vedika
-
టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఫియర్ మూవీ ఆడియన్స్‌ను భయపెట్టిందా?
టైటిల్: ఫియర్నటీనటులు: వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులునిర్మాణ సంస్థ: దత్తాత్రేయ మీడియానిర్మాత: డా. వంకీ పెంచలయ్య, ఏఆర్ అభిరచన, ఎడిటింగ్, దర్శకత్వం : డా. హరిత గోగినేనిసంగీతం: అనూప్ రూబెన్స్సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూవిడుదల తేది: డిసెంబర్ 14, 2024వేదిక, అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫియర్. డా. హరిత గోగినేని డైరెక్షన్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం డిసెంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విడుదలకు ముందే ఈ మూవీ పలు అవార్డులు దక్కించుకుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సింధు(వేదిక) అనే అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతూ ఉంటోంది. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు ఊహించుకుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకరోజు తాను ప్రాణంగా ప్రేమించే అరవింద్ కృష్ణ(సంపత్) దూరం కావడంతో మరింత మనోవేదనకు గురి అవుతుంది. అంతేకాకుండా తన చెల్లి ఇందుతో గొడవ పడటం, పేరేంట్స్‌కు దూరంగా ఉండటం లాంటి సింధును మరింత కుంగదీస్తాయి. అసలు సింధు తన చెల్లితో ఎందుకు గొడవ పడింది? తల్లిదండ్రులకు దూరంగా ఉండటానికి కారణమేంటి? ఆమె ప్రియుడు సంపత్ తిరిగొచ్చాడా? అనేది తెలియాలంటే ఫియర్ చూడాల్సిందే.కథ ఎలా ఉందంటే..గతంలో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ మాత్రం చాలా అరుదుగానే ఉంటాయి. మొదటిసారి తల్లిదండ్రులను ఆలోచింపజేసేలా ఉంది ఈ ఫియర్ స్టోరీ. ఈ కథ మొత్తం సింధు చుట్టూనే తిరుగుతుంది. ఆమె ప్రియుడు సంపత్ దూరం కావడంతో మానసికంగా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎక్కడికెళ్లినా ఎవరో తనను వెంబడిస్తున్నారనే భ్రమలో ఉంటూ భయానికి గురవుతుంది. కొన్ని సీన్స్‌లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌లో కన్ఫ్యూజన్కు గురి చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్న క్యూరియాసిటీని మిస్ అవ్వకుండా డైరెక్టర్ జాగ్రత్తపడ్డారు.సెకండాఫ్ వచ్చేసరికి అసలు సింధుకు అలా మారడానికి దారితీసిన పరిస్థితులు ఆడియన్స్‌ను ఆలోచించేలా చేస్తాయి. అసలు సింధుకు నిజంగానే సైకాలాజికల్ డిజార్డర్ ఉందా? ఎవరికీ కనిపించని వ్యక్తులు.. ఆమెకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు? సింధుకు కనిపిస్తున్నవారంతా ఆమె జీవితంలో ఉన్నారా? లేదంటే కావాలనే తాను అలా ప్రవర్తిస్తోందా? అనే క్యూరియాసిటీ ఉండేలా కథను మలిచాడు డైరెక్టర్. కథ మొదలైనప్పటి నుంచి సినిమా క్లైమాక్స్ వరకు ట్విస్ట్‌లు, సస్పెన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. అయితే డైరెక్టర్ తాను అనుకున్న కథను తెరపై చక్కగా ఆవిష్కరించారు. స్లో నేరేషన్ అక్కడక్కడా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మరింత ఫోకస్ చేయాల్సింది. కొన్ని సీన్స్‌లో కథలో కనెక్షన్ మిస్సయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు తల్లిదండ్రులకు మంచి మేసేజ్ ఇచ్చేలా ఉంది ఫియర్ మూవీ.ఎవరెలా చేశారంటే..లీడ్‌రోల్ పోషించిన వేదిక ద్విపాత్రాభినయంతో అభిమానులను కట్టిపడేసింది. సంపత్ పాత్రలో అరవింద్ కృష్ణ మెప్పించాడు. పవిత్రా లోకేశ్, షాయాజీ షిండే, జయప్రకాశ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతికత విషయానికొస్తే ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ బీజీఎం ఈ సినిమాకు కాస్తా ప్లస్ అనే చెప్పొచ్చు. ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.రేటింగ్ : 2.75/5 -
'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తెలుగులో మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతుంది. అది కూడా హారర్ బ్యాక్‌డ్రాప్ కావడం ఆసక్తి పెంచుతోంది. కొన్నిరోజులుగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సిరీస్ గురించి చెబుతూ వచ్చారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అలానే స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడనేది కూడా అధికారికంగా వెల్లడించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఏ ఓటీటీలో రిలీజ్ కానుంది?తెలుగులోనూ హారర్ కథలతో వెబ్ సిరీసులు వస్తున్నాయి. ఇప్పుడు అలా 'యక్షిణి' పేరుతో తీసిన సిరీస్‌లో మంచు లక్ష్మీ, వేదిక, రాహుల్ విజయ్, అజయ్ కీలక పాత్రలు పోషించారు. 'బాహుబలి' నిర్మాతలు తీసిన ఈ సిరీస్.. జూన్ 14 నుంచి హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుండటం విశేషం.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ట్రైలర్ బట్టి చూస్తే.. యక్షిణి అనే దేవకన్య శాపానికి గురవుతుంది. దీంతో మనిషిగా పుడుతుంది. అలానే 100 మంది యువకుల్ని వశపరుచుకుని చంపితేనే శాపవిముక్తి జరుగుతుంది. దీంతో విజయవంతంగా 99 మందిని చంపిన యక్షిణి.. 100వ వాడి విషయంలో మాత్రం ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరి తాను అనుకున్నది నెరవేర్చుకుందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.కాన్సెప్ట్ పరంగా చూస్తే ఆసక్తికరంగానే ఉంది. ట్రైలర్లో గ్రాఫిక్స్ కూడా పర్వాలేదనిపించేలా ఉన్నాయి. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ పాత్రలే మెయిన్. మరి ఈ హారర్ సిరీస్.. తెలుగు ఓటీటీ ప్రేక్షకులని ఎంతమేర ఆకట్టుకుంటుందనేది చూడాలి?(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!) -
సస్పెన్స్.. థ్రిల్
‘కాంచన 3, రూలర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ వేదిక లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఫియర్’. హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ఏఆర్ అభి నిర్మించారు. కాగా బుధవారం (ఫిబ్రవరి 21) వేదిక పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఫియర్’. ఇందులో వేదిక క్యారెక్టర్ కొత్తగా ఉంటూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది. ఆమె కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన చిత్రం అవుతుంది. ప్రస్తుతం ‘ఫియర్’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ, సహ నిర్మాతలు: సుజాత రెడ్డి, సామ సురేందర్ రెడ్డి. -
Fear Movie: భయపెట్టడానికి రెడీ అవుతున్న వేదిక!
కాంచన, రూలర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ వేదిక. ఆమె ప్రధాన పాత్రలో ఓ సస్పెన్స్ , థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతుంది. హరిత గోగినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు మురళీ మోహన్ పాల్గొని స్క్రిప్ట్ అందించగా...డైరెక్టర్ కరుణాకరన్ క్లాప్ నిచ్చారు. ఈ సందర్భంగా హీరోయిన్ వేదిక మాట్లాడుతూ.. ‘ఫియర్ మూవీ షూటింగ్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా క్యారెక్టర్ మల్టీ డైమెన్షన్స్ తో ఉంటుంది’ అన్నారు. డైరెక్టర్ హరిత గోగినేని మాట్లాడుతూ ..‘ప్రేక్షకులకు ఎలాంటి సినిమా నచ్చుతుంది అనేది ఆలోచిస్తూ ఏడాదిపాటు ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేశాను. ఈ స్క్రిప్టుకు వేదిక లాంటి మంచి హీరోయిన్ దొరకడం సంతోషంగా ఉంది. సినిమా పట్ల ఆమెకున్న డెడికేషన్ చూస్తుంటే ఎంతో ఎంకరేజింగ్ గా ఉంది. మంచి టీమ్ నాకు దొరికింది. వీరి సహాయంతో నేను అనుకున్న స్క్రిప్ట్ తో ఇన్ టైమ్ లో సినిమా రూపొందించి ప్రేక్షకులకు నచ్చేలా స్క్రీన్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాను’ అన్నారు. ‘ఫియర్ స్క్రిప్ట్ ను హరిత చాలా బాగా రాసుకుంది. ఆ స్క్రిప్ట్ ను యాక్సెప్ట్ చేసి హరితకు సపోర్ట్ చేస్తున్న వేదిక గారికి థ్యాంక్స్’అని నిర్మాత ఏఆర్ అభి అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో అరవింద్ కృష్ణ, సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ, డైరెక్టర్ తేజ కాకుమాను, హీరో సోహైల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. -
‘ఫియర్’ మూవీ ఓపెనింగ్ (ఫొటోలు)
-
Vedika: జీరో సైజ్ భామ హీరోయిన్ వేదిక గ్లామర్ రచ్చ (ఫొటోలు)
-
ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రజాకార్’. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఈ సినిమాలోని ‘పోతుగడ్డ మీద..’ పాటను విడుదల చేశారు. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో బాబీ సింహా మాట్లాడుతూ– ‘‘భీమ్స్‌గారి సంగీతం, సుద్దాల అశోక్తేజగారి సాహిత్యంలో ఏదో తెలియని భావోద్వేగం ఉంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కూడా మేం అంతే భావోద్వేగానికి లోనయ్యాం’’ అన్నారు. ‘‘సుద్దాల అశోక్‌తేజ, భీమ్స్గార్లు ఊరికే ఎమోషన్ కాలేదు. మా పూర్వీకుల చరిత్రలో అంతటి ఆవేదన నిండి ఉంది. భీమ్స్‌గారు పాడిన పాట వింటే పోతుగడ్డ మీద పుట్టిన భూమి బిడ్డల ఆత్మ ఘోషిస్తున్నట్లు ఉంటుంది’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘సుద్దాల హనుమంత, జానకమ్మల బిడ్డను కాకుంటే నా పాటలో ఇంత ఎమోషన్ ఉండేది కాదు. రజాకార్ ఉద్యమంలో మా అమ్మా నాన్న పాల్గొన్నారు. స్వాతంత్య్రం కోసం వారు నైజాంకు వ్యతిరేకంగా పోరాడారు. రజాకార్ ఉద్యమంలో ్రపాణాలు కోల్పోయిన కమ్యూనిటీ నుంచి వచ్చిన భీమ్స్ ఉండటం నాకు కలిసొచ్చింది. ఈ తరహా సినిమా తీయాలంటే డబ్బులు ఉంటే సరిపోదు.. ధైర్యం కావాలి. ఆ ధైర్యం గూడూరు నారాయణరెడ్డికి ఉంది’’ అన్నారు సుద్దాల అశోక్‌తేజ. ‘‘మా తాతగారు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ సమాజం ఎంత కష్టానికి గురైందో, ఎన్ని కన్నీళ్లను చూసిందో... వారందరి స్వరాలకు నేను స్వరాన్ని సమకూర్చానని చె΄్పాలి’’ అన్నారు భీమ్స్ సిసిరోలియో. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనుష్య త్రిపాఠి, కొరియోగ్రాఫర్ స్వర్ణ, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్ పోతిరెడ్డి అంజిరెడ్డి పాల్గొన్నారు. -
రెండు హృదయాల కల
‘రూహి’ చిత్రం తర్వాత రాజ్‌కుమార్ రావు, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. ‘నో డ్రీమ్ ఈజ్ ఎవర్ చేజ్డ్ ఎలోన్!’ అనేది క్యాప్షన్. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్‌కు శరణ్‌శర్మ దర్శకత్వం వహించగా, కరణ్ జోహార్ నిర్మించారు. ‘‘ఒకే కల కోసం రెండు హృదయాలు ఎదురు చుస్తున్నాయి’’ అంటూ ఈ మూవీని ఏప్రిల్ 19న రిలీజ్ చేయనున్నట్లుగా జాన్వీ కపూర్ అండ్ టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. -
నా మనశ్శాంతి పోయింది పోలీసులే వెతకాలి
‘నా మనశ్శాంతి పోయింది. పోలీసులే వెతికి తేవాలి. స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ చేస్తా’ అని ఒక ముంబై మహిళ సరదాగా పెట్టిన ‘ఎక్స్’ పోస్టుకు పోలీసులు సినిమా భాషలో సరదాగా సమాధానం చెప్పారు. అది కాస్తా వైరల్ అయ్యి పోలీసులను మెచ్చుకున్నవారూ... మీ పంచ్‌లు తర్వాత... ముందు మా కేసులు చూడండి అని మొత్తుకున్నవారూ ఉన్నారు. ఈ సరదా ఉదంతం ఎట్టిదనిన... ‘పోలీస్ స్టేషన్ జా రహీ హూ... సుకున్ ఖోగయాహై మేరా’ (నా మనశ్శాంతి పోయింది... వెతికి పెట్టమని కోరేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నా) అంటూ అక్టోబర్ 31న వేదిక ఆర్య అనే మహిళ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టింది. మనశ్శాంతిగా లేను అని చెప్పడానికి ఆమె చేసిన సరదా ప్రయోగం అది. ముంబై పోలీసులు ఆమెకు సరదాగా సినిమా భాషలో సమాధానం చెప్పారు. వారు హిందీ సినిమాల పేర్లతో చెప్పినా... తెలుగు సినిమాలకు అన్వయిస్తే ఆ సమాధానం ఇలా ఉండొచ్చు... ‘మన మనసు ‘శాంతి నివాసం’లా ఉండాలని ప్రతి ఒక్కరూ ‘ఆశ ఆశ ఆశ’ పడతారు. ‘అన్వేషణ’ సాగిస్తారు. ‘ఇది (మీ ఒక్కరి) కథ కాదు’. మీ ‘గుప్పెడు మనసే’ ఏదో ఒకనాటికి దీనిని కనుగొనగలదు. అయినా సరే మా సాయం కావాలంటే అది మా ‘కర్తవ్యం’. మీరు ఎప్పుడొచ్చినా ‘ఆవిడే శ్యామలా’ అని గుర్తించగలం’... ఇలాంటి జవాబు చూసి పోలీసు వారిలో ఇంత పంచ్ ఉందా అని చాలా మంది మెచ్చుకున్నారు. అలాగే రకరకాల జవాబులూ వచ్చాయి. ‘మనశ్శాంతి దొరికితే మాక్కూడా చెప్పండి’ అని ఒకరు, ‘షాపింగ్ చెయ్ దొరుకుతుంది’ అని ఒకరు, ‘మనశ్శాంతి స్నేహితుల దగ్గర ఉంటుంది’ అని ఒకరు ‘రాధాకృష్ణ మందిరానికి పో’ అని ఒకరు వేదిక ఆర్యకు సలహాలు ఇస్తే మరి కొందరు పోలీసులకు చివాట్లేశారు. ‘మా కేసు సంగతి చూడండి ముందు’ అని ఒకరు, ‘ఫేస్బుక్లో వీడు వేధిస్తున్నాడు.. వీడి సంగతి చూడండి ముందు’ అని మరొకరు రిప్లైలు పెట్టారు. ‘ఉన్న మనశ్శాంతి లాక్కోకపోతే అదే పదివేలు’ అని ముక్తాయించారొకరు. -
భవిష్యత్తుకు భరోసా!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో రాజుకున్న వేడి క్రమంగా చల్లబడుతోంది. పార్టీ నేతల మధ్య సయోధ్యకు జరుగుతున్న ప్రయత్నాలు ఒకటొకటిగా కొలిక్కి వస్తున్నాయి. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని బుజ్జగించిన అధినేత కేసీఆర్.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఆ నియోజకవర్గం టికెట్ ఖరారు చేశారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య నడుమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమక్షంలో రాజీ కుదిరింది. నర్సాపూర్ అభ్యర్థి ప్రకటనలో నెలకొన్న ప్రతిష్టంభనను కూడా రెండు మూడురోజుల్లో తొలగించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కల్వకుర్తి, పటాన్చెరు తదితర నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై కూడా కేటీఆర్ దృష్టి సారించారు. జనగామ, నర్సాపూర్‌తో పాటు నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను మరో వారం రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఆర్టీసీ చైర్మన్ పదవి కావాలన్న ముత్తిరెడ్డి? ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, వెంకట్రాంరెడ్డి శుక్రవారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నివాసానికి వెళ్లారు. అంతా కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ముత్తిరెడ్డికి టికెట్ నిరాకరణకు కారణాలను వివరించిన కేసీఆర్.. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సహకరించి ఆయన గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం ఏదో ఒక ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వడంతో పాటు, భవిష్యత్తులో ఎమ్మెల్సీగానూ అవకాశం కల్పిస్తానని హామీ ఇ చ్చినట్లు తెలిసింది. అయితే తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి కావాలని ముత్తిరెడ్డి కోరగా ప్రస్తుతం ఎమ్మెల్సీ పల్లా నిర్వహిస్తున్న రైతుబంధు సమితి అధ్యక్ష పదవిని కేసీఆర్ ఆఫర్ చేసినట్లు సమాచారం. కాగా ముత్తిరెడ్డి బెట్టు వీడిన నేపథ్యంలో జనగామ బీఆర్ఎస్ అభ్యరి్థగా పల్లా పేరును కేసీఆర్ ఖరారు చేశారు. నర్సాపూర్, కల్వకుర్తిపై త్వరలో స్పష్టత నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనలో నెలకొన్న ప్రతిష్టంభనపై బీఆర్ఎస్ అధినేత దృష్టి సారించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా టికెట్ కోసం పట్టుబడుతుండటంతో అభ్యర్థి ప్రకటనను పెండింగులో పెట్టారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తానని మదన్‌రెడ్డి స్పష్టం చేస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమ లేదా మంగళవారం అందుబాటులో ఉండాల్సిందిగా ఇద్దరు నేతలకు ప్రగతిభవన్ నుంచి సమాచారం వెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కల్వకుర్తి టికెట్‌ను ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి కూడా శుక్రవారం ప్రగతిభవన్ నుంచి పిలుపు వెళ్లినట్లు తెలిసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు కసిరెడ్డి ప్రగతిభవన్‌కు చేరుకున్నప్పటికీ సీఎం ఇతర సమావేశాలతో బిజీగా ఉండటంతో భేటీ వాయిదా పడింది. కసిరెడ్డికి ఒకటి రెండురోజుల్లోనే మరోమారు పిలుపు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. తనను కల్వకుర్తి అభ్యరి్థగా ప్రకటించి, సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు తాను ఖాళీ చేసే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కసిరెడ్డి కోరుతున్నారు. వరంగల్ ఎంపీగా పోటీ చేస్తానన్న రాజయ్య! స్టేషన్ ఘన్పూర్ టికెట్ విషయంలో నెలకొన్న పంచాయితీ కూడా ప్రగతిభవన్ వేదికగా కొలిక్కి వ చ్చింది. ఎమ్మెల్సీ పల్లా శుక్రవారం స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యరి్థ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను వెంటబెట్టుకుని కేటీఆర్ వద్దకు వెళ్లారు. సంప్రదింపులు, చర్చల అనంతరం కడియం శ్రీహరి అభ్యరి్థత్వానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు రాజయ్య ప్రకటించారు. కడియం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవిని రాజయ్యకు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే గతంలో శ్రీహరికి వరంగల్ ఎంపీగా అవకాశం ఇ చ్చినందున తనకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాజయ్య కోరినట్లు సమాచారం. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనకు లోక్‌సభకు పోటీ చేసే అవకాశమివ్వాలని రాజయ్య పట్టుబట్టినట్లు సమాచారం. అయితే కేటీఆర్ ఏదో ఒక చట్టసభలో క చ్చితంగా పదవి ఇస్తామని భరోసా ఇవ్వడంతో రాజయ్య అంగీకరించినట్లు తెలిసింది. కేటీఆర్‌తో భేటీ అనంతరం కడియం శ్రీహరి గెలుపు కోసం పనిచేస్తానంటూ రాజయ్య ప్రకటించారు. కాగా పార్టీ నిర్ణయం మేరకు తనకు మద్దతు ప్రకటించిన రాజయ్యకు కడియం ధన్యవాదాలు తెలిపారు. -
యువతకు సందేశం
‘‘నేటి యువతకు సందేశం ఇవ్వడానికే ‘రజాకార్’ సినిమా తీశారు. ఇలాంటి చిత్రం తీసే ధైర్యం చేసిన మా డైరెక్టర్ సత్యనారాయణకి థ్యాంక్స్’’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బాబీ సింహా, వేదిక, అనుశ్రేయ త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో యాటా సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రజాకార్’. సమర్ వీర్ క్రియేషన్స్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను రాజాసింగ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ సినిమా టీజర్ చూస్తేనే ఎంతో కోపం వస్తోంది.. ఇక సినిమా చూస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి’’ అన్నారు. ‘‘తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17 మా సినిమాకి కథా వస్తువుగా మారింది. ఆ రోజు జరిగిన విముక్తి పోరాటంతో ఈ సినిమా తీశాను’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘ఈ చిత్రం మన చరిత్ర గురించి అందరికీ తెలియజేస్తుందనుకుంటున్నాను’’ అన్నారు గూడూరు నారాయణ రెడ్డి. -
విశాఖ వేదికగా మిలన్–2024
సాక్షి, అమరావతి: తూర్పు నావికాదళం విశాఖపట్నం వేదికగా వచ్చే ఫిబ్రవరిలో మిలన్–2024 నిర్వహించనుంది. తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్కర్ మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. మిలన్–2024 నిర్వహణ వివరాలను సీఎంకు తెలియజేశారు. విశాఖపట్నంలో నిర్వహించే మిలన్–2024కు 57 దేశాల ప్రముఖులు, నౌకాదళాలు పాల్గొనే అవకాశముందని చెప్పారు. సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లను అధిగవిుంచేందుకు తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రాజేశ్ పెందార్కర్‌ను సీఎం జగన్ సత్కరించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేయగా.. రాజేశ్ ముఖ్యమంత్రికి ఐఎన్ఎస్ విశాఖపట్నం షిప్ మోడల్‌ను బహూకరించారు. సమావేశంలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ వీఎస్సీ రావు, కెప్టెన్ రోహిత్ కట్టోజు, కమాండర్ వైకే కిశోర్, లెఫ్టినెంట్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ జవహర్‌రెడ్డిని తూర్పు నావికాదళ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. -
భావి తరాలకు చరిత్ర తెలియాలి
బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, ప్రధాన పాత్రల్లో యాటా సత్యానారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రజాకర్’. ఈ సినిమా ΄ోస్టర్ లాంచ్ ఈవెంట్లో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌లో 8, మహారాష్ట్రలో 5, కర్ణాటకలో 3 జిల్లాలు హైదరాబాద్ సంస్థానంగా ఉండేవి. ఇవన్నీ ఓ దేశంగా ఉండాలంటూ బ్రిటిష్ ప్రభుత్వం చట్టాన్ని విడుదల చేసిన కారణంగా నిజాం ప్రభువు స్వతంత్య్ర రాజ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతనికి బలంగా దాదాపు 2 లక్షల మంది రజాకార్స్ సైన్యంగా ఏర్పడి, ఆకృత్యాలు చేశారు. ఈ చరిత్ర భావి తరాలకు తెలియాలి. ఇలాంటి చరిత్రతో రూ΄÷ందిన ‘రజాకర్’ చిత్రాన్ని ్ర΄ోత్సహించాలి’’ అన్నారు. ‘‘ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే, హైదరాబాద్‌కు వచ్చింది సెప్టెంబరు 17న. ఈ చరిత్ర తెలియజేసే ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్. ‘‘రజాకార్’ సినిమా చూడక΄ోతే మన బతుక్కే అర్థం లేదు’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘తెలంగాణవాదిగా నా హక్కుగా, భారతీయుడిగా భావించి ఈ సినిమా చేశాను’’ అన్నారు నారాయణ రెడ్డి. -
జలకళ తీసుకువచ్చింది
బ్యాంకింగ్ రంగంలో క్షణం తీరిక లేని పనుల్లో ఉండేది వేదిక భండార్కర్. ఆ ఊపిరి సలపని పనుల్లో ఆమెకు కాస్త ఉపశమనం సామాజికసేవ. బ్యాంకింగ్ రంగాన్ని వదిలి సామాజికసేవా రంగం దారిని ఎంచుకున్న వేదిక... ‘సామాజిక సేవ మనకు వినయాన్ని నేర్పుతుంది. మనుసులో నుంచి మానవత్వ భావన పోకుండా కాపాడుతుంది. మరిన్ని మంచి పనులు చేయాలనే ఉత్సాహాన్ని ఎప్పుడూ ఇస్తుంది’ అంటోంది... ‘సామాజిక సేవారంగంలో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు’ అంటుంది ముంబైకి చెందిన వేదిక భండార్కర్. ‘స్టార్ బ్యాంకర్’గా పేరు తెచ్చుకున్న వేదిక జేపీ మోర్గాన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్‌గా పనిచేసింది. ఆ తరువాత మరో కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పనిచేసింది. తన వృత్తిపనుల్లో తలమునకలయ్యే వేదిక తొలిసారిగా ముంబైలోని ‘జై వకీల్ ఫౌండేషన్’తో కలిసి పనిచేసింది. ఆ తరువాత ‘దస్రా’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి జార్ఖండ్, బిహార్ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, బాలికల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంది. ‘అపుడప్పుడు’ అన్నట్లుగా ఉండే ఆమె సామాజికసేవలు ఆతరువాత నిత్యకృత్యం అయ్యాయి. అలాంటి సమయంలోనే తమ సంస్థకు ఇండియాలో సారథ్యం వహించమని ‘వాటర్.ఆర్గ్’ నుంచి పిలుపు వచ్చింది. మిస్సోరీ (యూఎస్) కేంద్రంగా పనిచేసే స్వచ్ఛందసంస్థ ‘వాటర్.ఆర్గ్’ సురక్షిత నీరు, జలసంరక్షణ, పారిశుద్ధ్యంకు సంబంధించి ఎన్నో దేశాల్లో పనిచేస్తోంది. ఆ సంస్థ నుంచి ఆహ్వానం అందినప్పుడు నిరాకరించడానికి వేదికకు ఏ కారణం కనిపించలేదు. ఒప్పుకోవడానికి మాత్రం చాలా కారణాలు కనిపించాయి. అందులో ప్రధానమైనది... ‘పేదప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుంది’ ‘వాటర్.ఆర్గ్’ సారథ్య బాధ్యతలు చేపట్టే ముందు నీటి సంక్షోభం గురించి లోతుగా అధ్యయనం చేసింది వేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) గణాంకాల ప్రకారం సురక్షితమైన నీటి సౌకర్యానికి నోచుకోని ప్రజలు కోట్లలో ఉన్నారు. నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు మహిళలు. నీటి కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించక తప్పని పరిస్థితుల వల్ల ఆ సమయాన్ని ఇతర ప్రయోజనకర పనులకోసం కేటాయించలేకపోతున్నారు. ‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతాను’ అంటున్న వేదిక ఆ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తోంది. మరుగుదొడ్లు నిర్మించుకోవడం నుంచి వాటర్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వరకు ‘వాటర్.ఆర్గ్’ ద్వారా సహాయపడుతోంది. ఒకసారి క్షేత్రపర్యటనలో భాగంగా కర్ణాటకలోని ఒక గ్రామానికి వెళ్లింది వేదిక. ఒక మహిళ తన పదకొండు సంవత్సరాల కూతురు గురించి చెప్పింది. ఆ అమ్మాయి చదువుకోడానికి వేరే ఊళ్లో బంధువుల ఇంట్లో ఉంటుంది. అయితే బడికి సెలవులు వచ్చినా ఆ అమ్మాయి ఇంటికి రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు. దీనికి కారణం వారి ఇంట్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళ టాయిలెట్ నిర్మించుకోవడానికి సహకరించింది వేదిక. ఆ గృహిణి కళ్లలో కనిపించిన మెరుపును దగ్గర నుంచి చూసింది. ‘బ్యాంకర్‌గా క్లయింట్స్ ఆదాయం ఒక స్థాయి నుంచి మరో స్థాయి పెరగడానికి కృషి చేశాను. ఇప్పుడు...తమకున్న వనరులతోనే సౌకర్యవంతమైన జీవితం ఎలా గడపవచ్చు అనే విషయంలో సామాన్య ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను’ అంటుంది వేదిక. ఒకప్పుడు ‘స్టార్ బ్యాంకర్’గా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన వేదిక భండార్కర్ ఇప్పుడు ‘నీటిని మించిన అత్యున్నత పెట్టుబడి ఏదీ లేదు’ అంటూ జలసంరక్షణపై ఊరూరా ప్రచారం చేస్తోంది. -
స్త్రీవాద విమర్శపై ఉపన్యాస పరంపర
సాహిత్య విమర్శ రంగంలో పని చేస్తున్న ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, జిజ్ఞాసా వేదిక కలిసి ‘స్త్రీవాద సిద్ధాంతం – సాహిత్య విమర్శ’ అనే అంశం మీద అంతర్జాల ప్రసంగ పరంపరను నిర్వహించడానికి పూనుకున్నాయి. సాహిత్య అన్వయానికి సంబంధించిన అంశాలతో ఈ ఉపన్యాస పరంపరను రూపొందించాం. అంతర్జాతీయంగా ఆలోచించటం, దేశీయ, సామాజిక, రాజకీ యార్థిక పరిణామాల సంబంధంలో స్త్రీల చరిత్ర నడిచిన దారులను తెలుసుకొనటం; ప్రాంతీయంగా స్త్రీల జీవితానికి సంబంధించి తెలుగు సాహిత్యం నిర్మించి ప్రచారం చేసిన భావజాలాన్ని నిర్ధారించటం, సమాంతరంగా సాహిత్య రంగంలో అభివృద్ధి చెందిన ప్రజాస్వామిక సంస్కృతిని నిరూపించటం లక్ష్యంగా ఈ ప్రసంగ విషయాలు రూపొందాయి. (Ravipudi Venkatadri: వంద వసంతాల హేతువాది) మొదటి నాలుగు ఉపోద్ఘాత ప్రాయమైనవి. తరువాతి 19 మానవ హక్కుల ఉద్యమ నేపథ్యంలో స్త్రీల హక్కుల ప్రశ్నను లేవనెత్తటం దగ్గర ప్రారంభించి ప్రపంచమంతటా స్త్రీలు వివక్షకు గురికావటాన్ని నిరసిస్తూ, కారణాలను అన్వేషిస్తూ, పరిష్కారాలు కోరుకొంటూ స్త్రీలు అనేక స్థాయులలో చేసిన యుద్ధాల, సిద్ధాంతాల అవగాహన కోసం ఉద్దేశిం చినవి. 24వ అంశం నుండి ఆ తరువాతవి అన్నీ భారతదేశ సందర్భం నుండి, తెలుగు సాహిత్య ప్రత్యేకత నుండి స్త్రీల అనుభవాన్ని, స్త్రీవాద భావనలను పరిశీలించేవి. (క్లిక్: ఆ నిషేధం చదువును దూరం చేస్తుంది!) స్త్రీవాద సిద్దాంతంలో సాహిత్య విమర్శలో అభిరుచి, అభినివేశం ఉన్న వాళ్ళందరూ ఈ ఫిబ్రవరి 20 నుండి ప్రతి ఆదివారం ఉదయం 11.00 లకు ప్రారంభమై 1.30 వరకు జరిగే ఈ వారం వారం అంతర్జాల సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. సామాజిక మాధ్యమాలలో జూమ్ లింక్ వివరాలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తాము. సాహిత్య విమర్శకు, ప్రత్యేకించి స్త్రీవాద విమర్శకు సంబంధించి జరిగే సంభాషణలో భాగస్వాములు కావలసిందిగా విజ్ఞప్తి. – ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, జిజ్ఞాసా వేదిక -
జంగిల్లో ఏం జరిగింది?
‘ఇప్పటివరకూ ఎన్నో హారర్ చిత్రాలు చూసి ఉంటారు. ఇప్పుడు సరికొత్త హారర్ చిత్రం తీసుకొస్తున్నాం’ అంటోంది ‘జంగిల్’ చిత్రబృందం. ఆది, వేదిక హీరోహీరోయిన్లుగా కార్తీక్ విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ చిత్రం ‘జంగిల్’. ‘అది శ్వాసిస్తుంది. అది దాక్కొని ఉంటుంది. అది వేటాడుతుంది’ అన్నది క్యాప్షన్. మహేశ్ గోవిందరాజ్, అర్చనా చందా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘మా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం. అలాగే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం. కార్తీక్ విఘ్నేష్ దర్శకత్వ ప్రతిభ, కెమెరా, నేపథ్య సంగీతం మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ’’ అన్నారు. ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్స్: ఎస్ సత్యమూర్తి, సురేశ్ కుమార్, కెమెరా: గౌతమ్ జార్జ్, సంగీతం: జోస్ ప్రాంక్లిన్. -
నేడు రాష్ట్రవ్యాప్తంగా ’రైతు వేదిక’లు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్/ వరంగల్: విత్తు నాటింది మొదలు పంట చేతికొచ్చే వరకు కష్టాల సాగు చేసే అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం మరో కానుక ఇస్తోంది. రైతులను ఒకే వేదిక కిందకు తీసుకురావడంతోపాటు వారు అధిక రాబడి పొందడంలో సహాయ పడేందుకు నిర్మించిన రైతు వేదికలను నేడు కర్షకులకు అంకితం చేయనుంది. తెలంగాణలో తొలి రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జనగాం జిల్లా కొడకండ్లలో ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 572.22 కోట్లు కేటాయించగా క్లస్టర్లవారీగా ప్రతిపాదించిన వాటి నిర్మాణ వ్యయాలను గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖలు భరించాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేదికల నిర్మాణాలను అనుసంధానించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,536, పట్టణ ప్రాంతాల్లో 65 రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా భూసేకరణ, తదితర కారణాలతో 63 చోట్ల రైతు వేదికలకు ఇంకా పునాది రాయి పడలేదు. మిగిలిన వాటిలో పూర్తయిన 2,476 రైతు వేదికలను దసరా రోజున ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ అనివార్య కారణాలతో సాధ్యంకాలేదు. సకల సదుపాయాలతో.. రాష్ట్రంలో ప్రతి 5 వేల ఎకరాల విస్తీర్ణానికి ఒక ఏఈవో ఉన్నారు. ఏఈవో క్లస్టర్ పరిధిలో రెండు, మూడు గ్రామాలకు కలిపి అందరికీ అందుబాటులో ఉండే ఒక గ్రామంలో రైతు వేదికలను నిర్మించారు. వేదికల్లో మౌలిక సదుపాయాలైన కుర్చీలు, మైకులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. అవసరాలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు, పంట ఉత్పత్తులు నిల్వ చేసుకొనేలా వేదికలను నిర్మించారు. క్లస్టర్ పరిధిలోని రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతులు సమావేశాలు అక్కడే నిర్వహించుకొనేలా నిర్మాణాలకు రూపకల్పన చేశారు. రైతులకు శిక్షణ, పథకాలపై అవగాహన కార్యక్రమాలు ఈ వేదికల్లోనే నిర్వహించనున్నారు. రైతులకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికీ ఇదే ‘వేదిక’ కానుంది. దాతల చేయూత... రైతు వేదికల నిర్మాణంలో కర్షక లోకానికి దాతలు అండగా నిలిచారు. కొన్నిచోట్ల స్థలాలను, మరికొన్ని చోట్ల నిర్మాణ ఖర్చులను విరాళంగా ఇచ్చారు. 135 చోట్ల రైతు వేదికల నిర్మాణ స్థలాలను దానం చేయగా 24 చోట్ల వాటి నిర్మాణ వ్యయాన్ని దాతలు భరించారు. కొడకండ్లలో ప్రారంభించనున్న సీఎం... ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శనివారం బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జనగామ జిల్లా కొడకండ్లకు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కొడకండ్లకు చేరుకొని 12:10 గంటలకు రైతు వేదిక భవనాన్ని ప్రారంభిస్తారు. 12:20 నిమిషాలకు సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిస్తారు. అనంతరం కొడకండ్ల మండలంలోని రామవరం గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డు పనులను పరిశీలిస్తారు. కొడకండ్లలో దాదాపు 5 వేల మంది రైతులతో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగి చేరుకోనున్నారు. -
శరవేగంగా రైతు వేదికల నిర్మాణం
కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న పుడమి బిడ్డల సేవ కోసం రైతువేదికలు సిద్ధమవుతున్నాయి. ఈపాటికే మహబూబ్‌నగర్ మండలంలోని వెంకటాపూర్‌లో పూర్తయింది. రాష్ట్ర మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయించారు. కలెక్టర్ వెంకట్రావ్ సైతం నిరంతరం పర్యవేక్షిం చారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో మిగిలిన రైతువేదికల్లోనూ వేగం పెంచారు. సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లావ్యాప్తంగా 88 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో దాని పరిధిలో ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మిస్తున్నారు. వీటన్నింటిని దసరా పండుగ నాటికి పూర్తిచేసి వినియోగంలోకి తేవాలన్న లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. ప్రతి ఐదు వేల ఎకరాల సాగు విస్తీర్ణాని వ్యవసాయ క్లస్టర్‌గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారు (ఏఈఓ) లను సైతం నియమించిన విషయం విదితమే. ఈ క్లస్టర్లలో రైతువేదికలను నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ వెంకట్రావ్ నేతృత్వంలో అధికారులు యుద్ధప్రాతిపదికన అనువైన స్థలాలను గుర్తించి పనులు మొదలుపెట్టారు. పంటల సాగు, వ్యవసాయంలో పాటించాల్సిన మెళకువలను రైతులకు వివరించడం, సమావేశాల నిర్వహణ, చైతన్య కార్యక్రమాలు జరపడానికి వీలుగా ఈ వేదికలు ఉంటాయి. ఒక్కో క్లస్టర్ పరిధిలో సుమారు 2,500మంది రైతులకు మేలు చేకూరనుంది. జిల్లాలోని 15 మండలాల్లో.. మహబూబ్‌నగర్ అర్బన్ మండలం పట్టణ ప్రాంతం కావడంతో ఎదిర రెవెన్యూ గ్రామంలో ఒకే రైతువేదికను నిర్మిస్తున్నారు. పంటల సాగులో ఉన్న మండలాల్లో మాత్రం నాలుగు నుంచి తొమ్మిది వరకు నిర్మిస్తున్నారు. ఒక్కో దాని కోసం రూ.22 లక్షలు వెచ్చిస్తున్నారు. మొత్తం 88 వేదికలను రూ.19.36 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రతి వేదికలో ఏఈఓ, రైతువేదిక కో–ఆర్డినేటర్లకు ఒకటి చొప్పున చాంబర్, 200మంది రైతులు కూర్చునేందుకు వీలుగా సమావేశ మందిరం, రిసెప్షన్, రెండు మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని నిధులు కేటాయిస్తే చుట్టూ ప్రహరీ నిర్మించాలని యంత్రాంగం యోచిస్తోంది. ఒక్కోవేదిక కోసం కనీసం అర ఎకరం సేకరించారు. భూమి లభ్యత ఉన్న చోట ఎకరం కేటాయించారు. నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖ అధికారులకు అప్పగించారు. భూసార పరీక్షలు సైతం.. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 55క్లస్టర్లలో భూసార పరీక్ష కేంద్రాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. నియంత్రిత సాగు విధానంలో భాగంగా పంట మార్పిడి కోసం భూసార పరీక్షలు కీలకం అవుతున్నాయి. దీంతో పరీక్షలను విస్తృతం చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని రైతు వేదికలో ఒకటి చొప్పున భూసార కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. దసరాకు పూర్తవుతాయి జిల్లాలో రైతువేదికల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దసరా నాటికి అన్ని వేదికలు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాం. రైతులకు అన్నివిధాలా ఉపయోగపడే రీతిలో వీటిని నిర్మిస్తున్నాం. – సుచరిత, డీఏఓ -
హీరోయిన్ వేదిక గ్లామర్ ఫోటోలు
-
మా ప్రయత్నాన్ని ఆదరించారు
‘‘రూలర్ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మేం ఓ మంచి ప్రయత్నం చేశాం.. మా ప్రయత్నానికి విజయాన్ని అందించారు. సి.కల్యాణ్‌గారితో నేను చేసిన మూడో సినిమా ఇది. మంచి కథా విలువలున్న చిత్రం చేయాలని భావించే ఆయనకు నా తరఫున, అభిమానుల తరఫున కృతజ్ఞతలు’’ అని బాలకృష్ణ అన్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రూలర్’. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం (డిసెంబర్ 20) విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ పరుచూరి మురళిగారు మంచి కథ, డైలాగ్స్‌ను అందించారు. ఈ కథలో మంచి సందేశాన్ని కూడా చొప్పించినందుకు ఆయనకు థ్యాంక్స్. ఆర్టిస్టుల దగ్గర నుంచి తనకు ఏం కావాలో రాబట్టుకునే దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌గారు. ఆయన నిర్మాతల దర్శకుడు కూడా. మా సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘జై సింహా’ తర్వాత మా కాంబినేషన్ లో వచ్చిన ‘రూలర్’ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మా కాంబినేషన్లో వచ్చే తర్వాతి చిత్రం ‘రూలర్’ కంటే మంచి చిత్రం అవుతుంది’’ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు వెరీ హ్యాపీ’’ అన్నారు వేదిక. ‘‘జైసింహా’ తర్వాత అదే కాంబినేషన్ లో వచ్చిన ‘రూలర్’కి సినిమాటోగ్రఫీ అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు కెమెరామేన్ రాంప్రసాద్. ‘‘కల్యాణ్‌గారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని పరుచూరి మురళి అన్నారు. -
అందుకే తెలుగులో వీలు కుదర్లేదు
‘‘ఒక్కో ఇండస్ట్రీ ఒక్కోలాంటి సినిమాలు తీస్తుంది. తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో నేను సినిమాలు చేస్తుంటాను. పలు భాషల్లో సినిమాలు చేయడం వల్ల విభిన్నత చూపించడానికి నటిగా నాకు మంచి అవకాశం అనుకుంటాను’’ అన్నారు వేదిక. బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రూలర్’. వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ‘బాణం, విజయ దశమి, దగ్గరగా దూరంగా’ సినిమాల్లో కనిపించి వేదిక 7 ఏళ్ల విరామం తర్వాత ‘రూలర్’ అనే తెలుగు సినిమా చేశారు. ఈ సందర్భంగా వేదిక పంచుకున్న విశేషాలు... ► ఇతర భాషల్లో సినిమాలతో బిజీగా ఉండటంతో తెలుగులో సినిమాలు చేసే వీలు కుదర్లేదు. అక్కడ వరుస చిత్రాలతో ఇక్కడ ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాను. నాకు తెలుగులో మేనేజర్ కూడా లేరు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన 3’ తమిళంలో, తెలుగులో హిట్ అయింది. నా పాత్రకు మంచి స్పందన రావడంతో ‘రూలర్’కి నన్ను సంప్రదించారు. ► బాలకృష్ణగారిలాంటి పెద్ద స్టార్ సినిమాలో అవకాశం రావడం మంచి అవకాశంగా భావించాను. కేఎస్ రవికుమార్‌గారు చాలా మంచి సినిమాలు తీశారు. ఈ సినిమాను పూర్తి చేయాలంటే ఏడాది పడుతుంది. కానీ, మూడున్నర నెలల్లో పూర్తి చేశారాయన. సి.కల్యాణ్‌గారు రాజీపడకుండా క్వాలిటీతో తెరకెక్కించారు. ► ‘రూలర్’ సినిమాలో నా పాత్రకు రెండు షేడ్స్ ఉంటాయి. ఒకటి సంప్రదాయబద్ధంగా, మరొకటి ఫుల్ గ్లామరస్‌గా ఉండేది. డామినేటింగ్‌గా ఉండే పాత్ర నాది. సప్తగిరితో కలసి కామెడీ చేస్తాను. నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. ఈ సినిమాలో పాత్రలానే నేనూ డామినేటింగే. కానీ నా ఫేస్ అలా కనిపించదు(నవ్వుతూ). ► బాలకృష్ణగారి ఎనర్జీ సూపర్. డ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేశాను(నవ్వుతూ). ఆయన డైలాగ్స్, యాక్టింగ్‌లో ఒక స్టయిల్ ఉంటుంది. ఆయన అందర్నీ సమానంగా చూసుకుంటారు. -
ఆ స్ఫూర్తితోనే రూలర్ చేశాం
‘‘రైతుల మీద సినిమాలు చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఓ సందర్భంలో చాలామందిని కలిశాను కూడా. కానీ కుదర్లేదు. ‘రూలర్’ సినిమాతో ఆ కోరిక కొంత తీరింది’’ అన్నారు బాలకృష్ణ. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సి. కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘రూలర్’. ఇందులో వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ–రిలీజ్ ఈవెంట్లో సినిమా ట్రైలర్‌ను దర్శకుడు బోయపాటి శీను, నందమూరి రామకృష్ణ విడుదల చేశారు. బాల కృష్ణ మాట్లాడుతూ–‘‘నేనూ, కల్యాణ్, కేఎస్ రవికుమార్ కలిసి చేసిన ‘జై సింహా’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఆ స్ఫూర్తితోనే ‘రూలర్’ సినిమా తీశాం. మొదట్లో ఈ సినిమాకు మరో కథ అనుకున్నాం. కుదర్లేదు. ఆ సమయంలో నేను పరుచూరి మురళిగారికి ఫోన్ చేశాను. ఆయన దగ్గర ఉన్న ఓ కథను వినిపించారు. ఆ కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమా చేయాలని నిర్ణయించు కున్నాను. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, కొత్తదనం అందించాలనే ప్రయత్నాలు చేస్తుంటాను. ఈ ప్రయత్నంలో భాగంగానే ఎన్నెన్నో విభిన్నమైన పాత్రలు చేశాను. కళామతల్లికి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించిన తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని అన్నారు. ‘‘రూలర్’ అనే పేరు బాలకృష్ణగారికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. తమిళంలో రవికుమార్‌గారు చేసిన సినిమాలు మాలాంటి దర్శకులకు రిఫరెన్స్లా ఉపయోగపడతాయి. సి.కల్యాణ్‌గారికి అభినందనలు’’అన్నారు బోయపాటి శీను. ‘‘ఇండస్ట్రీలో నాకు బాగా సపోర్ట్ అందించిన వ్యక్తి బాలకృష్ణగారు. కేఎస్ రవికుమార్ సూపర్ డైరెక్టర్. సి.కల్యాణ్‌గారితో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. ఇంతమంది నాకు కావాల్సిన వ్యక్తులు చేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు నటుడు రాజశేఖర్. ‘‘జైసింహా’ తర్వాత మా కాంబినేషన్లో వస్తోన్న చిత్రం ఇది. టీమ్ అందరూ ఎంతగానో కష్టపడ్డారు’’ అన్నారు కేఎస్ రవికుమార్. ‘‘బాలకృష్ణగారు ఈజ్ గ్రేట్’ అనేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు సి. కల్యాణ్. కథానాయికలు సోనాల్ చౌహాన్, వేదిక మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు, అంబికా కృష్ణ, జీవితా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
గుమ్మడికాయ కొట్టారు
‘రూలర్’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటించారు. సి. కల్యాణ్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. ‘‘మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు శక్తివంతమైన పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో పాటల లిరికల్ వీడియోను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి సీవీ రావ్, పత్సా నాగరాజు సహ–నిర్మాతలు. -
ఇక వేటే
‘‘ఒంటి మీద ఖాకీ యూనిఫామ్ ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫామ్ తీశానా... బయటకు వచ్చిన సింహంలా ఆగను. ఇక వేటే’’ అని ‘రూలర్’ టీజర్లో విలన్‌కు పవర్ఫుల్ వార్నింగ్ ఇస్తున్నారు బాలకృష్ణ. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రూలర్’. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలు. సి. కల్యాణ్ నిర్మాత. ఈ చిత్రం టీజర్ గురువారం రిలీజ్ అయింది. టీజర్లో రెండు డిఫరెంట్ గెటప్స్‌తో బాలకృష్ణ కనిపించారు. డిసెంబర్ 20న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్ భట్. -
రొమాంటిక్ రూలర్
ప్రేయసితో ప్రణయ గీతాలా పన చేస్తున్నారు బాలకృష్ణ. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సి. కల్యాణ్ నిర్మిస్తున్న చిత్రం ‘రూలర్’. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. సి.వి. రావ్, పత్సా నాగరాజు సహ–నిర్మాతలు. ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు బాలకృష్ణ. అందులో ఒకటి పోలీసాఫీసర్. మరొకటి ఐటీ ప్రొఫెషనల్ అని సమాచారం. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్స్ పోస్టర్స్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా చిత్రీకరణ మున్నార్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఓ మెలోడీ సాంగ్‌ను బాలకృష్ణ, వేదికలపై చిత్రీకరిస్తున్నారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్. ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ‘రూలర్’ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది.