వేదిక లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ఫియర్’. హరిత గోగినేని దర్శకత్వంలో డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజైంది. ఆదివారం జరిగిన సక్సెస్‌మీట్‌లో హరిత గోగినేని మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి 30 ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 70కి పైగా అవార్డులు దక్కాయి. ఎవరైనా ఒక సెలబ్రిటీ ఒక అవార్డు గెలుచుకుంటే ఎంతో ప్రచారం దక్కుతుంది.
కానీ మేం కొత్తవాళ్లం కాబట్టి ఇన్ని అవార్డ్స్ వచ్చినా ఎవరూ ఫోకస్ చేయలేదు. తెలుగు సినిమాలో ఎవరూ వాడని, యునిక్ కలర్ ΄్యాట్రన్‌ను మేం వాడాం. మంచి సౌండింగ్ ఉన్న థియేటర్‌లో ఈ సినిమా చూడండి’’ అన్నారు. ‘‘మా సినిమాను 150 థియేటర్స్‌లో రిలీజ్ చేశాం. అన్ని సెంటర్స్ నుంచిపాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది’’ అన్నారు ఏఆర్ అభి.
Comments
Please login to add a commentAdd a comment