కమలహాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనాతి కాలంతో మంచి హిరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి నూటికి నూరు మార్కులు కొట్టేసింది. ఉత్తమ నటి, సైమా వంటి ప్రతిష్టాత్మక అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. చక్కటి ముఖ సౌందర్యంతో చూడచక్కని రూపంలో ఉండే శృతి తన గ్లామర్ కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందట. ఎక్కువగా సహజసిద్ధమైన నూనెలనే వాడతానని చెబుతోంది.
తన మృదువైన చర్మం కోసం ఏం చేస్తుందో వెల్లడించింది కూడా. ఇంతకీ ఆమె అందమైన చర్మం వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..అలోవెరా.. బంగాళదుంప.. ఈ రెండే నా బ్యూటీ సీక్రెట్స్! మృదువైన చర్మం కోసం వీలైనప్పుడల్లా అలోవెరా జెల్‌తో ఫేస్ మాస్క్ వేసుకుంటాను. ట్యాన్ లైన్స్ పోగొట్టుకోవడానికి బంగాళదుంప జ్యూస్‌ని మొహానికి అప్లయ్ చేసి.. అది మొత్తం ఆరిపోయాక చన్నీళ్లతో కడిగేసుకుంటే.. ట్యాన్ అంతా పోయి ఈవెన్ టోన్ వచ్చేస్తుంది.
(చదవండి: చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే..ఇలా చేయండి!)
Comments
Please login to add a commentAdd a comment