంట్స్‌ను మాత్రమే అనుసరించండి. ఆందోళన కలిగించే అకౌంట్స్‌ను అనుసరించవద్దు. – స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి, సానుకూల భావాలను పెంపొందించే అర్థవంతమైన పరిచయాలను పెంచుకోండి. – ఆనందాన్ని, సంతృప్తిని కలిగించే హాబీలను అలవాటు చేసుకోండి. – మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. ఆ వ్యాయామాలు.. ఏదో కోల్పోతున్నామనే ఆందోళనను తగ్గించేందుకు, వర్తమానంలో బతికేందుకు సహాయపడతాయి.– అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే ఏమాత్రం మొహమాటపడకుండా, భయపడకుండా సారికలా సైకాలజిస్ట్‌ను కలవండి. – కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) ఆందోళన తగ్గించేందుకు సహాయ పడుతుంది. మీ విలువను, బంధాల విలువను గుర్తిస్తారు. మళ్లీ మీ జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెడతారు. – డా. సైకాలజిస్ట్ విశేష్