తెలంగాణ చరిత్రలో జరిగిన కొన్న సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'రజాకార్'(Razakar Movie). ఈ చిత్రాన్ని దర్శకుడు యాటా సత్యనారాయణ తెలిపారు. మార్చి 15న విడుదలైన ఈ మూవీ ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఓ వర్గం వారిని కించపరిచే విధంగా ఉందంటూ విమర్శలు కూడా వచ్చాయి. థియేటర్‌లో కాస్త పర్వాలేదని మెప్పించిన ఈ మూవీ విమర్శల కారణంగా ఇప్పటి వరకు ఓటీటీలో(OTT Streaming) రిలీజ్ కాలేదు.
అయితే ఇప్పటికే ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకున్న ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారు అయింది. ఈ నెల 24 నుంచి ఆహాలో(Aha) స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు రజాకార్ మూవీ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ ప్రకటనతో దాదాపు 10 నెలల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది.
కాగా.. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో విడుదలయింది. తెలంగాణ పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే 'రజాకార్' నిర్మించినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కులను 'ఆహా' సంస్ధ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వస్తోంది. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.
డిసెంబర్‌లోనే ఓటీటీ ప్రకటన..
అయితే ఇంతకు ముందే రజాకర్ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ఆహా (Aha) ప్రకటించింది. దీంతో ఈ సినిమా చూడాలని కోరుకునేవారు ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. అప్పట్లోనే డిసెంబర్ 20న ఓటీటీలో విడుదల కానుందని సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. కొత్త ఏడాదిలో రజాకార్ మూవీని ఆడియన్స్‌కు అందుబాటులోకి రానుంది.
కాగా.. ఈ చిత్రంలో బాబీ సింహా, అనసూయ, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే వంటి ముఖ్య నటీనటులు రజాకర్ చిత్రంలో నటించారు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి ముందు రజాకార్లు సాగించిన అకృత్యాలను ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు యాటా సత్యనారాయణ వెల్లడించారు.
చరిత్ర తెలియజేసే చిత్రం.. ఆర్.నారాయణ మూర్తి
రజాకార్ ఎవరికీ వ్యతిరేకమైన సినిమా కాదు. మన చరిత్ర గురించి తెలియజేసే చిత్రమని.. నాటి కాలంలో జరిగిన దుర్మార్గాలను ప్రజలకు తెలియజేసేలా తెరకెక్కించిన మూవీ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి దర్శక, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్యనారాయణ, నిర్మాత నారాయణరెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ చరిత్రపై రజాకార్ చేసే చాన్స్ ఇచ్చిన నిర్మాత గూడూరు నారాయణరెడ్డిగారికి దర్శకుడు యాటా సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. మన పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే ‘రజాకార్’ నిర్మించినట్లు నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment