సస్పెన్స్‌... థ్రిల్‌ | Vedhika Fear Grand Release on December 14th | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌... థ్రిల్‌

Published Wed, Nov 27 2024 4:05 AM | Last Updated on Wed, Nov 27 2024 4:05 AM

Vedhika Fear Grand Release on December 14th

వేదిక ప్రధానపాత్రలో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘ఫియర్‌’. డా. హరిత గోగినేని దర్శకత్వంలో డా. వంకి పెంచలయ్య, ఏఆర్‌ అభి నిర్మించిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని డిసెంబరు 14న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించి, కొత్తపోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

‘‘ఫియర్‌’ సినిమా విడుదలకు ముందే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్‌ చేసిన ఈ చిత్రం టీజర్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది. ఓ డిఫరెంట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement