సినిమాల తోపాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే హిరోయిన్‌లో ఒకరు అనుపమ పరేమశ్వరన్. ప్రస్తుతం అనుపమ డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో పాటు సైరన్ (తమిళ్) సినిమా తోపాటు ఒక మలయాళ మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. తన కర్లీ హెయిర్‌తో కుర్రకారుకి కునుకు లేకుండా చేసే ఈ మలయాళం భామ తన అందమైన శిరోజాల వెనుక దాగి ఉన్న బ్యూటీ సీక్రేట్‌ని షేర్ చేసుకుంది.
ఈ మేరకు అనుమ మాట్లాడుతూ..ఉంగరాల జుట్టును మేనేజ్ చేయడం చాలా కష్టం కదా.. మరి మీరెలా మేనేజ్ చేస్తుంటారు అని చాలామంది అడుగుతుంటారు నన్ను! నిజమే కర్లీ హెయిర్‌ని మేనేజ్ చేయడం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. సల్ఫేట్ ఫ్రీ షాంపూ వాడతాను. వీలైనప్పుడల్లా స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో తలను మసాజ్ చేసుకుంటాను. గ్లోయింగ్ స్కిన్ విషయానికి వస్తే.. రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడిలో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలిపి ముఖానికి అప్లయ్ చేసి.. సున్నితంగా మసాజ్ చేసుకుంటాను. అలా ఒక పదిహేను నిమిషాలు ఉంచేసి.. ముఖం కడుక్కుంటాను.’
– అనుపమ పరమేశ్వరన్
(చదవండి: ఏజెంట్ బ్యూటీ ధరించిన డ్రస్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment