secret
-
సెన్సేషనల్ స్టార్ బ్యూటీ సీక్రెట్స్ : మేక పెరుగు, నెయ్యి, జ్యూస్‌లు
ఆర్ట్ కలెక్టర్, దాత సోషల్ మీడియా సెన్సేషన్, రియాలిటీ టీవీ స్టార్ షాలిని పాసి 'ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్' సిరీస్‌తో మరింత పాపులర్ అయిపోయింది. ఆమె అదిరిపోయే పంచ్ డైలాగులు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు 49 ఏళ్ల వయసులో ఇంత అందంగానా? శిల్పం లాంటి ఆకృతి, మెరిసే చర్మం కోసం, ఆమె ఏమి తింటుంది అనేది చర్చకు తెరతీసింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన ఆహార నియమాలు, సౌందర్య రహస్యాలను బహిర్గతం చేసింది. షాలిని రోజువారీ ఆహారంలో ఎటువంటి ఘనమైన ఆహారం తీసుకోదట. సెలెరీ (ఆకుకూరలు)జ్యూస్, కూరగాయలతో చేసిన జ్యూస్‌లు, నెయ్యి, మేక పెరుగు ఖచ్చితంగా తీసుకుంటానని తాగా వెల్లడించింది. ప్రధానంగాకొంచెం వింతగా అనిపించినా తాను మేక పెరుగును ఎక్కువగా తీసుకుంటానని చెప్పింది. మేక పెరుగుతో ఎముకలు ,దంతాలు బలంగా ఉంటాయని వివరించింది. డైట్ మాత్రమే కాదు, రోజుకు రెండు గంటల వ్యాయామం తప్పకుండా చేస్తుందట.షానిలి డైట్ సీక్రెట్, ఆమె మాటల్లో ఉదయం ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటా.తర్వాత ఉసిరి అల్లం కలిపిన బీట్రూట్ రసం.డైట్లో హెర్బల్ లిక్విడ్లు, కూరగాయలజ్యూస్లు ఎక్కువ భాగం ఉంటాయి. రెండు గిన్నెల మొలకలను నమలడం కష్టం. అదే జ్యూస్ అయితే సులభంగా తాగవచ్చు. సెలెరీ జ్యూస్, రెడ్ జ్యూస్, స్ప్రౌట్ జ్యూస్, మిరియాలతో చేసే క్యాప్సికమ్ జ్యూస్ ఇలా చాలా ఉంటాయి.సాయంత్రం ఆహారంలో ప్రతిదీ సూప్ రూపంలో ఉంటుంది. వడకట్టకుండా, చిక్కగా ఉండే కూరగాయలను జ్యూస్‌లను తాగుతాను. ఇంకా బచ్చలికూర, బ్రోకలీ సూప్, టొమాటో, బెండ, తామర కాండం, బఠానీలు ఇలా ఏదైనా జ్యూస్ రూపంలోనే.సాయంత్రం 6 గంటల వరకు పచ్చి ఆహారం మాత్రమే .. రాత్రి 7 గంటలకు భోజనం. అదీ కూడా 'ఘర్ కా ఖానా (ఇంట్లో వండిన ఆహారం)'ఉండేలా చూసుకుంటా. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడే సహజమైన వాటిని మాత్రమే తీసుకుంటాను.డిన్నర్లో అవకాడో, రాగి లేదా జొన్న పిండితో చేసిన దోసలు తింటానుఇక గుడికి వెళ్లని రోజుల్లో ప్రోటీన్ కోసం గుడ్డు, చేపలు లేదా చికెన్ తీసుకుంటా.సాయంత్రం 4 నుండి 6 వరకు నా వర్కౌట్ సమయం. కండరాలకు బలం చేకూర్చే పైలేట్స్ , డ్యాన్స్ చేస్తాను. ఆ సమయంలో నన్ను డిస్టర్బ్ చేయకూడదు. (ఫ్యాషన్‌తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..!) -
మిల్కీ బ్యూటీ డైట్ సీక్రెట్ ఇదే!.. మెరిసే చర్మం కోసం..
టాలీవుడ్ నటి తమన్నా భాటియా హ్యాపీ డేస్ మూవీతో ఎంట్రీ ఇచ్చి.. వరుస హిట్ సినిమాలతో మంచి సక్సెస్‌ని అందుకుంది. మిల్కీ బ్యూటీ, తన అందం, నటనతో విమర్శకుల ప్రశంసలందుకోవడమే గాక ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించింది. కళ్లు తిప్పుకోలేని అందం, ఆహార్యం ఆమె సొంతం. అంతేగాదు యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామరస్‌గా ఉంటుంది. ఇప్పటికి అలానే చెక్కిన శిల్పంలా అందంగా ఉంటుంది. అంతలా బాడీ మెయింటైన్ చేసేందుకు ఆమె ఎలాంటి డైట్ ఫాలో అవుతుందోనని కుతూహలంగా ఉంటారు అభిమానులు. అయితే తమన్నా మాత్రం ఫిట్నెస్ అనేది రోజు బ్రెష్ చేయడం మాదిరిగా శరీరానికి సంబంధించిన ఓ దినచర్య. అందుకోసం తాను ఎలాంటి డైట్లు ఫాలో అవ్వనని, తనకు వాటిపై నమ్మకం లేదని అంటోంది. మరీ అంతలా నాజుకైన శరీరం ఎలా మెయింటైన్ చేస్తుందంటే..తమన్నా నాజూకైన శరీరాకృతి పరంగా ఎన్నో ప్రశంసలందుకుంటుంది. ఫిట్‌గా ఉండేందుకు మెరిసే చర్మం కోసం ఎలాంటి ఫుడ్ తింటుందంటే..బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరి అవి..గ్లూటెన్ ఫ్రీ గ్రానోలా, ఖర్జూరాలు, బాదంపాలు, అరటి పండు, గింజలు, కొన్ని బెర్రీలు ఉంటాయి. శక్తి బూస్ట్ కోసం తేలికపాటి అల్పాహారంతో డైట్ ప్రారంభిస్తుంది. ప్రోటీన్ కోసం గుడ్లను తింటుంది. అంతేగాదు మరింత హెల్తీగా ఉండేందుకు ఉల్లిపాయలు, టొమాటోలు, బచ్చలికూరతో చేసి ఆమ్లేట్లు తీసుకుంటుందట. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) లంచ్ వద్దకు వస్తే సాధారణ భోజనం, పప్పు, అన్నం, పచ్చికూరగాయలే తింటుంది. ఇలాంటి భోజనం సంతృప్తినిస్తుందని అంటోంది. షూటింగ్లో ఉన్న రోజుల్లో లేదా బయటకు వెళ్లే రోజుల్లో ఇడ్లీ, సాంబార్ లేదా రసం, దోస వంటి దక్షిణ భారత ఆహారాన్నే ఎంచుకుంటానంటోంది. డిన్నర్ చాలావరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల్లోపు తినేలా చూసుకుంటుందట. దీంతోపాటు కొన్ని గింజలను తింటానని చెబుతోంది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) అంతేగాదు తాను ఎక్కువగా సాయంత్రం సమయాల్లో జిమ్ చేస్తానని అంటోంది. ఆ టైంలో తప్పనిసరిగా గుడ్లు, కూరగాయలతో కూడిన ప్రోటీన్ రిచ్ డిన్నర్‌కి ప్రాధాన్యత ఇస్తుందట. జిమ్ ఎక్కువ చేస్తే తాను తీసుకునే భోజనం క్వాంటిటీని కూడా పెంచుతానని చెబుతోంది. ఇక మెరిసే చర్మం కోసం హైడ్రేటెడ్‌గా ఉండేలా ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతానని అంటోంది. (చదవండి: కళ ద్వారా ఆరోగ్య అక్ష్యరాస్యత..!) -
పుతిన్‌తో ట్రంప్ రహస్య స్నేహం.. పదవి నుంచి దిగిపోయాక ఆరుసార్లు ఫోన్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యా అధినేత పుతిన్ కోసం కోవిడ్–19 టెస్టింగ్ కిట్లు రహస్యంగా అందజేశారా? పుతిన్ వీటిని వ్యక్తిగతంగా వాడుకున్నారా? పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా పుతిన్‌తో ట్రంప్ రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగించారా? అవుననే చెబుతోంది ఓ పుస్తకం. వాటర్‌గేట్ కుంభకోణంపై వార్తలు రాసిన విలేకరి బాబ్ వుడ్‌వర్డ్ రచించిన ‘వార్’అనే పుస్తకంలో ఈ సంచలన విషయాలు ప్రస్తావించారు. ఈ పుస్తకం ఈ నెల 15న విడుదల కానుంది. ఇందులోని కొన్ని ముఖ్య అంశాలను అమెరికా పత్రికలు బయటపెట్టాయి. ట్రంప్ 2021లో అధికారం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ట్రంప్, పుతిన్ కనీసం ఆరుసార్లు ఫోన్లో సీక్రెట్‌గా మాట్లాడుకున్నారని ట్రంప్ సహాయకుడు చెప్పినట్లు పుస్తకాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం అమెరికాలో సంచలనాత్మకంగా మారింది. ఇదిలా ఉండగా, వార్ పుస్తకంలోని అంశాలను ట్రంప్ ప్రచార బృందం ఖండించింది. అదొక చెత్త పుస్తకం, అందులోని కాగితాలు టాయిలెట్ టిష్యూగా వాడుకోవడానికి పనికొస్తాయని ఎద్దేవా చేసింది. ట్రంప్ సైతం స్పందించారు. కథలు చెప్పడంతో దిట్ట అయిన బాబ్ వుడ్‌వర్డ్ చెప్పే పనికిమాలిన విషయాలు నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. అతడొక చెడ్డవ్యక్తి అని విమర్శించారు. తాజా వివాదంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ కూడా స్పందించింది. ‘వార్’పుస్తకంలో ప్రస్తావించిన వాటిలో ఏమాత్రం వాస్తవం లేవని, అవన్నీ అభూత కల్పనలు అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తేలి్చచెప్పారు. -
ఎన్నికల వేళ ట్విస్ట్.. పుతిన్‌కు ట్రంప్ సీక్రెట్ కాల్స్?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గత అధ్యక్ష ఎన్నికల ఓటమిచెంది పదవి నుంచి దిగిపోయిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పలు ప్రైవేట్ ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారని వచ్చిన ఆరోపణలను బుధవారం క్రెమ్లిన్ ఖండించింది. ఇటీవల బాబ్ వుడ్వార్డ్ తాను రాసిన ‘వార్’ అనే పుస్తకంలో ట్రంప్,పుతిన్ రహస్య ఫోన్ కాల్స్ విషయాలను ప్రస్తావించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్, పుతిన్ ఫోన్ సంభాషణ తీవ్ర సంచలనంగా మారింది. అయితే.. తాజాగా ఈ ఆరోపణలపై రష్యా స్పందించింది. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలో ఉన్నప్పుడు కోవిడ్ మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉందని క్రెమ్లిన్ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.#BREAKING : Kremlin denies calls between Trump and Putin The Russian Presidential spokesman, Dmitry Peskov, has denied information alleging that former US President Donald Trump had spoken on the phone with Russian President Vladimir Putin seven times after the former left… pic.twitter.com/8rbppPeRgD— upuknews (@upuknews1) October 9, 2024 అయితే ఆ సమయంలో తాము కోవిడ్ -19 పరీక్ష పరికరాలను అమెరికాకు పంపినట్లు ధృవీకరించారు. కానీ, ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇరు నేతలు చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని పుస్తకంలోని వాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. బాబ్ వుడ్వార్డ్ తన పుస్తకంలో చేసిన ఆరోపణలను ‘నిజం కాదు’ అని కొట్టిపారేశారు.బాబ్ వుడ్వార్డ్ తాను రాసిన ‘వార్’ అనే పుస్తకం వారం రోజులల్లో మార్కెట్లోకి విడుదల కానుంది. అయితే అంతకంటే ముందే కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. 2024 ప్రారంభంలో ట్రంప్ తన ఫ్లోరిడా రిసార్ట్ మార్-ఎ-లాగోలో ఉన్నప్పుడు పుతిన్‌తో.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రైవేట్ కాల్‌ను ఏర్పాటు చేశారు. ఇరు నేతల మధ్య ఇలాంటి ఫోన్ సంభాషణ కేవలం ఒక్కసారి మాత్రమే జరగలేదని ఆ పుస్తకంలో బాబ్ వుడ్వార్డ్ ప్రస్తావించటం చర్చనీయాంశంగా మారింది.చదవండి: హెజ్బొల్లా చితికి పోయింది: అమెరికా -
80/20 నా డైట్ సీక్రెట్
నటి మసాబా గుప్తా జిహ్వచాపల్యం, తిండి పుష్టి గురించి అందరికీ తెలిసిందే! ఇంట్లో తయారు చేసే రకరకాల చిరుతిళ్లు అంటే ఆమెకు మహా మక్కువ. నోరూరించే రకరకాల తినుబండారాలకు నో చెప్పలేని బలహీనత ఆమెది. అయితే వాసికీ, రాశికీ మధ్య సమతూకాన్ని పాటించడం ఆమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో అనిపిస్తుంది. డైట్ విషయంలో తాను 80/20 సూత్రాన్ని పాటిస్తానని చెప్పిన మసాబా గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో కరోసెల్ అనే క్యాప్షన్ కింద తన రోజువారీ డైట్ గురించిన వివరాలు ఇలా పంచుకుంది. ‘‘80/20 రూల్ అనేది నా పాలిట బంగారం లాంటిది. ఇక్కడ 80 అనేది ప్రోటీన్లతో కూడిన బలవర్థకమైన ఆహారాన్ని సూచిస్తే, 20 నాకు నచ్చిన ఆహారాన్ని సూచిస్తుంది. (పేస్ట్రీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా బర్గర్లను సూచిస్తూ ఇమోజీలు పెట్టింది) వారంలో ఆరు రోజులూ నేను నా శరీరానికి ఏది అవసరమో అది ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తాను. ఒకరోజు మాత్రం నా నాలుక ఏది కోరిందో అది తీసుకోవడానికే ప్రయత్నిస్తాను’’ అని చెప్పింది. తాను రోజువారీ తీసుకునే డైట్ గురించిన వివరాలు ఇలా పంచుకుంది మసాబా. ‘‘ఉదయం ఆరున్నరకు టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ సోంపు గింజలను బాగా నమిలి తిని గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగుతాను. నా దృష్టిలో ఇది అమృత జలం. తొమ్మిది గంటలకు పెద్ద కప్పు నిండా ముసేలీ, బెర్రీలు. దాంతోపాటు వీలయితే అత్తిపళ్లు (రాస్బెర్రీ), నేరేడు పళ్లు. వర్క్ అవుట్స్ చేసిన తర్వాత పెద్ద గ్లాసు నిండా ప్రోటీన్ షేక్ తీసుకుంటాను. నానబెట్టిన ఐదు బాదం, ఐదు వాల్నట్స్ తీసుకుంటా. మధ్య మధ్యలో చల్లటి మజ్జిగ పిప్ చేస్తుంటా. ఒంటిగంటకు ఆలూ లేదా బెండకాయ ఫ్రై, చికెన్ కర్రీ, రైస్, స్ప్రౌట్స్తో చేసిన సలాడ్‌తో సంతృప్తికరమైన లంచ్ చేస్తాను. 5 గంటలకు చికెన్ లేదా చీజ్, కూరగాయలతో టాపింగ్ చేసిన హోల్ వీట్ లేదా మల్టిగ్రెయిన్స్తో చేసిన పిజ్జా.. రెండు ఉడకబెట్టిన గుడ్లు, కొద్దిగా చికెన్ గ్రేవీతో ఏడింటికల్లా డిన్నర్ ఫినిష్ చేస్తాను. మొత్తం మీద నా డైట్లో కార్బ్స్ కంటే ్రపోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను’’ అంటూ ఆమె చేసిన పోస్టింగ్‌కు చాలా లైకులు వచ్చాయి. -
ఏడుపదుల వయసులోనూ చలాకీగా మోదీ.. అలా ఎలా?
మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుర్రాడిలా చురుకుగా ఉంటారు. మంచి యాక్టివ్‌గా కనిపించే ఆయనకు 74 ఏళ్లు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సాధారణంగా ఏడు పదుల వయసులో వణుకుతూ..తడబడుతూ ఉంటారు. కానీ మన మోదీ మాత్రం పాతికేళ్ల కుర్రాడి మాదిరిగా వేగంగా కదులుతూ పనులు చేస్తారు. ఆ వయసు వారికి వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఆయన ఫిట్నెస్ పరంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్య పరంగా యువతకు ఆదర్శం ఆయన. ఇంతలా చురుగ్గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరించే ఐదు ఆరోగ్య రహస్యల గురించి సవివరంగా చూద్దామా..!యోగా..యోగాతో రోజుని ప్రారంభిస్తారు మోదీ. పంచతత్త్వ యోగాసెషన్తో అతని రోజు త్వరగా ప్రారంభమవుతుందట. ఆయన ప్రకృతిలోని ఐదు అంశాలతో ముడిపడి ఉన్న అనేక ఆసనాలను వేస్తారు. ప్రతిరోజూ సుమారు 40 నిమిషాల పాటు సూర్య నమస్కారం, ధ్యానం, ప్రాణాయామం, యోగా నిద్ర తదితరాలు తప్పనిసరి. ఇక్కడ యోగా మనస్సుని, శరీరాన్ని సమతుల్యం చేస్తుంది, పైగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ఉపకరిస్తుంది. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) యోగా నిద్ర లేదా సమాధి స్థితి..ప్రధానిగా ఆయనకు ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందువల్ల కంటినిండా నిద్ర అనేది కాస్త కష్టమనే చెప్పాలి. ఇది ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపిస్తుందో మనకు తెలిసిందే. అందుకోసం మోదీ యోగా నిద్ర లేదా సమాధి స్థితిలో గడుపుతుంటారు. ఇది నిద్రలేమితో పోరాడటానికి, శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడానికి ఉపకరిస్తుంది. ఇద తనకు మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు, శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు ఉపయోగపడుతుందని పలు ఇంటర్యూలలో మోదీ చెప్పుకొచ్చారు కూడా. తప్పనిసరిగా వాకింగ్..ఎంత బిజీ షెడ్యూల్లో కూడా తప్పనిసరిగా వాకింగ్ చేస్తారు. అక్కడ ఉన్న వెసులబాటు రీత్యా సమయం తీసుకుని మరీ నడకకు ప్రాధాన్యత ఇస్తారు మోదీ. తాను ఎక్కువగా ప్రకృతిని ప్రేమిస్తానని, అక్కడ కాసేపు గడపడం తనకెంతో ఆహ్లాదాన్ని ఇస్తుందని చెబుతుంటారు. అందుకోసమైనా ఆపేదే లేదని చెబుతుంటారు. పచ్చగడ్డిపై నడుస్తూ ప్రకృతితో మమేకమవ్వడం తెలియని రిఫ్రెష్‌ని ఇస్తుందని అంటారు మోదీ.అల్పాహరం, భోజనంగా..ప్రధాని మోదీ శాకాహారి. ఆయన నవరాత్రుల తొమ్మిది రోజులు ఉపవాసాలు పాటిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఆఖరికీ విదేశాల్లో ఉన్నా కూడా నియమం తప్పరు. అంతేగాదు కచ్చితంగా ప్రతిరోజు తొమ్మిది కల్లా అల్పాహారం తీసుకుంటానని చాలసార్లు చెప్పారు. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించేందుకు ఆయా కాలానుగుణ పండ్లను కూరగాయాలను, తృణధాన్యాలను అస్సలు మిస్‌కాకుండా చూసుకుంటానని సోషల్ మీడియా పలుసార్లు వెల్లడించారు. అంతేగాదు ఒకసారి ఫిట్ ఇండియా ఉద్యమంలోతాను ములక్కాయతో కూడిన పరాఠాను తినేందుకు ఇష్టపడతానని అన్నారు. అలాగే మిల్లెట్లు, కాయధాన్యాలు, భారతీయ మసాలాలతో చేసే గుజరాతీ వాఘరేలీ ఖిచ్డీ వంటివి ఇష్టంగా తింటానని చెప్పారు. ఆయర్వేదానికే ప్రాధాన్యత..మోదీకి ఆయుర్వేదంపై ప్రగాఢ నమ్మకం ఉంది. జలుబు, దగ్గు,లేదా కాలనుగుణ అలెర్జీలు వంటి ఏ అనారోగ్య సమస్యకైనా ఆయుర్వేదాన్నే ఆశ్రయిస్తారు. అలాగే ఆహారంలో సహజసిద్ధమైన నూనెలకే ప్రాధాన్యత ఇస్తారు. అందువల్లే తాను ఇంతలా ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండగలుగుతున్నానని అన్నారు. ఈ విధానాలను పాటించడం వల్లే అలసటకు ఆస్కారం లేకుండా చురుగ్గా ఉండటమే గాక దాదాపు 130 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా సమర్థవంతంగా పనులు చేయగలుగుతున్నానని సగర్వంగా చెప్పారు మోదీ. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) (చదవండి: రోగి భద్రతకు కావాల్సింది భరోసా..!) -
ఆదిమూలం కేసు: అజ్ఞాతంలోకి వరలక్ష్మి.. టీడీపీ నేతల రహస్య మంతనాలు!
సాక్షి, చిత్తూరు జిల్లా: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాధితురాలు వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లింది. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కేసు దర్యాప్తునకు అవసరమైన ఆరు రకాల పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరణ పూర్తయిన తర్వాత వరలక్ష్మి నిన్న(గురువారం) డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తాళం వేసుకొని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.వరలక్ష్మి జాడ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆదిమూలం-వరలక్ష్మిల మధ్య రాజీ కుదుర్చేందుకు టీడీపీ నాయకులు రహస్య మంతనాలు జరుపుతుండగా, ఈ క్రమంలోనే వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు, ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలుమరోవైపు, ఈ కేసులో హైడ్రామా నడుస్తోంది. మొక్కుబడిగా ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయగా.. విమర్శల నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. వేధింపులు వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. తాజా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు. కోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.కాగా, బాధితురాలి ఆరోపణల మేరకు తిరుపతి భీమా ప్యారడైజ్‌లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూములు సీజ్, సీసీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని అశ్లీల వీడియోను ఫారెన్సీక్ ల్యాబ్‌కు పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో శాసనసభ స్పీకర్ అనుమతి తీసుకొని ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు. -
నా ఫిట్నెస్ రహస్యం ఇదే!
మనిషికి ఫిట్నెస్ చాలా ముఖ్యం. ఇది సినీ తారలకు మరీ ముఖ్యం. అందుకు వ్యాయామం వంటి కసరత్తులతో పాటు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. కొందరు అందుబాటులో ఉన్నవి కదా అని అన్నీ తినేస్తుంటారు. దీంతో భారీ కాయంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కాగా చాలా మంది కథానాయికలు వయసు పరంగా 40లో పడినా చాలా ఫిట్నెస్గా, ఆరోగ్యంగా ఉంటారు. అందులో ఒకరు అగ్రనటి నయనతార. జవాన్ చిత్రంలో ఇండియన్ స్టార్ హీరోయిన్గా మారిన ఈమె ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు రూ. 10 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ తరగని అందాలతో నిగ నిగలాడుతున్న ఈ భామ ఫిట్నెస్ రహస్యమేమిటో? అని చాలా మంది ఆశ్యర్యపోతుంటారు. ఆ రహస్యాన్ని నయనతారనే ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. అందులో డైట్ అంటే ఇష్టమైన వన్నీ భుజించకూడదని, తాను ఇంతకు ముందు వరకూ భావించానన్నారు. అయితే అది కరెక్ట్ కాదని తన వైద్యురాలి ద్వారా తెలుసుకున్నానన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే మంచి పోషకాహారాలను ఇంట్లోనే తయారు చేయించుకుని, భుజిస్తున్నానని చెప్పారు. వాటిని ఆస్వాదిస్తూ తినడంతో జంక్ పదార్థాలపై కోరిక పుట్టడం లేదన్నారు. అలా తన ఆహారపు అలవాట్లే మారిపోయాయని పేర్కొన్నారు. మన లైఫ్ స్టైల్ బట్టే మన జీవన విధానం ఉంటుందని నయనతార అన్నారు. కాగా ప్రస్తుతం ఈ లేడీ సూపర్‌స్టార్ తమిళం, మలయాళం భాషల్లో నటిస్తూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరో పక్క నిర్మాతగా, వ్యాపారవేత్తగా, వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ పలు విధాలుగా సంపాదిస్తున్నారు. -
మరికొద్ది గంటల్లో తెరుచుకోనున్న పూరీ రత్నభాండాగారం
దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది రేపే తెరుచుకోనుంది.ఈ రత్న భాండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తోంది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని.. వీటి విలువ వెలకట్టలేనిదని అంచనాలున్నాయి.ఆదివారం పూరీలోని ప్రముఖ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని తెరవనున్నారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. అక్కడ ఉంచిన విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు.46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా.. సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. అయితే.. పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భండారంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సేవకుడు హరేకృష్ణ మహాపాత్ర అంటున్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు కూడా.👉పూరీ జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. 👉అయితే.. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. అయితే.. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో.. ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.👉భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రబీంద్ర నారాయణ్ మిశ్రా వెల్లడించారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటిని పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్‌లకు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ.. ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్కకట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు.👉ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే.. హైకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ రఘుబీర్ దాస్ కమిషన్ బృందం భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న పరిశీలనకు వెళ్లింది. అయితే, రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందం.. పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. 👉జగన్నాథుని రత్న భాండాగారాన్ని గురించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి పూరీ కలెక్టర్ చార్లెస్ గోమ్స్ నివేదికలో వచ్చింది. ఆ సమయంలో రత్న భాండాగారంలో రత్నాలు పొదిగిన బంగారు, వెండి ఆభరణాలు, 128 బంగారు నాణేలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1333 రకాల వస్త్రాలు లభించాయి. 👉కాగా, 1978లో జగన్నాథ ఆలయంలోని రత్నాల దుకాణాన్ని తెరిచినప్పుడు అక్కడ 454 బంగారు ఆభరణాలు, 293 వెండి వస్తువులు లభించాయి. 1982 – 1985 సంవత్సరాలలో రత్న భండాగారం తెరచుకుంది. కానీ అప్పటికి విషయాలు లెక్కించలేదు.👉జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 2021లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా మాట్లాడుతూ.. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం, 12,831 భరీల బంగారం (ఒక భరీ సుమారు 12 గ్రాములతో సమానం), 22,153 భరీల వెండితోపాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. ఎంతో విలువైన రాళ్లతో కూడిన 22,153 భరీల వెండి కూడా నిపుణులు గుర్తించారు. వీటితోపాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి. అయితే, పలు కారణాల వల్ల 14 బంగారు, వెండి ఆభరణాలను కొలవలేకపోయినందున వాటిని ఈ జాబితాలో పొందుపరచలేదని చెప్పారు.👉రఘుబీర్ కమిటీ నివేదికపై జులై 10లోగా స్పందన తెలియజేయాలంటూ ఒడిశా హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాళాలు ఎలా మాయమయ్యాయని.. డూప్లికేట్ తాళాలతో వాటిని తెరవాల్సిందేనని విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. రాజకీయం చేయొద్దని బీజేడీ కోరినా.. బీజేపీ, కాంగ్రెస్‌లు వెనక్కి తగ్గలేదు. అయితే ఈలోపే ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీ.. ఎన్నికల హామీ మేరకు రత్న భాండాగారం తెరిపించేందుకు సిద్ధమైంది.👉ఒడిశా పూరీ జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారాన్ని తెరిపించి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రథ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో.. ఈ నెల 14న(ఆదివారం) రత్న భాండాగారం రహస్య గదిని తిరిగి తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి ఆ కమిటీ సిఫార్సు చేసింది.👉జగన్నాథ ఆలయంలోని రత్నాల భాండాగారాన్ని తెరిచే బాధ్యతను బిశ్వనాథ్ కమిటీనే తీసుకుంది. ఆయన నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీకి ఈ బాధ్యతను అప్పజెప్పారు. ఈ కమిటీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఉంచిన వస్తువులను లెక్కించి వాటిపై నివేదికను రూపొందిస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో.. రత్న భాండాగారం తెరిచి అక్కడున్న వస్తువులను లెక్కిస్తారని తెలుస్తోంది. -
60లలో యవ్వనంగా కనిపించేలా చేసే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..!
వృధాప్యం అనేది సర్వసాధారణం. వయసు గడిచేకొద్ది ఎవ్వరైనా ఈ స్టేజ్‌కి రావాల్సిందే. అందుకోసం మార్కెట్లో లభించే వేల ఖరీదు చేసే కాస్మెటిక్స్‌కి డబ్బులు తగలేస్తుంటారు. పలు వర్కౌట్లని, డైట్లని నానాతంటాలు పడుతుంటారు. అయితే అవేమీ లేకుండానే, ఎలాంటి కష్టం లేకుండా తన తల్లి 60లలో కూడా యంగ్‌గా కనిపిస్తోందని చెబుతున్నాడు డిజిటల్ క్రియేటర్. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో కూడా షేర్ చేసుకున్నాడు. అదెంటో చూద్దామా..వృద్ధాప్యాన్ని ఆపడం అంత ఈజీకాదు కానీ నియంత్రించొచ్చు. అది కూడా సహజమైన వాటితోనే చెయ్యొచ్చట. వయసు రీత్యా చర్మం పలు మార్పులకు లోనవ్వుతుంది. ఆ మార్పులను నియంత్రించగలిగితే నిగనిగలాడే కాంతివంతమైన చర్మం మన సొంతం అవుతుందట. అందుకు నిద ర్శనం తన తల్లేనని డిజి టల్ క్రియేటర్ రోహిత్ బోస్ చెబుతున్నాడు. ఆమె 64 ఏళ్ల వయసులో కూడా యంగ్‌గా ఉంటుందని, అలా అని బోటాక్స్ ట్రీట్మెంట్, జిమ్ వంటి వర్కౌట్లు ఏమి చెయ్యదని చెబుతున్నాడు. అందుకోసం ఆరోగ్యకరమైన ఫుడ్స్ అంటూ ప్రత్యేకంగా ఏమి తీసుకోదని కూడా తెలిపారు. అయినా ఇంతలా ఆమె అందంగా కనిపించడానికి ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్సేనని చెప్పుకొచ్చారు. అవేంటంటే..బొప్పాయి: విటమిన్లు ఏ, సీ, ఈ, కే పుష్కలంగా ఉంటాయి. ముఖంపై గీతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అవిసె గింజలు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో నిండిన అవిసె గింజలు చర్మాన్ని ఆర్ద్రీకరణ, స్థితిస్థాపకతకు మద్దతునిస్తాయి. దీంతో చర్మం బొద్దుగా, మృదువుగా ఉంచుతాయి.గుమ్మడి గింజలు: జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న గుమ్మడికాయ గింజలు కణాల పునరుద్ధరణను ప్రోత్సహిస్తాయి, పైగా వృద్ధాప్యంతో పోరాడుతాయి.కొబ్బరి నీరు: ఈ సహజ హైడ్రేటర్ సైటోకినిన్లతో నిండి ఉంటుంది. ఇది కణాల పెరుగుదల, వృద్ధాప్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని తాజాగా హైడ్రేట్‌గా ఉంచుతుంది.అల్లం: యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన అల్లం చర్మపు రంగును సమంగా ఉంచడంలో సహాయపడటమే గాక వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతుంది.పసుపు: పసుపులోని కర్కుమిన్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యగా ముడతలు తగ్గించి,యవ్వనపు ఛాయను ప్రోత్సహిస్తుంది.వైద్యులు సైతం ఇలాంటి ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు. బొప్పాయి చర్మానికి, ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇక అవిసెగింజలు చర్మాన్ని కోమలంగా ఉంచడంలోనూ, జీర్ణక్రియకు మంచిదని చెబుతున్నారు. ఈ ఆహారాలు స్కిన్ టోన్‌ని మంచిగా ఉంచినప్పటికీ వ్యాయామాలు కూడా చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెబుతున్నారు. (చదవండి: పాత జీన్స్ ప్యాంటులతో స్లీపింగ్ బ్యాగ్‌లు..ఒక్కో జీన్స్‌కి ఏకంగా..!) -
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
టాలీవుడ్ రౌడీ హీరోగా పేరుగాంచిన విజయ్ దేవకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడటానికి మంచి స్టైయిలిష్ లుక్‌తో కండలు తిరిగిన బాడీతో మంచి ఫిట్నెస్గా ఉంటాడు. అమ్మాయిల కలల రాకుమారుడిలా క్రేజీ లుక్‌తో ఎట్రాక్ట్ చేస్తుంటాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ రౌడీ హీరో పిట్ నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందామా..!వర్కౌట్లు..కండలు తిరిగిన టోన్డ్ ఫిజిక్‌ని మెయింటెయిన్ చేసేందుకు తీవ్రమైన వ్యాయామాలు చేస్తుంటారు. ముఖ్యంగా అధిక బరువులు, కార్డియో ఫంక్షన్లకు సంబంధించిన వ్యాయామాలు ఎక్కువగా చేస్తుంటాయడు. ప్రతిరోజు కనీసం రెండు గంటలు వర్కౌట్లకు కేటాయిస్తాడు. ముఖ్యంగా మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉండేలా యోగా, మెడిటేషన్ వంటివి తప్పనిసరి. డైట్ ప్లాన్..విజయ్ చాలా స్ట్రిక్ట్ డైట్ ప్లాన్‌ని ఫాలో అవుతాడు. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాడు. ముఖ్యంగా జీవక్రియను చురుకుగా ఉంచేందుకు అతిగా తినకుండా ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు. ముఖ్యంగా రోజంతా చిన్న చిన్నగానే భోజనం తీసుకుంటాడు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటాడు. హైడ్రేటెడ్‌గా ఉండటానికి పుష్కలంగా నీరు తాగుతుంటాడు.ఇక్కడ విజయ్ దేవరకొండలా పిట్‌గా ఉండాలంటే మంచి ఫిజిక్, తీవ్రమైన వర్కౌట్లు, స్ట్రిక్ట్ డైట్ ప్లాన్లు అవసరం అనేది గ్రహించాలి. అలా అని ఎలా పడితే అలా చేసేయ్యకూడదు. ఫిట్నెస్ కోచ్‌లు, ఆరోగ్య నిపుణులు పర్యవేక్షణలో సలహాలు, సూచనలతో సరైన విధంగా వర్కౌట్లు చేయాల్సి ఉంటుంది. అలాగే అందుకు తగ్గట్టుగా తీసుకునే డైట్ కూడా నిపుణుల సలహాలు మేరకు తీసుకోవాలినేది గ్రహించాలి. అందరికి ఒకలాంటి డైట్‌ప్లాన్‌లు వర్కౌట్లు సరిపోవు. ఇక్కడ ఆయా వ్యక్తుల ఆరోగ్య చరిత్ర, ఫేస్ చేసే హెల్త్ సమస్యలు తదితరాలను పరిగణలోనికి తీసుకుని ఎలాంటి వర్కౌట్ సెషన్లు మంచివి, ఎలాంటి ఆహారం తీసుకోవడం మంచిది అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాటన్నింటిని పరిగనలోనికి తీసుకుని ఫాలో అవ్వడం మంచిది. (చదవండి: భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!) -
సిక్సర్ల బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
ప్రముఖ స్టార్ క్రికెటర్ రోహిత్ గురునాథ్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలోకి బ్యాట్‌తో దిగడంతోనే ప్రత్యర్థులను మట్టికరిపించేలా సిక్స్‌ర్లతో చెలరేగిపోతాడు. విధ్వంసకర బ్యాట్సమెన్గా ఈ హిట్‌మ్యాన్‌కి పేరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. అంతేగాదు రోహిత్ టీమిండియా జట్టు కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో ఆడి తొలి సిరీస్‌ల్లోనే ప్రత్యర్థి జట్టును క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అలాంటి విధ్వంసకర బ్యాట్సమెన్ రోహిత్ ఫిట్నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందామా..! క్రీడాకారులు మంచి ఆటతీరుని కనబర్చాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే. మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తేనే మంచి ఆట తీరుని కనబర్చగలరు. మరి ఈ దిగ్గజ ఆటగాడు రోహిత్ ఫిట్నెస్ సీక్రెట్, ఫాలో అయ్యే డైట్ ఏంటో సవివరంగా చూద్దామా..! డైట్.. రోహిత్ పోషకాహారంతో కూడిన ఆరోగ్యకరమైన డైట్‌ని ఫాలో అవ్వుతాడు. తన డైట్లో తప్పనిసరిగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అల్పాహరంలో రోహిత్ తప్పనిసరిగా గుడ్లు, ఓట్స్, పండ్లను తింటాడు. సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాడు. మధ్యాహ్నాం లంచ్‌లో తప్పనిసరిగా బ్రౌన్ రైస్, చికెన్, కూరగాయాలు తీసుకుంటాడు. రాత్రిపూట తప్పనిసరిగా కాల్చిన చేపలు, సలాడ్, ఉడికించిన కూరగాయాలు తీసుకుంటాడు వర్కౌట్లు.. ఫిట్‌గా ఉండేలా శరీరంలో చెడు కొలస్ట్రాల్ చేరకుండా జాగ్రత్త పడతాడు. అలాగే ఇన్సులిన్ స్థాయిలు సమంగా ఉండేలా డైలీ శరీరానికి కావాల్సిన వర్కౌట్లు చేస్తుంటాడు. ఎక్కువ సమయం తన ట్రైనర్‌తో కలిసి వ్యాయామ శాలలో గడుపుతాడు. కోర్ వర్కౌట్లపై దృష్టిపెడతాడు. ఇది కండరాల స్థాయిని మెరుగుపరుస్తుంది. బరువుని అదుపులో ఉంచుతుంది. నిజానికి రోహిత్ కెరియర్ ప్రారంభంలో ఫిట్‌నెస్‌లో అంత ప్రావీణ్యం పొందలేదు. రానురాను ఆటను మెరుగుపరచుకునే క్రమంలో తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారించడం ప్రారంభించినట్లు ఓ ఇంటర్యూలో వెల్లడించారు. ఇక రోహిత్ శాకాహార కుటుంబంలో జన్మించినప్పటికీ ఫిట్నెస్గా ఉండి మెరుగ్గా ఆడేందుకు నాన్‌వెజ్ తీసుకోక తప్పలేదు. (చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే డైట్ ఇదే!) -
సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి త్రీ సీక్రెట్స్ ఇవే!
చాలా మంది వృద్ధులు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించిన పలు ఘటనలను చూశాం. వాళ్లు అంతకాలం ఎలా జీవించారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి మరీ అంతకాలం ఎలా జీవించారని కూడా అనుకుంటాం. అందకు రహస్యలివే అంటూ.. ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఓ వీడియోని షేర్ చేశారు. ఆయన ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గ్ ఉంటూ మంచి మంచి వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. అలానే ఈసారి ఆరోగ్యగానికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ డాక్టర్ సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవిత రహాస్యలను వెల్లడించారు. ఆ వీడియోలో డాక్టర్ నిషిత్ చోక్సీ అనే వ్యక్తి 90 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు గల రోగులతో సంభాషణ ద్వారా తాను తెలుసుకున్న విషయాలను గురించి చెప్పుకొచ్చారు. దాదాపు తన పేషంట్లలో చాలామంది సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి సంతోషం, సంతృప్తి ప్రాముఖ్యతల గురించి నొక్కి చెప్పినట్లు తెలిపారు. వాళ్లందరూ చెప్పిన మరో కామన్ పాయింట్ వ్యాయామం అని అన్నారు. చక్కటి వ్యాయామం దీర్ఘాయువుని నిర్ణయిస్తుందని వారంతా చెప్పినట్లు తెలిపారు. తన పేషంట్లలో కొంతమంది వృద్ధులు కర్ర లేకుండా నడవగలరని, కొందరూ అసలు కళ్లద్దాలు ఉపయోగించకుండా పుస్తకాలు, పేపర్లు చదవగలరని చెప్పుకొచ్చారు. వారిలో చాలామంది తమ పనులను వారే స్వయంగా చేసుకుంటారు. అంతేగాదు చాలామంది మోతాదుకు మించి తిని ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారని అన్నారు. ఓ వయసు వచ్చాక మితంగా తినాలని, అలాగే ఎక్కువ ఒత్తిడిగా ఉన్న సమయంలో మనం తీసుకునే ఆహారంలో తేడాలు ఉంటాయని కూడా చెప్పారన్నారు. "ఎందుకంటే.. ఒత్తిడిగా ఉంటే కొందరు తినరు, మరికొందరూ అతిగా తింటారు. ఇవి రెండూ కూడా ప్రమాదమే. పిడుగు వచ్చి మీద పడిపోయేంత సమస్య అయినా.. తాపీగా జరేది జరగక మానదు..నా చేతిలో ఏమిలేదు అనేది సత్యాన్ని గట్టిగా విశ్వసించాలి. అప్పుడూ ఎంతటి ఒత్తడి అయినా తట్టుకుంటారు, నిదానంగా తినేందుకు యత్నిస్తారు. అప్పుడు రక్తపోటు పెరగదు. కాబట్టి జీవితంలో సంతోషం, సంతృప్తికి ప్రాధాన్యత ఇస్తూ వీలైనంతలో వ్యాయామం చేయండి చాలు. ఈ మూడే సుదీర్ఘ కాలం ఆరోగ్యంగా జీవించడానికి కీలకమైనవని డాక్టర్ నిషిత్ అన్నారు. అందుకు సంబంధించిన వీడియోకి "సుదీర్ఘ జీవితానికి రహస్యాలు" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశారు హర్ష గోయెంకా. ఈ వీడియోని చూసిన నెటిజన్లు..ఆ వైద్యుడు చెప్పిన వాటితో ఏకీభవిస్తూ ఆరోగ్యమే అసలైన సంపద అంటూ పోస్టులు పెట్టారు. అలాగే మెదడు షార్ప్‌గా ఉండేలా పజిల్స్ లేదా కొత్త భాషను నేర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటే కూడా ఆరోగ్యంగా ఉంటామని పోస్టుల్లో పేర్కొన్నారు. Simple secrets to long life… pic.twitter.com/nuVzuGGR2C — Harsh Goenka (@hvgoenka) March 27, 2024 (చదవండి: అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!) -
రహస్య ప్రాజెక్ట్.. ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు
Facebook Secret Project: మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలకు సంబంధిచిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్‌చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల యూజర్లపై ఫేస్బుక్ స్నూపింగ్ (అనైతిక విశ్లేషణ) చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేసింది. ‘టెక్ క్రంచ్’ కథనం ప్రకారం.. స్నాప్‌చాట్ (Snapchat) యాప్‌కి, తమ సర్వర్లకు మధ్య నెట్వర్క్ ట్రాఫిక్‌ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్బుక్ 2016లో 'ప్రాజెక్ట్ ఘోస్ట్‌బస్టర్స్' అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం.. యూజర్ బిహేవియర్‌ను అర్థం చేసుకోవడానికి, స్నాప్‌చాట్‌పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్బుక్ ఈ చొరవను రూపొందించింది. ఈ పత్రాల్లో రహస్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఫేస్బుక్ అంతర్గత ఈమెయిల్‌లు కూడా ఉన్నాయి. 2016 జూన్ 9 నాటి అంతర్గత ఈమెయిల్లో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్నాప్‌చాట్‌లో ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానిలో విశ్లేషణలను పొందాలని ఉద్యోగులను ఆదేశించినట్లుగా ఉంది. దీంతో నిర్దిష్ట సబ్డొమైన్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడానికి 2013లో ఫేస్బుక్ ద్వారా పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ‘ఒనావో’ను ఉపయోగించాలని ఫేస్బుక్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒక నెల తర్వాత, వారు ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్స్టాల్ చేయగల ప్రతిపాదన కిట్లను అందించారు. ఈ ప్రాజెక్ట్‌ను అమెజాన్, యూట్యూబ్ యూజర్ల డేటా కోసం విస్తరించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల బృందంతో పాటు దాదాపు 41 మంది న్యాయవాదులు ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్లో పనిచేశారు. ఓనావోను ఉపయోగించడానికి ఫేస్బుక్ టీనేజర్లకు రహస్యంగా డబ్బు చెల్లిస్తోందని దర్యాప్తులో వెల్లడైన తర్వాత, ఫేస్బుక్ 2019లో ఒనావోను మూసివేసింది. -
సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారా?
హీరోయిన్ తాప్సీ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ రిలేషన్ షిప్లో ఉన్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మథియాస్, తాప్సీ వివాహం చేసుకున్నట్లుగా గతంలో కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను తాప్సీ ఖండించారు. అయితే తాజాగా మథియాస్, తాప్సీల వివాహం తెరపైకి వచ్చింది. అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో మథియాస్, తాప్సీ వివాహబంధంతో ఒక్కటయ్యారని బాలీవుడ్ సమాచారం. వీరి పెళ్లి వేడుకలు ఈ నెల 20నే మొదలయ్యాయని, 23న వివాహం జరిగిందని టాక్. తాప్సీ మెయిన్ లీడ్‌గా నటించిన సినిమాలతో అసోసియేట్ అయిన కనికా థిల్లాన్ తో పాటు కొందరు బాలీవుడ్ నటీనటులు తాము ఓ పెళ్లి వేడుకలో పాల్గొంటున్నామన్నట్లుగా సోషల్ మీడియాలో హింట్ ఇచ్చారు. దీంతో వీరు హాజరైంది తాప్సీ వివాహానికే అనే ప్రచారం జరుగుతోంది. మరి.. తాప్సీ, మథియాస్ పెళ్లి జరిగిందా అనే విషయంపై ఆ ఇద్దరే క్లారిటీ ఇవ్వాలి. -
Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో
సినిమాలు పాత కథలను తవ్వి పోస్తున్నాయి. చరిత్ర గతిని వెండి తెర మీద పునఃసృష్టిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో ఘట్టాలు. ఎందరో త్యాగమూర్తులు. కాని పురుషుల బయోపిక్‌లు వచ్చినట్టుగా స్త్రీలవి రాలేదు. తాజాగా విడుదలైన ‘అయ్ వతన్ మేరే వతన్’ సినిమా నాటి వీర వనిత ఉషా మెహతా జీవితాన్ని చూపింది. బ్రిటిష్‌కు వ్యతిరేకంగా సీక్రెట్ రేడియో నడిపిన ఉషా మెహతా ఎవరు? ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో కాలింగ్ ఆన్ 42.34 మీటర్స్ సమ్‌వేర్ ఇన్ ఇండియా’... ఈ అనౌన్స్మెంట్ బ్రిటిష్ వారిని గడగడలాడించింది. మునికాళ్ల మీద పరిగెత్తిచ్చింది. ఒక బుల్లి రహస్య రేడియో స్టేషన్‌ని, దాని నిర్వాహకులను అరెస్ట్ చేయడానికి పిచ్చెక్కినట్టు తిరిగేలా చేసింది. మూడు నెలల పాటు బ్రిటిష్‌వారిని ముప్పుతిప్పలు పెట్టిన ఆ రేడియో నిర్వాహకురాలి పేరు ఉషా మెహతా. గాంధీ పిలుపు విని... ఉషా మెహతా గుజరాత్‌లోని సూరత్ సమీపంలో ఉన్న సారస్ అనే ఊళ్లో 1920లో జన్మించింది. ఐదేళ్ల వయసులో గాంధీజీని అహ్మదాబాద్‌లో చూసింది. 8 ఏళ్ల వయసులో వాళ్ల ఊరి దగ్గర గాంధీజీ చరఖా కార్యక్రమం నిర్వహిస్తే ఉషా పాల్గొని కొద్దిసేపు చరఖా తిప్పింది. బాల్యంలోనే గాంధీజీ మీద గొప్ప భక్తి పెంచుకున్న ఉషా 12 ఏళ్ల వయసులో తండ్రి వృత్తిరీత్యా బొంబాయికి మారడంతో తన దేశభక్తిని చాటుకునే అవకాశం పొందింది. డూ ఆర్ డై 1942 ఆగస్టు 8న బొంబాయిలో గాంధీజీ క్విట్ ఇండియా పిలుపునిచ్చారు. ‘డూ ఆర్ డై’ లేదా ‘కరో యా మరో’ నినాదాలు మిన్నంటాయి. ‘ఇక భారత ప్రజలు నాయకుల కోసం ఎదురు చూడొద్దు. ప్రజలే నాయకులు’ అని గాంధీజీ పిలుపునిచ్చారు. 22 ఏళ్ల ఉషా మెహతా తన స్నేహితులైన విఠల్ దాస్ ఖాకడ్, చంద్రకాంత్ ఝావేరీ, బాబూభాయ్ ఠక్కర్‌లతో కలిసి ఆ మీటింగ్‌కు వెళ్లింది. ఉత్తేజితురాలైంది. అప్పటికే స్వతంత్రోద్యమ వార్తల మీద బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉద్యమం ఉధృతం కావాలంటే రేడియో మాధ్యమం ద్వారా వార్తలు అందించాల్సిన అవసరం ఉందని ఉషా మెహతా తన స్నేహితులతో చెప్పింది. దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలని పిలుపునిచ్చింది. రహస్య కాంగ్రెస్ రేడియో బ్రిటిష్ ప్రభుత్వంలో జడ్జిగా పని చేస్తున్న తండ్రి నివారించినా వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఉషా బొంబాయిలో షికాగో రేడియో ట్రాన్స్‌మిషన్‌ను చూస్తున్న మరో మిత్రుడు మోత్వాని సహాయంతో సొంత ట్రాన్స్మిటర్ను సంపాదించింది. మిత్రులతో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని రేడియో స్టేషన్‌గా మలిచింది. ఆగస్టు 27, 1942న మొదటి చరిత్రాత్మక ప్రసారాన్ని సొంత గొంతుతో చేసింది. ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో 42.34 మీటర్స్ సమ్‌వేర్ ఇన్ ఇండియా’... అంటూ స్వాతంత్రోద్యమ వార్తలు వినిపించింది. ఆ క్షణం నుంచి ఆ రహస్య రేడియో కోసం బ్రిటిష్ అధికారులు, పోలీసులు కంటి మీద కునుకు లేకుండా వెతకసాగారు. ప్రసారాలు బొంబాయి నుంచే నిర్వహిస్తున్నా దేశంలో ఎక్కడి నుంచి అవుతున్నాయో తెలియక గింజుకున్నారు. మూడు నెలలు రహస్య రేడియో ప్రసారాలు మూడు నెలలు సాగాయి. కాని పరికరాలు సమకూర్చిన మోత్వాని లొంగిపోయి రేడియో స్టేషన్ చిరునామా చెప్పేశాడు. నవంబర్ 12, 1942న పోలీసులు దాడి చేసి ఉషా మెహతాను అరెస్ట్ చేశారు. ఆరు నెలల పాటు ఆమెను ఇంటరాగేట్ చేశారు. 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉషా ఏ మాత్రం జంకలేదు. 1946 నాటి మధ్యంతర ప్రభుత్వ హయాంలో మురార్జీ దేశాయ్ హోమ్ మినస్టర్గా ఉండగా ఆమె విడుదల జరిగింది. కాని జైలు జీవితం ఆమె ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసింది. బయటకు వచ్చాక ఆమె చదువు కొనసాగించి ముంబై యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి 1980లో రిటైర్ అయ్యింది. గాంధీజీ భావజాలాన్ని ప్రచారం చేస్తూ 2000 సంవత్సరంలో తుది శ్వాస విడిచింది. ఉషా మెహతా జీవితం ఆధారంగా నిర్మించిన బయోపిక్ ‘అయ్ వతన్ మేరే వతన్’ అమేజాన్‌లో మార్చి 21న విడుదలైంది. -
93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!
ఓ వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా దేహ ధారుడ్యంతో పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఉన్నారు. అతడి శరీరాకృతిని చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. ఇంత అద్భుతమైన ఫిట్నెస్కి గల కారణాలేంటని అధ్యయనం చేసే పనిలో పడ్డారు పరిశోధకులు. ఐరిష్కి చెందిన 93 ఏళ్ల రిచర్డ్ మెర్గాన్ అనే వ్యక్తి చూడటాని 40 ఏళ్ల వ్యక్తిలా చురుగ్గా ఉన్నాడు. పైగా 70 ఏళ్ల వయసులో రోయింగ్(పడవ రేస్)ను ప్రారంభించినప్పటికీ నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచి ఆశ్చర్యపరిచాడు. అతడిని చూస్తే యువకుడి మాదిరిగా మంచి శరీరాకృతితో ఉంటాడు. శాస్త్రవేత్తలు సైతం అతడి హృదయ స్పందన రేటుని చూసి ఆశ్చర్యపోతున్నారు. మోర్గాన్ ఫిట్నెస్ ప్రయాణం, ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై పరిశోధకులు అధ్యయనం చేయడంతో ఒక్కసారిగా అతను వార్తల్లో నిలిచాడు. అంతేగాదు అతని శరీరంలోని 80% కండర ద్రవ్యరాశి, గుండె పనితీరుని ఆశ్చర్యపోతున్నారు. అచ్చం 40 ఏళ్ల వ్యక్తిని పోలి ఉందని చెప్పారు. అతను మనందరికీ ప్రేరణ అని చెబుతున్నారు. అతని జీవన శైలి, ఆహార పద్ధతులు, చేసే వ్యాయమాలు తదితరాలను పరిశీలించింది పరిశోధకుల బృందం. అంతేగాదు అతడి శారీరక పనితీరు, పోషకాహారం తీసుకోవడం తదితరాలను బయో ఎలక్ట్రిక్ ఇంపెడెన్స్ ద్వారా అంచనా వేసింది. ఇక అతను ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డయాక్సైడ్ వదలడం, హృదయ స్పందన రేటు, తదితర వాటిని రోయింగ్ ఎర్గోమీటర్తో కొలిచారు. అందుకు సంబంధించిన అధ్యయనం గురించి గత నెలలో జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీలో ప్రచురితమయ్యింది. ఇక మోర్గాన్ తాను 73 ఏళ్ల వయసులో వ్యాయామం ప్రారంభించానని, ఆ తర్వాత రోయింగ్ క్రీడలో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చానని చెప్పుకొచ్చారు. తనకు వ్యాయామం చేయడంలో ఆనందం ఉందని తెలిశాక ఇక ఆపలేదని, అదే ఈ రోయింగ్ క్రీడో పాల్గొనేలా చేసిందని చెప్పారు మోర్గాన్. వ్యాయామం మంచి ఫిట్నెస్గా ఉండేలా చేయడమే గాక సర్వసాధారణంగా వయసు రీత్యా వచ్చే శరీరంలోని వృద్ధాప్య ప్రభావాలను అరికడుతుందని మోర్గాన్‌పై జరిపిన పరిశోధనలో తేలిందని చెబుతున్నారు పరిశోధకులు. ఇక అతను మంచి ఫిట్‌నెస్‌లో.. వ్యాయామం స్కిప్ చేయకపోవడం, బరువుకి సంబంధించిన వ్యాయామాలు, ప్రోటీన్ ఆహారం తదితరాలు తన రోజూ వారీ జీవశైలిలో ఉండే ప్రాథమిక మూల స్థంభాలని చెప్పారు పరిశోధకులు. ఇంకేందుకు ఆలస్యం వయసుతో సంబంధం లేకుండా చక్కగా మంచి వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా ఉండటమే గాక వృధాప్య ప్రభావం పడకుండా చూసుకోండి. (చదవండి: ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్‌మెంట్‌ని ఫ్రాన్స్ అధ్యక్షుడికి చూపించిన ప్రధాని మోదీ!) -
‘శామ్ అవుట్’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్ వాట్సాప్ చాట్
చాట్ జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్ తొలగింపు వ్యవహారం టెక్ ప్రపంచంలో అలజడి సృష్టించింది. ఈ ఉదంతం మార్క్ జుకర్‌బర్గ్, డ్రూ హ్యూస్టన్లతో సహా 100 మందికి పైగా సిలికాన్ వ్యాలీ సీఈవోలు ఉన్న ప్రైవేటు వాట్సాప్ చాట్ గ్రూప్‌లో హల్చల్ చేసింది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓపెన్ఏఐ సీఈఓ పదవి నుంచి శామ్ ఆల్ట్‌మన్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో ఆల్ట్‌మన్‌ను తిరిగి వెనక్కి తీసుకున్నారు ఆ సంస్థ బోర్డ్ సభ్యులు. అయితే ఆల్ట్‌మన్ అనూహ్య తొలగింపు ఉదంతం.. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, డ్రాప్‌బాక్స్ సీఈవో డ్రూ హ్యూస్టన్‌తో సహా యూఎస్‌లోని పలు అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల సీఈవోలను దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన ఓ కథనం ప్రకారం.. నవంబర్ 17న ఆల్ట్‌మన్‌ను ఓపెన్ఏఐ తొలగించినట్లు వార్తలు వెలువడినప్పుడు, సిలికాన్ వ్యాలీ కంపెనీలకు చెందిన 100 మందికి పైగా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో కూడిన ఈ ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్‌లో ఒక సందేశం వచ్చింది. ఇంతకీ ఏంటది? సీఈవోల వాట్సాప్ గ్రూప్‌లో ఆ రోజు "శామ్ అవుట్" అని ఓ సందేశం వచ్చింది. దీనిపై గ్రూప్ సభ్యులు వెంటనే స్పందించారు. శామ్ ఏమి చేశాడు.. అంటూ రకరకాల ప్రశ్నలు వచ్చాయి. ఉన్నంటుండి తొలగించడానికి శామ్ ఆల్ట్‌మన్ చేసిన తప్పేంటి అనేదానికిపై అనేక ఊహాగానాలు బయలుదేరాయి. సత్య నాదెళ్లకు అర్జెంట్ కాల్! ఓపెన్ఏఐ సంస్థకు అతిపెద్ద పెట్టుబడిదారైన మైక్రోసాఫ్ట్‌లో కూడా దీనిపై అలజడి చలరేగింది. మైక్రోసాఫ్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కెవిన్ స్కాట్‌కి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటి నుంచి కాల్ వచ్చినట్లు వాట్సాప్ చాట్‌లో ఉంది. ఆల్ట్‌మన్‌ను తొలగించినట్లు ఓపెన్ఏఐ బోర్డు ప్రకటించబోతోందని, తానే తాత్కాలిక చీఫ్‌గా ఉండనున్నట్లు ఆ కాల్లో ఆమె స్కాట్‌తో చెప్పినట్లు సందేశంలో పేర్కొన్నారు. దీంతో స్కాట్ వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు అర్జెంట్ కాల్ చేశారట. ఆ సమయంలో ఆయన రెడ్‌మండ్‌లోని మైక్రోసాఫ్ట్ హెడ్‌క్వార్టర్స్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశంలో ఉన్నారు. ఈ ఉదంతం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయిన సత్య నాదెళ్ల తక్షణమే ఓపెన్ఏఐ సీటీవో మీరా మురాటికి ఫోన్ చేసి బోర్డు నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని ఆరా తీసినట్లు వాట్సాప్ సందేశాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆమె నుంచి సమాధానం లేదు. దీంతో ఆయన ఓపెన్ఏఐ ప్రధాన స్వతంత్ర డైరెక్టర్ డీఏంజెలోకి కాల్ చేసి ఏం జరిగిందని అడిగినా కారణం తెలియరాలేదు. అయితే తమతో ఆల్ట్‌మన్ సమన్వయం సక్రమంగా లేదని మాత్రమే బోర్డు చెప్పినట్లు వాట్సాప్ సందేశాల సారాంశం. -
సాయి పల్లవికి పెళ్లి అయిపోయిందా!..క్లారిటీ ఇదే..
-
శిల్పంలా ఉండే శృతి హాసన్ బ్యూటీ సీక్రెట్ ఇదేనా!
కమలహాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనాతి కాలంతో మంచి హిరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి నూటికి నూరు మార్కులు కొట్టేసింది. ఉత్తమ నటి, సైమా వంటి ప్రతిష్టాత్మక అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. చక్కటి ముఖ సౌందర్యంతో చూడచక్కని రూపంలో ఉండే శృతి తన గ్లామర్ కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందట. ఎక్కువగా సహజసిద్ధమైన నూనెలనే వాడతానని చెబుతోంది. తన మృదువైన చర్మం కోసం ఏం చేస్తుందో వెల్లడించింది కూడా. ఇంతకీ ఆమె అందమైన చర్మం వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..అలోవెరా.. బంగాళదుంప.. ఈ రెండే నా బ్యూటీ సీక్రెట్స్! మృదువైన చర్మం కోసం వీలైనప్పుడల్లా అలోవెరా జెల్‌తో ఫేస్ మాస్క్ వేసుకుంటాను. ట్యాన్ లైన్స్ పోగొట్టుకోవడానికి బంగాళదుంప జ్యూస్‌ని మొహానికి అప్లయ్ చేసి.. అది మొత్తం ఆరిపోయాక చన్నీళ్లతో కడిగేసుకుంటే.. ట్యాన్ అంతా పోయి ఈవెన్ టోన్ వచ్చేస్తుంది. (చదవండి: చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే..ఇలా చేయండి!) -
చైనా కంపెనీ సీక్రెట్ ఆపరేషన్.. రహస్యంగా చిప్‌ల తయారీ!
అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీ హువాయి టెక్నాలజీస్ ( Huawei Technologies ) చైనా అంతటా రహస్యంగా సెమీకండక్టర్ తయారీ కేంద్రాలను నిర్మిస్తున్నట్లుగా వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న సెమీకండక్టర్ అసోసియేషన్ హెచ్చరించినట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ తాజాగా నివేదించింది. ఈ చైనీస్ టెక్ దిగ్గజం ఏడాది క్రితమే చిప్‌ల ఉత్పత్తి చేపట్టిందని, ఇందు కోసం ఆ దేశ ప్రభుత్వం నుంచి 30 బిలియన్ డాలర్ల నిధులను సైతం పొందిందని సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెబుతోంది. దేశంలో ఇప్పటికే రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసిన హువాయి మరో మూడు ప్లాంట్లను నిర్మిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. భద్రతాపరమైన సమస్యల కారణంగా 2019లో యూఎస్ వాణిజ్య విభాగం తమ ఎగుమతి నియంత్రణ జాబితాలో హువాయి కంపెనీని చేర్చింది. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెప్పినట్లుగా ఇతర కంపెనీల పేర్లతో హువాయి తయారీ కేంద్రాలను నిర్మిస్తుంటే యూఎస్ ఆంక్షలను అధిగమించి అమెరికన్ చిప్ తయారీ పరికరాలను పరోక్షంగా కొనుగోలు చేస్తుండవచ్చని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ పేర్కొంది. యూఎస్‌లో హువాయి కంపెనీని ట్రేడ్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. దీంతో ఆ కంపెనీకి ఇక్కడి కంపెనీలు విడిభాగాలు, సాంకేతికతను అందించేందుకు వీలు లేదు. సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేయకుండా హువాయి కంపెనీ కట్టడి చేసేందుకు యూఎస్ అధికారులు నియంత్రణలను కఠినతరం చేస్తున్నారు. ఇదీ చదవండి: సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి.. -
వన్నె తరగని నయన తార బ్యూటీ రహస్యం ఇదే..ఆ క్రీమ్ లేకుండా..
దక్షిణాది అగ్రకథనాయికగా ఇప్పటికీ చెలమణి అవుతున్న మళయాళి కుట్టి నయనతార. ఆమె తెలుగు, తమిళ, కన్నడ అగ్రకథనాయకుల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో కుర్రాళ్ల కలల రాణిగా మంచి క్రేజీ స్టార్‌గా వెలుగొందుతోంది. అందంలోనూ, అభినయంలోనూ తనకు తానే సాటి అని పేరుతెచ్చుకుంది. ఆమె డైరెక్టర్ విఘ్నేశ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పైగా ఇద్దరు పిల్లలు(సరోగసి విధానం) తల్లి కూడా. నాలుగు పదుల వయసుకు దగ్గరవ్వుతున్న ఏమాత్రం వన్నెతరగని అందంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె ఇప్పటికీ అందంగా ఉండటం వెనుక దాగున్న రహస్యం ఏంటీ?..ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఇప్పుడూ చూద్దాం. ఆమె ఎక్కువగా ఆయుర్వేదిక్ బ్యూటీ ప్రొడక్ట్స్‌నే ప్రిఫర్ చేస్తుందట. బాడీ డ్రీహైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు ఎక్కువగా మచినీళ్లు తాగుతుందట. అలాగే బయటకు వెళ్లితే కంప్లసరి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటుందట. అస్సలు అది లేకుండా గడప కూడా దాటనని చెబుతున్నారు నయన్. అంతేకాదు మాయిశ్చరైజర్‌ని తప్పనిసరిగా వాడతారు. అది ఆమె చర్మాన్ని అందంగా మృదువుగా ఉండేలా చేస్తుంది. ఆమె ఎప్పుడూ విటమిన్ సీ ఎక్కువగా ఉండే.. పండ్లు, పండ్ల రసాలు ప్రతిరోజూ మర్చిపోకుండా తీసుకుంటుందట. వాటి వల్ల.. ఆమె చర్మం మృదువుగా , అందంగా మెరిసేలా చేయడంలో సహాయం చేస్తుందని చెబుతోంది నయన తార. (చదవండి: కీర్తీ సురేష్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
200 ఏళ్ల నేలమాళిగలోకి దూరిన అమ్మాయిలు.. లోపల ఏముందో చూసి..
ఒక యువతికి తమ ఇంటి కింది భాగంలో ఒక రహస్య గది కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులకు, అధ్యాపకులకు తెలిపింది. దీంతో వీరంతా ఆ గదిలోనికి వెళ్లి, లోపల ఏముందో చూసే ప్రయత్నం చేశారు. ఆ గది 1800 శతాబ్దం నాటిదని గుర్తించారు. ఈ ఉదంతం బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌లో చోటుచేసుకుంది. ది సన్ రిపోర్టును అనుసరించి ఈ నేలమాళిగ 200 ఏళ్ల క్రితం నాటిది. అమ్మాయిలంతా దానిలోనికి వెళ్లి చూడగా వారికి అక్కడ ఒక ఫ్లోర్ కనిపించింది. అక్కడ నాలుగు మూలలా బెంచీలు కనిపించాయి. అలాగే పలు అల్మరాలు కూడా ఉన్నాయి. అది వారికి ఒక స్టోర్ రూమ్ మాదిరిగా కనిపించింది. ఆ యువతి కుటుంబం ఈ ఇంటిలోకి షిష్ట్ అయ్యే సమయంలో వారికి ఈ సంగతి తెలియదు. నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్శిటీ జర్నలిజం విద్యార్థి స్టెఫానీ బెన్నెట్.. కొద్దిపాటి భయాందోళనల వాతావరణం మధ్య తన ఈ నూతన ఆవిష్కరణ ఎలా జరిగిందో మీడియాకు తెలియజేసింది.. ‘అదేమీ పెద్ద గది కాదు. 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు కలిగివుంది. ఈ ఆవిష్కరణ ఎంతో ఆసక్తికరంగా సాగింది. లోపల ఏముందో చూడాలనే ఆసక్తితో తామంతా ఒకేసారి ఆ గదిలోనికి ప్రవేశించాం. అయితే ఆ గదిని ఎందుకు వినియోగించేవారో కనుగొనలేకపోయాం’ అని పేర్కొంది. ఈ యువతుల బృందం ఈ విషయాన్ని స్థానిక పురాతత్వ శాస్త్రవేత్తలకు తెలియజేసింది. వారు వెంటనే గుహను సందర్శించారు. అది రెండు శతాబ్ధాల క్రితం నిర్మితమయినదని తెలిపారు. నాటింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ యాక్టింగ్ ఆర్కియాలజిస్ట్ స్కాట్ లోమాక్స్ మాట్లాడుతూ ఆ గుహ ఒక నేలమాళిగ అని తెలిపారు. దానిపైన భవనం నిర్మితమవడాన్ని గమనిస్తే అది 19వ శతాబ్దం నాటిదిగా తెలుస్తున్నదన్నారు. ఈ నేలమాళిక అనేక పురాతన విశేషాలను తెలియజేస్తుందన్నారు. ఇది కూడా చదవండి: ‘ఆరోపణలతో పెరుగుతున్న ఆదరణ’.. ట్రంప్ మరో వింత వ్యాఖ్యానం! -
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.. కర్లీ హెయిర్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
సినిమాల తోపాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే హిరోయిన్లో ఒకరు అనుపమ పరేమశ్వరన్. ప్రస్తుతం అనుపమ డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో పాటు సైరన్ (తమిళ్) సినిమా తోపాటు ఒక మలయాళ మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. తన కర్లీ హెయిర్‌తో కుర్రకారుకి కునుకు లేకుండా చేసే ఈ మలయాళం భామ తన అందమైన శిరోజాల వెనుక దాగి ఉన్న బ్యూటీ సీక్రేట్ని షేర్ చేసుకుంది. ఈ మేరకు అనుమ మాట్లాడుతూ..ఉంగరాల జుట్టును మేనేజ్ చేయడం చాలా కష్టం కదా.. మరి మీరెలా మేనేజ్ చేస్తుంటారు అని చాలామంది అడుగుతుంటారు నన్ను! నిజమే కర్లీ హెయిర్‌ని మేనేజ్ చేయడం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. సల్ఫేట్ ఫ్రీ షాంపూ వాడతాను. వీలైనప్పుడల్లా స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో తలను మసాజ్ చేసుకుంటాను. గ్లోయింగ్ స్కిన్ విషయానికి వస్తే.. రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడిలో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలిపి ముఖానికి అప్లయ్ చేసి.. సున్నితంగా మసాజ్ చేసుకుంటాను. అలా ఒక పదిహేను నిమిషాలు ఉంచేసి.. ముఖం కడుక్కుంటాను.’ – అనుపమ పరమేశ్వరన్ (చదవండి: ఏజెంట్ బ్యూటీ ధరించిన డ్రస్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే!) -
ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్!
బాలీవుడ్ భామ కృతి సనన్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. దిల్లీకి చెందిన ముద్దుగుమ్మ ఆదిపురుష్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ఆదిపురుష్ జూన్ 16 రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ భామకు నిరాశే ఎదురైంది. అంతకుముందే మహేశ్ బాబు సరసన నేనొక్కడినే చిత్రంలో నటించింది. అంతే కాకుండా ఈ ఏడాది అల వైకుంఠపురములో రీమేక్‌గా వచ్చిన షెహజాదా చిత్రంలో కార్తీక్ ఆర్యన్ సరసన కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఘనపత్ పార్ట్-1లో నటించనుంది. (ఇది చదవండి: 'మేడ్ ఇన్ హెవెన్ 2' ఓటీటీ డేట్ వచ్చేసింది, ఎప్పటినుంచంటే?) తాజాగా కృతి సనన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈనెల 27న తన బర్త్ డే సందర్బంగా ఓ సీక్రెట్‌ను రివీల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదేంటో అభిమానులు గెస్ చేయండి అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఆ వీడియోలో హెచ్ లెటర్‌తో మొదలవుతుందని క్లూ ఇచ్చేసింది భామ. అయితే ఇది చూసిన అభిమానులు బ్యూటీకి సంబంధించి యాడ్ గురించేనా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఎవరా లక్కీ గాయ్.. అంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు ఫ్యాన్స్ ఏకంగా ఎవరినైనా పెళ్లి చేసుకుంటున్నావా?.. లేకపోతే ప్రభాస్ అన్నను పెళ్లి చేసుకోవచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు. కొందరు నెటిజన్స్ అయితే కొత్త మూవీ గురించి అప్డేట్ ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా కృతి సనన్ తన పుట్టిన రోజు అభిమానులకు ఓ సీక్రెట్ రివీల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కృతి సనన్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. (ఇది చదవండి: నిహారికతో విడాకులు.. తొలిసారి పోస్ట్ చేసిన చైతన్య!) I’m gonna be sharing my birthday with someone special! 🥹 I've kept this secret from you guys for too long! It's been a year and I can't wait for you all to see what I've been working on. Any Guesses??#StayTuned pic.twitter.com/MbPzA15hve — Kriti Sanon (@kritisanon) July 26, 2023