కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా.. ఆ తర్వాత దర్శకుడిగా పలు సినిమాలు చేశాడు. ఇప్పుడు నటుడిగా బిజీ అయిపోయాడు. ఇతడు హీరోగా నటించిన ఓ తమిళ సినిమా.. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్)
ప్రభుదేవా, సన్నీ లియోన్, వేదిక హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'పెట్టా రాప్'. అక్టోబరులో తమిళంలో థియేటర్లలో రిలీజ్ కాగా.. డిజాస్టర్‌గా నిలిచింది. ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. ప్రభుదేవా, వేదిక యాక్టింగ్‌తో పాటు సన్నీలియోన్ రోల్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. ఇప్పుడు దీని తెలుగు వెర్షన్ నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.
'పెట్టా రాప్' విషయానికొస్తే.. బాల (ప్రభుదేవా) సినిమా యాక్టర్ కావాలనే కలతో బతుకుతుంటాడు. వందకుపైగా ఆడిషన్స్ ఇచ్చిన ఒక్క అవకాశం రాదు. ఎప్పటికీ నటుడివి కాలేవని స్నేహితులు బాలను అవమానిస్తారు. ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. జానకి (వేదిక) అనే సింగర్ ద్వారా బాల జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. బాల, జానకి మధ్య ఉన్న సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక)
Comments
Please login to add a commentAdd a comment