అవార్డులు కాదు.. ఆడియన్స్‌కి నచ్చాలి : డైరెక్టర్‌ హరిత గోగినేని | Director Haritha Gogineni Talks About Fear Movie | Sakshi
Sakshi News home page

అవార్డులు కాదు.. ఆడియన్స్‌కి నచ్చాలి : ‘ఫియర్‌’ డైరెక్టర్‌ హరిత గోగినేని

Published Sat, Dec 7 2024 3:57 PM | Last Updated on Sat, Dec 7 2024 4:05 PM

Director Haritha Gogineni Talks About Fear Movie

‘నాకు సినిమాలంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. బుక్స్ చదివే అలవాటు ఉంది. కొన్ని కథలు రాసుకున్నాను. క్రమంగా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. మూడేళ్ల క్రితం ‘ఫియర్’ సినిమా ఆలోచన మొదలైంది. అయితే అప్పుడు లక్కీ లక్ష్మణ్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం. అది కంప్లీట్ అయ్యాక పూర్తిగా ఈ సినిమా మీదే దృష్టి పెట్టాం.అందరికి నచ్చేలా ఈ సినిమాని తెరకెక్కించాం అన్నారు’ దర్శకురాలు డా. హరిత గోగినేని. ఆమె దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ఫియర్‌’. వేదిక లీడ్‌ రోల్‌లో నటించగా.. అరవింద్‌ కృష్ణ ఓ ప్రత్యేక పాత్ర పోషించాడు. విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ గెలుచుకున్న ఈ మూవీ.. డిసెంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హరిత గోగినేని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

రెగ్యులర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా "ఫియర్" ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేందుకు ఇష్టపడరు. కానీ మా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది.

వేదిక కంటే ముందు మరికొందరు హీరోయిన్స్ ను అప్రోచ్ అయ్యాం. అయితే వాళ్ల డేట్స్ కోసం ఏడాది పాటు ఆగాలని చెప్పారు. అంత టైమ్ వెయిట్ చేయడం ఇష్టం లేక కొన్నిఆప్షన్స్ చూశాం. వేదిక ముని, కాంచన 3 వంటి మూవీస్ లో బాగా నటించింది. మా సబ్జెక్ట్ కు కూడా చాలా యాప్ట్ అనుకుని ఆమెను సంప్రదించాం. కథ విన్న తర్వాత వేదిక కూడా వెంటనే ఓకే చెప్పింది. నేను అనుకున్న కథలో వేదికను ఊహించుకుంటే ఆమె పర్పెక్ట్ అనిపించింది.

సినిమా భయం గురించి కాబట్టి ఫస్ట్ టైటిల్ భయం అనే పెట్టాలనుకున్నాం. అయితే అది క్యాచీగా ఉండదని ఫియర్ అని పెట్టా. ఫియర్ అంటే అన్ని భాషలకు రీచింగ్ బాగుంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు యూనివర్సల్ కంటెంట్. అందరికీ నచ్చుతాయి. ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా గుర్తింపు పొందడానికి టైటిల్ ఒక కారణమైంది. ఫిలిం ఫెస్టివల్స్ లో ఎన్ని అవార్డ్స్ వచ్చినా మన తెలుగు ఆడియెన్స్ కు నచ్చితే ఎక్కువ సంతోషాన్నిస్తుంది.

ఈ సినిమా మేకింగ్ పక్కా ప్లానింగ్ తో చేశాను. ఏ సీన్ ఎంత ఉండాలి ఏ షాట్ ఎంత సేపు పిక్చరైజ్ చేయాలని పక్కాగా చేశాం. 2 గంటల ఫుటేజ్ వచ్చింది. ఒక 8 నిమిషాలు ఎడిటింగ్ లో తీసేశాం. డైరెక్టర్ క్లారిటీగా ఉంటే మేకింగ్ లో ఎలాంటి వేస్టేజ్ ఉండదు. నిర్మాత మీద భారం పడదు. ఆర్టిస్టుల డేట్స్ తీసుకునేప్పుడు కూడా ఎన్ని రోజులు షూటింగ్ చేస్తామో చెప్పి మరీ తీసుకున్నాం.

వేదిక నటన చూసిన తర్వాత ఎంతో సంతృప్తిగా అనిపించింది. నేను అనుకున్న పాత్రను తను పర్పెక్ట్ గా పర్ ఫార్మ్ చేసింది. అరవింద్ కృష్ణ మేము అడిగిన వెంటనే క్యారెక్టర్ చిన్నదైనా చేశాడు. కథలో నిడివి తక్కువైనా తన క్యారెక్టర్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది.

అనూప్ రూబెన్స్ గారితో పనిచేయడం చాలా సులువు. ఆయన స్టార్స్ సినిమాలకు పనిచేసినా కొత్త వాళ్లతో వర్క్ చేసేందుకు ఎలాంటి ఈగో చూపించరు. "ఫియర్" మూవీలో బీజీఎం అద్భుతంగా చేశారు.

మంచి ప్రయత్నం నిజాయితీగా చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. పెద్ద సినిమాలంటే స్టార్స్ తోనే చేయాలి. చిన్న చిత్రాలకు కంటెంట్ బాగుంటే చాలు. నాకు ఈ మూవీ మేకింగ్ టైమ్ లో థియేటర్ కు ఇలా ఉండాలి ఓటీటీకి అలా ఉండాలి అని చాలా చెప్పారు. నేను కథను ఎంత జెన్యూన్ గా రూపొందించాలో అంతే జెన్యూన్ గా చేశా. ఎవరు చెప్పినవి యాడ్ చేయలేదు.

నవరసాల్లో అన్ని జానర్స్ కథల లైన్స్ నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మంచి యాక్షన్ మూవీతో పాటు ఒక కామెడీ ఎంటర్ టైనర్ సినిమా నెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement