‘సినిమాలను డబ్బు కోసం, ఎంటర్ టైన్ మెంట్ కోసం చేస్తుంటారు. కానీ మేము రజాకార్ సినిమాను ఒక బాధ్యతతో చేశాం. నిజాం పాలనలో రజాకార్లు సాగించిన అకృత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించాలనే ప్రయత్నం చేశాం’ అన్నారు నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి. బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రజాకార్(Razakar Movie). ఈ చిత్రాన్ని సమర్‌వీర్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. యాటా సత్యనారాయణ దరకత్వం వహించారు. గతేడాది థియేటర్స్ లో రిలీజై మంచి విజయాన్ని అందుకున్న రజాకార్ సినిమా ఈ నెల 24వ తేదీ నుంచి ఆహా(AHA) ఓటీటీలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి(Guduru Narayana Reddy) మాట్లాడుతూ .. ఈ సినిమా నిర్మించే క్రమంలో నాకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. కానీ నేను భయపడలేదు. సినిమాను నిర్మించాను. ఐఎండీబీలో 9.5 రేటింగ్ వచ్చింది. గోవా ఫిలిం ఫెస్టివల్ లో సన్మానం చేశారు. మా టీమ్, మా డైరెక్టర్ యాాటా సత్యనారాయణ సపోర్ట్ తో సినిమా సక్సెస్ పుల్ గా ప్రేక్షకులకు రీచ్ చేయగలిగాం. సొసైటీకి ఇది నేను ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అనుకుంటా. ప్రజల నుంచి వచ్చిన స్పందన నాకు ఎంతో సంతృప్తిని మిగిల్చింది. ఈ సినిమాను మరో ప్రొడ్యూసర్ చేయలేడని చెప్పగలను. ఇప్పుడు మన తెలుగు వారి ఓటీటీకే మూవీ ఇవ్వాలని ఆహాలోకి తీసుకొస్తున్నాం. ఈ నెల 24వ తేదీ నుంచి ఆహాలో మా సినిమా ప్రీమియర్ కు వస్తోంది. మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
నటి ఇంద్రజ మాట్లాడుతూ - రజాకార్ సినిమాను ప్రొడ్యూసర్ గూడూరు సత్యనారాయణ రెడ్డి గారు ఎన్నో కష్టాలకు తట్టుకుని నిర్మించారు. దర్శకుడు యాటా సత్యనారాయణ గారు పదేళ్లు ఈ మూవీ కోసం కష్టపడ్డారు. రజాకార్ల అకృత్యాలకు ఈ సినిమా గొప్ప డాక్యుమెంటరీ. మన నేల చరిత్ర గురించి తెలుసుకోవడం ఇక్కడ బతికే ప్రతి ఒక్కరి బాధ్యత. మతాలకు అతీతంగా ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆహాలో చూడాలి. ఎందుకంటే ఇది హిందూ, ముస్లిం మతాల మధ్య విభేదాలు సృష్టించే మూవీ కాదు. చరిత్రలో జరిగింది జరిగినట్లు తెరకెక్కించారు. ముస్లిం జర్నలిస్ట్ క్యారెక్టర్ మా సినిమాలో గొప్పగా ఉంటుంది. అలాగే ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసిన ఆరో నిజాం ఘనతను కూడా చెప్పాం. నేను ఈ సినిమాలో వీరనారి చాకలి ఐలమ్మ క్యారెక్టర్ లో నటించాను. ఇలాంటి గొప్ప క్యారెక్టర్ లో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. చాకలి ఐల్మమ చేస్తున్నాని తెలిసినప్పుడు ఆమె చరిత్ర చదివి తెలుసుకున్నాను. ఆమె ఒక నిప్పురవ్వలా అప్పటి అకృత్యాలపై ఎదురుతిరిగారు. అన్నారు.
నటుడు నాగమహేశ్ మాట్లాడుతూ - రజాకార్ చిత్రంలో నేను రాపాక రామచంద్రారెడ్డి అనే దేశ్ ముఖ్ క్యారెక్టర్ లో నటించాను. చాలా క్రూరమైన పాత్ర ఇది. సినిమాలో కీలకమైన ఇలాంటి పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు యాటా సత్యనారాయణ గారికి థ్యాంక్స్. ఆయన ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాను రూపొందించారు. అలాగే ఒక మంచి లక్ష్యంతో నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మించారు. ఆహా ఓటీటీలో రజాకార్ మూవీని చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.
డైరెక్టర్ యాటా సత్యనారాయణ మాట్లాడుతూ - మా రజాకార్ మూవీకి తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, ఇతర భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. 18 ఫిలిం ఫెస్టివల్స్ కు అప్లై చేస్తే 15 ఫిలిం ఫెస్టివల్స్ కు సెలెక్ట్ అయ్యింది. గోవాలో జరిగిన ఇఫ్పీలో బెస్ట్ ఇండియా డెబ్యూగా నమోదైంది, బెస్ట్ డైరెక్టర్ గా నామినేట్ అయ్యాను. గోవాలో 75 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు రాజాకార్ సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో 72 దేశాల ప్రతినిధులు వచ్చి మా మూవీ చూశారు. ఇంత గొప్ప స్వాతంత్య్రపోరాటం జరిగిందా అని వారంతా ఆశ్చర్యపోయారు. ఎన్నో అవార్డ్ లు దక్కించుకుంది మా మూవీ. థియేట్రికల్ రిలీజ్ టైమ్ లో మంచి సమ్మర్, విద్యార్థులకు పరీక్షలు జరిగే టైమ్ కాబట్టి ఎక్కువమంది మా సినిమాను చూడలేకపోయారు. ఓటీటీలోకి మూవీని ఎప్పుడు తీసుకొస్తారు అని వందల ఫోన్ కాల్స్ వచ్చాయి. మాకు మూడు ఓటీటీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే ఆహాలో మాత్రమే 25 నుంచి 30 లక్షల మంది తెలుగు ప్రేక్షకులు సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. మన చరిత్రను తెలుగు ప్రేక్షకులు తెలుసుకోవాలంటే ఆహా కరెక్ట్ ప్లాట్ ఫామ్ అని భావించి ఈ నెల 24న ప్రీమియర్ కు తీసుకొస్తున్నాం. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మా మూవీ ఉంటుంది. తప్పకుండా మీరంతా ఆహాలో రజాకార్ సినిమా చూడాలని కోరుకుంటున్నా’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment