బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రజాకార్’. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఈ సినిమాలోని ‘పోతుగడ్డ మీద..’ పాటను విడుదల చేశారు. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో బాబీ సింహా మాట్లాడుతూ– ‘‘భీమ్స్‌గారి సంగీతం, సుద్దాల అశోక్‌తేజగారి సాహిత్యంలో ఏదో తెలియని భావోద్వేగం ఉంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కూడా మేం అంతే భావోద్వేగానికి లోనయ్యాం’’ అన్నారు.
‘‘సుద్దాల అశోక్‌తేజ, భీమ్స్‌గార్లు ఊరికే ఎమోషన్ కాలేదు. మా పూర్వీకుల చరిత్రలో అంతటి ఆవేదన నిండి ఉంది. భీమ్స్‌గారు పాడిన పాట వింటే పోతుగడ్డ మీద పుట్టిన భూమి బిడ్డల ఆత్మ ఘోషిస్తున్నట్లు ఉంటుంది’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘సుద్దాల హనుమంత, జానకమ్మల బిడ్డను కాకుంటే నా పాటలో ఇంత ఎమోషన్ ఉండేది కాదు. రజాకార్ ఉద్యమంలో మా అమ్మా నాన్న పాల్గొన్నారు.
స్వాతంత్య్రం కోసం వారు నైజాంకు వ్యతిరేకంగా పోరాడారు. రజాకార్ ఉద్యమంలో ్రపాణాలు కోల్పోయిన కమ్యూనిటీ నుంచి వచ్చిన భీమ్స్ ఉండటం నాకు కలిసొచ్చింది. ఈ తరహా సినిమా తీయాలంటే డబ్బులు ఉంటే సరిపోదు.. ధైర్యం కావాలి. ఆ ధైర్యం గూడూరు నారాయణరెడ్డికి ఉంది’’ అన్నారు సుద్దాల అశోక్‌తేజ. ‘‘మా తాతగారు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ సమాజం ఎంత కష్టానికి గురైందో, ఎన్ని కన్నీళ్లను చూసిందో... వారందరి స్వరాలకు నేను స్వరాన్ని సమకూర్చానని చె΄్పాలి’’ అన్నారు భీమ్స్ సిసిరోలియో. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనుష్య త్రిపాఠి, కొరియోగ్రాఫర్ స్వర్ణ, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్ పోతిరెడ్డి అంజిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment