బెల్లంకొండ సాయి శ్రీనివాస్
‘రాక్షసుడు’ అనగానే రామాయణ, మహాభారతాల్లోని విలన్లే గుర్తుకు వస్తారు. సినిమా వాళ్లకు అయితే గతంలో చిరంజీవి హీరోగా నటించిన సూపర్‌హిట్ సినిమా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మరోసారి అదే టైటిల్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. ఏ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది. హీరో హవీశ్ ప్రొడక్షన్‌లో రమేశ్ వర్మ దర్శకత్వం వíß ంచారు. చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా ప్రసుత్తం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 18న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత కోనేరు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఫిబ్రవరి 21న ప్రారంభమైన మా ‘రాక్షసుడు’ చిత్రం సింగిల్ షెడ్యూల్‌లో 85రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడే సినిమా రష్ చూశాను. అద్భుతంగా ఉంది. సినిమా మొదలు పెట్టిన రోజు నుండే ఓ మంచి సినిమా తీస్తున్నామనే ఫీలింగ్ ఉండేది. ఈ రోజు రష్ చూశాక బ్లాక్‌బస్టర్ సినిమా తీశాం అని నమ్మకంగా ఉంది’’ అన్నారు. రమేశ్‌వర్మ మాట్లాడుతూ– ‘‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత సత్యనారాయణగారికి కృతజ్ఞతలు. మంచి టీమ్ కుదరడంతో అనుకున్న ప్రకారం సినిమాను ముగించగలిగాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment