సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ ఎంజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఈ మేరకు ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఈ నెల 17న చర్చలకు రావాలని రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ ఆహ్వానం పంపించింది. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది.
త్రిసభ్య కమిటీలో ఏపీ నుంచి ఎస్‌ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణా రావు ఉన్నారు. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై 9 అంశాలపై చర్చ జరుపుతారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఏపీ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే. ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగెస్ పార్టీ చాలా రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తోంది. జనవరి మొదటివారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీని కలిసి ఏపీ ప్రత్యేక హోదాతో పాటు, రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
త్రిసభ్య కమిటీ ఎజెండాలో 9 అంశాలు...
ఎజెండా1: ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
ఎజెండా 2: ఏపీ- తెలంగాణ మధ్య విద్యుత్ వినియోగ సమస్యపై పరిష్కారం
ఎజెండా 3: పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం
ఎజెండా 4: రెండు రాష్టాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు
ఎజెండా 5: ఏపీఎస్‌సీఎస్‌సీఎల్, టీఎస్‌సీఎస్‌సీఎల్ మధ్య నగదు ఖాతాల విభజన
ఎజెండా 6: ఏపీ-తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ
ఎజెండా 7: ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జాల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు
ఎజెండా 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా
ఎజెండా 9: రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు
Comments
Please login to add a commentAdd a comment