
వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫియర్’. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. విడుదలకు ముందే ఈ చిత్రం వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది .
(చదవండి: అభిమాని చివరి కోరిక తీర్చిన తారక్)
తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఒక చీకటి గదిలో హీరోయిన్ భయపడుతూ చూస్తున్న స్టిల్ తో డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన "ఫియర్" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment