ఆదిమూలం కేసు: అజ్ఞాతంలోకి వరలక్ష్మి.. టీడీపీ నేతల రహస్య మంతనాలు! | Secret Discussions Of Tdp Leaders In The Koneti Adimulam Case | Sakshi
Sakshi News home page

ఆదిమూలం కేసు: అజ్ఞాతంలోకి వరలక్ష్మి.. టీడీపీ నేతల రహస్య మంతనాలు!

Published Fri, Sep 13 2024 11:44 AM | Last Updated on Fri, Sep 13 2024 11:57 AM

Secret Discussions Of Tdp Leaders In The Koneti Adimulam Case

సాక్షి, చిత్తూరు జిల్లా: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.  బాధితురాలు వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లింది. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కేసు దర్యాప్తునకు అవసరమైన ఆరు రకాల పరీక్షల నిమిత్తం శాంపిల్స్‌ సేకరణ పూర్తయిన తర్వాత వరలక్ష్మి నిన్న(గురువారం) డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తాళం వేసుకొని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

వరలక్ష్మి జాడ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆదిమూలం-వరలక్ష్మిల మధ్య రాజీ కుదుర్చేందుకు టీడీపీ నాయకులు రహస్య మంతనాలు జరుపుతుండగా, ఈ క్రమంలోనే వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు, ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు

మరోవైపు, ఈ కేసులో హైడ్రామా నడుస్తోంది. మొక్కుబడిగా ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్‌ చేయగా.. విమర్శల నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. వేధింపులు వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. తాజా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు. కోర్టులో ఆయన క్వాష్‌ పిటిషన్‌ విచారణకు రానున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

కాగా, బాధితురాలి ఆరోపణల మేరకు తిరుపతి భీమా ప్యారడైజ్‌లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూములు సీజ్, సీసీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని అశ్లీల వీడియోను ఫారెన్సీక్ ల్యాబ్‌కు పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో శాసనసభ స్పీకర్ అనుమతి తీసుకొని ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement