
రమ్య, రామ్ ప్రకాష్, నిష్కల, శ్రీజిత్
రామ్ ప్రకాష్ గున్నం హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘చెరసాల’(Cherasala). శ్రీజిత్, నిష్కల, రమ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్‌రాయ్ క్రియేషన్స్ పై కథ్రి అంజమ్మ, షికార నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది. రామ్ ప్రకాష్ గున్నం మాట్లాడుతూ– ‘‘రిలేషన్ షిప్‌లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే అంశాలతో ఈ మూవీ తీశాం.
ఇందులో మంచి భావోద్వేగాలతో పాటుగా, చక్కని వినోదం ఉంది ’’ అని అన్నారు. ‘‘ఈ చిత్రంపై దర్శకుడు నాలుగు సంవత్సరాలు దృష్టి పెట్టాడు. ఇలాంటి మంచి సినిమాలు రావాలి’’ అని పేర్కొన్నారు శ్రీజిత్. ‘‘ఓ అమ్మాయి తన భర్త కోసం, మాంగళ్యాన్ని కాపాడుకునేందుకు పడే తపనే ఈ కథ’’ అని తెలిపారు కథా రచయిత ఫణీంద్ర భరద్వాజ్.