వేదిక(Vedhika) ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘ఫియర్’ (Fear) ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ చిత్రం సడెన్‌గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా మెప్పించిన ఈ సినిమాలో అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు నటించారు. డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మించారు. విడుదలకు ముందే ఈ చిత్రం వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది . అయితే, ఈ చిత్రం టాలీవుడ్‌లో గతేడాది డిసెంబర్ 14న రిలీజైంది.
(ఇదీ చదవండి: చనిపోయిన తర్వాత నా ఫోటోలు పెట్టకండి.. కన్నీళ్లతో గ్లామర్ క్వీన్ రిక్వెస్ట్)
ఫియర్ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే నేడు (జనవరి 22) ఓటీటీలో విడుదలైంది. 'అమెజాన్ ప్రైమ్'లో(Amazon Prime Video) ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఎక్కువగా థ్రిల్లర్ అంశాలతో పాటు హారర్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీనేజ్ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతమేరకు ఉండాలి అనే కాన్సెప్ట్‌తో ఫియర్ చిత్రాన్ని తీశారు. సినిమా కాస్త పర్వాలేదనిపించేలా ఉంటుంది. కానీ, పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేకపోయింది.
కథేంటంటే..
సింధు(వేదిక) అనే అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతూ ఉంటోంది. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు ఊహించుకుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకరోజు తాను ప్రాణంగా ప్రేమించే అరవింద్ కృష్ణ(సంపత్) దూరం కావడంతో మరింత మనోవేదనకు గురి అవుతుంది. అంతేకాకుండా తన చెల్లి ఇందుతో గొడవ పడటం, పేరేంట్స్‌కు దూరంగా ఉండటం లాంటి సింధును మరింత కుంగదీస్తాయి. అసలు సింధు తన చెల్లితో ఎందుకు గొడవ పడింది? తల్లిదండ్రులకు దూరంగా ఉండటానికి కారణమేంటి? ఆమె ప్రియుడు సంపత్ తిరిగొచ్చాడా? అనేది తెలియాలంటే ఫియర్ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment