Razakar Movie
-
ఓటీటీలో వివాదాస్పద సినిమా.. 'రజాకార్'పై ప్రకటన
'రజాకార్' చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది. తెలంగాణ చరిత్రలో జరిగిన కొన్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు యాటా సత్యనారాయణ తెలిపారు. మార్చి 15న విడుదలైన ఈ మూవీ ఒక వర్గం వారిని కించపరిచే విధంగా ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. థియేటర్లో కాస్త పర్వాలేదని మెప్పించిన ఈ మూవీ విమర్శల కారణంగా ఇప్పటి వరకు ఓటీటీలో స్ట్రీమింగ్కు రాలేదు. అయితే, సుమారు 9 నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలో విడుదల కానున్నట్లు 'ఆహా' నుంచి ప్రకటన వచ్చేసింది.గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో విడుదలయింది. తెలంగాణ పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే 'రజాకార్' నిర్మించినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కులను 'ఆహా' సంస్ధ సొంతం చేసుకుంది. ఈమేరకు తన సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసింది. త్వరలో రజాకర్ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు ఆహా ప్రకటించడంతో సినిమా చూడాలని కోరుకునేవారు సంతోషిస్తున్నారు. అయితే, ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. కానీ, డిసెంబర్ 20న ఓటీటీలో విడుదల కానుందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.బాబీ సింహా, అనసూయ, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే వంటి ముఖ్య నటీనటులు రజాకర్ చిత్రంలో నటించారు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి ముందు రజాకార్లు సాగించిన అకృత్యాలను ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు చెప్పారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఓటీటీలోకి రాబోతున్న అనసూయ లేటెస్ట్ మూవీ
నిజ జీవిత సంఘటనల ఆధారంగా అన్ని భాషల్లోనూ సినిమాలు వస్తున్నాయి. అలా కొన్నిరోజుల ముందు 'రజాకార్' చిత్రం తెలుగులో రిలీజైంది. అనసూయ, ఇంద్రజ, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) మార్చి 15న థియేటర్లలోకి వచ్చిన 'రజాకార్'.. ప్రేక్షకులకు తెలియకుండానే థియేటర్లలో మాయమైపోయింది. ఒకప్పుడు తెలంగాణలో రజాకార్లు సాగించిన హింస కాండ ఆధారంగా యాటా సత్యనారాయణ ఈ సినిమాని తెరకెక్కించారు. 'రజాకార్' సినిమా డిజిటల్ హక్కుల్ని జీ5 ఓటీటీ సంస్థ దక్కించుకుంది. ఇకపోతే ఏప్రిల్ 26న లేదా మే 3న ఈ చిత్రాన్ని ఓటీటీలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావల్సి ఉంది. (ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్) -
‘రజాకార్’ నిర్మాతకు బెదిరింపు కాల్స్
‘రజాకార్’ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. సినిమాను నిలివేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో నారాయణ రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు 1100పైగా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణరెడ్డికి భద్రతగా 1+1 సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంతో దర్శకుడు యాటా సత్యనారాయణ రజాకార్ చిత్రాన్ని తెరకెక్కించారు. బాబీ సింహా, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
కేసీఆర్ ఎక్కడున్నా ‘రజాకార్’ చూడాలి
కరీంనగర్ టౌన్: నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలు, గోసను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా ‘రజాకార్’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని మమత థియేటర్లో రజాకార్ చిత్ర యూనిట్, బీజేపీ కార్యకర్తలతో కలిసి సినిమా చూసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియంత నిజాం, రజాకార్ల రాక్షస పాలనపై తెలంగాణ ప్రజ లు చేసిన పోరాటాల చరిత్రను అద్భుతంగా తెరపై చూపించారని కొనియాడారు. ఈ వాస్తవాలను నేటి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సినిమాను ప్రజలకు అందించిన దర్శక, నిర్మాతలు యాట సత్యనారాయణ, గూడూరు నారాయణరెడ్డిని అభినందించారు. కేసీఆర్ ఎక్కడున్నా రజాకార్ సినిమా చూడాలన్నారు. ఆ సినిమా చూసిన తర్వాత కూడా నిజాం గొప్పోడు, రజాకార్లు మంచోళ్లని అనిపిస్తే నిరభ్యంతరంగా కేసీఆర్ ‘ట్వీట్’చేయొచ్చు అని సూచించారు. అవసరమైతే ఆనాడు నిజాం సమాధి ఎదుట మోకరిల్లిన కేసీఆర్ ఫొటోను కూడా ఈ సినిమా చూసిన తర్వాత ట్వీట్ చేయవచ్చని పేర్కొన్నారు. -
చరిత్ర తెలియజేసే రజాకార్
‘‘రజాకార్’ ముస్లింలకు వ్యతిరేకమైన సినిమా కాదు. మన చరిత్ర గురించి తెలియజేసే చిత్రం. నాటి కాలంలో జరిగిన దుర్మార్గాలను ప్రజలకు తెలియజేసేలా తెరకెక్కించిన మూవీ. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. దర్శకుడు సత్యనారాయణ, నిర్మాత నారాయణరెడ్డిలకు ధన్యవాదాలు’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. బాబీ సింహా, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే నటీనటులుగా యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రజాకార్’. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. గురువారం జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో యాటా సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ చరిత్రపై ‘రజాకార్’ చేసే చాన్స్ ఇచ్చిన నారాయణరెడ్డిగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మన పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే ‘రజాకార్’ నిర్మించాను’’ అన్నారు గూడూరు నారాయణ రెడ్డి. -
మరో ఇద్దరు రజాకార్లు ఉన్నారు వాళ్ళని కూడా తరిమికొడతాం
-
ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న చిన్నసినిమాలు ఇవే..
-
'రజాకార్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రజాకార్ వాయిదా.. మరో తేదీ ప్రకటించిన మేకర్స్
బాబీ సింహా, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘రజాకర్’. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లో విడుదల కావాల్సింది. అయితే వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడం వల్ల వాయిదా వేసినట్లు శనివారం యూనిట్ ప్రకటించింది. మార్చి 15న రిలీజ్ చేస్తామని తెలిపారు. ‘‘మా చరిత్ర.. మా పూర్వీకుల బాధలు, త్యాగాలు.. ఈ గడ్డ కోసం పోరాడిన వాళ్ల చరిత్ర చెప్పడానికే ఈ సినిమా తీశాను. రజాకార్లు చేసిన అన్యాయాల గురించి చెప్పేందుకే సినిమా చేశాం’’ అని ఇటీవల యాటా సత్యనారాయణ పేర్కొన్నారు. -
పాన్ ఇండియా భాషల్లో రజాకార్.. ట్రైలర్ రిలీజ్!
సమర వీర్ క్రియేషన్స్ పతాకంపై గూడూర్ నారాయణరెడ్డి నిర్మించిన తాజా చిత్రం 'రజాకర్'. యధా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఇందులో బాబీ సింహా, వేదిక జంటగా నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర తమిళ వర్షన్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ వేదికపై చిత్ర నిర్మాత గూడూర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ సమర్ వీర్ క్రియేషన్స్ సంస్థ తరపున యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటం కాలంలో హైదరాబాదులో జరిగిన ఒక యదార్థ ఘటన ఆధారంగా రూపొందించిన కథా చిత్రమని చెప్పారు. 1948లో హైదరాబాద్ భారతదేశంలో విలీనం కాకముందు రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంపై రూపొందించిట్లు చెప్పారు. నిజాం రాజు హైదరాబాదును దుర్గిస్తాన్గా మార్చే ప్రయత్నం చేసినప్పుడు భారత ప్రభుత్వం దాన్ని అడ్డుకుందని చెప్పారు. తమ వంశంలో తన తాత కూడా ఆ పోరాటంలో పాల్గొని ప్రజలను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు అర్పించారన్నారు. అలాంటి ఒక యదార్థ ఘటనపై ఈ తరం ప్రజలకు తెలియచేయాలనే ప్రయత్నమే ఈ రజాకర్ చిత్రమని చెప్పారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఈ చిత్రం నిర్మాత నారాయణరెడ్డి తాత పోరాటంలో ప్రాణాలు కోల్పోయారని చెప్పారన్నారు. మరుగున పడ్డ చరిత్ర ప్రజలకు తెలియచేయాలనే లక్ష్యంతో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించడం గర్వకారణమని పేర్కొన్నారు. -
అప్పుడేం జరిగిందో యువతకు తెలియాలి
బాబీ సింహా, వేదిక, మకరంద్ దేశ్‌పాండే, రాజ్ అర్జున్, అనుష్యా త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ ఫిల్మ్ ‘రజాకార్’. ‘సైలెంట్ జెనొసైడ్ ఆఫ్ హైదరాబాద్’ (హైదరాబాద్‌లో జరిగిన నిశ్శబ్ద మారణహోమం) అనేది ట్యాగ్‌లైన్. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మార్చి 1న విడుదల కానుంది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం నిజాం పాలన, సామాన్య ప్రజలపై రజాకార్ల క్రూరమైన చర్యలు, నిజాం పాలన నుంచి ప్రజలు విముక్తి పొందేలా సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన వ్యూహాత్మక ప్రయత్నాలు వంటి అంశాల నేపథ్యంతో ‘రజాకార్’ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటి–దర్శక–నిర్మాత కంగనా రనౌత్ మాట్లాడుతూ– ‘‘రజాకార్’ సినిమా పట్ల చిత్ర యూనిట్ చూపిస్తున్న అంకితభావం, తపన నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’’ అన్నారు. ‘‘చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన, గౌరవించుకోవాల్సిన ఓ అధ్యాయాన్ని ‘రజాకార్’ సినిమాగా తీశాం. 15 ఆగస్టు 1947–17 సెప్టెంబరు 1948ల మధ్య నిజాం పాలనలో ఏం జరిగింది? అనే అంశాలు ఈ తరం యువతీ యువకులకు తెలియాల్సిన అవసరం ఉంది’’ అన్నారు నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి. ‘‘నిరంకుశత్వం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన వారి పరాక్రమాన్ని ఈ సినిమాలో వెండితెరపై చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు దర్శకుడు యాటా సత్య నారాయణ. -
రాజమౌళితో నా వర్కింగ్ అనుభవం ఏంటంటే: తిరుపతి
-
ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రజాకార్’. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఈ సినిమాలోని ‘పోతుగడ్డ మీద..’ పాటను విడుదల చేశారు. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో బాబీ సింహా మాట్లాడుతూ– ‘‘భీమ్స్‌గారి సంగీతం, సుద్దాల అశోక్తేజగారి సాహిత్యంలో ఏదో తెలియని భావోద్వేగం ఉంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కూడా మేం అంతే భావోద్వేగానికి లోనయ్యాం’’ అన్నారు. ‘‘సుద్దాల అశోక్‌తేజ, భీమ్స్గార్లు ఊరికే ఎమోషన్ కాలేదు. మా పూర్వీకుల చరిత్రలో అంతటి ఆవేదన నిండి ఉంది. భీమ్స్‌గారు పాడిన పాట వింటే పోతుగడ్డ మీద పుట్టిన భూమి బిడ్డల ఆత్మ ఘోషిస్తున్నట్లు ఉంటుంది’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘సుద్దాల హనుమంత, జానకమ్మల బిడ్డను కాకుంటే నా పాటలో ఇంత ఎమోషన్ ఉండేది కాదు. రజాకార్ ఉద్యమంలో మా అమ్మా నాన్న పాల్గొన్నారు. స్వాతంత్య్రం కోసం వారు నైజాంకు వ్యతిరేకంగా పోరాడారు. రజాకార్ ఉద్యమంలో ్రపాణాలు కోల్పోయిన కమ్యూనిటీ నుంచి వచ్చిన భీమ్స్ ఉండటం నాకు కలిసొచ్చింది. ఈ తరహా సినిమా తీయాలంటే డబ్బులు ఉంటే సరిపోదు.. ధైర్యం కావాలి. ఆ ధైర్యం గూడూరు నారాయణరెడ్డికి ఉంది’’ అన్నారు సుద్దాల అశోక్‌తేజ. ‘‘మా తాతగారు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ సమాజం ఎంత కష్టానికి గురైందో, ఎన్ని కన్నీళ్లను చూసిందో... వారందరి స్వరాలకు నేను స్వరాన్ని సమకూర్చానని చె΄్పాలి’’ అన్నారు భీమ్స్ సిసిరోలియో. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనుష్య త్రిపాఠి, కొరియోగ్రాఫర్ స్వర్ణ, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్ పోతిరెడ్డి అంజిరెడ్డి పాల్గొన్నారు. -
Razakar: గూస్బంప్స్ తెప్పిస్తోన్న అనసూయ బతుకమ్మ పాట
తెలంగాణలో రజకార్ల దాడి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘రజాకార్’. యాటా సత్యానారాయణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనసూయ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి బతుకమ్మ పాటను విడుదల చేశారు. భారతి భారతి ఉయ్యాల అంటూ సాగే ఈ పాట కాస్లర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. మోహన భోగరాజు, భీమ్స్ సీసిరోలియో, స్ఫూర్తి జితేందర్ ఆలపించారు. భీమ్స్ సంగీతం అందించాడు. ఈ వీడియో చూస్తుంటే..అనసూయ మరోసారి పవర్ఫుల్ పాత్రతో అదరగొట్టినట్లు తెలుస్తోంది. -
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటకు మాట
-
కాంట్రవర్సీ కథలకు ఫ్రీ పుబ్లిసిటీ
-
యువతకు సందేశం
‘‘నేటి యువతకు సందేశం ఇవ్వడానికే ‘రజాకార్’ సినిమా తీశారు. ఇలాంటి చిత్రం తీసే ధైర్యం చేసిన మా డైరెక్టర్ సత్యనారాయణకి థ్యాంక్స్’’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బాబీ సింహా, వేదిక, అనుశ్రేయ త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో యాటా సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రజాకార్’. సమర్ వీర్ క్రియేషన్స్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను రాజాసింగ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ సినిమా టీజర్ చూస్తేనే ఎంతో కోపం వస్తోంది.. ఇక సినిమా చూస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి’’ అన్నారు. ‘‘తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17 మా సినిమాకి కథా వస్తువుగా మారింది. ఆ రోజు జరిగిన విముక్తి పోరాటంతో ఈ సినిమా తీశాను’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘ఈ చిత్రం మన చరిత్ర గురించి అందరికీ తెలియజేస్తుందనుకుంటున్నాను’’ అన్నారు గూడూరు నారాయణ రెడ్డి. -
భావి తరాలకు చరిత్ర తెలియాలి
బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, ప్రధాన పాత్రల్లో యాటా సత్యానారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రజాకర్’. ఈ సినిమా ΄ోస్టర్ లాంచ్ ఈవెంట్లో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌లో 8, మహారాష్ట్రలో 5, కర్ణాటకలో 3 జిల్లాలు హైదరాబాద్ సంస్థానంగా ఉండేవి. ఇవన్నీ ఓ దేశంగా ఉండాలంటూ బ్రిటిష్ ప్రభుత్వం చట్టాన్ని విడుదల చేసిన కారణంగా నిజాం ప్రభువు స్వతంత్య్ర రాజ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతనికి బలంగా దాదాపు 2 లక్షల మంది రజాకార్స్ సైన్యంగా ఏర్పడి, ఆకృత్యాలు చేశారు. ఈ చరిత్ర భావి తరాలకు తెలియాలి. ఇలాంటి చరిత్రతో రూ΄÷ందిన ‘రజాకర్’ చిత్రాన్ని ్ర΄ోత్సహించాలి’’ అన్నారు. ‘‘ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే, హైదరాబాద్‌కు వచ్చింది సెప్టెంబరు 17న. ఈ చరిత్ర తెలియజేసే ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్. ‘‘రజాకార్’ సినిమా చూడక΄ోతే మన బతుక్కే అర్థం లేదు’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘తెలంగాణవాదిగా నా హక్కుగా, భారతీయుడిగా భావించి ఈ సినిమా చేశాను’’ అన్నారు నారాయణ రెడ్డి. -
‘రజాకార్’ రిలీజ్ అయితే కొందరి మైండ్ బ్లాక్ అవుతుంది: బండి సంజయ్
ఖైరతాబాద్: సమర్ వీర్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘రజాకార్’ సినిమా పోస్టర్‌ను శుక్రవారం సాయంత్రం జలవిహార్‌లో మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఎంపీ బండి సంజయ్, దర్శక నిర్మాత యాటా సత్యనారాయణ, నిర్మాత గూడూరు నారాయణరెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ రజాకార్ సినిమా చరిత్రలో నిల్చిపోతుందన్నారు. ప్రపంచాన్ని ఆకర్షించిన చరిత్ర తెలంగాణది అన్నారు. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా ప్రభుత్వమే నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ 18–40 సంవత్సరాల మధ్యవయసు వారికి తెలంగాణ చరిత్ర తెలియదని, ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరికి తెలంగాణ చరిత్ర తెలుస్తుందన్నారు. కొందరు చరిత్రను తెరమరుగు చేయాలని చూస్తూ, ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే కొందరి మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. సోషల్ మీడియా వారియర్స్, యువత మీడియా ద్వారా రజాకార్ సినిమాపై ప్రచారం చేయాలన్నారు. ఈ సందర్భంగా నటి వేదిక మాట్లాడుతూ..ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సంగప్ప, విఠల్‌తో పాటు నటుడు బాబి, అనిష్కా త్రిపాఠి, లక్ష్మణ్‌తో పాటు చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.