anupama paramesvaran
-
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.. కర్లీ హెయిర్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
సినిమాల తోపాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే హిరోయిన్లో ఒకరు అనుపమ పరేమశ్వరన్. ప్రస్తుతం అనుపమ డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో పాటు సైరన్ (తమిళ్) సినిమా తోపాటు ఒక మలయాళ మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. తన కర్లీ హెయిర్‌తో కుర్రకారుకి కునుకు లేకుండా చేసే ఈ మలయాళం భామ తన అందమైన శిరోజాల వెనుక దాగి ఉన్న బ్యూటీ సీక్రేట్ని షేర్ చేసుకుంది. ఈ మేరకు అనుమ మాట్లాడుతూ..ఉంగరాల జుట్టును మేనేజ్ చేయడం చాలా కష్టం కదా.. మరి మీరెలా మేనేజ్ చేస్తుంటారు అని చాలామంది అడుగుతుంటారు నన్ను! నిజమే కర్లీ హెయిర్‌ని మేనేజ్ చేయడం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. సల్ఫేట్ ఫ్రీ షాంపూ వాడతాను. వీలైనప్పుడల్లా స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో తలను మసాజ్ చేసుకుంటాను. గ్లోయింగ్ స్కిన్ విషయానికి వస్తే.. రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడిలో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలిపి ముఖానికి అప్లయ్ చేసి.. సున్నితంగా మసాజ్ చేసుకుంటాను. అలా ఒక పదిహేను నిమిషాలు ఉంచేసి.. ముఖం కడుక్కుంటాను.’ – అనుపమ పరమేశ్వరన్ (చదవండి: ఏజెంట్ బ్యూటీ ధరించిన డ్రస్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే!) -
సీక్వెల్లో
నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో 2014లో వచ్చిన థ్రిల్లర్ చిత్రం ‘కార్తికేయ’. లేటెస్ట్గా ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ రెడీ కాబోతోంది. మొదటి భాగంలో స్వాతి, నిఖిల్ జంటగా నటించారు. తాజా సీక్వెల్లో అనుపమా పమేశ్వరన్ కూడా నటిస్తారని తెలిసింది. ‘కార్తికేయ 2’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూఛిబొట్ల నిర్మించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. మొదటి భాగంలో కనిపించిన స్వాతి ఈ సీక్వెల్లోనూ కనిపిస్తారట. అనుపమ పాత్ర కొత్త జాయిన్ అవుతుందని తెలిసింది. మొదటి భాగం ఎక్కడ ముగిసిందో, సీక్వెల్ అక్కడి నుంచి ప్రారంభం కానుంది. గతంలో చందు మొండేటి ‘ప్రేమమ్’లో అనుపమ ఓ హీరోయిన్గా నటించారు. -
నిజాయతీ పోలీస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ‘రైడ్, వీర’ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. ఎ. హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హవీష్ కోనేరు మాట్లాడుతూ–‘‘తమిళంలో హిట్ అయిన ‘రాక్షసన్’ చిత్రాన్ని ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్ చేశాం. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. బెల్లంకొండ శ్రీనివాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ ఈ చిత్రంతో మాటల రచయితగా పరిచయం అవుతున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్. -
రాక్షసుడు రెడీ
‘రాక్షసుడు’ అనగానే రామాయణ, మహాభారతాల్లోని విలన్లే గుర్తుకు వస్తారు. సినిమా వాళ్లకు అయితే గతంలో చిరంజీవి హీరోగా నటించిన సూపర్‌హిట్ సినిమా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మరోసారి అదే టైటిల్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. ఏ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది. హీరో హవీశ్ ప్రొడక్షన్లో రమేశ్ వర్మ దర్శకత్వం వíß ంచారు. చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా ప్రసుత్తం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 18న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత కోనేరు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఫిబ్రవరి 21న ప్రారంభమైన మా ‘రాక్షసుడు’ చిత్రం సింగిల్ షెడ్యూల్లో 85రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడే సినిమా రష్ చూశాను. అద్భుతంగా ఉంది. సినిమా మొదలు పెట్టిన రోజు నుండే ఓ మంచి సినిమా తీస్తున్నామనే ఫీలింగ్ ఉండేది. ఈ రోజు రష్ చూశాక బ్లాక్‌బస్టర్ సినిమా తీశాం అని నమ్మకంగా ఉంది’’ అన్నారు. రమేశ్‌వర్మ మాట్లాడుతూ– ‘‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత సత్యనారాయణగారికి కృతజ్ఞతలు. మంచి టీమ్ కుదరడంతో అనుకున్న ప్రకారం సినిమాను ముగించగలిగాం’’ అన్నారు. -
స్క్రీన్ టెస్ట్
అబ్బాయి అవ్వగా మారాలా? ఏ అవకరం లేని వ్యక్తి అవిటివాడిగా కనిపించాలా? మంచి అందగాడు గూని ఉన్న వ్యక్తిగా అగుపించాలా? సిల్వర్ స్క్రీన్‌పై స్లిమ్‌గా కనిపించాల్సిన హీరోయిన్ బొద్దుగా కనిపించాలా? తెల్లగా ఉన్నవాళ్లు నల్లగా కలరింగ్ ఇవ్వాలా? సినిమాకి ఏదైనా సాధ్యమే. ఇప్పటివరకూ అలా విభిన్న పాత్రల్లో కనిపించిన కొందరు స్టార్స్‌తో ఈ వారం స్పెషల్. 1. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన సంచలన చిత్రం ‘విచిత్ర సోదరులు’. ఆ చిత్రంలోని ఓ పాత్రలో మరుగుజ్జుగా నటించారు కమల్. అలా మరుగుజ్జుగా కనపడటానికి ఆయనకు ఎన్నో నెంబర్ షూ వాడారో తెలుసా? (అవి స్పెషల్‌గా తయారు చేశారు. ఆ షూ సైజు ప్రపంచంలో ఎక్కడా దొరకదు ఎ) 10 బి) 18 సి) 12 డి) 14 2. ‘కలిసి ఉంటే కలదు సుఖం’లో యన్టీఆర్ అవిటివాడిగా నటించారు. తాపి చాణక్య దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) ఘంటసాల బి) రాజన్ నాగేంద్ర సి) మాస్టర్ వేణు డి) ఎస్. రాజేశ్వరరావు 3. ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన చిత్రం ‘లడ్డూబాబు’. దోమకాటు వల్ల అతని శరీర బరువు 50 కిలోలు పెరిగిపోతుంది. రవిబాబు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నరేశ్ సరసన నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) పూర్ణ బి) ఫర్జానా సి) ఈషా రెబ్బా డి) భూమికాచావ్లా 4. ఇప్పటివరకూ దాదాపు గ్లామరస్ రోల్స్‌లో కనిపించిన నయనతార ఏ చిత్రంలో నల్లని మేకప్‌తో కనిపించారో చెప్పుకోండి? ఎ) ఐరా బి) రాజా–రాణి సి) మాయ డి) డోరా 5. రామ్‌చరణ్ పల్లెటూరి అమాయకునిగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఆ చిత్రంలో ఆయన సౌండ్ ఇంజనీర్ (చెవిటివానిగా)లాగా నటించి మెప్పిం చారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో రామ్‌చరణ్ అన్న పాత్రలో నటించిన నటుడెవరో గుర్తుందా? ఎ) సందీప్ కిషన్ బి) అరుణ్ విజయ్ సి) నందు డి) ఆది పినిశెట్టి 6. శ్రీదేవి హీరోయిన్గా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘పదహారేళ్ల వయసు’. ఆ చిత్రంలో హీరో వికలాంగుడు. తెలుగులో ఆ పాత్రను చంద్రమోహన్ చేశారు. అదే పాత్రను తమిళంలో ఎవరు చేశారో తెలుసా? ఎ) కమల్‌హాసన్ బి) రజనీకాంత్ సి) పార్తిబన్ డి) శరత్‌కుమార్ 7. వైవిధ్యమైన పాత్రలు చేసే విక్రమ్ ‘కాశి’ చిత్రంలో గుడ్డివానిగా, ‘శివపుత్రుడు’ చిత్రంలో మతి స్థిమితం లేని వ్యక్తిగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ‘ఐ’ చిత్రంలో గూనివానిగా మారి కురూపిగా కనిపించారు. ఆ కురూపి పాత్ర కోసం ఆయన ఎన్ని కిలోల బరువు తగ్గారో తెలుసా? (ఆ టైమ్‌లో ఆయన బరువు 49 కిలోలు) ఎ) 45 బి) 25 సి) 35 డి) 42 8. ‘ప్రేమిస్తే’ చిత్రవిజయంతో ఆ చిత్రకథానాయకుడు భరత్ ‘ప్రేమిస్తే’ భరత్‌గా మారారు. ఆ చిత్రంలో అతను పిచ్చివానిగా చేసిన పాత్రతో మంచి నటునిగా పేరు సంపాదించాడు. ఆ సినిమాలోని ‘జన్మ నీదేలే, మరుజన్మ నీదేలే జతను విడిచావో, చితికి పోతాలే’ అనే సూపర్‌హిట్ పాట రచయిత ఎవరో కనుక్కోండి? ఎ) అనంత శ్రీరామ్ బి) వెన్నెలకంటి సి) వేటూరి డి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి 9. సావిత్రి నిజజీవిత పాత్రతో తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. ఆ చిత్రంలోని 1980ల నాటి జర్నలిస్ట్ పాత్రలో నటించిన నటి ఎవరో గుర్తున్నారా? ఆ చిత్రంలో ఆమె నత్తి పాత్రలో నటించారు. ఎవరామె? ఎ) కీర్తీ సురేశ్ బి) అంజలి సి) సమంత డి) త్రిష 10. నాని కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. అందులో మతిమరుపు పాత్రలో నాని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు . ఆ చిత్రంలో ఆయన సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) లావణ్యా త్రిపాఠి బి) అనుపమా పరమేశ్వరన్ సి) సాయిపల్లవి డి) నివేదా థామస్ 11. శుభ్రంగా ఉండాలి, కానీ అతి శుభ్రం వల్ల అనేక ప్రమాదాలు ఉంటాయి. ఇదే కాన్సెప్ట్‌తో దర్శకుడు మారుతి ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రంలో హీరో ఎవరో కనుక్కోండి? ఎ) విజయ్ దేవరకొండ బి) శర్వానంద్ సి) నాని డి) మంచు విష్ణు 12. హీరో బాలకృష్ణ కురూపిగా నటించిన చిత్రం ‘భైరవద్వీపం’. ఆ చిత్రంలోని ఆయన నటనకు చాలా మంచి పేరొచ్చింది. ఆ చిత్రదర్శకుడు ఎవరో తెలుసా? ఎ) దాసరి నారాయణరావు బి) కోడి రామకృష్ణ సి) సింగీతం శ్రీనివాసరావు డి) రవిరాజా పినిశెట్టి 13 వరుసగా నాలుగు విజయవంతమైన చిత్రాలు ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి ఇప్పుడు మహేశ్‌బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆయన తీసిన మూడో సినిమాలో హీరో పూర్తిగా అంధుడు. ఆ పాత్రలో నటించిన హీరో ఎవరు? ఎ) వెంకటేశ్ బి) రవితేజ సి) కళ్యాణ్‌రామ్ డి) సాయిధరమ్ తేజ్ 14. ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా, కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా’ అని ‘ప్రేమించు’ చిత్రంలో హీరోయిన్ లయ పాడుతుంది. లయ ఆ చిత్రంలో అంధురాలిగా నటించింది. ఆ పాట చాలా పెద్ద హిట్. ఆ పాటకు సంగీతాన్ని అందించిందెవరో తెలుసా? ఎ) కల్యాణీ మాలిక్ బి) యం.యం. శ్రీలేఖ సి) కోటి డి) రాజ్ 15. బాలీవుడ్ చిత్రం ‘బర్ఫీ’లో హీరో రణ్‌బీర్ కపూర్ చెవిటి, మూగ. ఆ సినిమాలోని హీరోయిన్ మతి స్థిమితం లేని పాత్రలో నటించారు. ఆ హీరోయిన్ పేరేంటి? ఎ) అనుష్కా శర్మ బి) ఇలియానా సి) కంగనా రనౌత్ డి) ప్రియాంకా చోప్రా 16. శోభన్‌బాబుకి ఆంధ్రుల అందగాడు అని పేరు. కానీ ‘చెల్లెలి కాపురం’ సినిమాలో శోభన్‌బాబు అంద విహీనమైన పాత్రలో కనిపిస్తారు. ఆ సినిమా పెద్ద హిట్. ఆ చిత్ర దర్శకుడెవరో తెలుసా? ఎ) వి. మధుసూదన్ రావు బి) కె. విశ్వనాథ్ సి) ఆదుర్తి సుబ్బారావు డి) పి.సి. రెడ్డి 17. హీరో సూర్య వెరైటీ పాత్రలకు పెట్టింది పేరు. ఆయన నటించిన ఓ చిత్రంలో ఏ విషయాన్నైనా ఎక్కువసేపు గుర్తు పెట్టుకోలేడు. అందుకే ఏ విషయాన్నైనా తన కెమెరాలో ఫొటో తీసుకొని గుర్తు పెట్టుకుంటాడు. ఆ చిత్రంలో నయనతార ఓ హీరోయిన్ కాగా మరో హీరోయిన్ ఎవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) తమన్నా బి) జ్యోతిక సి) సదా డి) ఆసిన్ 18. హీరో రాజేంద్రప్రసాద్ ఓ చిత్రంలో ఎత్తు పళ్లతో, సోడా బుడ్డి అద్దాలు పెట్టుకుని అంద వికారమైన పాత్రలో నటించారు. ఈ సినిమా పేరేంటో తెలుసా? ఎ) సుందరాంగుడు బి) అందగాడు సి) మాయలోడు డి) కొబ్బరిబోండం 19. తమిళ దర్శకడు బాల దర్శకత్వం వహించే సినిమాల్లోని హీరోలు రెగ్యులర్ హీరోల్లా ఉండరు. ఆయన ప్రతి సినిమాలో హీరోల్ని రకరకాలుగా ప్రెజెంట్ చేస్తారు. ఓ చిత్రంలో హీరో సినిమా అంతా మెల్ల కన్నుతో ఉండేట్లు చేశారు. ఆ సినిమా పేరు ‘వాడు–వీడు’. మెల్ల కన్ను పాత్రలో చేసిన ఆ హీరో ఎవరు? ఎ) ఆర్య బి) విశాల్ సి) కార్తీ డి) విక్రమ్ 20. చిరంజీవి హీరోగా నటించిన ‘ఆపద్భాందవుడు’ చిత్రంలో హీరోయిన్‌కి పిచ్చెక్కుతుంది. ఆమె మెంటల్ హాస్పిటల్లో ఉందని అక్కడికి వెళ్లడానికి చిరంజీవి కూడా పిచ్చివాడిగా నటిస్తాడు. పిచ్చి అమ్మాయిగా నటించిన ఆ బాలీవుడ్ భామ ఎవరు? ఎ) మీనాక్షీ శేషాద్రి బి) సోనాలీ బింద్రే సి) సమీరా రెడ్డి డి) నగ్మా మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) సి 3) డి 4) ఎ 5) డి 6) ఎ 7) బి 8) సి 9) సి 10) ఎ 11) బి 12) సి 13) బి 14)బి 15) డి 16) బి 17) డి 18) బి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
రామ్‌చరణ్ సినిమాకి బై బై?
ఇప్పటివరకూ రామ్‌చరణ్ సరసన సమంత నటించలేదు. ఈ ఇద్దరి కాంబినే షన్ అంటే కాస్త ఆసక్తిగానే ఉంటుంది. అందుకే సుకుమార్ దర్శకత్వంలో చరణ్ హీరోగా రూపొందనున్న సినిమాలో సమంతను నాయికగా తీసుకున్నారని వినగానే ‘ఫ్రెష్ పెయిర్’ అని చాలామంది అనుకున్నారు. అయితే ఈ ఫ్రెష్ జోడీ తెరపై కనిపించే ఛాన్స్ లేదని ఫిలింనగర్ అంటోంది. ఈ చిత్రం నుంచి సమంత తప్పుకున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. ఒకవేళ అదే నిజమైతే కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ముందు అనుపమా పరమేశ్వరన్‌ని నాయికగా తీసుకుని, ఆ తర్వాత ఆమెను వద్దనుకున్నారు. ఇప్పుడు సమంత తప్పుకున్నారని వార్త వచ్చింది. మరి.. ఈ ప్లేస్‌ని ఎవరు రీప్లేస్ చేస్తారో? లేక సీన్లో సమంతే ఉంటారో? -
ప్రెట్టీ కుట్టి
‘హలో...’ ‘కేరళ ఎక్కడ ఉంది?’ ‘కనపడటంలేదు.. కొంచెం బైనాక్యులర్స్ తీసుకు రండి!’ ‘అదిగో అక్కడ చిన్నగా ఉందే... అదే కేరళ.’ ‘కేరళ అక్కడెక్కడో కింద ఉంది కానీ... అక్కడి హీరోయిన్లు చూశారా... ఇక్కడ ఎంత ఎత్తుకి ఎదిగారో! పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, నాగచైతన్య... ఇలా స్టార్ల పక్కన నటిస్తున్నారు. ఈ ప్రెట్టీ కుట్టీలు చూడ్డానికి బ్యూటీగానే కాదు.. యాక్టింగ్‌తో కూడా మేజిక్ చేస్తున్నారు.’ ఆలస్యమే అమృతం! ‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు పెద్దలు. అలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందని ఈ సామెతకు అర్థం. కానీ, నివేదా థామస్ ప్రయాణం చూస్తే అలస్యమే అమృతమైందని చెప్పాలేమో! ‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా అప్పట్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ఆ సినిమా చిత్రీకరణ ఆలస్యం కావడంతో నాని ‘జెంటిల్మన్’తో తెలుగు తెరకు పరిచయమయ్యారామె. అప్పటికే, తమిళంలో విజయ్ ‘జిల్లా’, కమల్‌హాసన్ ‘పాపనాశం’ చిత్రాల్లో చేసిన కీలక పాత్రలతో నటిగా నివేదకు మంచి పేరొచ్చింది. తెలుగులో తొలి సినిమా ‘జెంటిల్మన్’తో ఇక్కడి ప్రేక్షకులు, చలనచిత్ర ప్రముఖులను ఆకట్టుకున్నారు. అందం, అభినయం.. రెండిటిలోనూ నివేదకు మంచి మార్కులు పడ్డాయి. ‘జెంటిల్మన్’ తర్వాత నానీకి జంటగా మరోసారి నటిస్తున్నారీ భామ. శివ నిర్వాణని దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రంలో నాని, నివేద, ఆది పినిశెట్టి నటిస్తున్నారు. స్టార్స్ లిస్ట్‌లో... సమంత వంటి స్టార్ హీరోయిన్ సినిమాలో ఉన్నప్పుడు... అందులోనూ ఆమె పాత్ర చుట్టూ నడిచే ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అయినప్పుడు... అందులో సెకండ్ హీరోయిన్గా నటించిన అమ్మాయికి అరుదుగా గుర్తింపు లభిస్తుంది. కానీ, ‘అ.. ఆ’ ప్రచార చిత్రాల్లో అనుపమా పరమేశ్వరన్ చెప్పిన ‘రావణాసురుడి వాళ్లావిడ కూడా వాళ్ల ఆయన్ను పవన్‌కల్యాణ్ అనే అనుకుంటుంది’ అనే డైలాగ్ ఆమెకు పాపులారిటీ తీసుకొచ్చింది. ‘అ.. ఆ’లో కనిపించినంత సేపూ అందమైన నటనతో ఆకట్టుకున్న అనుపమ, తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. అసలు మలయాళంలో అనుపమ హీరోయిన్గా పరిచయమైన ‘ప్రేమమ్’ పెద్ద హిట్. ఆ చిత్రం తెలుగు రీమేక్‌లో మాతృకలో చేసిన పాత్ర చేశారు. అయితే.. అనుపమ చేసిన ‘అ.. ఆ’, ‘ప్రేమమ్’ రెండూ మల్టీ హీరోయిన్ చిత్రాలే. త్వరలో సోలో హీరోయిన్గా సందడి చేయనున్నారు. శర్వానంద్ సరసన ఆమె నటించిన ‘శతమానం భవతి’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఇది కాకుండా అనుపమ తాజాగా ఓ బంపర్ ఆఫర్ దక్కించుకున్నారు. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించనున్న చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌ను నాయికగా తీసుకున్నారని సమాచారం. మెల్లిగా అనుపమ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోతున్నారు. తక్కువ టైమ్‌లో కీర్తి తెలుగు తెరపై కీర్తీ సురేశ్ అడుగుపెట్టి సరిగ్గా సంవత్సరం అవుతుంది. గత ఏడాది జనవరి 1న విడుదలైన రామ్ ‘నేను – శైలజ’తో ఈ మలయాళ ముద్దుగుమ్మ మన తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ చిత్రం చూసిన వాళ్లంతా... మన పక్కింటి అమ్మాయిలా భలే నటించిందీ హీరోయిన్ అన్నారు. ఆవేదన, ఆనందం, అలజడి.. ఏదైనా మనసులోనే దాచుకునే శైలజ పాత్రలో కీర్తీ సురేశ్ భావోద్వేగాలు పండించిన తీరు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘నేను –శైలజ’ తర్వాత తమిళ అనువాద చిత్రాలు ‘రైల్’, ‘రెమో’లతో తెలుగు తెరపై కనిపించారు తప్ప... కీర్తీ సురేశ్ స్ట్రయిట్ తెలుగు చిత్రంతో మన ముందుకు రాలేదు. కానీ, ఆమెకు మంచి ఛాన్సులు వచ్చాయి. హీరో నానీకి జోడీగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఆమె నటించిన ‘నేను లోకల్’ ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఇది కాకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించనున్న సినిమాలో ఆయనకు జోడీగా నటించే బంపర్ ఆఫర్ కొట్టేశారు. మరోవైపు తమిళంలోనూ విజయ్, సూర్య వంటి స్టార్ల సరసన నటిస్తున్నారు. కళ్లు మూసి తెరిచే లోపే ‘కళ్లు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే...’ – ‘మజ్ను’ చిత్రంలో హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్‌ను చూసి ప్రేమలో పడిన హీరో నాని పాడిన పాట ఇది. ఈ అమ్మాయి నవ్వు, నటనకు ఫిదా అయిన యువత కూడా థియేటర్ బయటకొచ్చిన తర్వాత ఈ పాటే పాడారు. ‘మజ్ను’ హిట్‌తో అనూకి సూపర్ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. గోపీచంద్ ‘ఆక్సిజన్’, రాజ్‌తరుణ్ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాలను ‘మజ్ను’లో నటిస్తున్నప్పుడే అంగీకరించారామె. ఈ రెండూ వినూత్న కథలతో రూపొందుతోన్న చిత్రాలే. ఇక, ‘మజ్ను’ విడుదల తర్వాత ఆమెకు వచ్చిన ఛాన్స్ స్టార్ హీరోయిన్స్ రేసులోకి తీసుకువెళ్లింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించనున్న ప్రేమకథా చిత్రంలో ఓ నాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ఎంపికయ్యారు. ఈ ఛాన్స్ ఆమెను కూడా సర్ప్రైజ్ చేసింది. ‘‘ఓ ఐదేళ్ల తర్వాత ఎప్పుడో పవన్‌కల్యాణ్ పక్కన నటించే ఛాన్స్ వస్తుందనుకున్నా! తెలుగు తెరకు పరిచయమైన ఏడాదిలోపే వస్తుందనుకోలేదు’’ అన్నారు అను. ఈ మూడు చిత్రాలూ ఈ ఏడాదే విడుదల కానున్నాయి. ఈలోపు అనూ ఇమ్మాన్యుయేల్ ఇంకెన్ని ఛాన్సులు అందుకుంటారో! మలయాళీ హీరోయిన్లు తెలుగు తెరపై రాణించడం ఇదేమీ కొత్త కాదు. ఆల్రెడీ అసిన్, మమతా మోహన్‌దాస్, మీరా జాస్మిన్, నయనతార, నిత్యామీనన్ తదితర కేరళ కుట్టీలు మనవాళ్లను తెగ మెప్పించిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్, నివేదా థామస్, కీర్తీ సురేశ్, అనుపమా పరమేశ్వరన్‌లు ఒక్క ఏడాదిలో తెలుగు తెరపై తారాజువ్వలా దూసుకెళుతుండడం చెప్పుకోదగ్గ విశేషం. -
ప్రేమకూ... పెళ్లికీ మధ్య!
సిటీలో ఉంటున్న అమ్మాయి సెలవులకు పల్లెటూరికి వస్తుంది. వరసకు బావయ్యే అబ్బాయితో ప్రేమలో పడింది. ఈ జంటను దేవతలందరూ ‘శతమానం భవతి’ అని దీవించారు. మరి, కుటుంబ పెద్దల దీవెనల కోసం ఏం చేశారు? ప్రేమకూ, పెళ్లికీ మధ్య ఏమైంది? - శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శతమానం భవతి’ చిత్రకథ చూచాయగా ఇదేనట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ నేడు మొదలైంది. నవంబర్ నెలాఖరు వరకూ జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తి కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘తాతా మనవళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న అందమైన కుటుంబ కథా చిత్రమిది. హైదరాబాద్, ఉభయ గోదావరి జిల్లాల్లో చిత్రీకరణ జరుపుతున్నాం. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ప్రకాశ్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రధారులు.