ఇంగ్లీష్‌ లిరిక్స్‌తో ‘ఫియర్‌’ టైటిల్‌ సాంగ్‌ | Vedhika Starrer Fear Movie Title Song Out | Sakshi
Sakshi News home page

ఇంగ్లీష్‌ లిరిక్స్‌తో ‘ఫియర్‌’ టైటిల్‌ సాంగ్‌

Published Sat, Dec 7 2024 3:10 PM | Last Updated on Sat, Dec 7 2024 3:42 PM

Vedhika Starrer Fear Movie Title Song Out

హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా "ఫియర్". ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.‌ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. "ఫియర్" సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు "ఫియర్" మూవీ నుంచి టైటిల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా..మేఘన, నీల్ క్రితన్ ఆకట్టుకునేలా పాడారు. ఫియర్ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇంగ్లీష్ లో ఉండటం ‌విశేషం. నాయిక వేదిక క్యారెక్టర్ ను భయాలు ఎలా చుట్టుముట్టాయి. ఆ ఫియర్ ప్రభావం ఆమె మీద ఎంతగా ఉందో చెప్పేలా ఈ పాటను డైరెక్టర్ డా. హరిత గోగినేని ఆసక్తికరంగా డిజైన్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement