
‘రజాకార్’ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. సినిమాను నిలివేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో నారాయణ రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు 1100పైగా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దీంతో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణరెడ్డికి భద్రతగా 1+1 సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంతో దర్శకుడు యాటా సత్యనారాయణ రజాకార్ చిత్రాన్ని తెరకెక్కించారు. బాబీ సింహా, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment