Central Home Ministry
-
వారిక ‘నో ఫ్లై లిస్టు’లో
న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులతో హడలెత్తిస్తున్న ఆకతాయిలు, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి ఉత్తుత్తి బాంబు బెదిరింపులతో ప్రమాణికులకు తీవ్ర అసౌకర్యం కల్పిస్తున్న వారిని, భయాందోళనలకు గురిచేస్తున్న వారిని ఇకమీదట విమాన ప్రయాణానికి అనర్హుల జాబితా (నో ఫ్లై లిస్టు)లో చేర్చనున్నారు. మూడు రోజుల్లో మొత్తం 19 జాతీయ, అంతర్జాతీయ విమానా లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కొన్ని విమానాలను దారిమళ్లించి దగ్గర్లోని విమానాశ్రయాల్లో దింపి తనఖీలు పూర్తి చేశారు. ఇవన్నీ ఉత్తుత్తి బాంబు బెదిరింపులేనని తేలింది. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు బుధవారం సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశమై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. నిఘా సంస్థలు, పోలీసుల సహకారంతో బాంబు బెదిరింపులకు దిగుతున్న వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని, చట్టసంస్థలు ప్రతికేసులోనూ లోతుగా దర్యాప్తు జరుపుతున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు బుధవారం తెలిపారు. మరో ఏడు విమానాలకు బెదిరింపులుబుధవారం మరో ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ ఉత్తవేనని తేలింది. నాలుగు ఇండిగో విమానాలు, రెండు స్పైస్‌జెట్ విమానాలు, ఒక ఆకాశ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. రియాద్–ముంబై ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని దారి మళ్లించి మస్కట్ (ఒమన్)లో దింపారు. చెన్నై– లక్నో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నోలో దిగగానే ప్రయాణికులను సురక్షితంగా దింపి.. విమానాన్ని నిర్జన ప్రదేశానికి తీసు కెళ్లారు. అలాగే ఢిల్లీ– బెంగళూరు ఆకాశ ఎయిర్ విమానానికి బెదిరింపు రావడంతో దాన్ని తిరిగి దేశ రాజధానికి మళ్లించి.. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఇలాగే ముంబై– ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అహ్మదాబాద్‌కు మళ్లించారు. మైనర్ అరెస్టు: ముంబై: మూడు విమానాలను లక్ష్యంగా చేసుకొని సోషల్‌మీడియాలో బాంబు బెదిరింపులు పంపిన చత్తీస్‌గఢ్‌లోని ఒక 17 ఏళ్ల మైనర్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేశారు. -
Hizb-ut-Tahrir: హిజ్బ్–ఉత్–తహ్రీర్‌పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: జిహాద్, ఉగ్ర కార్యకలాపాలతో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్న హిజ్బ్–ఉత్–తహ్రీర్(హెచ్‌యూటీ)పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 1953లో జెరుసలేంలో ప్రారంభమైన ఈ సంస్థ, దేశంలో దారితప్పిన యువతను చేరదీసి వారిలో ఉగ్ర భావజాలాన్ని నూరిపోస్తోందని కేంద్ర హోం శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. వివిధ సామాజిక మాధ్యమ వేదికలు, రహస్య యాప్‌లు, ప్రత్యేక సమావేశాల ద్వారా యువతను ఇది గ్రూపులో చేర్చుకుంటోందని తెలిపింది. వారిని జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాలవైపు మళ్లించి ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ప్రభుత్వాలను కూలదోయడమే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడిన హిజ్బ్–ఉత్– తహ్రీర్ భద్రతకు ముప్పుగా పరిణమించిందని హోం శాఖ వెల్లడించింది. అందుకే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం–1967 కింద ఈ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్లో ప్రకటించింది. -
ఎన్ఐఏ చేతికి ‘బస్సుపై ఉగ్రదాడి’ కేసు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఇటీవల బస్సుపై ఉగ్రవాదుల దాడి కేసు దర్యాప్తును కేంద్రం హోంశాఖ... జాతీయ పరిశోధన సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. జమ్మూకశ్మీర్ శాంతిభద్రతలు, అమర్నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై వరుస సమీక్షా సమావేశాల అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ నుంచి మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తున్న యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై రియాసి జిల్లాలో జూన్ 9న ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. డ్రైవర్‌కు బుల్లెట్ తగలడంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. -
‘రజాకార్’ నిర్మాతకు బెదిరింపు కాల్స్
‘రజాకార్’ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. సినిమాను నిలివేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో నారాయణ రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు 1100పైగా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణరెడ్డికి భద్రతగా 1+1 సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంతో దర్శకుడు యాటా సత్యనారాయణ రజాకార్ చిత్రాన్ని తెరకెక్కించారు. బాబీ సింహా, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
Central Vigilance Commission: ఆ శాఖల అధికారులపైనే అత్యధిక ఫిర్యాదులు
న్యూఢిల్లీ: దేశంలో 2022లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా కేంద్ర హోంశాఖ అధికారులపైనే వచ్చాయి. ఆ తర్వాత రైల్వే శాఖ, బ్యాంకు అధికారులు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తన వార్షిక నివేదికలో వెల్లడించారు. గత ఏడాది అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలకు చెందిన అన్ని కేటగిరీల అధికారులు, ఇతర సిబ్బంది విషయంలో మొత్తం 1,15,203 ఫిర్యాదులు అందాయని తెలియజేసింది. వీటిలో 85,437 కేసులను పరిష్కరించామని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. అత్యధికంగా హోంశాఖ అధికారులపై 46,643, రైల్వే శాఖ అధికారులపై 10,580, బ్యాంకుల అధికారులపై 8,129 ఫిర్యాదులు తమకు అందాయని సీవీసీ స్పష్టం చేసింది. ‘నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ’ ప్రభుత్వ అధికారులపై 7,370 ఫిర్యాదులు వచ్చాయని వివరించింది. ఇన్సూరెన్స్ సంస్థల్లో పనిచేసేవారిపై 987, ఉక్కుశాఖలో పనిచేసేవారిపై 923 కంప్లైంట్లు వచ్చినట్లు వెల్లడించింది. -
మణిపూర్ అల్లర్లకు వారే కారణమా..?
ఇంఫాల్: మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మయన్మార్ నుండి అక్రమంగా వలస వచ్చిన వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి బయోమెట్రిక్ డేటాను సేకరించడం మొదలుపెట్టింది. ఈ అల్లర్లకు వారికీ సంబంధం ఉందన్న కోణంలోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు చెబుతోంది మణిపూర్ ప్రభుత్వం. మణిపూర్ హోంశాఖ తెలిపిన వివరాల ప్రకారం మయన్మార్ నుండి అక్రమంగా వలసవచ్చిన వారి గణన సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తవుతుందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు హోంశాఖ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్.సి.ఆర్.బి) నుండి కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపినాట్లు తెలిపారు జాయింట్ సెక్రెటరీ(హోమ్) పీటర్ సలాం. కూకీలు అత్యధికంగా ఉండే కొండ ప్రాంతమైన చురాచంద్ పూర్ లో ఏడుగురు మయన్మార్ వలసదారులకు బులెట్ గాయాలు తగలడంతో అల్లర్లలో వారి పాత్ర ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలోనే వెంటనే స్పందించి మణిపూర్, మిజోరాం రాష్ట్రాల ప్రభుత్వాలను వెంటనే బయోమెట్రిక్ ఆధారంగా మయన్మార్ అక్రమ వలసదారుల గణన చేపట్టాలని అదేశించింది. మయన్మార్ వలసదారులు ఎక్కువగా అడవులను కొట్టి, గసగసాల సాగు, గంజాయి సాగుకి పాల్పడుతూ ఉంటారని గతంలో ఒకసారి మణిపూర్ సీఎం బైరెన్ సింగ్ కూడా తెలిపారు. ఇది కూడా చదవండి: Manipur Violence: నా కొడుకు, భర్తను చంపేశారు.. కూతురిని నగ్నంగా.. -
మణిపూర్ అల్లర్లు: అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన అమిత్ షా
న్యూఢిల్లీ: మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఎట్టకేలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈశాన్య రాష్ట్రంలో నెలన్నరగా జరుగుతున్న అల్లర్లను అదుపులోకి తెచ్చి రాష్ట్రంలో శాంతిస్థాపనే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది హోంశాఖ. ప్రశాంతతకు నెలవైన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మే 3న ఒక్కసారిగా భగ్గుమంది. ఇక్కడి జనాభాలో అత్యధికులు మెయిటీ, కుకీ తేగల మధ్య వైరం తారాస్థాయిలో రాజుకుంది. రెండు వర్గాలు పరస్పర దాడులు చేసుకుంటూ సృష్టించిన బీభత్సంలో అనేకమంది సామాన్యుల జీవితాలు చితికిపోయాయి. ఈ అల్లర్ల కారణంగా 98 మంది మృతిచెందగా భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. దీంతో ఉలిక్కిపడిన కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సాయంతో సైనిక బలగాలను, పోలీసులను మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పర్యటించి, రెండు వర్గాల మధ్య సంధిని కుదిర్చి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. పరిస్థితి సద్దుమణిగిందనుకుంటున్నంతలోనే మళ్ళీ నిప్పు రాజుకుంది. మరోసారి అల్లర్లు చెలరేగడంతో 9 మంది స్థానిక ఎమ్మెల్యేలు బైరెన్ సింగ్ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదని తేల్చి చెప్పేశారు. ఈ మేరకు ప్రధానమంత్రికి ఒక లేఖను రాస్తూ.. ఇక్కడి ప్రజల నమ్మకాన్ని చూరగొనాలంటే మొదట ప్రభుత్వం చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని, పరిపాలనా విధానంలో మార్పులు చేయాలని వారు తెలిపారు. ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మెయిటీ తెగకు చెందినవారే. దీంతో కేంద్ర హోంశాఖకు అన్నివైపుల నుండి ఒత్తిడి అధికమవడంతో ఆలస్యం చేయకుండా మణిపూర్‌లో శాంతిస్థాపనే ప్రధాన ఉద్దేశ్యంగా అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశం జూన్ 24న న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుందని ఈ ప్రకటనలో తెలిపింది హోంశాఖ. Union Home Minister Shri @AmitShah has convened an all party meeting on 24th June at 3 PM in New Delhi to discuss the situation in Manipur.@PIB_India @DDNewslive @airnewsalerts — Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) June 21, 2023 ఇది కూడా చదవండి: భారత ప్రధానిపై హాలీవుడ్ నటుడి ప్రశంసలు -
మాజీ అగ్నివీర్లకు బీఎస్ఎఫ్ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్
న్యూఢిల్లీ: సైనిక దళాల్లో ఎంపికల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అగ్నిపథ్ పథకం పట్ల యువతను ఆకర్షితులను చేసే దిశగా కేంద్రం ఒక ప్రకటన చేసింది. అగ్నివీర్ ద్వారా ఎంపికై నిబంధనల మేరకు నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని రిటైరైన అభ్యర్థులకు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. అంతేకాదు, గరిష్ట వయోపరిమితిలో కూడా సడలింపులు ఉంటాయని తెలిపింది. ఇందుకు వీలు కల్పిస్తూ బీఎస్ఎఫ్ జనరల్ డ్యూటీ కేడర్(నాన్ గెజిటెడ్) రిక్రూట్మెంట్–2015 నిబంధనల్లో మార్పులు చేపట్టినట్లు వెల్లడించింది. ఇవి మార్చి 9వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయని ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి బ్యాచ్ మాజీ అగ్నివీర్లకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుందని కేంద్ర హోం శాఖ అందులో వివరించింది. ఇతర బ్యాచ్‌ల వారికైతే మూడేళ్ల వరకు సడలింపు ఉంటుంది. మాజీ అగ్నివీర్లకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. -
పైశాచికత్వంపై కొరడా!
అతనో డాక్టర్. విజయవాడ నుంచి ఢిల్లీ వెళుతూ ఆన్లైన్లో ఓ బాలిక పోర్న్ వీడియో చూశాడు. అంతటితో ఆగని వైద్యుడు వీడియోను డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాలో ఉన్న తన ఫేక్ ఐడీ ద్వారా పబ్లిక్ డొమైన్లో షేర్ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వివరాలన్నింటినీ సేకరించిన పోలీసులు.. ఆ డాక్టర్‌ను అరెస్ట్ చేసేందుకు వెళితే ఆ తప్పు తాను చేయలేదంటూ బుకాయించాడు. తీరా సాక్ష్యాలు చూపించాక తోక ముడవగా నిందితుడిని కోర్టుకు తరలించారు. చిత్తూరు అర్బన్: రాష్ట్రంలో గత నెల వరకు 1,787 మంది పిల్లల పోర్న్(అశ్లీల) వీడియోలను పలు సామాజిక మాధ్యమాల్లో, స్నేహితులకు షేర్ చేశారు. చట్ట విరుద్ధమైన ఈ నేరానికి పాల్పడిన వాళ్లపై క్రిమినల్ కేసుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించుకుంది. ఇందులో భాగంగా నిందితుల వివరాలను 26 జిల్లాల ఎస్పీలకు అందజేయగా.. వాళ్లపై చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్(ఎన్‌సీఎంఈసీ).. అనేది అమెరికాకు చెందిన ఎలాంటి లాభాపేక్ష ఆశించని స్వచ్ఛంద సంస్థ. 2019లో ఈ సంస్థ మనదేశంతో ఒప్పందం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సహకారంతో ఇక్కడ పనిచేస్తోంది. ఈ సంస్థ తప్పిపోయిన, అక్రమ రవాణాకు గురైన పిల్లలతో పాటు లైంగిక దాడికి గురైన పిల్లల్ని సంరక్షిస్తుంది. అలాగే 18 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలకు సంబంధించిన అసభ్య వీడియోలు(పోర్న్) ఇంటర్నెట్ నుంచి తీసుకుని మరొకరికి చేరవేయడం, సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయడం వంటివి చేస్తే ఆ వీడియోలను తొలగించడంతో పాటు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది. ఇలా దేశంలోని ప్రతి రాష్ట్రంలో జిల్లాల వారీగా వివరాలు సేకరించి కేంద్ర హోంశాఖ ద్వారా ఆయా రాష్ట్రాల హోంశాఖలకు పంపుతోంది. లింగ భేదంతో సంబంధం లేకుండా పిల్లల గోప్యత, హక్కులను కాలరాసే ఈ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎస్సీఎంఈసీ పంపిన వివరాల ఆధారంగా నిందితులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అప్లోడ్ చేసినా, షేర్ చేసినా.. ఇక అంతే! ప్రతి నెలా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న నిందితుల వివరాలను టిప్‌లైన్ సాంకేతిక వ్యవస్థతో కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర హోంశాఖకు అందుతోంది. ఒక టిప్‌లైన్‌లో ఏ వ్యక్తి ఏ తేదీన, ఏ సమయంలో, ఏ మొబైల్/కంప్యూటర్ నుంచి ఏ పోర్న్ వీడియోను ఆప్‌లోడ్ చేశాడు? ఎందులో షేర్ చేశాడు? ఏ స్థలం నుంచి పోర్న్ వీడియో అప్లోడ్ చేశాడు? ఆ చిత్రం ఎన్ని నిమిషాలు ఉంది? ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరం ఇంటర్నెట్ ప్రొటోకాల్ అడ్రస్? అనే వివరాలను టిప్‌లైన్‌లో నిక్షిప్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సాంకేతిక సాక్ష్యాలు కేంద్రం నుంచి రాష్ట్ర పోలీస్‌కు అందుతున్నాయి. పోలీస్ శాఖ దీన్ని జిల్లాల వారీగా విభజించి ఓ ఫైల్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో ప్రతి మూడు నెలలకోసారి ఈ అశ్లీల వీడియోలు షేర్ చేసే వారి వివరాలుంటాయి. గత నెల వరకు రాష్ట్రంలో 1,787 మంది ఈ నేరానికి పాల్పడ్డట్టు నివేదిక అందింది. అత్యధికంగా గుంటూరులో 330, విశాఖ 270, ఎన్టీఆర్ విజయవాడ 238, కడప 126, నెల్లూరు 102, ప్రకాశం 94, అనంతపురం 90, తిరుపతి 77, శ్రీకాకుళం 70, చిత్తూరు 59, కాకినాడ 56, ప.గో 50, కర్నూలు 49, బాపట్ల 44, కృష్ణా 30, విజయనగరం 25, నంద్యాల 14, ఏలూరు 14, పల్నాడు 12, కోనసీమ 11, అన్నమయ్య 10, సత్యసాయి 6, అనకాపల్లి 4, పార్వతీపురం 2, రాజమండ్రి 2, అల్లూరి సీతారామరాజు 2 మంది ఈ నేరాలకు పాల్పడ్డారు. కాగా, ఇప్పటివరకు 680 మందిపై కేసులు నమోదయ్యాయి. శిక్షలు కఠినతరం ఈ కేసుల్లో కఠిన శిక్షలు విధించేలా చట్టాల్లో మార్పులు చేశారు. సాక్ష్యాధారాలు న్యాయస్థానంలో రుజువైతే మొదటిసారి ఐదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, రెండోసారి ఇదే తప్పు చేస్తే గరిష్టంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చని చట్టం చెబుతోంది. -
MLAs Episode: బీజేపీ హైకమాండ్ ఆగ్రహం.. రంగంలోకి కేంద్ర హోం శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కలకలం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టీఆర్ఎస్ ఆరోపణలపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉందని తెలిసింది. దీనిని తీవ్రస్థాయిలో తిప్పికొట్టాలని రాష్ట్ర నేతలకు సూచించినట్టు సమాచారం. ఈ అంశంలో టీఆర్ఎస్ నేతలు నేరుగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించడం, దిష్టిబొమ్మలను దహనం చేయడాన్ని ఉపేక్షించవద్దని స్పష్టం చేసినట్టు తెలిసింది. అవసరమైతే టీఆర్ఎస్తో తాడోపేడో తేల్చుకోవాలనే సంకేతాలను కూడా హైకమాండ్ ఇచ్చినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సీబీఐ విచారణ.. కోర్టుల్లో పోరాటం.. టీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న అంశం గురువారం ఢిల్లీలో హాట్‌టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలోకి బీజేపీని లాగుతోందని భావించిన పార్టీ పెద్దలు.. దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలతో చర్చించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ అంశంలో సీబీఐ విచారణ జరిపించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, కుదరని పక్షంలో కోర్టుల ద్వారా జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించేలా పోరాటం చేయాలని సూచించినట్టు వివరిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ గురువారం హైకోర్టును ఆశ్రయించిందని అంటున్నాయి. ఇక రాజకీయంగానూ ఈ వ్యవహారాన్ని ఎదుర్కోవాలని నేతలకు హైకమాండ్ సూచించినట్టు తెలిసింది. ‘తెలంగాణలో మరో ఎనిమిది, తొమ్మిది నెలలైతే సాధారణ ఎన్నికలున్న సమయంలో ఎవరైనా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చేస్తారా? అదీ కేవలం నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన ప్రభుత్వం పడిపోతుందా? ఒక్కో ఎమ్మెల్యే కొనుగోలుకు రూ.100 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయా?’అన్న దానిపై విస్తృత చర్చ పెట్టాలని సూచించినట్టు సమాచారం. ఇదే సమయంలో ‘కొనుగోళ్ల వ్యవహారం అంతా బోగస్. కేసీఆర్ ఆడుతున్న డ్రామా. పోలీసులు దీనికి సహకరిస్తున్నారు. ఫామ్‌హౌస్ ఎవరిది? డబ్బు ఎక్కడిది? ఎవరు ఎవరితో మాట్లాడారనే ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే పోలీసులు ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌కు ఎలా తరలించారు? బేరసారాలపై ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌లో విచారిస్తున్నారా? లేక ప్రగతిభవన్ చెప్పినట్టు పోలీసులు నడుచుకుంటున్నారా?’’అని బీజేపీ జాతీయ స్థాయి నేత ఒకరు పేర్కొనడం గమనార్హం. ఈ అంశాలన్నింటినీ జనంలోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పార్టీకి సూచించినట్టు వెల్లడించారు. నిజానిజాలు త్వరలోనే బయటికి వస్తాయని.. ప్రధానిని, కేంద్ర హోంమంత్రిని లక్ష్యంగా పెట్టుకొని ఇలా చేశాక పార్టీ అంత సులువుగా దీనిని వదిలిపెట్టదని పేర్కొన్నారు. రంగంలోకి కేంద్ర హోం శాఖ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి లక్ష్యంగా విమర్శలు చేస్తుండటం, వందల కోట్ల డీల్ జరిగినట్టు కథనాలు వస్తుండటంపై హోంశాఖ ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై దృష్టి పెట్టాలని ఐబీ, ఐటీ, ఈడీలనూ అప్రమత్తం చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తమకు అందించాలని ఇప్పటికే ఏజెన్సీలను కోరినట్టు నేతలు చెబుతున్నారు. నిజంగానే కోట్ల రూపాయలు చేతులు మారితే అవి ఎవరివి? ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చేందుకు సిద్ధం కావాలని సూచించినట్టు పేర్కొంటున్నారు. కేంద్ర సంస్థలు ఈ వ్యవహారంపై రెండు మూడు రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. -
పాస్‌పోర్ట్ కోసం... ఆన్లైన్లోనే పీసీసీ దరఖాస్తు
న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ మంజూరులో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) జారీ జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర హోం శాఖ కొత్త విధానాన్ని ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులే నేరుగా పీసీసీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితంగా పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారులు వివరాలను స్థానిక పోలీసులకు పంపించి వాకబు చేసే అవసరం తగ్గి సమయం ఆదా అవుతుంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. చదవండి: అన్యాయంపై పోరాటానికే.. జోడో యాత్ర: రాహుల్ -
సాక్షి కార్టూన్ 18-02-2022
ఇక మన హింస కాస్త తగ్గిస్తే బెటర్ -
అజెండాలోంచి హోదాను తీయిస్తే కానీ జీవీఎల్‌కు నిద్రపట్టలేదా: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: విభజన చట్టంలోని సమస్యలపై న్యాయం చేయాలని అనేకసార్లు ప్రధానిని కలిసి సీఎం జగన్ కోరారు. కేంద్ర హోంశాఖ కమిటీ అజెండాలో మొదట ప్రత్యేక హోదాను చేర్చారు. అప్పుడు చంద్రబాబు, బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు అంటూ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. గోతికాడ నక్కల్లా చంద్రబాబు, బీజేపీ నేతలు కాచుకుని కూర్చున్నారు. చంద్రబాబు సలహా మేరకే జీవీఎల్ పట్టుబట్టి అజెండాలోంచి ప్రత్యేక హోదా అంశాన్ని తప్పించేశారు. ప్రత్యేక హోదాకు జీవం పోస్తే ఏపీలో బీజేపీ ఇంకా చచ్చిపోతుందనేదే జీవీఎల్ ఆలోచన. రాష్ట్రానికి మేలు జరగకుండా ఉండేందుకు జీవీఎల్ మంచి పాత్రే పోషిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో జీవీఎల్ బాగా పనిచేస్తున్నారు. అజెండాలోంచి తీసేసిన తర్వాత దెయ్యాల్లా వేదాలు వల్లిస్తున్నారు. చదవండి: (రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. కేంద్రం అదే చెప్పింది: మంత్రి బొత్స) చంద్రబాబు, జీవీఎల్, సోమువీర్రాజుని ప్రశ్నిస్తున్నా. పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని 2014 మ్యానిఫెస్టోలో పెట్టారా లేదా చెప్పాలి. ఏపీ ప్రజలను వాగ్ధానాలతో మోసం చేశారా లేదా. ప్రత్యేక హోదాపై అప్పుడు ఇచ్చిన మాటను నిలబెడతారా.. చేతులెత్తేశారా. బీజేపీ పిల్లిమొగ్గలు వేసే పరిస్థితుల్లో ఉందా. దేశంలో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఫలాలు అనుభవిస్తున్నాయా లేదా. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టమా, లేదా..?. ఏపీపై బఠాని గింజంత చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ నేతలు మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది మీరా కాదా.. టీడీపీ సమాధానం చెప్పాలి. ప్యాకేజీ పేరుతో టోకుగా అమ్మేసింది మీరా కాదా. ప్రత్యేక హోదాను అజెండా నుంచి తీసేయగానే మాట్లాడుతున్న హీన సంస్కృతి టీడీపీది. హోల్‌సేల్‌గా హోదాను అమ్మేసి సాధించిన ప్యాకేజీ వల్ల ఏపీకి ఏం చేశారు. చదవండి: (కొత్త జిల్లాల్లో కార్యాలయాలన్నీ ఒకే చోటు: విజయ్ కుమార్) కేంద్ర హోంశాఖ కమిటీ అజెండాలో ప్రత్యేకహోదా పెట్టడం దేశ ద్రోహమా. ఎందుకు చంద్రబాబు, జీవీఎల్ పట్టుబట్టి అజెండా నుంచి తీయించేశారు. జీవీఎల్ ఎందుకు భయపడ్డాడు. ఏపీకి ఎప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదనేది బీజేపీ, టీడీపీ స్టాండా.. చెప్పాలి. జీవీఎల్‌కు ఎందుకంత ఆత్రం. అజెండాలోంచి హోదాను తీయిస్తే కానీ జీవీఎల్‌కు నిద్రపట్టలేదా. ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్న టీడీపీ నేతలు అజెండా ప్రకటించినపుడు ఏమైపోయారు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కనకమేడల ఏ కలుగులో దాక్కున్నారు. అజెండా నుంచి హోదాను తీసేయగానే ఎందుకు బయటికొచ్చారు. చంద్రబాబు ఏపీ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏపీ బాగుపడుతుందంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈర్ష్య, అసూయలతో నీచరాజకీయాలు మానుకోవాలని టీడీపీ, ఏపీ బీజేపీ నేతలను హెచ్చరిస్తున్నాం' అని మంత్రి పేర్ని నాని అన్నారు. -
ఆ సమస్యల పరిష్కారం కోసం ఏడేళ్లుగా పోరాడుతున్నాం: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం ఏడేళ్లుగా పోరాడుతున్నామని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా రాష్ట్ర సమస్యలపైనే చర్చించారు. పార్లమెంట్‌లోనూ మా ఎంపీలు విభజన హామీలపై అనేకమార్లు ప్రశ్నించారు. కేంద్ర ఇప్పటివరకూ పెద్దన్న పాత్ర పోషించలేదు. ఈనెల 17న కేంద్ర హోంశాఖ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలు నెరవేర్చాలి. పోలవరానికి పూర్తి నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయాలి' అని మల్లాది విష్ణు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చదవండి: (AP: కొత్త జిల్లాలపై సూచనల పరిశీలనకు కమిటీ) -
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి పోరాటం
-
త్రిసభ్య కమిటీ అజెండాలో కీలక అంశాలు
-
కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రత్యేకహోదా
-
ఏపీ ప్రత్యేక హోదా అంశం: చర్చలకు రావాలని కేంద్ర హోంశాఖ ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ ఎంజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఈ మేరకు ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఈ నెల 17న చర్చలకు రావాలని రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ ఆహ్వానం పంపించింది. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. త్రిసభ్య కమిటీలో ఏపీ నుంచి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణా రావు ఉన్నారు. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై 9 అంశాలపై చర్చ జరుపుతారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఏపీ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే. ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగెస్ పార్టీ చాలా రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తోంది. జనవరి మొదటివారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీని కలిసి ఏపీ ప్రత్యేక హోదాతో పాటు, రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. త్రిసభ్య కమిటీ ఎజెండాలో 9 అంశాలు... ఎజెండా1: ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన ఎజెండా 2: ఏపీ- తెలంగాణ మధ్య విద్యుత్ వినియోగ సమస్యపై పరిష్కారం ఎజెండా 3: పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం ఎజెండా 4: రెండు రాష్టాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు ఎజెండా 5: ఏపీఎస్సీఎస్సీఎల్, టీఎస్సీఎస్సీఎల్ మధ్య నగదు ఖాతాల విభజన ఎజెండా 6: ఏపీ-తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ ఎజెండా 7: ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జాల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు ఎజెండా 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎజెండా 9: రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు -
విభజన అంశాలపై కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ ఆ«ధ్వర్యంలో నేడు రాష్ట్ర విభజన సమస్యలపై జరిగే కీలకభేటీలో ముందడుగు పడే అవకాశముంది. తెలంగాణ, ఏపీ ఉన్నతాధికారులు సమావేశమై పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు జరిగే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులకు ఇప్పటికే హోంశాఖ సమాచారమిచ్చింది. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లవుతున్నా పరిష్కారంకాని, ఇరు రాష్ట్రాల నడుమ భిన్నాభిప్రాయాలున్న ఒకట్రెండు అంశాల్లో ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని తెలంగాణ భావిస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో సమర్పించేందుకుగాను ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంలేని సమస్యల గురించి తెలంగాణ నివేదికలను సిద్ధం చేసింది. విభజన.. బకాయిలే ప్రధాన ఎజెండా విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల విభజనపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. ఏపీ ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ, విజయ డెయిరీ లాంటి సంస్థల విషయంలో ఇరు రాష్ట్రాలు వాదనలను వినిపించనున్నాయి. ముఖ్యంగా సింగరేణి కార్పొరేషన్, దీనికి అనుబంధంగా ఉన్న ఏపీ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్(ఆప్మెల్)ల విభజన అంశం ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఎక్కడి కంపెనీలు ఆ రాష్ట్రానికే చెందుతాయని అటార్నీ జనరల్ న్యాయ సలహా ఇచ్చిన నేపథ్యంలో దీనిపై హోంశాఖ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశముందని అధికారులంటున్నారు. షీలాబీడే కమిటీ సిఫారసులపై తెలంగాణ, ఏపీ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ డిస్కంల నుంచి తమకు రూ.7,500 కోట్లు వస్తాయని ఏపీ అంటుండగా, దీనిపై ఏపీ ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో వేసిన కేసును ఉపసంహరించుకుంటే వివాదాన్ని పరిష్కరించుకునేందుకు సిద్ధమని తెలంగాణ చెబుతోంది. ఏపీ నుంచి రావాల్సిన బకాయిలపై కూడా తెలంగాణ అధికారులు హోంశాఖకు నివేదిక ఇవ్వనున్నారు. ఏపీ రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ విభజన, నగదు, బ్యాంకు డిపాజిట్ల పంపిణీ, జనాభా దామాషా ప్రాతిపదికన పన్ను బకాయిల పంపకాలపై ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించనున్నాయి. తెలంగాణకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ విభజన చట్టానికి అనుగుణంగా అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరిం చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర హోంశాఖ ఎదుట వాదనలను సమర్థవంతంగా వినిపిస్తామని, చాలా వరకు అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
వివాదాస్పద సరిహద్దుల్లో కేంద్ర బలగాల పహారా
న్యూఢిల్లీ: హింస చెలరేగి ఐదుగురు పోలీసుల మరణాలకు కారణమైన అస్సాం–మిజోరం సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర బలగాల మొహరింపునకు అస్సాం, మిజోరం, కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అంగీకరించాయి. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ను బారువా, అస్సాం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా, మిజోరం సీఎస్ లాల్‌నున్‌మా వియా చవుంగో, డీజీపీ ఎస్బీకే సింగ్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాల మధ్య రెండు గంటలపాటు కొనసాగిన చర్చల అనంతరం ఈ నిర్ణయానికొచ్చారు. 306 నంబర్ జాతీయ రహదారి వెంట సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్(సీఏపీఎఫ్)ను రంగంలోకి దించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని హోం శాఖ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది.‡ మిజోరం రాష్ట్రానికి నిత్యావసర సరుకులు సహా అన్ని రకాల రవాణాకు జీవనాడిలాంటి 306 నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలను అస్సామీలు 26వ తేదీ నుంచి మూసేశారని, వెంటనే ఈ దిగ్బంధాన్ని ఎత్తేయాలని మిజోరం డిమాండ్ చేసింది. -
వెంటనే ఆ కేసులన్నీ కొట్టి వేయండి: కేంద్ర హోం శాఖ
సాక్షి, న్యూఢిల్లీ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) చట్టంలోని రద్దు చేసిన సెక్షన్ 66ఏ కింద నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆ సెక్షన్ కింద కొత్తగా ఎలాంటి కేసుల నమోదు చేయవద్దని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు అధిపతులను ఆదేశించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ 2015లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడి ఆరేళ్లు కావస్తున్నా ఆ సెక్షన్ కింద దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు కావడంతో ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 1,307 కేసులు నమోదు అయితే.. ఈ విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ 50కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇలాంటి 229 కేసులు ఇంకా 11 రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్నాయని ఎన్జిఓ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఈ నెలలో కోర్టుకు తెలియజేసింది. ఈ నిబంధన రద్దు చేసిన తర్వాత రాష్ట్రాల్లోని పోలీసులు దాని కింద ఎందుకు కొత్త కేసులను నమోదు చేశారు. "ఏం జరుగుతోంది? ఇది భయంకరమైనది, బాధాకరం" అని జస్టిస్ రోహింటన్ ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం జూలై 5న వ్యాఖ్యానించింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్(ఎఫ్ఐఆర్)లో చట్టంలోని సెక్షన్ 66ఏను పోలీసులు నిలివేసినట్లు తెలియజేయాలని బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఐటీ యాక్ట్ సెక్షన్ 66ఏ అంటే ఏమిటి? భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలొ వ్యాపార లావాదేవీలను, ఈ-కామర్స్‌ను నియంత్రించడానికి ఐటీ చట్టాన్ని అమలులొకి తీసుకొచ్చింది. 2008లో ఈ చట్టాన్ని సవరించి సెక్షన్ 66ఏను చేర్చారు. ఐ.టి. చట్టంలోని సెక్షన్-66ఏ కింద ఒక వ్యక్తి నేరం చేసినట్లు రుజువైతే గరిష్ఠంగా మూడేళ్ల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. కింద పేర్కొన్న సందర్భాలలో సెక్షన్-66ఏ కింద అరెస్టు చేసే అవకాశం ఉంది. కంప్యూటర్, ఇతర సమాచార పరికరాన్ని గానీ ఉపయోగించి ఇతరులకు హానికర, అభ్యంతరకర సమాచారాన్ని చేరవేసిన. ఒక సమాచారం తప్పు అని తెలిసినప్పటికీ ఇతరులకు రాజకీయ, మత, ప్రాంత విద్వేషాలు పరంగా కోపం/ అసౌకర్యం/ ప్రమాదం/ కలిగించే నేరపూరిత ఉద్దేశంతో, శతృత్వంతో, ద్వేష భావంతో, దురుద్దేశంతో కంప్యూటర్ ద్వారా దానిని వినియోగించుకున్నా ఇతరులకు అసౌకర్యం కలిగించేలా, లేదా తప్పుదారి పట్టించేలా ఏదైనా ఈ-మెయిల్‌ను వాడుకున్నా, అసలు సందేశం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా ఏమార్చాలని చూసిన. ఒక సమాచారాన్ని రూపొందించినా, వేరేవారికి చేరవేసినా, ఇతరుల నుంచి స్వీకరించినా నేరమే. ముద్రణ రూప సమాచారం, చిత్రాలు, ధ్వని, దృశ్యాలు, ఇతర ఎలక్ట్రానిక్ సమాచారం విషయాల్లో ఇది వర్తిస్తుంది. ఈ చట్టాన్ని 2008లో సవరించారు. 2009 ఫిబ్రవరి 5న దీనిని రాష్ట్రపతి ఆమోదించారు. -
పోలీసు బలగాల్లో మహిళల ప్రాతినిథ్యం 33% తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ: పోలీసు బలగాల్లో 33 శాతం మహిళలను నియమించాలని కేంద్రం పునరుద్ఘాటించింది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇటీవల కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ‘మహిళలు, చిన్నారులపై దాడులు’కు సంబంధించి హోంశాఖ పార్లమెంటరీ స్టాయీ సంఘం నివేదికలో సూచించిన సిఫార్సుల మేరకు పోలీసు బలగాల్లో మహిళల సంఖ్యను పెంచాలని పేర్కొంది. ప్రస్తుతం పోలీసు బలగాల్లో మహిళలు 10.30% మాత్రమే ఉండటంపై స్థాయీ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపింది. పోలీసుల బలగాల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచడం ఎందుకు ఆలస్యం అవుతోందో అర్థం కావడంలేదని నివేదికలో పేర్కొందని తెలిపింది. పోలీసు బలగాల్లో మహిళల ప్రాతినిథ్యం 33% ఉండటం తప్పనిసరి అని ఎప్పటికప్పుడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ సూచనలు చేయాలని స్పష్టం చేసినట్లు లేఖలో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసినట్లు గుర్తుచేసింది. పోలీసు బలగాల్లో అన్ని స్థాయిల్లోనూ మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి ప్రత్యేక రిక్రూట్మెంట్ నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు చేపట్టిన చర్యలను తమ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. -
ఊరట: విదేశీయుల వీసా గడువు పొడిగింపు..
న్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో కేంద్ర అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు విదేశీయులు భారత్‌లో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం వారి వీసా గడువు పెంచుతూ నిర్ణయం తీసకుంది. దేశంలో చిక్కుకున్న విదేశీయుల వీసా గడువు ఆగస్ట్ 31, 2021 వరకు పొడిగిస్తూ కేంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది కూడా కేంద్రం దేశంలో చిక్కుకున్న విదేశీయుల వీసా గడువు పెంచిన సంగతి తెలిసిందే. మహమ్మారి కారణంగా సాధారణ కమర్షియల్ విమాన కార్యకలాపాలు 2020 మార్చి నుంచి రద్దయ్యాయి. లాక్‌డౌన్‌కు ముందే చెల్లుబాటు అయ్యే భారతీయ వీసాలపై మన దేశానికి వచ్చిన అనేక మంది విదేశీ పౌరులు ఇండియాలో చిక్కుకుపోయారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. లాక్డౌన్ కారణంగా భారత్‌లో చిక్కుకున్న విదేశీ పౌరులు తమ వీసా గడువును పొడిగించుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో జూన్ 30, 2020 తర్వాత గడువు ముగిసే అటువంటి విదేశీ పౌరులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2020 జూన్ 29న వీసా గడువును పొడిగిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసింది. 2020 సాధారణ అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన తేదీ నుంచి మరో 30 రోజుల వరకు వీసా చెల్లుబాటు అవుతుందని తెలిపింది. తాజాగా మరో సారి ఇదే సమస్య తలెత్తడంతో ఆగస్టు 31, 2021 వరకు ఎటువంటి ఓవర్‌స్టే పెనాల్టీ విధించకుండా ఉచిత ప్రాతిపదికన దేశంలో చిక్కుకున్న వీదేశీయుల వీసా గడువు పొడగిస్తూ కేంద్రం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక విదేశీ పౌరులు తమ వీసా గడువు పొడిగింపు కోసం సంబంధిత ఎఫ్ఆర్ఆర్ఓ లేదా ఎఫ్‌ఆర్‌ఓకు ఎటువంటి దరఖాస్తును సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. విదేశీ పౌరులు దేశం నుంచి వెళ్లే ముందు సంబంధిత ఎఫ్ఆర్ఆర్ఓ, ఎఫ్‌ఆర్‌ఓకు నిష్క్రమణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ఎటువంటి ఓవర్‌స్టే జరిమానా విధించకుండా ఉచిత ప్రాతిపదికన మంజూరు చేయబడుతుంది అని కేంద్రం తెలిపింది. -
బెంగాల్లో కేంద్రమంత్రి మురళీధరన్ కారుపై దాడి
-
బెంగాల్లో హింస.. కేంద్ర హోం శాఖ సీరియస్
కోల్కత్త: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర హోం శాఖ బెంగాల్ గర్నర్‌ను ఆదేశించింది. ఇప్పటికే కేంద్రం నలుగురు సభ్యులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఫలితాల తర్వాత బెంగాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బెంగాల్లో కేంద్రమంత్రి మురళీధరన్ కారుపై దాడి జరిగింది. దుండగలు మంత్రి వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో తన వ్యక్తిగత సిబ్బంది గాయపడినట్టు మురళీధరన్ వెల్లడించారు. టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారని ఆరోపించడమే కాక.. మురళీధరన్ పర్యటన రద్దు చేసుకుని వెనక్కి వెళ్లిపోయారు. ఇక బెంగాల్లో చెలరేగిన హింసకు ఎన్నికల కమిషనే కారణమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇక మీదట రాష్ట్రంలో శాంతి భద్రతలు తానే పర్యవేక్షిస్తానన్న మమతా.. డీజీపీ నీరజ్ నయాన్‌పై బదిలీ వేటు వేయడమే కాక.. పాత డీజీపీ వీరేంద్రకు తిరిగి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. చదవండి: బెంగాల్ హింస ఆగేదెన్నడు? -
కేంద్రం తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తెలంగాణలో హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. అయితే, అఫిడవిట్ దాఖలు చేయకుండా.. మెమో దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ కేంద్ర హోమ్ శాఖ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంబసీ నుంచి వివరాలు రాబట్టలేకపోతే ఎందుకు మీ హోదాలు? అని హైకోర్టు ప్రశ్నించింది. పాత మెమోనే సమర్పించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు జర్మనీ ఎంబీసీ నుంచి పూర్తి సమాచారంతో అఫిడవిట్ వేయాలని హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది. -
ఏలూరు ఘటనపై స్పందించిన కేంద్ర హోంశాఖ
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థత ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఘటనకు సంబంధించిన వివరాలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరాతీశారు. ఈమేరకు ఆదివారం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఫోన్లో చర్చించారు. అవసరం మేరకు కేంద్ర వైద్య బృందం సహాయం అందించేందకు సిద్ధంగా ఉందన్నారు. ఆస్పత్రిలో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. కాగా, ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య ఇప్పటివరకు 270కి చేరింది. అస్వస్థతకు గురైన బాధితులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఇప్పటివరకు 117 మందిని డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం పదిమందిని అధికారులు విజయవాడ తరలించారు. బాధితులకు వైద్యసిబ్బంది అలుపెరగకుండా సేవలు అందిస్తున్నారు. -
8న సినీ ప్రముఖులతో కేంద్రం భేటీ
న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసి ఆన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో దేశంలోని అన్ని రంగాలు మెల్లమెల్లగా పునఃప్రారంభం అవుతున్నాయి. జిమ్ములు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలు ఇప్పటికే తెరుచుకోగా మెట్రో సర్వీసులు మరి కొన్నిరోజుల్లో మొదలు కానున్నాయి. అయితే కేవలం విద్యా సంస్థలు, పార్కులు, సినిమా థియేటర్లు మాత్రమే ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రస్తుతం అన్‌లాక్ 4.0లో భాగంగా దేశంలో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. (సినిమాను కాపాడండి) ఈ క్రమంలో సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్‌ల ప్రారంభంపై ఈ నెల 8న సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులతో కేంద్ర హోం శాఖ అధికారులు భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో థియేటర్లు తెరుచుకునే తేదీ, పాటించాల్సిన నిబంధనలపై చర్చించనుంది. ఈ సమావేశం అనంతరం థియేటర్లు తెరుచుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టనుందనేది ఆసక్తిగా మారింది. (రాజ్‌నాథ్‌తో భేటీకి చైనా తీవ్ర ప్రయత్నం) కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినిమా రంగం కూడా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా సుమారు ఐదు నెలలకు పైగా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. దీని వల్ల విడుదలకు సిద్ధంగా ఉన్న ఎన్నో తెలుగు సినిమాలు వాయిద పడ్డాయి. చిన్న చిన్న సినిమాలు ఓటీటీ ద్వారా విడుదలైపోతున్నాయి. అయితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన స్టార్ హీరోల సినిమాలను ఓటీటీ విడుదల చేసే ధైర్యం చేయలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. -
రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే
సాక్షి, అమరావతి: ‘రాజధాని’ ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తీసుకునే నిర్ణయమే అని, అందులో తమ పాత్రేమీ ఉండదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 6 ప్రకారం ఏపీ రాజధాని విషయంలో ప్రత్యామ్నాయాల నిమిత్తం విశ్రాంత ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ 2014 ఆగస్టు 30న ఇచ్చిన నివేదికను కేంద్రం అదే ఏడాది సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపినట్లు వివరించింది. అనంతరం 2015 ఏప్రిల్ 23న అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం’ తెచ్చి జూలై 31న గెజిట్‌లో ప్రచురించిందని తెలిపింది. దీని ప్రకారం అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియాను శాసన రాజధానిగా, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియాను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ ఏరియాను న్యాయ రాజధానిగా ప్రకటించిందని కోర్టుకు నివేదించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదానివ్వడంతో పాటు పునర్విభజన చట్టంలోని పలు అంశాలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన పోలూరి శ్రీనివాసరావు హైకోర్టులో 2018లో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయలేదని శ్రీనివాసరావు తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ కార్యదర్శి స్థాయి అధికారి లలిత టి.హెడావు కౌంటర్ దాఖలు చేశారు. ►రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. అవి ప్రస్తుతం అక్కడ పెండింగ్‌లో ఉన్నాయని ఆమె కౌంటర్లో నివేదించారు. ►రాజ్యసభలో సభ్యుల మధ్య జరిగిన చర్చలపై రాజ్యాంగంలోని అధికరణ 122 ప్రకారం న్యాయస్థానాలు విచారణ జరపడానికి వీల్లేదన్నారు. రాష్ట్రాలను కలపడం, విభజించే అధికారాన్ని రాజ్యాంగం పార్లమెంట్‌కు కట్టబెట్టిందన్నారు. ►అధికరణ 371డీలో పేర్కొన్న ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ పార్లమెంట్ చట్టం తెచ్చిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకయ్యే 100 శాతం వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని చెప్పారు. -
రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదే: కేంద్రం
-
రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదే: కేంద్రం
సాక్షి, అమరావతి : రాజధాని అంశంపై ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ గురువారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. రాజధాని నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ.. కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది. కాగా రిట్ పిటిషన్ 20622/2018కు ప్రతిగా కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం 2014లో శివరామకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ‘రాజధాని ఎక్కడ పెట్టాలన్న దానిపై శివరామకృష్ణన్ కమిటీ పరిశీలన జరిపింది. ఆగస్టు 30, 2014న ఈ కమిటీ రాజధాని విషయమై నివేదిక సమర్పించింది. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు. జులై 31, 2020న ఏపీ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణ చేసింది. పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి ఒక గెజిట్‌ను విడుదల చేసింది. గెజిట్ ప్రకారం ఏపీలో మూడు పాలనా కేంద్రాలుంటాయి. గెజిట్ ప్రకారం శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును పేర్కొన్నార’ని కేంద్రం అఫిడవిట్లో పేర్కొంది. (ప్రభుత్వంపై ఆరోపణలన్నీ ఉపసంహరించుకుంటున్నా) -
‘కేరళ బంగారం’ కేసు ఎన్ఐఏకు
న్యూఢిల్లీ: తిరువనంతపురం విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం కేసు విచారణ బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ వ్యవహారం దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని హోం శాఖ పేర్కొంది. ఈ అంశంపై జోక్యం చేసుకుని, మరింత మెరుగైన దర్యాప్తు జరపాలంటూ కేరళ సీఎం విజయన్ ప్రధాని మోదీకి లేఖ రాసిన మరుసటి రోజే కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆదివారం గల్ఫ్ నుంచి తిరువనంతపురం వచ్చిన ఓ విమానంలో దౌత్యపరమైన సామగ్రి పేరుతో ఉన్న బ్యాగులో సుమారు 30 కిలోల బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. -
'ఒక్క వలస కూలీ మృతి చెందకూడదు'
న్యూఢిల్లీ : లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలు పడుతున్న ఇబ్బందులపై కేంద్ర హోం శాఖ మంగళవారం మరోసారి స్పందించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన తమ స్వస్థలాలకు వెళుతున్న వలస కార్మికుల బాధలను తగ్గించడానికి అన్ని రాష్ట్రాలు సహకరించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. వలస కూలీలను తీసుకెళ్లడానికి మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. (కరోనా.. కేంద్ర మంత్రి కార్యాలయం మూసివేత) వలస కూలీలు తమ ఇళ్లకు చేరుకోవడానికి ఏంచుకొన్న మార్గాల్లో విశ్రాంతి స్థలాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ స్థలాలను ఎన్జీవో సహాయంతో గుర్తించవచ్చని, వాటిని నిర్మించడంలో స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలని పేర్కొన్నారు. వలస కూలీలకు ఏర్పాటు చేయనున్న విశ్రాంతి గృహాల్లో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని, వారికి నిత్యం ఆహారం అందుబాటులో ఉంచాలని రాష్ట్రాలకు వెల్లడించారు. ఇక రైలు పట్టాలు, రోడ్ల వెంబడి వలస కూలీలు నడవకుండా చూసేలా ఆయా రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు చేపట్టేలా అక్కడి అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చినట్లు అజయ్ భల్లా పేర్కొన్నారు.ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖను ట్విటర్లో కూడా షేర్ చేశారు. (భారత్‌లో లక్ష దాటేసిన కరోనా కేసులు) కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో సొంతూళ్ల బాట పట్టిన వలస కూలీలు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు. మంగళవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 12 మంది వలస కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో వలస కూలీల బాధలు కొంతమేరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. Proactive coord between States & @RailMinIndia reqd to run more trains; run more buses for smooth transport of #MigrantWorkers. Create rest places with food etc for people on foot, till they are guided to bus/rail stations. Dispel rumours, give clarity on train/bus departures:MHA pic.twitter.com/EUHZgU5egD — Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) May 19, 2020 -
31 దాకా లాక్డౌన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31వ తేదీ వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్డీఎంఏ జాతీయ కార్యనిర్వాహక కమిటీ(ఎన్ఈసీ) చైర్మన్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆదివారం రాత్రి నాలుగో విడత లాక్డౌన్ మార్గదర్శకాలు జారీచేశారు. విమానాలు, మెట్రో రైళ్ల రాకపోకలపై ఉన్న నిషే«ధాన్ని యథాతథంగా కొనసాగించారు. విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు తెరుచుకోవని స్పష్టం చేశారు. నిర్ధిష్టంగా నిషేధిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలు మినహా మిగిలిన అన్ని కార్యకలాపాలకు లాక్డౌన్ నుంచి సడలింపులు ఇచ్చారు. (ఒక్కరోజులోనే 4,987) చిక్కుకుపోయిన వారంతా తరలింపు దేశంలో చిక్కు కుపోయిన విదేశీ యులు, ఇతర ప్రాంతాల్లో చిక్కు కుపోయిన శ్రామికులు, భారతీయ సీఫేరర్స్, వలస కూలీలు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతరుల తరలింపునకు అను మతి. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయు లు, భారతీయ విద్యార్థుల తరలింపునకు అనుమతి. ప్రత్యేక రైళ్ల ద్వారా వ్యక్తుల ప్రయా ణం వంటి అంశాల్లో ఇదివరకే జారీచేసిన ప్రామాణిక నియమావళి వర్తిస్తుంది. కొవిడ్– 19 మేనేజ్మెంట్కు సంబంధించి జాతీయ మార్గదర్శకాలు అమలులో ఉంటాయి. కట్టడి, బఫర్, రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ► కేంద్ర ఆరోగ్య శాఖ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఎక్కడెక్కడ ఉండాలో రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. ► రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో కట్టడి జోన్లు, బఫర్ జోన్లను జిల్లా యంత్రాంగాలు నిర్ధేశిస్తాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని గుర్తిస్తాయి. ► కట్టడి జోన్లలో కేవలం అత్యవసర సేవలనే అనుమతిస్తారు. ఆయా జోన్లలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తారు. అత్యవసర వైద్య సేవలు, నిత్యావసర వస్తువుల సరఫరాకు తప్ప వ్యక్తులు ఈ జోన్లలో రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఇందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి. ► కట్టడి జోన్లలో పటిష్టమైన కాంటాక్ట్ ట్రేసిం గ్, ఇంటింటిపై నిఘా, అవసరమైనప్పుడు వైద్య సేవలు అందించడం వంటి కార్యకలాపాలు కొనసాగుతాయి. రాత్రి పూట కర్ఫ్యూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వ్యక్తుల రాకపోకలు నిషేధం. అవసరమైన సేవలకు మినహాయింపు ఉంటుంది. సీఆర్పీసీ సెక్షన్ 144 కింద స్థానిక యంత్రాంగం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తుంది. కట్టడి జోన్లలో అత్యవసరానికే అనుమతి నిర్ధిష్టంగా నిషేధించిన వాటికి మినహా ఇతర అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. అయితే, కట్టడి జోన్లలో మాత్రం ఐదో నిబంధనలో పేర్కొన్నట్టుగా అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తారు. అలాగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పరిస్థితిని అంచనా వేసి, విభిన్న జోన్లలో కార్యకలాపాలపై నిషేధం విధించవచ్చు. అవసరమైన మేరకు ఆంక్షలు విధించవచ్చు. హాని పొంచి ఉన్న వారికి రక్షణ 65 ఏళ్ల వయస్సు పైబడి ఉన్నవారు, ఇతర వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు ఇంట్లోనే ఉండాలి. అత్యవసరాలు, ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి మినహాయింపు ఉంటుంది. ‘ఆరోగ్యసేతు’ వినియోగం ► పని ప్రదేశాలు, ఆఫీసుల్లో రక్షణ కోసం యాజమాన్యాలు తమ ఉద్యోగులు ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునేలా చూడాలి. ► వ్యక్తులు ఆరోగ్యసేతు యాప్ ఇన్స్టాల్ చేసుకుని తరచుగా తమ ఆరోగ్య స్థితిని తనిఖీ చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. వ్యక్తులు, వస్తు రవాణాకు ప్రత్యేకం ► రాష్ట్రంలో, అంతర్రాష్ట్ర పరిధిలో వైద్య నిపుణులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, అంబు లెన్స్‌ల రాకపోకలపై ఆంక్షలు కూడదు. ► ఖాళీ ట్రక్కులు సహా అన్ని రకాల వస్తు, కార్గో రవాణా వాహనాల అంత ర్రాష్ట్ర రాక పోకలపై ఆంక్షలు ఉండరాదు. ► ఏ రాష్ట్రమైనా అంతర్జాతీయ భూ సరిహద్దు వద్ద వస్తు రవాణాను అడ్డుకోరాదు. కచ్చితంగా అమలు చేయాల్సిందే ► జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద జారీచేసిన ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు ఏ విధంగానూ బలహీన పర్చరాదు. ► అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి. వీటిని అమలు చేసేందుకు జిల్లా మేజిస్ట్రేట్లు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లను ఇన్సిడెంట్ కమాండర్లుగా పంపాలి. వారి పరిధిలో నిబంధనల అమలుకు ఇన్సిడెంట్ కమాండర్లు బాధ్యులుగా ఉంటారు. ► జాతీయ విపత్తు నిర్వహణ చట్టం పరిధిలోని సెక్షన్ 51 నుంచి సెక్షన్ 60 మధ్య ఉన్న నిబంధనలను ఉల్లంఘించిన వారు ఐపీసీ సెక్షన్ 180 పరిధిలో శిక్షార్హులు. -
లాక్డౌన్ పొడిగింపు.. కేంద్రం సంకేతాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెండో దశ లాక్డౌన్ మే 3వ తేదీన ముగియనుంది. కానీ, కరోనా పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోగా, కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నానాటికీ దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో లాక్డౌన్ పొడిగించక తప్పదని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో చెప్పుకోదగ్గ మినహాయింపులు ఇస్తారని సమాచారం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం సంకేతాలు ఇచ్చింది. ఇప్పటిదాకా అమలు చేసిన లాక్‌డౌన్‌తో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది. లాక్‌డౌన్‌తో ఇప్పటికే మనం సాధించింది నిష్ఫలం కాకుండా ఉండాలంటే మరికొన్ని రోజులు ఓర్చుకోక తప్పదని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. -
‘నిజాముద్దీన్’పై కేంద్ర హోంశాఖ దర్యాప్తు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో నిజాముద్దీన్ మర్కజ్‌పై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు కేంద్ర హోంశాఖ మంగళవారం వెల్లడించింది. ఈ క్రమంలో మర్కజ్ కార్యక్రమానికి ఎవరెవరు హాజరయ్యారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి వచ్చిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు హోంశాఖ నిర్థారించింది. విదేశాల నుంచి వచ్చిన వారు మర్కజ్ భవనంలో రిపోర్టు చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తారని, వీరు వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కోర్డినేటర్ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని చెప్పింది. మార్చి 21 నాటికి మర్కజ్ భవనంలో 1746 మంది ఉన్నారని, వారిలో 1530 మంది దేశీయలు కాగా.. 216 మంది విదేశీయలు ఉన్నట్లు తెలిపింది. (‘నిజంగా మీరు ప్రజా రక్షక భటులు’) ఇక భారత తబ్లీక్ జమాత్ కార్యకర్తలు కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారని హోంశాఖ పేర్కొంది. కాగా ఈ 824 మంది విదేశీయులను కోవిడ్-19 స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వారిని క్వారంటైన్‌కు పంపాలని రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపింది. అదే విధంగా వీరితో పాటు భారత తబ్లీక్ జమాత్ కార్యకర్తలు, జిల్లా కోర్డినేటర్లకు కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని పోలీసులను ఆదేశించామంది. ఇప్పటి వరకు 2137 మంది భారత తబ్లీక్ జమాత్ కార్యకర్తలను పరీక్షించి అవసరమైన మేరకు క్వారంటైన్‌కు తరలించామని తెలిపింది. దీంతో పాటు జమాత్ కార్యకర్తలు తిరిగిన ప్రాంతాలు, ప్రైమరీ కాంట్రాక్ట్ వ్యక్తుల వివరాలను సేకరించాలని ఐబీ రాష్ట్రాల డీజీపీలకు సూచించామని, ఈ ఆదేశం మేరకు రాష్ట్రాల పోలీసులు చర్యలు చేపడుతున్నారని తెలిపింది. మర్కజ్ భవనంలో మార్చి 26 నుంచి తబ్లీక్ జమాత్ కార్యకర్తలు అందరినీ స్క్రీనింగ్ చేస్తున్నామని కూడా తెలిపింది. ఇక 1203 మందికి స్క్రీనింగ్ చేయగా 303 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించామంది. వారిని దిల్లీలోని వివిధ ఆస్పత్రులకు తరలించగా.. మిగతావారిని నరేలా, బక్కర్ వాలా, సుల్తాన్ పూరిలోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించామని పేర్కొంది. జనవరి 1 నుంచి తబ్లీక్ జమాత్ కార్యక్రమాల కోసం భారత్ వచ్చిన 2100 మంది విదేశీయులను గుర్తించామని, ఈ మేరకు ఇమీగ్రేషన్ బ్యూరో ఆయా రాష్ట్రాలకు విదేశీయుల రాకపై వివరాలను అందిస్తోందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. -
మరికొన్ని మినహాయింపులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌కు ఆదేశించిన నేపథ్యంలో దీనినుంచి కొన్నిటికి మినహాయింపులు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్బీఐ, ఆర్బీఐ నియంత్రించే ఫైనాన్షియల్ మార్కెట్లు, పే అండ్ అకౌంట్స్ అధికారులు, కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) క్షేత్రస్థాయి అధికారులు, పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ, పెన్షన్ సేవలు, అటవీ సిబ్బందిని లాక్డౌన్ పరిధి నుంచి మినహాయించారు. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో కార్గో సేవల నిర్వహణ సిబ్బంది, బొగ్గు తవ్వకాలు, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే రెసిడెంట్ కమిషనర్లు, సిబ్బంది, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో పనిచేసే కస్టమ్స్ సిబ్బందిని కూడా లాక్డౌన్ నుంచి మినహాయించారు. జంతు ప్రదర్శన శాలల(జూ) నిర్వహణ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బందితోపాటు అనాధ బాలల సంరక్షణ సిబ్బంది, అనాథలు, వితంతు శరణాలయాలు, పశు వైద్యశాలలు, మందుల షాపులు (జన ఔషధి దుకాణాలతో కలిపి), ఫార్మా రీసెర్చ్ ల్యాబ్‌లు, బ్యాంకింగ్ ఆధారిత ఐటీ సేవలు, ఏటీఎం నిర్వహణ ఏజెన్సీలను కూడా లాక్డౌన్ నుంచి మినహాయించారు. ఎవరేం వాడాలి? న్యూఢిల్లీ: మాస్కులు, గ్లౌజ్‌లు, కళ్లజోళ్లు, డిమాండ్ పెరగడంతో ఎవరెవరు ఎలాంటి రక్ష ణ ఉపకరణాలు వాడాలో చెప్తూ్త కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. దాని ప్రకారం.. ► కోవిడ్ రోగులకు చికిత్సచేసేవారికి పూర్తిస్థాయిలో రక్షణ ఉపకరణాలు ఉండాలి. ► పరిపాలన సిబ్బందిని ‘నో–రిస్క్’ జాబితాలో చేర్చారు. వీరికి ఈ వ్యక్తిగత రక్షణ పరికరాల అవసరం ఉండదు. పరిపాలన విభాగానికి చెందిన వారెవరూ రోగులకు చికిత్స అందిస్తున్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► ప్రయాణికులకు సమాచారం అందించే హెల్త్ డెస్క్ సిబ్బందిని ‘లో– రిస్క్’ కేటగిరీలో చేర్చారు. వీరు మూడు పొరలున్న మెడికల్ మాస్క్, చేతి తొడుగులు వాడాలి. 3పొరల మెడికల్ మాస్క్ ద్రవాలను అడ్డుకోగలదు. రోగుల దగ్గు, తుమ్ముల ద్వారా వెలువడే ద్రవాలు శరీరంలోకి చేరకుండా కాపాడతాయి. ► పారిశుధ్య కార్మికులను మధ్యమస్థాయి ప్రమాదం ఉన్న ‘మోడరేట్ రిస్క్’ కేటగిరీలో ఉంచారు. తరచూ నేలను, ఉపరితలాలను శుభ్రం చేసే వీరికి ఎన్95 మాస్క్ అందించాలి. వైద్య పరీక్షలు నిర్వహించే వైద్యులు, నర్సులకు కూడా ఇంతే స్థాయిలో ప్రమాదం ఉంటుంది. ► రోగులను రవాణా చేసే వారికి పూర్తిస్థాయిలో ప్రమాదం ఉన్నందున అన్ని రకాల వ్యక్తిగత రక్షణ పరికరాలు అందుబాటులో ఉండాలి. ఇదే విధంగా నమూనాలు సేకరించే అధికారులకు, పరిశోధనశాల నిపుణలకు కూడా పూర్తిస్థాయిలో ఈ పరికరాలు అందించాలి. ► స్వీయ నిర్బంధంలో ఉన్న వారికి ప్రమాదం తక్కువ. కుటుంబంలో ఎవరైనా క్వారంటైన్లో ఉంటే వారికి సేవలందించే వ్యక్తి చేతి తొడుగులు తొడుక్కోవడం అవసరం. మిగిలిన కుటుంబ సభ్యులకు ఎలాంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు అవసరం లేదు. -
నకిలీ వార్తల ఏరివేతపై మీ వైఖరేంటి?
న్యూఢిల్లీ: ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు, ద్వేషపూరిత ప్రసంగాలను తొలగించే అంశంపై తన వైఖరిని తెలియజేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి ఒక నోటీసు జారీ చేసింది. బుధవారం కేంద్ర హోం, ఆర్థిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ మాజీ సిద్ధాంతకర్త కె.ఎన్.గోవిందాచార్య దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఏప్రిల్ 14న జరగనుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం.. ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్‌లు భారత్‌లో తమ అధికార ప్రతినిధుల వివరాలను బహిర్గతపరిచేలా ఆయా సంస్థలను ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విరాజ్ గుప్తా డిమాండ్ చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలకు స్వర్గ ధామాలైపోయినా సామాజిక మాధ్యమాల్లో చట్టాలను అమలు చేసే వ్యవస్థ పోతోందని, అందుకు జవాబుదారీ అయిన అధికారులు ఎవరనేది తెలియకపోవడమూ ఇందుకు కారణమని పిటిషన్లో పేర్కొన్నారు. అలర్లకు, ఆస్తుల విధ్వంసానికి సామాజిక మాధ్యమాలు ఒక పనిముట్టుగా మారకూడదని, భావప్రకటన స్వేచ్ఛలో భాగమని చెప్పుకోవడమూ సరికాదని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛ అన్న భావనను ఈ సామాజిక మాధ్యమాలు దుర్వినియోగం చేస్తున్నాయని, భారతీయ చట్టాలను పాటించడం లేదని ఆరోపించారు. తగిన చర్యలేవీ లేని కారణంగానే రెచ్చగొట్టే ప్రసంగాలూ ఎక్కువ అవుతున్నాయని పిటిషనర్ ఆరోపించారు. -
ఏబీవీని విచారించండి
సాక్షి, అమరావతి: ఇంటెలిజెన్స్ మాజీ అదనపు డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఖరారు చేస్తూ తదుపరి విచారణను చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏబీపై క్రమశిక్షణ చర్యలను తీసుకోవడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తును చేపట్టేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించింది. ఈ మేరకు శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ నిగమ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. పోలీసు విభాగం ఆధునికీకరణ నిధులు దుర్వినియోగం, ఏరోసాట్, యూఏవీల కోనుగోళ్ల కోసం వెంకటేశ్వరావు వెచ్చించిన రూ.25.5 కోట్ల వ్యవహారంలో భారీ అక్రమాలు, అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు కేంద్ర హోంశాఖ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావుపై వచ్చే నెల 7వ తేదీలోగా చార్జిషీటు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఏసీబీ విచారణ జరిపించండి.. – ఏబీ వెంకటేశ్వరరావు ప్రతిపక్ష నేతలపై నిఘా కోసం ఫోన్ ట్యాపింగ్ పరికరాలు, డ్రోన్లు కొనుగోలు చేయడంలో చేతివాటం చూపినట్లు గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. – ఆ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయించింది. – వెంకటేశ్వరరావు దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను బహిర్గతం చేసినట్లు తేలింది. – పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ విధానాలను ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ఇండియన్ ప్రొటోకాల్ ఒకే విధమైన ప్రామాణికాలను కలిగి ఉంటాయి. దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. – ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద ఆయన్ను సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. – ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన హెడ్ క్వార్టర్ దాటి వెళ్లేందుకు వీల్లేదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. – ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 19వ తేదీన వెంకటేశ్వరరావు అక్రమాలపై సమగ్ర నివేదికను కేంద్ర హోం శాఖకు పంపించింది. – ఈ నివేదికను పరిశీలించిన కేంద్ర హోం శాఖ.. అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినందున వెంకటేశ్వరరావుపై ఏసీబీ ద్వారా సవివరమైన విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అందుకు సంబంధించిన నివేదిక సమర్పిస్తే తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సమర్థించిన కేంద్రం
-
ఏబీ వెంకటేశ్వరరావుకు షాకిచ్చిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంపై కేంద్ర హోంశాఖ స్పందించింది. వెంకటేశ్వరరావు అవినీతిపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న కేంద్రం.. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడాన్ని సమర్థించింది. అలాగే ఏబీ వెంకటేశ్వరరావు అవినీతిపై ఏప్రిల్ 7లోగా చార్జ్‌షీట్ దాఖలు చేయాలని శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మొత్తం రూ. 25 కోట్ల 50 లక్షల పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనీ.. వీటి వెనుక వెంకటేశ్వరరావు హస్తం ఉందని హోంశాఖ పేర్కొంది. పోలీస్‌శాఖ అధునీకరణ పేరుతో ఆయన అవినీతికి పాల్పడ్డారని నిర్థారించింది. కాగా ప్రవర్తనా నియమాల ఉల్లంఘించినందుకు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతనెల 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. (దేశ భద్రతా రహస్యాలు బహిర్గతం!) ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్ చేసినట్లు జీవో నంబర్ 18లో స్పష్టం చేసింది. ఆయన దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను బహిర్గతం చేసినట్లు తేలింది. ఏబీ వెంకటేశ్వరరావు పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ విధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. (వామ్మో.. ఏబీవీ!: సర్వత్రా విస్మయం). ఏపీ ప్రభుత్వం చెప్పిన చెప్పిన కారణాలు నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘాపరికరాల కొనుగోలు ఆరోపణలు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉండి ఇజ్రాయెల్ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు అడ్వాన్సుడ్ సిస్టమ్స్ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆరోపణ విదేశీ సంస్ధతో కుమ్మకై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకోవడం అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘన విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ నాణ్యతలేని నిఘాపరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ రాష్ట్ర భద్రతకు సంబంధించిన సమాచారం విదేశీ సంస్ధలతో పంచుకోవడం భవిష్యత్ భద్రతకు ముప్పని ఆరోపణ కాసులకు కక్కుర్తి పడి అనామక సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపణ కావాలనే టెండర్ల సాంకేతిక కమిటీలో నిపుణులకు స్ధానం కల్పించలేదని ఆరోపణ విదేశీ సంస్ధకు మేలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టు నిబంధనలు మార్చారని ఆరోపణ ఇజ్రాయెల్ సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చేందుకే మిగతా కంపెనీల అర్హతలను పట్టించుకోలేదని ఆరోపణ నిఘా పరికరాల కొనుగోలుకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోలేదని ఆరోపణ ఉద్దేశపూర్వకంగానే పరికరాల కొనుగోలు ఆర్డర్ కాపీలను మాయం చేశారు కావాలనే పరికరాల కొనుగోళ్లలో సీనియర్ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారు ఇజ్రాయెల్ కంపెనీతో కుమ్మకై అయినట్టుగా ప్రభుత్వం ఆరోపణ వెంకటేశ్వరరావు ఉద్దేశపూర్వకంగానే ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్స్, విధానాలను బహిర్గతం చేశారనే ఆరోపణ దీనితో పాటు వెంకటేశ్వరరావు రాజద్రోహానికి పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేధించింది. -
చట్టం 'దిశ'గా!
సాక్షి, అమరావతి: మహిళలు, చిన్నారుల రక్షణతోపాటు బాధితులకు సత్వర న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దిశ చట్టంపై కేంద్ర హోంశాఖ కసరత్తు చేపట్టింది. దిశ బిల్లుకు చట్టరూపం కల్పించే చర్యలను ప్రారంభించింది. కొన్ని సాంకేతిక అంశాలపై కేంద్ర హోంశాఖ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందచేసింది. దిశ చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. న్యాయ కోవిదులతో సంప్రదింపులు ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం లైంగిక దాడి, వేధింపులను తీవ్ర నేరాలుగా పరిగణిస్తూ ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్లలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చింది. నిర్భయ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో నేరం రుజువైతే దోషులకు ఏడేళ్ల నుంచి జీవిత ఖైదు విధించేలా చట్టాల్లో కేంద్రం మార్పులు తెచ్చింది. ఈ కేసుల దర్యాప్తు, విచారణ మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేసేలా ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం–2019 ద్వారా 21 రోజుల్లోనే కేసు దర్యాప్తు, విచారణ పూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షించేలా ప్రతిపాదించింది. అత్యాచారానికి పాల్పడే నిందితులకు ఉరిశిక్ష విధించేలా మార్పులు చేసింది. ఈ క్రమంలో త్వరితగతిన విచారణ, శిక్ష అమలులో వెసులుబాటు, ప్రత్యేక కోర్టులు, యంత్రాంగం ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని కేంద్ర హోంశాఖ కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన దిశ బిల్లు, కేంద్ర హోంశాఖ ప్రస్తావించిన పలు అంశాలకు సంబంధించిన వివరాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలన ప్రక్రియ ప్రారంభించింది. దిశ బిల్లులో పొందుపరిచిన పలు అంశాలను చట్టపరంగా, న్యాయపరంగా ఎలా పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై కేంద్ర హోంశాఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. మహిళలపై వేధింపులకు సంబంధించి ప్రస్తుత చట్టాల్లో మార్పులు, కొత్తవి రూపకల్పన, అమలు తీరు తదితర అంశాలపై సలహాలు ఇవ్వాలని కోరుతూ కేంద్రం గత నెలలో అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఐపీసీ 1860, ఎవిడెన్స్ యాక్ట్ 1872, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ) 1973 చట్టాల్లో మార్పులు తెచ్చి కేసుల దర్యాప్తు, విచారణ, తీర్పు వేగంగా పూర్తయ్యేలా కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే చట్టరూపం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దిశ బిల్లును చట్ట రూపంలోకి తేవటంపై కేంద్ర హోంశాఖ సానుకూలంగా ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్రాలు ప్రతిపాదించే సవరణలకు కేంద్ర హోంశాఖ అనుమతి అవసరం. ఇప్పటికే ఈ బిల్లును పరిశీలించి న్యాయ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు పంపింది. బిల్లును ఏ సబ్జెక్ట్ ప్రకారం ప్రతిపాదించారు? ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్లకు సంబంధించి ఏ మార్పులు చేశారు? అనే కొన్ని ప్రాథమిక అంశాలపై కేంద్ర హోంశాఖ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందచేసింది. దిశ బిల్లు త్వరలోనే చట్ట రూపం దాలుస్తుందని ఆశిస్తున్నాం. – దీపికా పాటిల్, దిశ ప్రత్యేక అధికారి -
ఎన్పీఏ డైరెక్టర్‌గా అతుల్ కర్వాల్
సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ) నూతన డైరెక్టర్‌గా అతుల్ కర్వాల్ నియమితులయ్యా రు. ఈ మేరకు బుధవారం కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. 1988 ఐపీఎస్ బ్యాచ్, గుజరాత్ కేడర్‌కు చెందిన అతుల్ ప్రస్తుతం సీఆర్పీఎఫ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. -
మహిళలపై దాడులు: కేంద్రం కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వరుస అత్యాచార ఘటనలు వెలుగు చూస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు పలు కీలక మార్గదర్శకాలను జారీచేసింది. మహిళల రక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. రక్షణలో పోలీసులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. అలాగే మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడి కేసులను రెండు నెలల్లో విచారించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలకు శనివారం లేఖను రాశారు. లైంగికదాడి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే మహిళ, రక్షణ కొరకు కేంద్రానికి పలు సూచనలు కూడా చేయవచ్చని హోంశాఖ రాష్ట్రాలను కోరింది. కాగా ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్, ఉన్నావ్, ఉత్తర భారత్‌లో పలు ముఖ్య నగరాల్లో సహా అనేక ప్రాంతాల్లో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో మహిళలు, ప్రజాసంఘాల నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. మహిళా రక్షణకు ప్రత్యేక చట్టాలను రూపొందించాలని, కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అత్యాచార ఘటనలో నిందితులకు క్షమాభిక్ష పెట్టే సాంప్రదాయాన్ని పక్కనపెట్టాలని పలువురు కోరుతున్నారు. దీనిపై తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దిశ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న చట్టాలను సమూలంగా మార్చుతున్నాంటూ కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం కూడా ఆలోచన చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. -
ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఆధునీకరణ
న్యూఢిల్లీ: నేర ఘటనలలో సమర్థవంతమైన దర్యాప్తు జరిపేందుకు వీలుగా దేశంలోని ఆరు కేంద్ర ఫోరెన్సిక్ ప్రయోగశాలలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. చండీగఢ్, హైదరాబాద్, కోల్‌కతా, భోపాల్, పుణే, గువాహటిలలో ఉన్న ఆరు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు (సీఎఫ్ఎస్ఎల్)లను ఆధునీకరించనుంది. ఈ ఆరు సీఎఫ్ఎస్ఎల్ల సామర్థ్యాన్ని పెంచాలని హోం శాఖ నిర్ణయించిందని ఒక అధికారి తెలిపారు. తీవ్రమైన నేరాలలో మరింత సమర్థవంతమైన, శాస్త్రీయ విధానంలో దర్యాప్తును సులభతరం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. పరిశోధన కార్యకలాపాలను నిర్వహించడానికి ఇటీవల ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిహేవియరల్ సైన్సెస్, గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. దీని ద్వారా విద్యావేత్తలు–అభ్యాసకుల మధ్య భాగస్వామ్యాన్ని పెండడంతోపాటు అత్యాధునిక పరిశోధనలకు దోహదపడుతుందని భావిస్తున్నారు. -
చెన్నమనేనికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయం అమలును 4 వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఈనెల 20 జారీ చేసిన ఉత్తర్వులను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం విచారించారు. భారత పౌరసత్వ చట్టం–1955లోని సెక్షన్ 10 ప్రకారం చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేయడం చెల్లదని ఆయన న్యాయవాది వాదించారు. కేంద్ర హోం శాఖ 2017 డిసెంబర్ 13న జారీ చేసిన ఆదేశాల తరహాలో తిరిగి సాంకేతికంగానే నిర్ణయం తీసుకుందన్నారు. 2017 నాటి రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని, అప్పుడు జారీ చేసిన ఉత్తర్వులను కేంద్రం పట్టించుకోలేదని నివేదించారు. మళ్లీ అదే తరహాలో రద్దు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్10ని ఉల్లంఘిస్తేనే పౌరసత్వం రద్దు చేయడానికి వీల్లేదని అదే చట్టంలోని సెక్షన్ 10(3) స్పష్టం చేస్తోందని తెలిపారు. భారత పౌర సత్వం కోసం 2008 మార్చి 31న చెన్నమనేని దరఖాస్తు చేసుకుంటే 2009 ఫిబ్రవరి 3న పౌర సత్వం వచ్చిందని, ఈ మధ్యకాలంలో చెన్నమనేని జర్మనీలో పది మాసాలు ఉంటే, భారత్‌లో కేవలం 2 నెలలే ఉన్నారని కేంద్రం తరఫు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌రావు వాదించారు. చెన్నమనేని పౌరసత్వ రద్దు నిర్ణయంపై జోక్యం చేసుకోవాల్సినదేమీ లేదని, ఇదే విధంగా 2009 నుంచి ఆయన వాదిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చేతిలో ఓడిపోయిన ఆదిశ్రీనివాస్ తరఫు న్యాయవాది పేర్కొ న్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి చెన్నమనేని పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు, దానిపై జరిగిన లావాదేవీల ఫైళ్లను తమ ముందుంచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. అనంతరం విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేశారు. -
‘లోకల్ స్టేటస్’ మరో రెండేళ్లు పొడిగింపు
సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి విద్య, ఉద్యోగాల్లో స్థానిక(లోకల్) కోటా రిజర్వేషన్లు పొందాలనుకుంటున్న వారికి శుభవార్త. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారు స్థానిక హోదా(లోకల్ స్టేటస్) పొందడానికి గడువును కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి 2021 జూన్ ఒకటో తేదీ వరకూ స్థానిక హోదా పొందడానికి అవకాశం లభించనుంది. తెలంగాణలో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి ఇక్కడ లోకల్ స్టేటస్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం మొదట మూడేళ్లు గడువు ఇచ్చింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370(డి)లోని ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను రాష్ట్రపతి ఆమోదంతో సవరించింది. దీనిప్రకారం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ రోజైన 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 1 వరకు లోకల్ స్టేటస్ సర్టిఫికెట్లు పొందవచ్చని 2016 జూన్ 16న కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. తదుపరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ 2017 అక్టోబర్ 30న మరో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం గడువు 2019 జూన్ 1వ తేదీతో ముగిసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడం వల్ల చాలామంది ఏపీ ఉద్యోగులు ఇప్పటికీ తెలంగాణలోనే ఉండిపోయారు. కొందరు ఉద్యోగులు ఏపీకి వచ్చినప్పటికీ తమ కుటుంబాలను హైదరాబాద్‌లోనే ఉంచారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో సైతం హైదరాబాద్‌ను పదేళ్ల వరకూ ఉమ్మడి రాజధానిగా అప్పట్లో కేంద్రం పేర్కొంది. విద్యా సంస్థలు, ఉద్యోగ నియామకాల్లో స్థానిక కోటా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారికి రాష్ట్రంలో స్థానిక హోదా పొందడానికి గడువును మరో రెండేళ్లు పొడిగించాలంటూ రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం రాష్ట్రపతి అనుమతి తీసుకుని లోకల్ స్టేటస్ పొందడానికి గడువును మరో రెండేళ్లు పొడిగించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి)లోని 1, 2 క్లాజ్‌లను సవరిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల(నియంత్రణ, ప్రవేశాలు) సవరణ చట్టం–2019’ చేసింది. ఇది ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలకు స్థానికత హోదా కల్పనకు వర్తిస్తుంది. అలాగే ఉద్యోగాల్లో స్థానిక హోదాను మరో రెండేళ్లు పొడిగించడం కోసం ఇదే తరహాలో రాష్ట్రపతి ఆమోదంతో ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) అమెండ్మెంట్ ఆర్డర్–2019’ చేసింది. దీంతో తెలంగాణ నుంచి 2021 జూన్ 1వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినవారు నిబంధనల ప్రకారం స్థానికత సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. ఉన్నత విద్యా సంస్థల్లో, ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో స్థానిక కోటా కింద రిజర్వేషన్లు పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ ఎస్కే షాహి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక హోదా సర్టిఫికెట్ పొందడమెలా? తెలంగాణ నుంచి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి స్థిరపడినవారు, ఇప్పుడు రావాలనుకుంటున్న వారు స్థానిక హోదా పొందాలంటే కొన్ని మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలి. ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చేశాం కదా ఆటోమేటిగ్గా లోకల్ స్టేటస్ వర్తిస్తుందనుకుంటే పొరపాటే. 2021 జూన్ 1వ తేదీలోగా తహసీల్దార్ నుంచి లోకల్ స్టేటస్ సర్టిఫికెట్లు పొందిన వారికి మాత్రమే విద్య, ఉద్యోగాల్లో స్థానిక కోటా రిజర్వేషన్లు వర్తిస్తాయి.ఈ సర్టిఫికెట్ పొందగోరేవారు తెలంగాణలో నివాసం ఉంటూ ఇక్కడికి వచ్చినట్లు ఆధారాలతో దరఖాస్తు (ఫారం–1) సమర్పించాలి. గతంలో తెలంగాణలో నివాసం ఉన్నట్లు ఆధారాలుగా రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం లాంటివి జత చేయాలి. దీంతోపాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోఫలానా ప్రాంతంలో నివాసం ఉంటున్నామని, అందువల్ల లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ ఫారం–2 సమర్పించాలి. మీ–సేవా ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోగా సంబంధిత తహసీల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. -
ప్రారంభమైన కేంద్ర హోంశాఖ సమావేశం
-
ముగిసిన కేంద్ర హోంశాఖ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంపై కేంద్ర హోంశాఖ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో బుధవారం సాయంత్రం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్కే జోషి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా సమస్యలపై అధికారులు రెండున్నర గంటలపాటు సుధీర్ఘంగా చర్చించారు. షెడ్యూల్ 9,10లలోని సంస్థల విభజనపై ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే సింగరేణి కాలరీస్, ఆర్టీసీ, సివిల్ సప్లై కార్పొరేషన్ బకాయిలు, పలు కార్పొరేషన్ల విభజన అంశాలపై అధికారులు చర్చించారు. అయితే ఈ సమావేశంలో ఏపీ భవన్ విభజనపై చర్చ జరగలేదు. ప్రస్తుతం ఏపీ భవన్‌ను రెండు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయని అధికారులు హోంశాఖకు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలు లెవనెత్తిన అంశాలపై కేంద్ర హోంశాఖ వివరణ కోరింది. అయితే ఈ సమావేశం ఫలప్రదంగా సాగిందని ఇరు రాష్ట్రాల సీఎస్‌లు తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత నార్త్ బ్లాక్ వద్ద ఇరు రాష్ట్రాల సీఎస్‌లు నార్త్ బ్లాక్ వద్ద కరచాలనం చేసుకున్నారు. -
వీవీఐపీల రహస్య పర్యటనలకు చెక్..!
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రముఖులకు ఇచ్చే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) నిబంధనలను కేంద్ర హోం శాఖ తాజాగా సవరించింది. ఇప్పటి నిబంధనల ప్రకారం వీవీఐపీలు ఇక నుంచి విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు ఎస్పీజీ సిబ్బంది వారిని నీడలా వెన్నంటి ఉండాల్సిందే. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత 1985లో ఎస్పీజీని ఏర్పాటు చేశారు. భారత పార్లమెంటును రక్షించడానికి ఈ బృందాన్ని అంకితం చేస్తూ పార్లమెంటు 1988 లో ఎస్పీజీ చట్టాన్ని ఆమోదించింది. తర్వాత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఇచ్చిన ఎస్పీజీ రక్షణను 1989 లో విపీ సింగ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మాజీ ప్రధాని కుటుంబ సభ్యుల హోదాలో రాహుల్ గాంధీకి ఎస్పీజీ భద్రత ఉంది. అనునిత్యం ఆయనకు భద్రతా కమాండోలు రక్షణ కల్పిస్తుంటారు. అలాంటిది కనీసం ప్రస్తుతం వారిని కూడా తనతో విదేశాలకు రానివ్వడం లేదు. ఉన్నట్లుండి మాయమవడం.. అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం.. ఎక్కడ తిరుగుతారో ఎవరికీ తెలియనివ్వకపోవడం.. ఇది కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల తీరు..! రాహుల్ గాంధీ కాంబోడియా పర్యటన నిమిత్తం వెళ్లిన నేపథ్యంలో వీవీఐపీల భద్రతా నిబంధనలను ప్రభుత్వం సవరించడం చర్చనీయాంశమైంది.ఇప్పటిదాకా విదేశాలకు వెళ్తే ఎస్పీజీ సిబ్బందిని కొన్ని ప్రదేశాలకు వారితో రాకుండా వీవీఐపీలు నియంత్రించే వారు. కానీ సవరించని నిబంధనల కారణంగా ఇక ప్రతిక్షణం వీవీఐపీల వెన్నంటే ఉండనున్నారు. భద్రతా కారణాల రీత్యా ఈ చర్యలు తీసుకొంటున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. ఎస్పీజీ సిబ్బందిని అనుమతించకపోతే వారి విదేశీ పర్యటనలను ఇక నుంచి కేంద్రం నియంత్రించే అవకాశం ఉంది. గాంధీ కుటుంబీకులు ఇప్పటి దాకా విదేశాలకు వెళ్లినపుడు వారు మొదట గమ్యస్థానం చేరేవరకు ఎస్పీజీ సిబ్బంది వారిని అనుసరిస్తూ రక్షణ కల్పించేవారు. అక్కడినుంచి ఎస్పీజీ సిబ్బందిని వెనక్కి పంపి వారు వెళ్లాల్సిన ప్రదేశాలకు వెళ్లి పర్యటనలు ముగించకొని వచ్చేవారు. అలా చేసే కొన్ని సందర్భాలో వీరు భద్రతాపరమైన ఇబ్బందులకు గురవుతున్నారు. సవరించిన భద్రతా నియమాల కారణంగా వీవీఐపీల రహస్య పర్యటనలకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. -
హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ ఆదేశాలతో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన డీజీపీలు హైదరాబాద్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. దేశ అంతర్గత భద్రతకు సంబంధించి రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అందించుకోవడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. శాంతి భద్రతలు, సైబర్ నేరాలు, మావోయిస్టులు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా తదితర అంశాలపై ఆయా రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికారులు చర్చిస్తారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌తో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు అదనపు డీజీపీలు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అధికారులు సందర్శించే అవకాశమున్నట్టు సమాచారం. -
అస్సాంలో విదేశీయులపై ఆంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : అస్సాంలో చేపట్టిన జాతీయ పౌరసత్వ తుది జాబితా (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్–ఎన్ఆర్సీ)పై వివాదం చెలరేగిన నేపథ్యంలో అస్సాంను కేంద్ర విదేశాంగ, హోం మంత్రిత్వ శాఖల పరిధిలో ‘ప్రొటెక్టెడ్ ఏరియా (రక్షిత ప్రాంతంగా)’ బుధవారం అధికారులు ప్రకటించారని, తక్షణం విదేశీ జర్నలిస్టులను రాష్ట్రం వదిలేసి వెళ్లాల్సిందిగా కూడా ఆదేశించారని ‘అస్సాం ట్రిబ్యూన్’ పత్రిక గురువారం వెల్లడించింది. రాష్ట్రం విడిచి విదేశీ జర్నలిస్టులు వెళ్లాలంటే అర్థం వారు రాష్ట్రంలో ఉండాలన్నా, రాష్ట్రంలో ఏ వార్తలు సేకరించాలన్నా ముందస్తుగా హోం శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియగానే అస్సాంలోని ‘అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ)’ జర్నలిస్ట్ బుధవారం రాష్ట్రం విడిచి స్వచ్ఛందంగా వెళ్లిపోయినట్లు అస్సాం ట్రిబ్యూన్ తెలియజేసింది. అస్సాం పోలీసులు ఆయన్ని వెన్నంటి విమానాశ్రయం వరకు సాగనంపి ఢిల్లీ విమానాన్ని ఎక్కించినట్లు కూడా పేర్కొంది. అస్సాంలో ఇటీవల ఎఆర్సీని సవరించినప్పటికీ ఇంకా 19 లక్షల మంది పేర్లు గల్లంతయినట్లు తెల్సిందే. అంటే వీరంతా ట్రిబ్యునల్ ముందు హాజరై తాము విదేశీయులం కాదని, భారతీయులమని నిరూపించుకోవాలి. అలా జరగనట్లయితే వారంతా దశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అస్సాంను ‘రక్షిత ప్రాంతం’గా ప్రకటించారు. అస్సాంలో ఎన్ఆర్సీ పట్ల కేంద్రం అనుసరిస్తోన్న విధానాన్ని కొన్ని విదేశీ పత్రికలు విమర్శించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న విదేశీ జర్నలిస్టులు స్థానిక వార్తలను కవర్ చేయాలన్నా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న విదేశీ జర్నలిస్టులు అస్సాంలోకి రావాలన్నా ముందస్తుగా విదేశాంగ శాఖ లేదా హోం శాఖ అనుమతి తీసుకోవాలని వారు సూచించారు. అయితే పాప్ (పీఏపీ–ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్)గానీ, రాప్ (ఆర్ఏపీ–రిస్ట్రిక్డెడ్ ఏరియా పర్మిట్)గానీ తాము జారీ చేయడం లేదని కూడా వారు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించినందున విదేశీ జాతీయులు, విదేశీ పర్యాటకులు కూడా రాష్ట్రాన్ని సందర్శించాలంటే ముందస్తు అనుమతి ఉండాల్సిందేనని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా అనుమతి కోరవచ్చని కూడా వారు సూచించారు. ప్రస్తుతం కశ్మీర్లో కూడా ఇలాంటి ఆంక్షలే కొనసాగుతున్నాయి. -
మత్స్యకారులే సైనికులు..
సాక్షి, అమరావతి: తమిళనాడు సముద్ర తీరం నుంచి ఉగ్రవాదులు చొరబడ్డారన్న కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి అప్రమత్తత పెరిగింది. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరంలో చొరబాటుకు అవకాశం ఉన్న దాదాపు 380 బ్లాక్ స్పాట్లలో భద్రత చర్యలు ముమ్మరమయ్యాయి. మెరైన్ పోలీస్స్టేషన్ల పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. విశాఖపట్నం కేంద్రంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు కోస్తా తీరం వరకు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ (ఏపీసీఎస్‌పీ), కోస్ట్ గార్డ్స్, నేవీ బృందాలు గస్తీ కట్టుదిట్టం చేశాయి. ఐబీతో పాటు రాష్ట్రానికి చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్‌లు కూడా కోస్తా తీరంలో అపరిచితుల కదలికలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో డేగ కళ్లతో కాపు కాస్తున్నాయి. మత్స్యకారులే సైనికులు.. ఆంధ్రప్రదేశ్‌లో సువిశాల కోస్తా తీరంలో మత్స్యకారులే పౌర సైనికులని చెప్పక తప్పదు. సముద్ర తీరంలో ఏపీసీఎస్‌పీ, కోస్ట్‌గార్డ్స్‌కు కూడా తెలియని ప్రాంతాలపై మత్స్యకారులకు అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తీరంలో అపరిచితులు ఎవరైనా చొరబడితే తమకు సమాచారం అందించేలా ఏపీసీఎస్‌పీ, నేవీ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రాష్ట్ర తీరం వెంబడి దాదాపు 541 గ్రామాల్లో 3.04 లక్షల మంది మత్స్యకారులున్నారు. మొత్తం 70 వేలకు పైగా బోట్లు నిత్యం తిరుగుతుంటాయి. మత్స్యకారులకు తగిన సౌకర్యాలు సమకూర్చి మరింత ప్రాధాన్యత ఇస్తే దేశ అంతర్గత భద్రతకు మేము సైతం అంటూ ముందు నిలుస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముంబై దాడుల తర్వాత తీరం పటిష్టం దశాబ్ధం కిందట ముంబైలో టెర్రరిస్ట్ దాడులు దేశంలోని సముద్ర తీరం భద్రతను సవాలు చేశాయి. ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చిన కేంద్ర హోంశాఖ 2017లో సముద్ర తీర రాష్ట్రాలకు 183 మెరైన్ పోలీస్స్టేషన్లను మంజూరు చేసింది. ఏపీలో కళింగపట్నం (శ్రీకాకుళం జిల్లా), రుషికొండ (విశాఖపట్నం), వాకలపూడి (తూర్పుగోదావరి), గిలకలదిండి (కృష్ణా), సూర్యలంక (గుంటూరు), దుగరాజపట్నం (నెల్లూరు) ప్రాంతాల్లో మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉండగా.. మరో 15 కొత్తగా ఏర్పాటయ్యాయి. వాటికి తగిన పోలీస్ సిబ్బంది నియామకంతోపాటు, మరబోట్లు, జెట్టీలు, అధునాతన ఆయుధాలు సమకూర్చాల్సి ఉంది. -
మా మేనిఫెస్టోను గిరిజనులు విశ్వసించారు : సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి ద్వారానే సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం చూపించవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా సమస్యలు పరిష్కరించవచ్చని చెప్పారు. విద్య, వైద్యం, రహదారుల విస్తరణ, గిరిజనులకు భూములపై హక్కులు కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు ఉదారంగా సాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న 10 రాష్ట్రాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్ర హోం శాఖ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడి విజ్ఞాన్ భవన్లో సాగింది. ఈ సమావేశానికి హాజరైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా దృష్టికి పలు విషయాలు తీసుకెళ్లారు. మూడు నెలల్లోనే గణనీయమైన కార్యక్రమాలు మానవ అభివృద్ధిని ఎజెండాగా చేసుకుని తమ పార్టీ వైఎస్సార్సీపీ రూపొందించిన మేనిఫెస్టోను గిరిజనులు విశ్వసించారని, తమ పార్టీకి ఘన విజయాన్ని అందించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తు చేశారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగాల్లో గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అంకిత భావంతో ముందుకు సాగుతోందని వివరించారు. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల కాలంలోనే అమలు చేసిన ముఖ్య కార్యక్రమాలను ఆయన వివరించారు. విభజన చట్టంలో భాగంగా కేంద్రం గిరిజన వర్శిటీని కేటాయించిందని, అయితే దాని ఏర్పాటులో జాప్యం జరుగుతోందని ప్రస్తావించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏ ఒక్కరూ ఆలోచించని రీతిలో తాము ఒక వైద్య కళాశాలను గిరిజన ప్రాంతమైన పాడేరులో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దీనికి కేంద్రం అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీంతోపాటు ఒక ఇంజినీరింగ్ కళాశాల కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రతి ఐటీడీఏకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నందున మెరుగైన వైద్యం అందక గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారని, ఈ సమస్యకు పరిష్కారంలో భాగంగా ప్రతి ఐటీడీఏకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తప్పకుండా ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ కోరారు. దీని కోసం ఏపీలో ప్రయత్నాలు ప్రారంభించామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఇవన్నీ అదనమని పేర్కొన్నారు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి ద్వారా శాంతిభద్రతలు వర్దిల్లుతాయని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలు వేగంగా సాగాలంటే కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు ప్రత్యేకంగా ఇంజినీరింగ్ కళాశాల, వైద్య కళాశాల ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని వివరించారు. మారుమూల ప్రాంతాలకు రహదారుల విస్తరణ, మొబైల్ టవర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. రహదారుల విస్తరణకు సంబంధించి రావాల్సిన అనుమతుల గురించి నివేదించారు. గిరిజనులకు భూములు ఇవ్వాలి అటవీ ప్రాంతాల్లో భూ పట్టాల కోసం సుదీర్ఘ కాలంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకొచ్చారు. గిరిజనులకు వారి ఆవాస ప్రాంతాల్లోనే భూములు ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. దీని కోసం తాజాగా దరఖాస్తులు ఆహ్వానించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గతంలో దాదాపు 1.41 లక్షల ఎకరాల అటవీ భూముల పట్టాలకు సంబంధించి 66 వేల దరఖాస్తులను నిరాకరించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తర్వాత నాలుగు బెటాలియన్లను కేటాయించారని, వీటి ఏర్పాటుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే భరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు మొదటి ఏడాదికి సంబంధించి మాత్రమే కేంద్రం నిధులు మంజూరు చేసిందని వివరించారు. కేంద్ర హోం శాఖ సమీక్ష అనంతరం అమిత్‌షాతో సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, నితీష్‌కుమార్, ఆదిత్యనాథ్, కమల్‌నాథ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ తదితరులు కేంద్ర స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీ! మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు జాతీయ స్థాయిలో ఒక కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసే దిశగా కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేసేందుకు ఈ కమిటీ పని చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ అనుమతుల్లో జాప్యం లేకుండా చూడాలని పలు రాష్ట్రాలు కోరాయి. కాంట్రాక్టర్లు ముందుకు రాని చోట ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థలు అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు సూచించాయి. రూ.50 లక్షల లోపు పనులను గిరిజనులకు నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని, ప్రతి గ్రామంలో పోస్టల్, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించినట్టు సమాచారం. మొబైల్ టవర్ల ఏర్పాటుకు గల నిబంధనలను సరళీకరించాలని కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, డీజీపీ గౌతం సవాంగ్‌లతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు పాల్గొన్నారు. అందరి ప్రయోజనాలకు అనుగుణంగా పోలవరంపై నిర్ణయం పోలవరంపై కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టు ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటామని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. ఇక్కడి శ్రమశక్తి భవన్‌లోని మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం రాత్రి 8.30 నుంచి రాత్రి 9.15 వరకు ఆయనతో సమావేశమయ్యారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ అంశం వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్రం చెల్లించాల్సిన రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, పునరావాసానికి సంబంధించిన నిధులు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టులో గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగినట్టు నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడంతో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లామని, ఈ ప్రక్రియ పూర్తవ్వగానే గడువును అనుసరించి చేపట్టే పనులకు నిధులను వెంటవెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరినట్టు సమాచారం. సమావేశం అనంతరం జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పోలవరంపై చర్చించాం. మేం ఏ నిర్ణయమైనా కేంద్ర, రాష్ట్ర, ప్రాజెక్టు ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకుంటాం’ అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుంటారా అని మీడియా ప్రశ్నించగా విషయ సంపూర్ణత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. కేంద్ర హోం మంత్రితో వైఎస్ జగన్ సమావేశం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఆయన అధికారిక నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం సాయంత్రం కలిశారు. సాయంత్రం 6.40 నుంచి 7.30 వరకు కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక పెండింగ్ అంశాలను ఈ సమావేశంలో ముఖ్యమంత్రి హోం మంత్రికి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, ఇంటింటికీ తాగు నీరు, తదితర పథకాలకు కేంద్ర సాయం ఆవశ్యకతను విశదీకరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 13లో పొందుపరిచిన నిబంధనల మేరకు మౌలిక వసతుల ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్ జగన్ వెంట వైఎస్సార్పీపీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. మానవ అభివృద్ధిని అజెండాగా చేసుకుని వైఎస్సార్సీపీ రూపొందించిన మేనిఫెస్టోను గిరిజనులు విశ్వసించారు. అందుకే ఘన విజయం అందించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగాల్లో గిరిజనుల అభివృద్ధికి మా ప్రభుత్వం అంకిత భావంతో ముందుకు సాగుతోంది. – సీఎం వైఎస్ జగన్ -
రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ అలర్ట్
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు(23న) వెలువడనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అలర్ట్ చేసింది. కౌంటింగ్ సందర్భంగా హింస తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా భందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపింది. స్ట్రాంగ్ రూంల వద్ద, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని వెల్లడించింది. కౌంటింగ్‌కు ఆటంకాలు కల్పించే విధంగా హింసను ప్రేరేపించే విధంగా ప్రకటనలు చేసే అవకాశముందని, ఈ విషయంలో అన్నిరాష్ట్రాలు గట్టి భద్రతా చర్యలను చేపట్టాలని సూచన చేసింది. -
తల్లిదండ్రుల్లో విశ్వాసం నింపలేకపోతున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆత్మ విశ్వాసం నింపడంలో ప్రభుత్వం విఫలమైం దని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అందుకే ఇంకా ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్మీడియెట్ ఫలితాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, బోర్డు వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు. గ్లోబరీనా సంస్థకు టెండర్ ఇవ్వడమే దీనికి కారణమని, ఈ వ్యవహారం వెనుక భారీ కుంభకోణం ఉందని ఆరోపించారు. బోర్డు తీరుపై నిరసన తెలిపితే అమానవీయంగా, ఎమర్జెన్సీని తలపించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విచారం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరాహార దీక్షను భగ్నం చేసేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. బీజేవైఎం కార్యకార్యకర్తల మీద దాడి చేయడం నియంతృత్వానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇంటర్మీడియెట్ ఫలితాల తప్పులపై సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని, వెంటనే ఇంటర్మీడియట్ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. బోర్డు వైఫల్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మే 2న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నామని, అందరూ సహకరించాలని కోరారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా లేదా? అని ప్రశ్నించారు. -
‘వాట్సాప్’నే ఎందుకు టార్గెట్ చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ : వాట్సాప్....సోషల్ మీడియాలోనే ఓ సంచలనం సృష్టించిన ఓ సందేశాల ఆప్. ఒక్క భారతదేశంలోనే 25 కోట్లమంది క్రియాశీల వినియోగదారులు ఉన్నారని చెప్పుకుంటున్న ఈ వాట్సాప్ యాజమాన్యం పట్ల కేంద్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ఒక్క సందేశాలే కాకుండా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌తోపాటు ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను అతి సులువుగా అతి వేగంగా షేర్ చేసుకునే అవకాశం ఉండడంతో అనతికాలంలోనే దీనికి అద్భుత స్పందన లభించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా నకిలీ వార్తల కారణంగా మూక హత్యలు చోటుచేసుకోవడంతో వాట్సాప్ ప్రతిష్ట కాస్త మసకబారింది. నకిలీ వార్తల వ్యాప్తి కారణంగా జరిగిన మూక హత్యల్లో 29 మంది మరణించడంతో ఇలాంటి నకిలీ వార్తలను, వదంతులను ఎవరు వ్యాప్తి చేస్తున్నారో కనుగొనడంతోపాటు వాటిని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌కు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేయడం, ఆ మేరకు వాట్సాప్ యాజమాన్యం ఇప్పటికే తన సాఫ్ట్‌వేర్‌లో పలు మార్పులు తీసుకురావడం తెల్సిందే. ఇటు భారత ప్రభుత్వం, అటు భారత సుప్రీంకోర్టు ఒత్తిళ్ల మేరకు వాట్సాప్ సృష్టికర్తయిన ‘ఫేస్బుక్’ యాజమాన్యం గతవారమే ఫిర్యాదులను స్వీకరించి విచారించే అధికారిని కూడా నియమించింది. కంపెనీ తీసుకున్న చర్యలను వివరించడం కోసం కంపెనీ తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి క్రిస్ డేనియల్స్ కూడా భారత్‌కు పంపించింది. ఆయన భారత్ వచ్చి కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను కలుసుకున్నారు. కంపెనీ తీసుకున్న చర్యల గురించి వివరించారు. కొన్ని సూచనలను స్వీకరించారు. వాట్సాప్ వినియోగదారులు వ్యక్తిగతంగా ఒకేసారి ఐదు మందికి, లేదా ఐదు గ్రూపులకు లేదా వ్యక్తులు, గ్రూపులు కలిసి ఐదుకు మించి సందేశాలు పంపడానికి వీల్లేకుండా వాట్సాప్ నియంత్రించింది. అలాగే వాట్సాప్‌లో వచ్చే సమాచారాన్ని గుడ్డిగా విశ్వసించరాదని, వాటిని అనుమానాస్పదంగానే చూసి నిజా నిజాలను తెలుసుకున్నాకే నమ్మాలని, ఆ తర్వాతనే వాటిని షేర్ చేయాలంటూ రేడియోల్లో, టీవీల్లో గత ఆగస్టు నెల నుంచి వాట్సాప్ కంపెనీ తెగ ప్రచారం మొదలు పెట్టింది. నకిలీ వార్తల వ్యాప్తికి కారణమైంది ఒక్క ‘వాట్సాప్’యే కాదు. ఇతర సోషల్ మీడియాలు, వెబ్సైట్లు, చివరకు కొన్ని టెలివిజన్ ఛానళ్లు కూడా నకిలీ వార్తలను ప్రసారం చేశాయి. అయినా వాటి మీదగా అంతగా దృష్టి పెట్టని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఇప్పుడు మూడో నోటీసును జారీ చేసేందుకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సిద్ధమైనట్లు తెల్సింది. ఏది ఏమైనా సమాచారాన్ని ఎవరు పోస్ట్ చేశారో, ఎక్కడి నుంచి పోస్ట్ చేశారో తెలుసుకునేవిధంగా టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిందేనంటూ ఆ నోటీసులో సంస్థను ఆదేశించే అవకాశం ఉంది. ఇతర సోషల్ మీడియాలను వదిలేసి ఒక్క వాట్సాప్‌నే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేయడానికి కారణం ఏమిటీ? కేంద్ర ప్రభుత్వం నోటీసు మేరకు కోడ్ రూపంలో వెళ్లే సందేశాన్ని ముందుగానే కనుగొని, అది ఎక్కడ ప్రాణం పోసుకుంది? ఎవరు దాన్ని పోస్ట్ చేశారు? కనుగొనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాట్సాప్ అభివృద్ధి చేస్తుందా? అసలు ఇప్పటికే అలాంటి పరిజ్ఞానం అందుబాటులో ఉందా? ఉంటే ఎందుకు ఉపయోగించడం లేదు? ఈ విషయంలో సాంకేతిక విజ్ఞాన పండితులు ఏమంటున్నారు? సామాజిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఇంతకు గోప్యత అంటే ఏమిటీ? ఎందుకా గోప్యత ? ఎవరి మధ్య గోప్యత? గోప్యత అవసరమా, కాదా ? అన్నదే ఇక్కడ చర్చ. భారత్‌లోనే ఎక్కువ యూజర్లు జనాభా ప్రాతిపదికన చూస్తే వాట్సాప్ వినియోగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ భారత్. భారత్‌లో తమకు 25 కోట్ల మంది యూజర్లు ఉన్నారని వాట్సాప్ చెప్పుకోవడం కాస్త అతిశయోక్తే కావచ్చు. కానీ గత రెండేళ్లలో రిలయెన్స్ జియో సృష్టించిన విప్లవం, తక్కువ ధరకు డేటా అందుబాటులోకి రావడం, స్మార్ట్ ఫోన్లు విస్తరించడం తదితర కారణాల వల్ల వాట్సాప్‌కు ఆదరణ విపరీతంగా పెరిగింది. వాట్సాప్ అంటే ఒకరి నుంచి మరొకరికి సందేశాన్ని పంపుకునే సర్వీసు మాత్రమే కాదు. ఒకేసారి 256 మందిని కలిపి ఓ గ్రూపును ఏర్పాటు చేయవచ్చు. మనం పంపించే సందేశం క్షణాల్లో గ్రూపులోని 256 మందికి ఒకేసారి వెళుతుంది. 256 మందిలో కూడా ప్రతి ఒక్కరికి కనీసం పది మందితో కూడిన గ్రూపులు ఉన్నాయనుకుంటే ఆ గ్రూపులన్నీ కూడా సందేశాన్ని లేదా సమాచారాన్ని షేర్ చేసుకుంటే కొన్ని క్షణాల్లో వేలాది మందికి సమాచారం వెళుతుంది. ఇంత వేగంతో ఇంత మందికి ఇంత సులువుగా సమాచారాన్ని, వీడియోలను, డాక్యుమెంట్లను షేర్ చేసే యాప్ మరోటి లేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌పై దృష్టిని కేంద్రీకరించింది. అయితే భారత్‌లో 25 శాతం మంది యూజర్లు ఏ గ్రూపుల్లోను లేనివారేనని కంపెనీ చెబుతోంది. అంటే 75 శాతం మంది గ్రూపుల్లో ఉన్నారన్న మాటే కద! వార్తాపత్రికలకు నియంత్రణా వ్యవస్థ ‘వార్తా పత్రికలు, రేడియోలు, టీవీ ఛానళ్లు చట్టాల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటి నియంత్రణకు వ్యవస్థనే ఉంది. వాటిల్లో వచ్చే నకిలీ వార్తలకు వాటి యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాట్సాప్ సామాజిక సందేశ సర్వీస్ ప్రొఫైడర్ అవడం వల్ల దానిపై ఆ నియంత్రణ లేదు’ అని నల్సర్ లా యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ టీ. ప్రశాంత్ రెడ్డి చెప్పారు. నకిలీ వార్తలు, రెచ్చగొట్టే ప్రసంగాలు ఎక్కడి నుంచి ఎవరు అప్లోడ్ చేశారో తెలుసుకోవాలని ఇప్పుడు ప్రభుత్వం వాంఛిస్తోంది. వాట్సాప్ ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్’ వ్యవస్థ. అంటే ఒక యూజర్ నుంచి మరో యూజర్ వద్దకు సందేశం కోడ్ రూపంలోనే వెళుతోంది. మధ్యలో దాన్ని డీకోడ్ చేసే వ్యవస్థ లేదు. అందువల్ల యూజర్ పంపిన సందేశం వాట్సాప్ యాజమాన్యానికి తెలిసే అవకాశమే లేదు. అసలు తెలుసుకోవాలనే ఆలోచనే ఆ కంపెనీకి ఇంతవరకు లేదు. గోప్యత కారణంగానే మాకు ఆదరణ ‘సున్నితమైన కుటుంబ వ్యవహారాలు, వైద్యానికి సంబంధించిన అంశాలు, బ్యాంకుల లావాదేవీలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని గోప్యంగా ఉంచుతుందన్న నమ్మకంతోనే ఎంతో మంది యూజర్లు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఆ సమాచారిన్ని పంపిందెవరో కనుగొనే వ్యవస్థ ఉండాలంటే వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుంది. అలా జరిగితే అందుకు సంబంధించి కంపెనీ అంతర్జాతీయంగా పలు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోంది’ అని కంపెనీ అధికార ప్రతినిథి ఒకరు తెలిపారు. బలిపశువును చేయడం భావ్యం కాదు ‘నకిలీ వార్తల కారణంగా మూక హత్యలు జరుగుతున్నాయంటూ వాట్సాప్ లాంటి యాప్‌లను బలి పశువులను చేయడం ప్రభుత్వాలకు ఎంత మాత్రం భావ్యం కాదు. ఇది తమ బాధ్యతలను ఇతరులపై రుద్దడం లాంటిదే. ప్రజలకు సరైన భద్రతను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, పోలీసు వ్యవస్థది. నకిలీ వార్తల పేరిట సందేశాహరులెవరో తెలుసుకోవాలనుకోవడం వ్యక్తిగత స్పేస్‌లోకి జొరబడేందుకు ప్రయత్నించడమే’ అని సాంకేతిక వ్యాసాల వ్యాసకర్త, న్యాయవాది అపర్ గుప్తా అభిప్రాయపడ్డారు. ఇది బాధ్యతల నుంచి తప్పించుకోవడమే ‘సందేశాన్ని డీకోడ్ చేసే సాంకేతిక పరిజ్ఞానమే తమకు లేదని, యూజర్ల గోప్యతను పరిరక్షించేందుకే తాము అటు వైపు ఆలోచించలేదని వాట్సాప్ యాజమాన్యం వాదించడం అర్ధరహితం. యూజర్ల సమాచారాన్ని పర్యవేక్షించాలంటే అదనపు ఉద్యోగులు అవసరం. తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ లాభాలను పొందాలన్నది ఆ కంపెనీ లోలోపలి ఆలోచన. వాట్సాప్.... ఫేస్బుక్, ట్విట్టర్ లాంటిది కాదు. ఇది చట్టానికి లోబడి పనిచేయాల్సిందే. డీకోడ్చేసే సాంకేతిక పరిజ్ఞానం లేదని కంపెనీ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. పత్రికలు, టీవీలు, రేడియోలు చట్టం పరిధిలోకి వచ్చినట్లే వాట్సాప్‌ను కూడా చట్టం పరిధిలోకి తీసుకరావాల్సిందే’ అని అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గోప్యత ఇద్దరు వ్యక్తులు, ఓ కుటుంబానికి సంబంధించినదని, వారు గోప్యంగా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేందుకు ఇతర మార్గాలున్నాయన్నది ఆయన అభిప్రాయం. మధ్యేమార్గమే ఉత్తమం ముఖాముఖి ఛాటింగ్, వ్యక్తిగత సందేశాల జోలికి వెళ్లకుండా మూకుమ్మడి సందేశాలను మాత్రమే కనుగొనే సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టడం సముచితంగా ఉంటుందని ‘మీడియా నామా’కు చెందిన నిఖిల్ పవ్వా అభిప్రాయపడ్డారు. కోడ్ భాషను బ్రేక్ చేయకుండా సమాజానికి హానికలిగించే సమాచారాన్ని ఎవరు పంపించారో తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం ఉండాల్సిందేనని వాట్సాప్‌కు పోటీగా ‘వియ్‌చాట్’కు పనిచేసి ఇప్పుడు ‘ఫిన్‌టెక్ స్టార్టప్’కు అధిపతిగా ఉన్న హిమాన్షు గుప్తా, ఇలినాయీ యూనివర్శిటీలోకి మీడియా కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ హర్ష్ తనేజా అభిప్రాయపడ్డారు. -
మావోయిస్టుల కట్టడికి ఐదు రకాల డ్రోన్లు!
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా మన్యంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య తర్వాత పోలీసులు కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దట్టమైన అడవిలో అణువణువు తెలిసిన మావోయిస్టుల్లా వెళ్లడం సాధ్యం కాబట్టి ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వామపక్ష తీవ్రవాదం ఉన్న పది రాష్ట్రాల్లో డ్రోన్లను వినియోగించి మావోయిస్టుల కదలికలను పసిగట్టాలని ఆదేశించారు. దీంతో పోలీసులు డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించారు. పది రాష్ట్రాల్లో డ్రోన్ల వినియోగం దేశవ్యాప్తంగా తీవ్రవాద సమస్య ఉన్న ప్రాంతాలతోపాటు వామపక్ష తీవ్రవాదం ఉన్న పది రాష్ట్రాల్లో ఐదు రకాల డ్రోన్లను వాడనున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాలను అనుసరించి వాటిని అందుబాటులోకి తేనున్నారు. 250 గ్రాముల బరువు ఉండే నానో డ్రోన్, 250 గ్రాముల నుంచి 2 కిలోల వరకు బరువు ఉండే మైక్రో డ్రోన్, 2 కిలోల నుంచి 25 కిలోల వరకు ఉండే స్మాల్ డ్రోన్, 25 కిలోల నుంచి 150 కిలోలుండే మీడియం డ్రోన్, 150 కిలోలకు పైబడి బరువుండే లార్జ్ డ్రోన్లను ఉపయోగించాలని ప్రతిపాదించారు. సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ బలగాల చేతికి.. కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), కోబ్రా దళాలు, రాష్ట్రాల పరిధిలో ఉన్న గ్రేహౌండ్స్ బలగాలకు ఈ డ్రోన్లను అందించాలని భావిస్తున్నారు. ప్రతి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో రెండు నుంచి నాలుగు డ్రోన్లను ఏర్పాటు చేయడం, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఢిల్లీ వరకు అనుసంధానం చేసేలా సీఆర్పీఎఫ్ కసరత్తు ప్రారంభించింది. ఈ ఐదు డ్రోన్లలో తక్కువ బరువున్న నానో, మైక్రో డ్రోన్లను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారు. 350 అడుగుల నుంచి 450 అడుగుల వరకు ఈ రెండు డ్రోన్లకు ఎగిరే శక్తి ఉంటుంది. వీటి ద్వారా పగటి పూట హెచ్డీ క్వాలిటీ వీడియోలు, ఫొటోలు చిత్రీకరించడం సులువని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అడవుల్లోనూ వినియోగించేలా.. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని అడవుల్లో సంచరించే మావోయిస్టులను గుర్తించేలా డ్రోన్లను వినియోగంలోకి తేనున్నారు. దీనికోసం శిక్షణ పొందిన పోలీసులను ఉపయోగించుకోనున్నారు. ఈ డ్రోన్ల సాయంతో మావోల కదలికలను ఫొటోలు, వీడియోల రూపంలో రికార్డు చేస్తారు. మావోయిస్టుల కోసం అడవుల్లో కూంబింగ్ చేసే ప్రత్యేక పోలీసు బలగాలకు దారి చూపించడానికి కూడా వీటిని వినియోగిస్తారు. అవసరమైతే మావోయిస్టులను కాల్చిచంపేలా వాటిని ఉపయోగిస్తారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి నేరుగా బాంబులు ఉన్న డ్రోన్ (సూసైడ్ డ్రోన్)లను పంపి పేలుళ్లు చేయాలని భావిస్తున్నారు. -
కేరళ వరదలు : తీవ్ర విపత్తుగా గుర్తించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : కేరళను వణికించిన వరదలతో లక్షలాది మంది నిరాశ్రయులు కాగా, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వందేళ్లలో కనీవినీ ఎరుగని వరద బీభత్సం కేరళను అతలాకుతలం చేయడంతో దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. అయితే కేరళ వరదలను తీవ్రమైన ప్రకృతి విపత్తుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తీవ్రమైన ప్రకృతి విపత్తుగా కేరళ వరద పరిస్థితిని గుర్తించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. వరదలతో 247 మంది మరణించారని, 17 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని, వేలాది ఎకరాల పంట నీటమునిగిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వ నివేదికలతో పాటు స్వయంగా ప్రధాని, హోంమంత్రి కేరళ వరద పరిస్థితిని సమీక్షించడంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. దీంతో కేరళలో నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో దీన్ని తీవ్ర ప్రకృతి విపత్తుగా గుర్తిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రకటనతో కేరళకు ఇతోధిక సాయంతో పాటు సహాయ, పునరావాస కార్యక్రమాలకు ముమ్మరంగా చేపట్టేందుకు కేంద్రం అన్ని విధాలా చొరవ చూపనుంది.పలు రాష్ట్రాలు ఇప్పటికే పెద్ద ఎత్తున సాయం ప్రకటించగా, సినీ నటులు, పారిశ్రామికవేత్తలు కష్టసమయంలో కేరళకు బాసటగా నిలుస్తామంటూ తమ వంతుగా భారీ విరాళాలు ప్రకటించారు. -
ఆగని అపహరణలు
న్యూఢిల్లీ: టెక్నాలజీ పెరిగింది.. సామాజిక మాధ్యమాలు అవగాహన కూడా కల్పిస్తున్నాయి.. అయినా చిన్నారుల అపహరణలు ఆగడంలేదు. పైగా మరింతగా పెరుగుతున్నాయి. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కేంద్రం విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. 2016లో ఏకంగా 54,723 మంది చిన్నారులు కిడ్నాప్ అయ్యారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 30 శాతం అధికం. ఇంత భారీస్థాయిలో అపహరణలు జరిగినా.. దాఖలైన కేసులు(ఎఫ్ఐఆర్) కేవలం 40.4 శాతమే. ఈ కేసులకు సంబంధించి విచారణ ఎదుర్కొని, శిక్షపడిన కేసులు కేవలం 22.7 శాతమే. 2015లో 41,893 కేసులు నమోదు కాగా 2014లో 37,854 కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాతో గందరగోళం..: ‘చిన్నారుల కిడ్నాప్‌లకు సంబంధించి చాలా కేసులు తొందరపాటు, సమాచారం లేకపోవడం వల్లే నమోదయ్యాయి. ఇందుకు సామాజిక మాధ్యమాలే కారణం. పిల్లల్ని అపహరించుకుపోయేవారు తిరుగుతున్నారని, అవయవాల కోసం కిడ్నాప్ చేస్తున్నారంటూ రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. వీటిని వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో చూసిన తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఇంటికి రావడం ఏమాత్రం ఆలస్యమైనా వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. అప్రమత్తంగా ఉండడం అవసరమే అయినప్పటికీ నిజానిజాలను ముందుగా నిర్ధారించుకోవాల’ని హోంశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. -
నిజాం ఆస్తి ప్రైవేటు సంస్థకా!
సాక్షి, హైదరాబాద్: ఏడో నిజాం నవాబ్ సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ మునిమనుమరాలు షఫియా సకినా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. రంగారెడ్డి జిల్లా అల్వాల్‌లోని 28.48 ఎకరాల్లో ఉన్న ప్యాలెస్‌ను ఏడాదికి రూ.1 చొప్పున 99 ఏళ్లపాటు భారతీయ విద్యాభవన్‌కు లీజుకివ్వడాన్ని సవాలుచేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నిజాం ఆస్తిని భారతీయ విద్యాభవన్‌కు లీజుకెలా ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భారతీయ విద్యాభవన్ ప్రెసిడెంట్, డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. భారతీయ విద్యాభవన్‌కు ఇచ్చిన లీజును రద్దు చేసి ఆ ప్యాలెస్‌ను తనకు స్వాధీనం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ షఫియా సకినా హైకోర్టులో వేసిన పిటిషన్‌ను జస్టిస్ శేషసాయి విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ శ్రీపాద వాదనలు వినిపిస్తూ నిజాం ఆస్తులపై ప్రభుత్వానికి హక్కు లేదన్నారు. అల్వాల్ సర్వే నం.157లో 28.48 ఎకరాల్లో విస్తరించి ఉన్న కోఠీ ఆసీఫియా ప్యాలెస్‌ను ప్రభుత్వం 1985లో భారతీయ విద్యాభవన్‌కు లీజుకిచ్చిందన్నారు. నిజాంకు చెందిన ప్రైవేటు ఆస్తిని ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు లీజుకివ్వడం విస్మయం కలిగిస్తోందన్నారు. 11 నెలల గడువులోగా ఈ లీజుడీడ్ రిజిస్టర్ కానందున, దీనికి చట్ట ప్రకారం ఎటువంటి విలువ లేదన్నారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. -
మైనారిటీ శాఖ పరిధిలో ‘లింగాయత్’ హోదా
న్యూఢిల్లీ: లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పించే అంశం తమ పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. మైనారిటీ వ్యవహారాల శాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని హోంశాఖ గురువారం వెల్లడించింది. అయితే.. కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున మైనారిటీ హోదాపై ఇప్పట్లో నిర్ణయం తీసుకోబోమని హోంశాఖ ప్రతినిధి తెలిపారు. ‘మత హోదాపై నిర్ణయం తీసుకోవటం హోంశాఖ పరిధిలోకి రాదు. అందుకే దీన్ని మైనారిటీ వ్యవహారాల శాఖకు బదిలీ చేశాం. కర్ణాటక సర్కారు ప్రతిపాదనను పరిశీలించటం, నిర్ణయం తీసుకోవటంలో మైనారిటీ శాఖకే పూర్తి అధికారాలున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. -
సీఎస్‌లతో మార్చి 5న కేంద్ర హోంశాఖ భేటీ
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ మార్చి 5న సమావేశం కానుంది. విభజన చట్టం అమలు తీరు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, 13వ షెడ్యూల్లోని అంశాలపై ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఈ సమావేశానికి తెలంగాణ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషీ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ దినేష్ కుమార్ హాజరు కానున్నారు. కాగా ఫిబ్రవరి 23న సమావేశం జరగాల్సి ఉండగా, ఆ భేటీ వాయిదా పడిన విషయం తెలిసిందే. -
ఇరురాష్ట్రాల సీఎస్ల సమావేశం వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : విజభన చట్టం అమలుపై ఈ నెల 23న జరగాల్సిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశం వాయిదా పడింది. కేంద్ర హోంశాఖ ఈ మేరకు ఉభయ రాష్ట్రాలకు సమాచారం అందించింది. అయితే తదుపరి సమావేశం ఎప్పుడనే దానిపై స్పష్టత లేదు. తొలుత ఈ నెల 21న సమావేశం కావాలని భావించినా, ఎస్సీ కమిషన్ పర్యటనతో మరో తేదీన నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖను కోరింది. దీంతో సీఎస్ల సమావేశం వాయిదా పడింది. విభజన హామీల అమలుపై పెద్ద ఎత్తున ఆందోళన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్న విషయం తెలిసిందే. -
చెన్నమనేని రివ్యూ పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఆగస్టు 31న జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాల్సిందిగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ దాఖలు చేసుకున్న దరఖాస్తును కేంద్ర హోంశాఖ కొట్టేసింది. ఆయన దరఖాస్తులో ఎలాంటి సమర్థనీయమైన అంశాలు లేవంటూ హోంశాఖలోని పౌరసత్వ విభాగ అదనపు కార్యదర్శి బి.ఆర్.శర్మ ఈ నెల 13న ఉత్తర్వులు జారీ చేశారు. భారత పౌరసత్వం పొందేందుకు చేసుకునే దరఖాస్తుకు ముందు దేశంలో ఏడాదిపాటు నివసించి ఉండాలని, కానీ చెన్నమనేని వాస్తవాలను దాచిపెట్టి మోసపూరితంగా పౌరసత్వం పొందారని హోంశాఖ మండిపడింది. దీనిపై పూర్తి ఆధారాలతోనే ఆగస్టు 31న ఉత్తర్వులు జారీ చేశామని తెలిపింది. ప్రజాసంక్షేమానికి పాటుపడిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చెన్నమనేని కోరారని, అయితే ఈ అంశాన్ని తాము గతంలోనే పరిశీలించామని వివరించింది. ప్రజాప్రతినిధిగా ఇతరులకు ఆదర్శంగా నిలిచేందుకు ఆయన సమాజం, దేశంపట్ల మరింత నిజాయితీతో వ్యవహరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. సాగుతున్న వివాదం... జర్మనీ వలసవెళ్లి ఆ దేశ పౌరసత్వం పొందిన చెన్నమనేని రమేశ్ తప్పుడు ధ్రువపత్రాలతో 2008లో తిరిగి భారత పౌరసత్వం పొందినందున ఆయన ఎన్నిక చెల్లదంటూ ఎన్నికల్లో ఆయన సమీప ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో చెన్నమనేని పౌరసత్వం చెల్లదంటూ హైకోర్టు 2013లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ చెన్నమనేని సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే పొందగా స్టే తొలగించాలని ఆది శ్రీనివాస్ సుప్రీంలో న్యాయ పోరాటం చేశారు. 2016 డిసెంబర్లో ఈఅంశంపై దర్యాప్తు చేయాలని హోంశాఖను సుప్రీం ఆదేశించింది. దీంతో కేంద్ర హోంశాఖ ఆగస్టు 31న చెన్నమనేని పౌరసత్వంపై నిర్ణయాన్ని ప్రకటించింది. రాజీనామా చేయాలి: ఆది శ్రీనివాస్ తన పౌరసత్వానికి సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన చెన్నమనేని రమేశ్ దేశాన్ని అగౌరవపరిచారని బీజేపీ నేత ఆది శ్రీనివాస్ విమర్శించారు. చెన్నమనేని భారత పౌరుడు కాదని హైకోర్టు, కేంద్ర హోంశాఖ మూడు సార్లు స్పష్టం చేశాయన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశాన్ని అగౌరవపరిచిన చెన్నమనేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని లేదా ప్రభుత్వమే ఆయన్ను తప్పించాలని డిమాండ్ చేశారు. మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తా పౌరసత్వ వివాదంపై చెన్నమనేని సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల: చట్టరీత్యా నిబంధనలు సంపూర్ణంగా తనవైపు ఉన్నందున మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పేర్కొన్నారు. ఆగస్టు 31న కేంద్ర హోంశాఖ ఏ నోటీసు లేకుండా తన పౌరసత్వాన్ని రద్దు చేసిందని, దీంతో హైకోర్టును ఆశ్రయించి తన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరినట్లు గుర్తు చేశారు. తన వాదనలను, కొత్తగా ఇచ్చే సాక్ష్యాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు హోం శాఖకు సూచించిందన్నారు. దీంతో మూడు పర్యాయాలు తన వాదనలు వినిపించానని, సుమారు నూరు పేజీల వివరణ కూడా సమర్పించానని చెప్పారు. -
నేడే లోక్‌సభకు జీఎస్టీ బిల్లులు
-
నేడే లోక్‌సభకు జీఎస్టీ బిల్లులు
మార్చి 29 లోగా ఆమోదం కోసం కేంద్రం కసరత్తు న్యూఢిల్లీ: జూలై 1 నుంచి జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) చట్టాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ మేరకు జీఎస్టీ అనుబంధ బిల్లులు నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సీజీఎస్టీ (కేంద్ర జీఎస్టీ), ఐజీఎస్టీ(సమీకృత జీఎస్టీ), యూటీ జీఎస్టీ(కేంద్ర పాలిత ప్రాంత జీఎస్టీ), రాష్ట్రాలకు పరిహార చట్టాలను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టి మార్చి 28లోపు చర్చ ముగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎక్సైజ్, కస్టమ్స్ చట్టంలోని వివిధ పన్నుల రద్దు కోసం సవరణలు, జీఎస్టీ అమలు నేపథ్యంలో ఎగుమతులు దిగుమతుల కోసం ఉద్దేశించిన బిల్లుల్ని కూడా సభలో ప్రవేశపెడతారని సమాచారం. బిల్లులపై ఎంత సమయం చర్చించాలన్న అంశంపై సోమవారం ఉదయం లోక్‌సభ బీఏసీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని కొన్ని వర్గాలు వెల్లడించాయి. మార్చి 29 లేదా 30 లోగా లోక్‌సభలో జీఎస్టీ బిల్లుల్ని ఆమోదింపచేసి అనంతరం రాజ్యసభకు పంపనున్నారు. ఒకవేళ బిల్లులకు రాజ్యసభలో ఏవైనా సవరణలు సూచిస్తే వాటిపై లోక్‌సభలో చర్చిస్తారు. ఆ సవరణల్ని లోక్‌సభ ఆమోదించవచ్చు లేదంటే తిరస్కరించవచ్చు. జీఎస్టీ బిల్లుల్ని ద్రవ్య బిల్లులుగా ప్రవేశపెడుతున్నందున రాజ్యసభ ఆమోదం అవసరం లేకపోయినా.. ఇరు సభల్లో చర్చ జరగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందాక.. ఎస్జీఎస్టీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాల్సి ఉంది. జీఎస్టీ నెట్వర్క్ వివరాలు వెల్లడించలేం: కేంద్ర హోం శాఖ జీఎస్టీ అమలు కోసం సిద్ధం చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్(జీఎస్టీఎన్) భద్రతా అనుమతుల వివరాలు వెల్లడించా లన్న ఆర్టీఐ దరఖాస్తును కేంద్ర హోం శాఖ తిరస్కరించింది. దరఖాస్తుదారుడు కోరిన అంశం జాతీయ భద్రతా అనుమతులకు సంబంధించిందని, ఆర్టీఐ చట్టం 2005, సెక్షన్ 8(1)(జీ) ప్రకారం వాటికి మినహాయింపు ఉండడంతో ఆ వివరాలు వెల్లడించలేమని హోం శాఖ సమాధానమిచ్చింది. -
‘హీరాఖండ్’ ప్రమాదం దుశ్చర్య కాదు
సీఐడీ ప్రాథమిక నిర్ధారణ సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా కూనేరు వద్ద జనవరి 21 అర్ధరాత్రి జరిగిన హీరాఖండ్ రైలు దుర్ఘటన దుశ్చర్య కాదని ప్రాథమికంగా తేలింది. 41 మంది ప్రయాణికులను బలిగొన్న ఈ ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉండవచ్చని అప్పట్లో రైల్వే అధికారులు భావించారు. ఒడిశాలోని రాయ్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లోని కూనేరుల మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉండడంతో ఈ ప్రచారానికి తెరలేపారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీతో విచారణకు ఆదేశించింది. కేంద్ర హోంశాఖ కూడా దర్యాప్తు చేపట్టింది. సీఐడీ అధికారులు ప్రమాద స్థలంలో పేలుడు పదార్థాల ఆనవాళ్లు గాని, నక్సల్స్ పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు గాని లభించలేదని నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ నివేదికను కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ (ఎన్ఐఏ)కి అప్పగించినట్టు తెలిసింది. -
రాష్ట్రంలో 80 శాతం మావోయిస్టు ప్రభావితమే!
బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ నివేదికలో వెల్లడి 8 పాత జిల్లాల్లో మావోయిస్టు/ఉగ్రవాద కార్యకలాపాలు ‘ఫోరెన్సిక్’ వినియోగంలో రాష్ట్ర పోలీసులు విఫలం రాష్ట్ర ఏర్పాటు తర్వాతా వివిధ ఆందోళనలు వీటిలో దేశంలోనే ఐదో స్థానంలో రాష్ట్రం పోలీసు అధికారులపై ఆరోపణల కేసుల్లో నాలుగో స్థానం దేశంలోనే అతి తక్కువగా మహిళా సిబ్బంది సంచలనాత్మక అంశాలు వెలువరించిన బీపీఆర్‌అండ్‌డీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్దగా మావో యిస్టుల ప్రాబల్యం లేదని పోలీసు అధికారులు తరచూ చెబుతుంటారు. రెండు మూడు జిల్లాలు మాత్రమే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయని పోలీసుశాఖ లెక్క లు పేర్కొంటున్నాయి. కానీ కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్‌అండ్‌డీ) విభా గం మాత్రం తెలంగాణలో 80 శాతం మావో యిస్టు/ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలే నని తమ నివేదికలో పేర్కొంది. 2015–16 ఏడా దికి సంబంధించి రెండు రోజుల కింద ఈ నివేదికను విడుదల చేసింది. 2016 జనవరి 1వ తేదీ నాటికి తెలంగాణలోని 10 పాత జిల్లాల్లో 8 జిల్లాలు మావోయిస్టు/ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలేనని అందులో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 172 పోలీస్ జిల్లాలు మావోయిస్టు ప్రభావితాలుగా ఉన్నాయని.. అందులో 8 జిల్లాలు తెలంగాణవేనని పేర్కొంది. ఈ జాబితాలో అత్యధికంగా అస్సాంలోని 36 జిల్లాలు, జమ్మూకశ్మీర్‌లో 25 జిల్లాలు, నాగాలాండ్‌లో 11, మణిపూర్‌లో 11, జార్ఖండ్‌లో 21 జిల్లాలు ఉన్నాయి. ‘ఫోరెన్సిక్’ వినియోగంలో విఫలం! దక్షిణ భారతదేశంలోనే హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. అయితే రాష్ట్రంలోని పోలీస్ శాఖ మాత్రం సాంకేతిక ఆధారాల సేకరణ, వాటి నిరూపణలో పూర్తి స్థాయిలో విఫలమవుతున్నట్టు బీపీఆర్‌అండ్‌డీ పేర్కొంది. 2016 జనవరి 1వ తేదీ వరకు ఎఫ్ఎస్ఎల్లో 1.46 లక్షల కేసులు పెండింగ్‌లోనే ఉండిపోయాయని తెలిపింది. కారణం ఆయా సాంకేతిక ఆధారాల సేకరణ, వాటి నిరూపణకు సరైన నమూనాలు సేకరించకపోవడం, పని ఒత్తిడి పెరగడం, దర్యాప్తు అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ని కేసుల్లో ఒక్క ఎఫ్ఎస్ఎల్ ఎప్పటికి నివేదికలిస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పెరిగిన ఆందోళనలు రాష్ట్రం ఏర్పడకముందు ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలు జరిగాయి. కానీ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014, 2015 లోనూ ఆందోళనలు ఉధృతంగానే జరిగినట్లు బీపీఆర్‌అండ్‌డీ నివేదిక వెల్లడించింది. 2014లో రాష్ట్రంలో అన్ని రకాల ఆందోళనలు కలిపి 7,202 కేసులు నమోదుకాగా.. 2015లో 8,926 ఆందోళనలు జరిగినట్టు నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు భారీగా జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. 2014లో జరిగిన ఆందోళనల్లో అధికంగా విద్యార్థి ఆందోళనలు ఉన్నాయి, ఇతరత్రా పార్టీలు, సంఘాలు, తదితరాలవి కలిపి 2,844 ఆందోళనలు, కార్మిక ఆందోళనలు 738, ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు 575గా నమోదయ్యాయి. ఇక 2015లో చూస్తే మత పరమైన ఆందోళనలు 164, విద్యార్థి ఆందోళనలు 1,440, కార్మిక ఆందోళనలు 3,363, ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు 1,240, రాజకీయ పార్టీలవి 22, ఇతరత్రా 3 ఆందోళనలుగా బీపీఆర్‌అండ్‌డీ పేర్కొంది. మొత్తంగా ఆందోళనల్లో మొదటి స్థానం తమిళనాడుకాగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా పంజాబ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, తెలంగాణ ఉన్నాయి. మన అధికారులపై ఆరోపణలూ ఎక్కువే! రాష్ట్రంలో పోలీసు అధికారులు, సిబ్బందిపై ఆరోపణ కేసులు సైతం అధికంగానే ఉన్నాయని బీపీఆర్‌అండ్‌డీ పేర్కొంది. 2015 జనవరి ఒకటి నాటికి 1,586 మంది అధికారులపై ఆరోపణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. ఆ ఏడాది మరో 2,125 కొత్త కేసులు జతకలిశాయని తెలిపింది. మొత్తం 3,711 కేసుల్లో విచారణ జరిగిందని పేర్కొంది. 2016 జనవరి ఒకటి నాటికి 1,838 కేసులు పెండింగ్‌లోనే ఉన్నట్లు తెలిపింది. 2016 ఏడాది కేసులు కలిపితే అవి 2,500కు పైగా ఉండి ఉంటాయని తెలుస్తోంది. అత్యల్పంగా మహిళా సిబ్బంది దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణలో అత్యల్పంగా మహిళా పోలీసు సిబ్బంది ఉన్నట్టు బీపీఆర్‌అండ్‌డీ ఆందోళన వ్యక్తం చేసింది. మిగతా రాష్ట్రాల్లో 4.2 శాతం నుంచి 15 శాతం వరకు మహిళా సిబ్బంది ఉంటే... తెలంగాణలో కేవలం 3.13 శాతం మాత్రమే మహిళా సిబ్బంది ఉన్నట్టు పేర్కొంది. అస్సాం, జమ్మూకశ్మీర్‌లలోనూ మహిళల శాతం తక్కువగా ఉన్నట్లు తెలిపింది. అయితే తెలంగాణలో 2014, 15 సంవత్సరాల్లో పెద్దగా పోలీస్ రిక్రూట్మెంట్ జరగలేదు. 2016లో నోటిఫికేషన్ ఇచ్చిన పోలీస్ శాఖ.. మహిళా సిబ్బంది పెంపు కోసం 33శాతం రిజర్వేషన్ అమల్లోకి తీసుకువచ్చింది. కానీ పోస్టుల కేటాయింపు పెద్దగా లేకపోవడంతో మహిళా సిబ్బంది శాతం 4.5% వరకు మాత్రమే ఉండే అవకాశం ఉందని తెలిసింది. -
‘అస్కి’ని నిత్యనూతనంగా నిలబెడతాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో పద్మనాభయ్య దేశంలోనే తొలి మేనేజ్మెంట్ శిక్షణ కేంద్రమైన ‘అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా’ (అస్కి)ని కాలానుగుణంగా నిత్యనూతనంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని సంస్థ కోర్ట్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలన వ్యవస్థ సామర్థ్యం పెంపు, పథకాల అమలు, పరిశోధన, ఉన్నతాధికారులకు నాయకత్వ శిక్షణ తదితరాల్లో పేరున్న అస్కి బుధవారంతో 60 వసంతాలు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు... అస్కి 60 ఏళ్ల ప్రస్థానంపై.... దేశంలోనే తొలి మేనేజ్మెంట్ సంస్థగా 1956లో పురుడు పోసుకుంది మొదలు నేటిదాకా అస్కి ఎన్నో మైలురాళ్లు దాటింది. దేశ పురోగతిలో తనవంతు పాత్ర పోషిస్తూ వస్తోం ది. అనేకానేక ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయానికి, ఉన్నతాధికారుల మధ్య సత్సం బంధాల సాధనకు, నాయకత్వ, నైపుణ్య శిక్షణలకు వేదికగా మారింది. పథకాల అమలు తీరుతెన్నులు, లోటుపాట్లను విశ్లేషించి, పలు అంశాలపై పరిశోధన చేసి ప్రభుత్వాలకు నివేదిస్తాం. ఎంతో అనుభవమున్న నిపుణులున్నారిక్కడ. సార్క్ దేశాల నుంచి అధికార బృం దాలు శిక్షణకు వస్తాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, యునిసెఫ్, యూరోపియన్ యూనియన్ అస్కి సేవలను వినియోగించుకుంటున్నాయి! మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌కు చెందిన దాతృత్వ సంస్థ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌కు కూడా అస్కి కన్సల్టెన్సీ సేవలందిస్తోంది. ఆర్థిక కష్టాలను అధిగమించాం ప్రభుత్వాల నుంచి అస్కి రూపాయి సాయం కూడా పొందదు. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు సొంతగా సిబ్బంది శిక్షణ కాలేజీలు ప్రారంభించుకోవడం మొదలవడంతో మా సేవలకు డిమాండ్ తగ్గింది. 2011 నుంచి ఐదేళ్లు వరుసగా నష్టాలే. 2014–15లో రూ.3.8 కోట్ల నషమొచ్చింది. సంస్థ సేవలు వాడుకునే వారి సంఖ్య పెంచడం, కోర్సులను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చడంపై దృష్టి పెట్టాం. అస్కిలో శిక్షణ పొంది ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులతో మాట్లాడి, మా సేవలు వాడుకునేలా ఒప్పించాం. 2015– 16 ముగిసేసరికి రూ.58 లక్షల లాభం వచ్చిం ది. 2015–16లో రూ.1.5 కోట్ల లాభం ఆశిస్తున్నాం. లాభాలు ముఖ్యం కాదు. సంస్థ దీర్ఘకాల మనుగడకు ఆర్థిక పరిపుష్టత అవసరం. పూర్వవైభవం దిశగా వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
గవర్నర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి..!
ఎమ్మెల్సీల నియామక పత్రాలు సృష్టించిన మోసగాడు అరెస్టు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడిని నియమిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసినట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించడంతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పోస్టులను గవర్నర్ కార్యాలయం మంజూరు చేసినట్లు మరో మూడు ఫోర్జరీ పత్రాలను సృష్టించిన ఘరానా మోసగాడు మారంరాజు రాఘవరావు (62)ను సీఐడీ శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పొల్కంపల్లి గ్రామానికి చెందిన రాఘవరాజు సికింద్రాబాద్‌లోని భాస్కరరావు నగర్లో నివాసముంటున్నాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇతడిపై గతంలో పలు చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. మరో నిందితుడు మట్ట రఘువంశీని రాజ్యసభ సభ్యుడిగా చూపించేందుకు కేంద్ర హోం శాఖ గెజిట్‌ను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సృష్టించాడు. అలాగే నామినేటెడ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పోస్టులను గవర్నర్ కార్యాలయం మంజూరు చేసినట్లు మరో మూడు ఫోర్జరీ పత్రాలను సృష్టించాడు. ఈ క్రమంలో ఏకంగా గవర్నర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తమ పత్రాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తూ రఘువంశీ ఏకంగా గవర్నర్ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశాడు. ఈ దరఖాస్తుతోపాటు ఫోర్జరీ పత్రాలను జత చేయడంతో మోసం బయటపడింది. గవర్నర్ కార్యాలయం ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సీఐడీ.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది. రాఘవరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. -
చొరబాట్ల నియంత్రణకు లేజర్ గోడలు
గురుదాస్‌పూర్: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో చొరబాట్లను అడ్డుకునేందుకు లేజర్ గోడలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సాధారణ కంచె నిర్మించడం సాధ్యం కాని నదీ ప్రవాహ, పర్వత ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మరో ఏడాదిలో ఈ పనిని పూర్తి చేస్తామని చెప్పారు. పంజాబ్‌లో ఇప్పటికే 12 లేజర్ గోడలను ఏర్పాటు చేసి వాడుకలోకి తెచ్చినట్లు ఆయన సమాచారమిచ్చారు. వీటిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పర్యవేక్షిస్తుంది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్‌ల్లో పాక్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్లే పహారా కాస్తుంటారు. -
కోడెల వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోండి
-
కోడెల వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోండి
ఏపీ సీఎస్, సీఈసీకి కేంద్ర హోంశాఖ లేఖ నరసరావుపేట: ఓ టీవీ ఇంటర్వ్యూలో 2014 ఎన్నికల సందర్భంగా తనకు రూ.11.5 కోట్లు ఖర్చయిందంటూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై తాను రాష్ట్రపతికి ఫిర్యాదు చేశానని, దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేసిందని ప్రముఖ న్యాయవాది, గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జి.అలెగ్జాండర్ సుధాకర్ తెలిపారు. ఈ మేరకు భారత ప్రభుత్వ కార్యదర్శి ఎ.కె.ధావన్ నుంచి విడుదలైన లేఖ మంగళవారం తనకు అందిందన్నారు. ఒక ఎమ్మెల్యేగా పోటీచేసే వ్యక్తి రూ.28 లక్షలు మించి ఖర్చు చేయరాదని భారత ఎన్నికల కమిషన్ పరిమితి విధించిందని, దీనికి విరుద్ధంగా తనంతట తానే స్వయంగా ఇంటర్వ్యూలో స్పీకర్ కోడెల చెప్పిన అంశాన్ని తాను రాష్ట్రపతి, భారత ఎన్నికల కమిషన్ల దృష్టికి జూన్ 21న తీసుకెళ్లానని తెలిపారు. (చదవండీ: ఏపీ స్పీకర్ కోడెల సంచలన వ్యాఖ్యలు) -
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందాం..
స్మార్ట్ పోలీసింగ్ వర్క్‌షాప్‌లో డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్ : పోలీసులపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. పవర్ ఒక్కటే పోలీసుల బలం కాదని, స్నేహభావంతో సమస్యలను పరిష్కరించినపుడు ప్రజల్లో మరింత గౌరవం పెరుగుతుందని చెప్పారు. మంగళవారం రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో నిర్వహించిన స్మార్ట్ పోలీసింగ్ వర్క్‌షాప్‌కు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాలంతోపాటు పోలీసులు టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు నైపుణ్యం సాధించాలని సూచించారు. దేశం మొత్తంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రమే స్మార్ట్ పోలీసింగ్ మీద వర్క్‌షాప్ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. కేంద్ర హోం శాఖలో ఆధునీకరణ విభాగానికి చెందిన ప్రిన్సిపాల్ సైంటిఫిక్ అధికారి సంజయ్ శర్మ మాట్లాడుతూ.. స్మార్ట్ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయాలంటే పోలీసులందరికీ శిక్షణ అవసరమన్నారు. కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డెరైక్టర్ ఈశ్కుమార్, అదనపు డెరైక్టర్ ఎంకే సింగ్, హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులందరూ పోలీసు అకాడమీలో మొక్కలు నాటారు. -
పంపకాలపై కేంద్రం చొరవ!
- ప్రధాని, హోం, న్యాయ శాఖల మంత్రులతో గవర్నర్ కీలక భేటీ - తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలపై చర్చలు - ఉమ్మడి సంస్థల విభజన వివాదాలకు కేంద్రం ముగింపు? సాక్షి, న్యూఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన పంపకాలకు సంబంధించి ముగింపు పలికేందుకు కేంద్రం చొరవ చూపుతున్నట్లు కేంద్ర హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం ఇక్కడ పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో కలిశారు. ఉభయ రాష్ట్రాల మధ్య రెండేళ్లుగా చిచ్చురేపుతున్న హైకోర్టు విభజనతో పాటు ఏపీ డిమాండ్ చేస్తూ వస్తున్న 9, 10 షెడ్యూలు సంస్థల విభజనపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఇవే అంశాలపై కేంద్రం ఆదేశాల మేరకు గవర్నర్ ఇటీవల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమావేశ వివరాలను ప్రధానికి, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు సోమవారం గవర్నర్ ఇక్కడ వివరించినట్లు సమాచారం. ముఖ్యంగా 9, 10 షెడ్యూల్లోని సంస్థలు, ఆస్తులను జనాభా ప్రాతిపదికన విభజిస్తే అమరావతిలో తాత్కాలిక మౌలిక వసతుల ద్వారా హైకోర్టు ఏర్పాటు చేసుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు సుముఖం వ్యక్తం చేశారని వివరించినట్లు తెలుస్తోంది. అయితే షెడ్యూలు 9, 10 సంస్థలకు సంబంధించి ఇదివరకే ఉన్న కమిటీ నివేదికల ప్రకారమే జరగడం సమంజసమని తెలంగాణ సీఎం కేసీఆర్ వాదిస్తున్నారని నివేదించినట్లు సమాచారం. న్యాయాధికారుల కేటాయిం పుల అంశంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకునేంతవరకు సద్దుమణగని సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విద్వేషాలు వద్దని, కేంద్రం సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల మేరకు వీటి పరిష్కారానికి సన్నద్దమైందని హోం శాఖ వర్గాలు తెలిపాయి. హైకోర్టు విభజనపై ప్రధానితో చర్చించలేదు: గవర్నర్ హైకోర్టు విభజనపై తానేమీ ప్రధానితో చర్చించలేదని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రధానితో సాధారణ సమావేశమే. ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఆయనతో హైకోర్టు విషయం చర్చించలేదు. 2 రాష్ట్రాల్లో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. జల వివాదాలపై జోక్యం చేసుకోను. సీఎంలతో చర్చించబోను. కృష్ణా పుష్కరాలకు సకాలంలో పనులు పూర్తవుతాయి’ అని తెలిపారు. మల్లన్నసాగర్ రైతులపై లాఠీఛార్జ్ సంఘటనను ప్రస్తావించగా హైదరాబాద్ వెళ్లాక వివరాలు తెలుసుకుంటానన్నారు. -
పఠాన్‌కోట్‌పై మరో ఉగ్రదాడి?
జమ్మూ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై జనవరి 2న జరిగిన ఉగ్ర దాడిని భారత్ ఇంకా మర్చిపోలేదు. అలాంటి దాడి మరొకటి జరిగే అవకాశం ఉందనీ, కొంతమంది ఉగ్రవాదులు ఇంకా పఠాన్‌కోట్ పరిసర గ్రామాల్లోనే దాగి ఉన్నారని చెప్పి పార్లమెంటరీ స్థాయీ సంఘం బాంబు పేల్చింది. సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర హోం శాఖ ఈ స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉగ్రవాదులు గ్రామాల్లో దాక్కున్న విషయం తమకు గ్రామస్థుల ద్వారా తెలిసిందనీ, పఠాన్‌కోట్‌పై మరోసారి దాడి జరిగే అవకాశం గురించి ప్రభుత్వానికి తెలియజేశామని కమిటీ.. ప్రభుత్వానికి తెలిపింది. దీంతో స్థావరం వద్ద భద్రత పెంచారు. -
ఇష్రత్ కేసు పేపర్లు మాయం
న్యూఢిల్లీ: ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసుకు సంబంధించిన గల్లంతైన ఫైళ్లపై కేంద్ర హోంశాఖ అంతర్గత దర్యాప్తు కమిటీ 52 పేజీల నివేదికను సమర్పించింది. 2009లో చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు హోంశాఖ నుంచి తెలిసో, తెలియకో ఎవరైనా తీయడం వల్లనో, మరేదైనా కారణం వల్లనో ఈ డాక్యుమెంట్లు కనిపించకుండా పోయాయని దర్యాప్తులో తేలింది. వాటిలో ఒకటి మాత్రం దొరికినట్లు హోంశాఖ అదనపు కార్యదర్శి బీకే ప్రసాద్ తన నివేదికలో పేర్కొన్నారు. ఆయన హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మిస్త్రీకి ఈ నివేదికను అందజేశారు. 2009, సెప్టెంబర్ 18-28 మధ్య ఈ డాక్యుమెంట్లు మాయమయ్యాయని పేర్కొన్నారు. ఈ నివేదికలో చిదంబరం గురించి ప్రస్తావించలేదు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన హత్యకు కుట్రపన్నారంటూ ఇష్రత్ తో పాటు మరో ముగ్గురిని 2004లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయితే వారు అమాయకులని నాటి కేంద్ర హోంశాఖ కోర్టుకు నివేదిక సమర్పించింది. భారతీయుడని నిరూపించుకోండి.. ఈ ఎన్కౌంటర్ కేసు డాక్యుమెంట్లు, కమిటీ నివేదిక కావాలని ఓ వ్యక్తి ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన భారతీయుడని నిరూపించుకునే డాక్యుమెంట్లు ఇచ్చాక సమాచారం ఇస్తామని కేంద్రం పేర్కొంది. -
మావోయిస్టుల కట్టడిపై కేంద్రం నజర్
భద్రాచలం: మావోయిస్టుల కట్టడిపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాలను స్థావరాలుగా చేసుకుని.. కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులను నియంత్రించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా మూడు రాష్ట్రాల సరిహద్దులో ప్రస్తుతం 20 సెల్‌టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఏకకాలంలో పెద్ద మొత్తంలో బీఎస్ఎన్ఎల్ టవర్ల నిర్మా ణం జరగటం ఇదే ప్రథమం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకంలో భాగంగా మంజూరైన నిధులతో ప్రస్తుతం బీఎస్ఎన్ ఎల్ సెల్టవర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. భద్రాచలం టెలికాం డివిజన్ పరిధిని విస్తరించి ఉన్న జిల్లాలోని గోదావరి నదికి ఇరువైపులా ఉన్న మండలాలతో ఏపీలో విలీనమైన మండలాల్లో కూడా టవర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రస్తు తం ఈ ప్రాంతంలో 50 బీఎస్ఎన్ఎల్ టవర్లు అందుబాటులో ఉన్నాయి. సోలార్ సిస్టమ్‌తో సిగ్నల్ వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులో ఉన్న టవర్ల ద్వారా విద్యుత్ సరఫరా ఉంటేనే సిగ్నల్ వ్యవస్థ పనిచేస్తుంది. కానీ.. నూతన టవర్లు సోలార్ సిస్టమ్‌తో పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో తరచూ తలెత్తే విద్యుత్ అవాంతరాలతో కమ్యూనికేషన్ వ్యవస్థకు ఆటంకం లేకుండా వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక టవర్ 4 నుంచి 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో సిగ్నల్ పనిచేస్తుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో కూడా ఇదే రీతిన టవర్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇవన్నీ అందుబాటులోకి వచ్చినట్లయితే అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాల్లో సెల్ హల్చల్ చేయనుంది. అడ్డుకట్ట వేయడమే లక్ష్యం కూంబింగ్ కోసం అటవీ ప్రాంతాల్లోకి వెళ్తున్న పోలీసు, సీఆర్పీ ఎఫ్, ప్రత్యేక బలగాలు సమాచారం కోసం వైర్లెస్ సిస్టమ్‌తో పనిచేసే వాకీటాకీలను ఉపయోగిస్తున్నారు. అలాగే గ్లోబల్ పొజిషన్ సిస్టం(జీపీఎస్) ద్వారా ముందుకు సాగుతూ.. అత్యవసర సమయంలో సంఘటనా స్థలం నుంచి సమాచారం చేరవేసేందుకు శాటిలైట్ ఫోన్లను ఇటీవల వినియోగిస్తున్నారు. వివిధ పోలీసు బలగాల జాయింట్ ఆపరేషన్లతో ఇటీవల కాలంలో మావోయిస్టులకు తీవ్ర నష్టమే వాటిల్లింది. గ్రామాల్లో బలంగా ఉన్న కొరియర్ వ్యవస్థ ద్వారా మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని మరింతగా రాబట్టి, వారికి అడ్డుకట్ట వేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎదురుదాడి తప్పదా? సమాచారాన్ని సత్వరమే రాబట్టుకునేందుకు ఒకేసారి పెద్ద ఎత్తున సెల్టవర్ల నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ మావోయిస్టుల ఎదురుదాడి నుంచి వాటిని కాపాడుకోవటం సాధ్యమేనా అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో నిర్మించే సెల్టవర్ల ద్వారా జరిగే నష్టాన్ని ముందుగానే ఊహించిన మావోయిస్టులు గతంలో దుమ్ముగూడెం మండలం చినబండిరేవు, ఆర్లగూడెం, కొత్తపల్లి, ఏపీలో విలీనమైన ఎటపాక మండలం లక్ష్మీపురం, గన్నవరం టవర్లు పనిచేయకుండా నిప్పంటించారు. భవిష్యత్‌లో కూడా ఇటువంటి ఘటనలు జరిగే అవకాశం లేకపోలేదని గిరిజనులు అంటున్నారు. -
స్థానికతకు న్యాయశాఖ ఆమోదం
* త్వరలో కేంద్రం ఉత్తర్వులు జారీ * 2017 జూన్ రెండో తేదీలోపు వెళ్లినవారంతా స్థానికులే సాక్షి, హైదరాబాద్: నూతన రాజధానికి తరలి వెళ్లే ఉద్యోగులతో పాటు ఇతరులు, వారి పిల్లలకు స్థానికత కల్పించేందుకు కేంద్ర న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంబంధిత ఫైలును హోంశాఖ గతంలోనే న్యాయశాఖ పరిశీలనకు పంపిన విషయం తెలిసిందే. న్యాయశాఖ ఆమోదం తెలపడంతో త్వరలోనే స్థానికత కల్పించే ఉత్తర్వులను కేంద్రం జారీ చేయనుంది. న్యాయశాఖ నుంచి సంబంధిత ఫైలు కేంద్ర హోంశాఖకు చేరిందని, ఆ ఫైలును కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తుందని ఉన్నతాధికారి తెలిపారు. రాష్ట్ర విభజన తేదీ జూన్ 2, 2014 నుంచి 2017జూన్2లోపు ఆంధ్రప్రదేశ్‌కు వలసవెళ్లే కుటుంబాలన్నిటికీ స్థానికత కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 7వ తేదీన కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం తుది ముసాయిదా తీర్మానాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన సంగతి విదితమే.