Rakshasudu
-
ప్రముఖ నిర్మాత డిల్లీ బాబు మృతి
కోలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు (50) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్‌లో అనేక విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. ఢిల్లీ బాబు కుటుంబ సభ్యులు చెబుతున్న ప్రకారం ఈ తెల్లవారుజామున 12.30 గంటలకు మరణించారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు, సెప్టెంబర్ 9న జరుగుతాయని ప్రకటించారు. అస్వస్థతకు గురైన ఢిల్లీ బాబు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని సమాచారం. ఆయన ఆకస్మిక మరణం తమిళ చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అని చెప్పవచ్చు.యాక్సెస్ ఫిల్మ్ బ్యానర్ పై తమిళంలో రాక్షసన్, ఓ మై గాడ్, బ్యాచిలర్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు తెలుగులో రీమేక్‌తో పాటు డబ్ కూడా అయ్యాయి. ముఖ్యంగా మిరల్, మరకతమణి, రాక్షసన్ (రాక్షసుడు) వంటి చిత్రాలు తెలుగువారిని బాగా మెప్పించాయి. ముఖ్యంగా ఆయన కొత్తవారితో సినిమాలు తెరకెక్కిస్తారు. అందువల్ల చిత్రపరిశ్రమలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. -
శ్రీకృష్ణుడి చేతిలో హతమైన రాక్షసుల గురించి తెలుసా?
ద్వాపరయుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణం మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. దేవకీ వసుదేవులకు అష్టమ(8వ) సంతానంగా జన్మించిన వాడే శ్రీకృష్ణుడు. అలాగే మహావిష్టువు ఎనిమిదో అవతారంగా కృష్ణావతారమని, ఇది చాలా విశిష్టమైందని భక్తుల విశ్వాసం.కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే ‘కృష్ణాష్టమి’గా జరుపు కుంటారు. అయితే కృష్ణావతారంలో దుష్టశిక్షణ, శిష్ట రక్షణార్థంఅనేకమందిరాక్షసులను తుదముట్టించాడు. ఆ వివరాలు ఒకసారి చూద్దామా. పూతన: మాయారూపంలో చిన్ని కృష్ణుడికి చనుపాలిచ్చి చంపాలని చూసిన రాక్షసి. ఇది గమనించిన కృష్ణుడి రెండు గుక్కలలో ఆమె శరీరంలోని సత్తువంతా పీల్చేసి, చివరకు ప్రాణాలను కూడా హరించాడు.శకటాసురుడు,తృణావర్త (సుడిగాలి): కంసుడు అనుచరులైన వీరుకృష్ణుడిని వధించాలని, అపహరించాలని భావించి ఆయనచేతిలోనే ప్రాణాలు కోల్పోయి, విముక్తి పొందిన రాక్షసులువత్సాసుర వధ: రేపల్లెనెంచి బృందావనానికి చేరిన కృష్ణుడు స్నేహితులతో ఆడుకుంటుండగా కోడె గిత్త రూపంలో వచ్చాడు వత్సాసురుడు. దీన్ని పసిగట్టిన కృష్ణయ్య దాన్ని ఎత్తి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపాడుబకాసురవధ: కంసుడు కృష్ణుడిని చంపడానికి పూతన సోదరుడు బకాసురుడు. పక్షిరూపంలో ఉన్న అతడిని కృష్ణుడు వధించాడు.శ్రీకృష్ణుడు గోపబాలురు యమునాతీరమున ఆడుకుటుండుగా కంసప్రేరితుడైన బకాసురుని జ్యేష్ఠపుత్రుడు అఘాసురుడు పెద్ద కొండచిలువ రూపంలో వచ్చి శ్రీకృష్ణుడిచేతిలో హతమయ్యాడు. అలాగే అరిష్టాసుర, ఇంకా గోవుల సమాజానికి ఒక పీడకలగా మారిన కాళియ మర్ధనంచేసి అక్కడి ప్రజలకు విముక్తి కల్పించాడు. కువలయపీడ- శ్రీ కృష్ణుడు మధురలో మదగజం రూపంలో ఉన్న ఏనుగు రాక్షసుడిని శ్రీ కృష్ణుడు చంపాడు.కంసుడు పంపించిన మరో రాక్షసుడు అశ్వం రూపంలో ఉన్న కేశికను కూడా వధించాడు కృష్ణుడు. పౌండ్రక వాసుదేవుడి వధ : అసూయతో యుద్ధం ప్రకటించి, శ్రీకృష్ణుడు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. కానీ వైరభక్తితో కృష్ణుని లో కలిసిపోయాడు.శిశుపాలుడి వధ: శిశుపాలుడు తల్లి సాత్యతికిచ్చిన మాట ప్రకారం అతని నూరు తప్పులను కాచిన శ్రీకృష్ణుడు,అతని దూషణలు శృతి మించడంతో సుదర్శన చక్రాన్ని ఉపయోగించి శిశుపాలుడుని హత మార్చాడు. కంస చాణూర మర్ధన: తండ్రిశాపంతో అసురులుగా పుట్టిన చాణూరుడు, ముష్టికుడు, కళలుడు, తోశాలకుడు, కూటుడు , కంసుని కొలువులో చేరి, చివరికి నల్లనయ్య చేతిలో శాప విముక్తి పొందారు. ఇంకా వెయ్యి బాహువులు కలిగిన బాణాసురుడు కూడా నల్లనయ్య చేతిలో హతమయ్యాడు. అనుచరుల మరణంతో, యుద్ధానికి కాలుదువ్విన మామ కంసుడిని అతి సునాయాసంగా కడతేర్చాడు కన్నయ్య. భౌమాసుర (నరకాసుర)- నరకాసురుడు శ్రీకృష్ణుని 16వేల భార్యలను బంధించాడు, చివరికి కృష్ణుడి చేతిలో చనిపోయాడు. -
హిట్ సినిమాకు సీక్వెల్.. ఈసారి ఏకంగా ఫాంటసీ కథతో!
విష్ణు విశాల్, దర్శకుడు రామ్ కుమార్ కాంబోలో వచ్చిన హిట్ సినిమా 'రాక్షసన్'. 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలన విజయాన్ని సాధించింది. తెలుగులోనూ 'రాక్షసుడు' పేరుతో రీమేక్ అయి, హిట్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ రెడీ చేస్తున్నారట.(ఇదీ చదవండి: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)'రాక్షసన్' సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీతో తీయగా.. ఇప్పుడు దీని సీక్వెల్‌ని ఫాంటసీ జానర్లో తీస్తారట. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. విష్ణు విశాల్ రీసెంట్గా ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్'తో వచ్చాడు. కానీ ఇది ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఇతడికి 'రాక్షసన్ 2' హిట్ కావడం చాలా కీలకం. మరి ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: నా భర్తతో హోటల్ రూమ్‌లో ఆ హీరోయిన్.. అందుకే విడాకులు: శ్రీదేవి) -
ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. 10వ తరగతిలోనే ఆ పొరపాటు చేయడంతో..
కోలీవుడ్‌లో కథానాయకిగా ఎదుగుతున్న నటి అమ్ము అభిరామి. ఈమె తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. భైరవ, ఎన్ ఆవిడ చెరుప్పు కానోమ్, ధీరన్ అధికారం ఒండ్రు వంటి చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన అమ్ము అభిరామి రాక్షసన్ చిత్రంలో పాఠశాల విద్యార్థినిగా నటించి గుర్తింపు పొందారు. ఇదే సినిమా తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు పేరుతో హిట్ కొట్టారు. ఆ తరువాత ధనుష్ కథానాయకుడిగా నటించిన అసురన్ చిత్రంలో ఆయన మరదలుగా నటించారు. తెలుగులో వెంకటేశ్ నారప్ప చిత్రంలో కన్నమ్మ పాత్రలో మెప్పించారు. సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌లో వెంకటేశ్ ప్రేయసిగా అభిరామి మంచి గుర్తింపు పొందింది. అదేవిధంగా కుక్ విత్ కోమాలి టీవీ కార్యక్రమంలో పాల్గొని పాపులర్ అయిన అమ్ము అభిరామి పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె తాజాగా నలుగురు కథానాయికల్లో ఒకరిగా నటించిన కన్నగి చిత్రం ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలతో ప్రదర్శింపబడుతోంది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో ప్రేమ గురించి పేర్కొంటూ తాను స్కూల్లో 10వ తరగతి చదువుతున్నప్పుడే సహ విద్యార్థి ప్రేమలో పడ్డానని, ఆ విషయం ఇంటిలో తెలిసి దొరికి పోయానని చెప్పారు. అది వన్ సైడ్ లవ్వే అయినా దాచుకోలేక ఇంటిలో దొరికిపోయి దెబ్బలు తిన్నానని చెప్పారు. ఆ సంఘటనను ఎప్పటికీ మరచిపోలేనన్నారు. ఎలాంటి భర్త రావాలని కోరుకుంటున్నారనే ప్రశ్నకు తనను అర్థం చేసుకునే వాడు అయితే చాలు అని బదులిచ్చారు. అది ప్రేమ వివాహం అయినా సరే పెద్దలు నిశ్చయించిన వివాహం అయినా సరే అని అమ్ము అభిరామి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈమె చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. గోలీ సోడా 1.5 అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించారు. View this post on Instagram A post shared by Ammu_Abhirami (@abhirami_official) -
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కి హ్యాపీ బర్త్ డే..!!
-
ఆ చిన్న చిత్రానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారా!
గతంలో సినిమాకి 50 కోట్లు అంటే భారీ బడ్జెట్ అనుకుని ఖర్చుకు కాస్త ఆలోచించే నిర్మాతలు, బాహుబలి చిత్రం బాక్స్‌ఫీస్ ఫలితాలు వాళ్ల లెక్కలన్నీ మార్చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం చిన్న సినిమాలు కూడా కథ డిమాండ్ చేస్తే భారీగానే ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు వెనకాడడం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్, రమేష్ వర్మ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘రాక్షసుడు’ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ హిట్ మూవీకి సీక్వెల్‌గా రాక్షసుడు 2 రాబోతున్నట్లు ప్రకటించిన ఆ చిత్ర నిర్మాత అందుకు భారీగా ఖర్చు పెట్టనున్నట్లు ప్రకటించాడు. ‘రాక్షసుడు’ సినిమా విడుదలై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ చిత్రం సీక్వెల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే సెకండ్ పార్ట్ మరింత థ్రిల్లింగ్‌గా ఉంటుందన్నారు. అలానే ఇందులో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కూడా జత చేస్తున్నామని, హాలీవుడ్ స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. కాగా ఈ హిట్ మూవీకి సీక్వెల్లో హీరో ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు. ఇందుకోసం సుమారు 100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించామని, సినిమా పూర్తిగా లండన్‌లో షూటింగ్ జరపనున్నట్లు చెప్పారు. ఇటీవల ‘హోల్డ్ యువర్ బ్రీత్’ అంటూ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేసి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచారు. ఎ స్టూడియోస్ సమర్పణలో హవిష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ‘రాక్షసుడు 2’ రూపొందనుంది. గిబ్రాన్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. కాగా ఈ చిత్ర నిర్మాత ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో ‘ఖిలాడీ’ చేస్తున్నాడు. -
ఎవరా స్టార్ హీరో? సస్పెన్స్ వీడేదెన్నడు?
-
ఎవరా స్టార్ హీరో? సస్పెన్స్ వీడేదెన్నడు?
అల్లుడు శీను సినిమాతో ప్రేక్షకులందరికీ దగ్గరైపోదామనుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా బాగానే ఆడటంతో తొలి సినిమాతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడని ప్రశంసించారంతా! తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడా? అని అందరూ వెయిట్ చేశారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత స్పీడున్నోడు సినిమాతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాడు. దీంతో ప్రేమ కథలను పక్కన పెట్టి సస్పెన్స్ థ్రిల్లర్ రూట్ ఎంచుకున్నాడు. అలా రమేశ్ వర్మ దర్శకత్వంలో రాక్షసుడు సినిమా చేశాడు. 2019లో వచ్చిన ఈ చిత్రం బెల్లంకొండ హీరోకు సక్సెస్‌ను రుచి చూపించింది. -
'రాక్షసుడు'ను మించిపోయేలా సీక్వెల్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సీక్వెల్ ప్లాన్ చేశాడు డైరెక్టర్. ఈ మేరకు టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. రాక్షసుడు సినిమాకు కొనసాగింపుగా రాక్షసుడు 2 రాబోతుందంటూ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ‘హోల్డ్ యువర్ బ్రీత్’ అనేది ట్యాగ్‌లైన్. ఇక టైటిల్ పోస్టర్ విషయానికి వస్తే... ఓ సైకో చేతిలో గొడ్డలి పట్టుకుని శవాన్ని మోసుకుపోతున్నాడు. తన వెనకాల చైన్‌కు రక్తంతో తడిసిన పదునైన కత్తి వేలాడుతుండడం చూడొచ్చు. క్రియేటివ్‌గా ఉన్న ఈ పోస్టర్‌లోని అంశాలు సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాక్షసుడు కంటే మరింత థ్రిల్లింగ్‌గా, హర్రర్‌గా ఉండనున్నట్లు కనిపిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో మరోసారి హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తాడా? లేదా వేరే స్టార్ హీరో నటిస్తాడా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. రాక్షసుడు సినిమాకు పనిచేసిన సాంకేతికబృందమే 'రాక్షసుడు 2' సినిమాకు కూడా పనిచేయనున్నారు. హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ఏ స్టూడియోస్’ అధినేత కోనేరు సత్యనారాయణ ‘రాక్షసుడు 2’ సినిమాను నిర్మించనున్నాడు. Hold your breath.. Going to be More Thrilling 😉#Rakshasudu2 is On!! 👍@idhavish #KoneruSatyaNarayana@SrikanthVissa @sagar_singer@GhibranOfficial #VenkatCDileep Shoot Begins Soon pic.twitter.com/EX89zyiv8b — Ramesh Varma (@DirRameshVarma) July 13, 2021 జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ సి దిలీప్ కెమెరామేన్. శ్రీకాంత్ విస్సా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నాడు. దర్శకుడు రమేష్ వర్మ ‘రాక్షసుడు 2’ చిత్రానికి స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సెస్‌ను రామ్ లక్ష్మణ్ పర్యవేక్షిస్తారు. మరోవైపు రాక్షసుడు హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రమేష్ వర్మ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. -
రాక్షసుడుని హిందీలో రీమేక్ చేయబోతున్నా
‘‘గత ఏడాది నా పుట్టినరోజుకి ‘రాక్షసుడు’ సినిమా హిట్‌తో ఉన్నా.. ఈ ఏడాది ఏం లేదు. కరోనా పరిస్థితులు లేకపోయుంటే కచ్చితంగా మరో హిట్‌తో ఉండేవాణ్ణి’’ అని దర్శకుడు రమేశ్ వర్మ పెన్మెత్స అన్నారు. ‘ఒక ఊరిలో, రైడ్, వీర, అబ్బాయితో అమ్మాయి, రాక్షసుడు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రమేశ్ వర్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు. ►ఈ లాక్డౌన్లో ఇంట్లో కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాను. అయితే పని అనేది తప్పని సరి కావడంతో 10 రోజులుగా ఆఫీసుకు వెళుతున్నా. మళ్లీ షూటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్లాన్ చేయాలి కదా. ‘రాక్షసుడు’ సినిమా విడుదల తర్వాత నాకు నాలుగైదు అవకాశాలు వచ్చాయి. కానీ రవితేజగారితో చేయాలనుకోవడంతో ఆగాను. నిర్మాత కోనేరు సత్యనారాయణగారు కూడా తొందరేం లేదు కంఫర్టబుల్‌గా చేద్దామన్నారు. తమిళ్లో హిట్ అయిన ఓ సినిమా రీమేక్ చేద్దామనుకున్నాం. కానీ ఆ కథ కంటే ఇప్పుడు చేయబోయే సినిమా కథ రవితేజగారికి చాలా బాగుందని దీంతో ముందుకు వెళుతున్నాం. సెట్స్‌పైకి వెళ్లేందుకు బౌండెడ్ స్క్రిప్ట్ లాక్ చేసిపెట్టుకున్నాం. ఇంతలో కరోనా వచ్చేసింది. ప్రస్తుతం చిన్న సినిమాల షూటింగ్‌లు మొదలయ్యాయి. కానీ పెద్ద చిత్రాలేవీ షూటింగ్స్ ప్రారంభించలేదు. అందరూ మొదలు పెడితే మేం కూడా సిద్ధమే. ►‘రాక్షసుడు’ హిందీ రీమేక్ హక్కులను కోనేరు సత్యనారాయణగారే తీసుకున్నారు. ఆ చిత్రానికి నేనే దర్శకత్వం వహించాలన్నారాయన. రీమేక్‌లో నటించేందుకు చాలా మంది హీరోలు రెడీగా ఉన్నారు. కానీ మేం ఎవర్నీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. రవితేజగారి సినిమా పూర్తయ్యాక బాలీవుడ్లో ‘రాక్షసుడు’ రీమేక్ చేస్తా. ►నిర్మాతగా ‘7’ నా తొలి సినిమా. చిన్న చిత్రంగా తీద్దామనుకున్నాం. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదరడంతో పెద్ద సినిమా అయింది.. బడ్జెట్ కూడా పెరిగింది. దీంతో నా స్నేహితులు కూడా ప్రొడక్షన్లో భాగమయ్యారు. ఈ చిత్రం వల్ల నష్టంలేదు.. సేఫ్ ప్రాజెక్ట్.. నెట్ ఫ్లిక్స్‌లో ఇప్పటికీ ఆదరణ బాగుంది. ఆ సినిమా హిందీలో చేస్తే బాగుంటుందని నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఓ ప్రతిపాదన కూడా పెట్టారు. భవిష్యత్‌లో సినిమాలు నిర్మించాలా? వద్దా అన్నది నిర్ణయించుకోలేదు.. అవకాశాల్ని బట్టి వెళతా. -
బర్త్‌డే స్పెషల్
రవితేజ పుట్టినరోజు నేడు. ఈ స్పెషల్‌గా ఆయన తాజా చిత్రానికి సంబంధించిన ప్రకటన వెల్లడైంది. ఇటీవల ‘రాక్షసుడు’ సినిమాతో హిట్ సాధించిన రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఏ స్టూడియోస్ పతాకంపై హవీష్ ప్రొడక్షన్లో కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తారు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించాలనుకుంటున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శ కత్వంలో తెరకెక్కుతోన్న ‘క్రాక్’ సినిమాతో రవితేజ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
మా నమ్మకం నిజమైంది
‘‘రాక్షసుడు’ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఆడపిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సందేశాత్మకంగా చూపించిన సినిమా ఇది’’ అన్నారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘రాక్షసుడు’. ఆగస్టు 2న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. మరో రెండు వారాల వరకూ వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మా ‘ఏ స్టూడియోస్ బ్యానర్’పై తొలి చిత్రంగా తెరకెక్కిన ‘రాక్షసుడు’ ఇంత పెద్ద విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘కథపై నమ్మకంతో ఈ సినిమా చేశాం. ఈ రోజు మా నమ్మకం నిజమైంది. ఒరిజినల్ కంటెంట్‌లోని అంశాలను మిస్ చేయకుండా మనకు తగ్గట్లు చేశాం’’ అన్నారు రమేష్ వర్మ. ‘‘ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కెరీర్లకు మంచి సినిమా ఎప్పుడూ ఉపయోగపడుతూనే ఉంటుంది. అలాంటి సినిమానే ‘రాక్షసుడు’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. -
‘నా జీవితానికి శక్తినిచ్చిన ‘రాక్షసుడు’’
అవకాశాలు అంత తొందరగా రావు. వాటి కోసం పోరాడి సాధించుకుని నలుగురుని మెప్పిస్తే కలిగే సంతోషమే వేరు. మరో విషయం ఏమిటంటే కొన్ని పాత్రలు కొందరు చేస్తేనే నప్పుతాయి. అందుకే ఒక భాషలో వచ్చిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేసినా, అందులో ఒరిజినల్ చిత్రంలో పాత్ర పోషించిన నటుడినే వరిస్తాయి. నటుడు వినోద్‌సాగర్ విషయంలోనూ అదే జరిగింది. తమిళంలో విష్ణువిశాల్, అమలాపాల్ జంటగా నటించిన చిత్రం రాక్షసన్. రామ్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో వినోద్‌సాగర్ ఉపాధ్యాయుడి పాత్రలో నటించి విలనిజాన్ని రక్తికట్టించాడు. ఆ పాత్రలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా అదే చిత్రం తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ అయ్యింది. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఈ సినిమాలో విలన్ పాత్ర మాత్రం తమిళంలో నటించిన వినోద్సాగర్నే వరించింది. తమిళంలో మాదిరిగానే తెలుగులోనూ ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. ఈ ఆనందాన్ని ఆయన పంచుకుంటూ తాను దుబాయ్‌లో రేడీయో జాకీగా పని చేసి ఆ తరువాత చెన్నైకి వచ్చానన్నారు. ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చేరి ఆపై నటుడిగా మారానని తెలిపారు. తన సినీ జీవితంలో ఇంటిని, తల్లిదండ్రుల్ని చాలా మిస్ అయ్యానని చెప్పారు. అలాంటి సమయంలో రాక్షసన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. ఆ చిత్రం తెలుగులోనూ రీమేక్ కావడంతో అందులోని ఉపాధ్యాయుడి పాత్రను మీరే పోషించాలని అడిగారన్నారు. అందుకు అంగీకరించి నటించినట్లు తెలిపారు. అంతకు ముందు బిచ్చైక్కారన్ చిత్ర అనువాదంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తనకు రాక్షసుడు చిత్రం చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందన్నారు. ఇలాంటి చిత్రాల్లో నటించాలన్నది తనకు చిరకాల ఆశ అని చెప్పారు. రాక్షసుడు చిత్రం తనకు జీవితంలో మరచిపోలేనంతగా గుర్తింపు తెచ్చి పెట్టిందన్నారు. ప్రేక్షకుల స్పందన తెలుచుకోవడానికి థియేటర్లకు వెళ్లగా చిత్రం చూసిన వారు తనను తిట్టుకుంటున్నారని అన్నారు. తాను గడ్డం పెంచుకుని ఉండటంతో అక్కడ తననెవరూ గుర్తించలేదని అన్నారు. అలా వారి ఒక్కో తిట్టును అభినందనగా భావిస్తున్నానని అన్నారు. రాక్షసుడు చిత్రం తన జీవితానికి పెద్ద శక్తినిచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ చిత్రంతో తెలుగులో పలు అవకాశాలు వస్తున్నట్లు తెలిపారు. అయితే సవాల్‌తో కూడిన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు వినోద్‌సాగర్ అంటున్నారు. -
ట్రూమేక్
కాగితం మీద సీన్ ఉంటే నమ్మకం కుదరదు. అదే ఆల్రెడీ తీసేసిన స్క్రిప్ట్ అయితే ఒక గ్యారంటీ. అది పెద్ద హిట్ అయి ఉంటే ఇంకా భరోసా. అక్కడ హిట్ అయ్యింది ఇక్కడ హిట్ అవుతుందిలే అని ధైర్యం. కాని రీమేక్‌లు ఎప్పుడూ మేజిక్స్టిక్లే. అవి సరిగ్గా తిప్పితే పూలవర్షం కురుస్తుంది.లేదంటే పాము పడగై కాటేస్తుంది. ఇటీవలి రీమేక్‌లు సక్సెస్‌స్టోరీ ఇది. రీమేక్ అనేది కత్తి మీద సాము. మార్పులు చేసి తీయాలా యథాతథంగా తీయాలా అనేది ఎప్పుడూ ఒక పజిల్. మార్పులు చేసి తీసిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మార్పులు చేయకుండా తీసిన సినిమాలూ హిట్ అయ్యాయి. మార్పులు చేసినా, చేయకపోయినా ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. సినిమాలు ఎలా ఎందుకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయో చెప్పలేము. చిరంజీవి అంతటి మెగాస్టార్ కెరీర్ పరంగా ఒడిదుడుకులలో ఉన్నప్పుడు హిట్ ఇచ్చి నిలబెట్టిన ‘హిట్లర్’ రీమేకే. పెద్ద సక్సెస్ ఇచ్చి రాజకీయ ప్రవేశానికి ఊతం ఇచ్చిన ‘ఠాగూర్’ రీమేకే. ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్’ కూడా రీమేకే. అలాగే మోహన్‌బాబుకు సినిమా రంగంలో సెకండ్ లైఫ్ ఇచ్చి స్టార్ ఇమేజ్ తెచ్చిన ‘అల్లుడుగారు’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘రౌడీ గారి పెళ్లాం’ సినిమాలు రీమేక్‌లే. కాని రీమేక్ అంటే మాత్రం చాలామంది దర్శకులు నెర్వస్‌గానే ఫీలవుతారు. గతంలో తెలుగులో రీమేక్ స్పెషలిస్టులు ఉండేవారు. పాతరోజులలో ఎస్.డి.లాల్ వంటి డైరెక్టర్లు హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ చేసేవారు. ‘నిప్పులాంటి మనిషి’ (జంజీర్), అన్నదమ్ముల అనుబంధం (యాదోంకి బారాత్), నేరం నాది కాదు ఆకలిది (రోటి) ఇవన్నీ ఎస్.డి.లాల్ తీసిన సినిమాలు. తర్వాతి రోజులలో రవిరాజా పినిశెట్టి రీమేక్‌లకు వాసి గాంచారు. ఆయన తీసి సూపర్‌హిట్ చేసిన ‘పుణ్యస్త్రీ’, ‘పెదరాయడు’, ‘చంటి’ రీమేక్‌లే. ఇక దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు రీమేక్ సినిమాలతోనే కెరీర్ నిర్మించుకున్నారు. ‘శుభాకాంక్షలు’, ‘సుస్వాగతం’, ‘సూర్యవంశం’, ‘సుడిగాడు’ ఇందుకు ఉదాహరణ. అయితే ఇప్పుడు అలా లేదు. అందరు దర్శకులూ అవకాశాన్ని బట్టి రీమేక్‌లు తీయడానికి సిద్ధమవుతున్నారు. తీస్తున్నారు కూడా. మొన్న మొన్న వచ్చిన నాగార్జున ‘ఊపిరి’ ఫ్రెంచ్ ‘‘ది ఇన్టచ్బుల్స్’కు రీమేక్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. నాగచైతన్య ‘ప్రేమమ్’ కూడా మలయాళ సూపర్‌హిట్‌కు రీమేక్. చందు మొండేటి దర్శకుడు. ఇటీవల తెలుగులో మళ్లీ రీమేక్‌ల చర్చ వస్తోంది. కారణం ఇటీవలి రీమేక్ సినిమాలు హిట్ కావడమే. ఎంత మార్చాలి ఎంత మార్చక్కర్లేదు అనే లెక్కలని జాగ్రత్తగా వేసి తీసిన సినిమాలివి. ఒక రకంగా వీటిని ‘ట్రూమేక్’లు అనొచ్చు. ఒరిజినల్ సినిమా పట్ల నిజాయితీతో ఉండి తీసిన సినిమాలన్నమాట. వాటి విశేషాలు. ఓహో బేబీ! సినిమా కథకు ఐడియా వెలగడం పెద్ద విషయం కాదు. దానిని విస్తరించి ఆసక్తికరమైన తొంభై సీన్లుగా మలచడం అసలు విజయం. ఒక స్త్రీ జీవిత చరమాంకంలో తిరిగి యంగ్‌గా జీవించే ఛాన్స్ వస్తే అనే ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే దానిని సినిమాకు వీలుగా మలిచిన తీరు కూడా ఆసక్తికరమే. అందుకే కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ పెద్ద హిట్ అయ్యింది. కథకు యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉందని గ్రహించాక 11 భాషలకు చెందిన సినీరంగాలవారు ఈ కథను దేశ విదేశాలలో ఎగరేసుకుపోయారు. అలా ఈ కథ తెలుగుకు కూడా చేరి ‘ఓ బేబీ’ అయ్యింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ముఖ్య పాత్రలో నటించారు. బేబీగా 80 ఏళ్ల వృద్ధ స్త్రీ పాత్రను లక్ష్మి చేశారు. రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యపాత్రల్లో నటించారు. బేబీ ఎంత బాగా నచ్చిందంటే సూపర్‌హిట్ కావడమే కాదు సుమారు 30 కోట్ల గ్రాస్ కూడా వసూలు చేసింది. హిందీలో కూడా రీమేక్ కాబోతోంది. హిందీలో ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తారని తెలిసింది. ఈ సినిమా హిట్ కావడానికి కారణం తెలుగుదనం తప్పిపోని విధంగా తెరకెక్కించడం, ఇది మన కథే అన్న భావన కలిగించడం. ఎప్పుడైతే బామ్మగా లక్ష్మి చేశారో ఆమె తన నుడికారంతో ఒక సాధారణ బామ్మను చూస్తున్న అనుభూతిని కలిగించారు. సమంత ఆ పాత్రను నేటి అమ్మాయిగా ప్రేక్షకులకు దగ్గర చేయగలిగింది. సగటు తెలుగు స్త్రీ మనోభావాలను, జీవితపు వెలితిని చూపడం వల్లే ఈ సినిమా హిట్ అయ్యిందని చెప్పొచ్చు. ‘‘రీమేక్‌తో వచ్చిన చిక్కేంటంటే సినిమా సరిగ్గా ఆడకపోతే పాడు చేశారు అంటారు. ఒకవేళ హిట్ అయితే సేమ్ అలానే తీశారు హిట్ అయిపోయింది అంటారు. రీమేక్స్‌తో ఎక్కువ పేరు సంపాదించడం కొంచెం కష్టం’’ – నందినీ రెడ్డి, ‘ఓ బేబి’ రిలీజ్ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో. రాక్షసుడు గతంలో ఎస్.వి.కృష్ణారెడ్డి ‘గన్‌షాట్’ అనే సైకో ఫిల్మ్ తీశారు. అందులో సైకోగా ప్రకాష్‌రాజ్ నటించారు. అలీ హీరో. కామెడీ చేయాల్సిన అలీ సీరియస్ రోల్ చేయడం, సీరియస్‌నెస్ చూపించాల్సిన విలన్ కామెడీ చేయడంతో ఈ సినిమా ప్రేక్షకులను సరిగా చేరలేదు. కాని ‘రాక్షసుడు’ సినిమా మాత్రం మొదటి సీన్ నుంచే సీరియస్ మూడ్‌లోకి తీసుకెళ్లిపోతుంది. స్కూల్ వయసు ఉన్న ఆడపిల్లలను చంపి అవయవాలను చిన్న చిన్న భాగాలుగా చేసి రాక్షసానందం పొందే ఈ సైకో కిల్లర్‌ను సినిమా దర్శకత్వం కోసం సైకోలను స్టడీచేసి, సినిమా తీసే వీలులేక పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఎలా పట్టుకున్నాడనేది కథ. తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘రాక్షసన్’కు రీమేక్ ఇది. అక్కడ ఈ కథను రాసి దర్శకత్వం వహించింది రామ్‌కుమార్. తెలుగులో రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు. క్లైమాక్స్ వరకూ విలన్ ఎవరనేది ప్రేక్షకుడు పసిగట్టలేనంత పకడ్బందీగా స్క్రీన్‌ప్లే ఉంది. తమిళ ఒరిజినల్‌ను చాలా కొద్ది మార్పులతో రీమేక్ చేయడం వల్ల ఈ సినిమా ప్రేక్షకుల్లో దూసుకుపోయిందనే అభిప్రాయం ఉంది. సాధారణంగా పాత్రకు తగ్గ నటులు దొరక్కపోతే పాత్ర ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే తమిళంలో ముఖ్యపాత్రలు చేసిన ఇద్దరు ముగ్గురు నటులు తెలుగులో చేయడం కూడా సినిమా హిట్‌కు కారణం కావచ్చు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లోనే బెస్ట్ హిట్ ఇదని చిత్రబృందం పేర్కొంది. ‘‘రీమేక్ చేయడం అంటే ఒక పెయింటింగ్‌ని మళ్లీ వేయడం. అది అంత ఈజీ కాదు. తమిళ సినిమా ఓ టెంపోలో నడుస్తుంటుంది. అదే టెంపోను ఇక్కడ రిపీట్ చేయగలిగాను. సక్సెస్ సాధించాను’’ – రమేశ్ వర్మ, ‘రాక్షసుడు’ రిలీజ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.– ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది గురి తప్పిన బాణాలు రీమేక్‌లు అన్నిసార్లు సత్ఫలితాలు ఇవ్వవు. తమిళంలో సూపర్‌హిట్ అయిన సత్యరాజ్ సినిమా ‘వాల్టర్ వెట్రివేల్’ను తెలుగులో చిరంజీవి, శ్రీదేవిలతో ‘ఎస్.పి.పరశురామ్’గా తీస్తే ప్రేక్షకులు నిరాకరించారు. గ్లామర్ స్టార్ శ్రీదేవి ఈ సినిమాలో పాత్రపరంగా అంధురాలు కావడం జనానికి రుచించలేదు. మలయాళంలో మోహన్‌లాల్ నటించగా సూపర్‌హిట్ అయిన ‘దేవాసురమ్’ను తెలుగులో మోహన్‌బాబు ‘కుంతీపుత్రుడు’గా తీస్తే ప్రేక్షకులు మెచ్చలేదు. కన్నడలో సూపర్‌హిట్ అయిన విష్ణువర్థన్ సినిమా ‘ఆప్తరక్షక’ తెలుగులో వెంటేష్‌తో ‘నాగవల్లి’గా తీస్తే సత్ఫలితం ఇవ్వలేదు. కన్నడలో సూపర్‌హిట్ అయిన శివ రాజ్‌కుమార్ ‘జోగి’ని తెలుగులో ప్రభాస్‌తో ‘యోగి’గా తీస్తే ఆశించిన ఫలితం ఇవ్వలేదు. హిందీలో సూపర్ హిట్ అయిన ఆమిర్ ఖాన్ ‘మన్’ను తెలుగులో నాగార్జునతో ‘రావోయి చందమామ’గా తీస్తే ప్రేక్షకులు నిరాశాజనకమైన రిజల్ట్స్ ఇచ్చారు. కనుక పట్టువదలక పని చేస్తూ పోవడమే చేయదగినది. నచ్చితే హిట్ అవుతుంది. లేకుంటే అనుభవం వస్తుంది. ఎవరు ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాలతో థ్రిల్లింగ్ హిట్స్ అందుకున్నారు అడివి శేష్. మళ్లీ ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ‘ఎవరు’తో వచ్చారు. స్పానిష్ సినిమా ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. ఆల్రెడీ హిందీలో ‘బద్లా’ గా ఈ సినిమా రీమేక్ అయింది. ఆ రెండు సినిమాలను చూసిన వారు కూడా ఎంటర్టైనింగ్గా చూసేలా మరిన్ని ట్విస్ట్‌లతో తెలుగు చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రామ్‌జీ. ఓ బడా బిజినెస్‌మేన్ భార్య పోలీస్ ఆఫీసర్‌ను చంపేస్తుంది. తన మీద అత్యాచారం చేశాడని, ఆత్మరక్షణ కోసం కాల్చానని చెబుతుంది ఆమె. ఇందులో నుంచి తప్పించడానికి విక్రమ్ వాసుదేవ్ అనే లంచగొండి పోలీస్ ఆఫీసర్ సహాయం తీసుకుంటుంది. ఈ కేస్‌లో నుంచి తప్పించుకోవడానికి విక్రమ్ వీళ్లకు సాయం చేశాడా? వీళ్లు తప్పించుకున్నారా? లేదా అనేది క్లుప్తంగా ‘ఎవరు’ కథ. ఒరిజినల్లో ఉన్న కొన్ని పాత్రలను తప్పించి, మరిన్ని ట్విస్ట్‌లు జోడించి ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా రూపొందించారు.‘‘ఒరిజినల్ సినిమా అక్కడ ఎందుకు ఆడింది? అనే విషయం అర్థం చేసుకోవాలి. ‘ఇన్విజిబుల్ గెస్ట్’ కోల్డ్ ఫిల్మ్. వాళ్ల ఎమోషన్స్ అలానే ఉంటాయి. మనవి అలా ఉండవు. దాన్ని అర్థం చేసుకుని మనకు తగ్గట్టుగా మలుచుకుంటే కచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు’’ – వెంకట్ రామ్‌జీ. ‘ఎవరు’ దర్శకుడు. -
‘స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా ’
‘‘రాక్షసుడు’ సినిమా బడ్జెట్ రూ.22 కోట్లు అయ్యింది. ఆంధ్ర, సీడెడ్, నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.12 కోట్లు అమ్ముడు కాగా, హిందీ శాటిలైట్ రూ.12 కోట్లు, తెలుగు శాటిలైట్ రూ.5.90కోట్లు వ్యాపారం జరిగింది. మొత్తంగా రూ.30 కోట్లకు ఈ సినిమాను అమ్మాం. థియేట్రికల్ రైట్స్‌కు పెట్టిన ఖర్చు రూ.12 కోట్లు సోమవారానికే వచ్చాయి’’ అని బెల్లంకొండ సురేశ్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. మంగళవారం జరిగిన ప్రెస్మీట్లో బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ– ‘‘చాలా చోట్ల వర్షం వల్ల ‘రాక్షసుడు’ కలెక్షన్లకు అంతరాయం కలిగింది. వర్షం లేకుంటే కలెక్షన్స్ సునామీ సృష్టించేది. ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ బాగున్నాయి. వైజాగ్, ఈస్ట్ హక్కులను నేనే కొన్నాను. వైజాగ్‌లో సోమవారానికే రూ.2 కోట్లు వచ్చాయి. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన రమేశ్ వర్మగారికి, కోనేరు సత్యనారాయణగారికి, హవీశ్‌గారికి రుణపడి ఉంటాను. ఈ సినిమాకు కథే హీరో.. ఆ తర్వాత పని చేసినవారందరూ హీరోలే. జీబ్రాన్ ఫస్ట్ హీరో, ఆ తర్వాతే మా అబ్బాయే హీరో. ఈ నెల 15 తర్వాత టూర్ ప్లాన్ చేస్తాం. ‘అల్లుడు శీను’కి మించిన వినోదం, పాటలుండి స్క్రిప్ట్ కుదిరితే మా అబ్బాయితో సినిమా చేస్తాను. గ్రాండ్ సినిమానే తీస్తాను. ‘జయజానకీ నాయకా’ భారీ బడ్జెట్‌తో తీశాం. కొంచెం నష్టపోయాం. మంచి కథ కుదరగానే మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి ఓ సినిమా చేస్తాను. అభిషేక్‌తో ‘సాక్ష్యం’ సినిమా చేశాను. ఆ తర్వాత ‘కవచం, సీత’ లాంటి సినిమాలు కొని, నష్టపోయినవాళ్లతో మా అబ్బాయి సినిమా చేసేలా చూస్తాను. మా అబ్బాయిని స్టార్ హీరోని చేయాలనే పెద్ద సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ఎవరైనా తమ పిల్లలు పెద్ద పొజిషన్లోనే ఉండాలనుకుంటారు కదా. ఇండస్ట్రీలో, యూ ట్యూబ్‌లో తనకు మంచి బిజినెస్ క్రియేట్ అయ్యింది’’ అన్నారు. ‘‘రాక్షసుడు’ సినిమాకి 10రోజుల్లోనే లాభాలు సాధించాం’’ అన్నారు నిర్మాత ‘మల్టీడైమన్షన్’ వాసు. ‘‘తొలివారంలో నాలుగో రోజు వసూళ్లు కాస్త డల్ కాగానే భయపడ్డా. రెండో వారంలో అద్భుతంగా ఉన్నాయి’’ అన్నారు రమేశ్ వర్మ. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా విడుదలైన 10వ రోజుకే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సేఫ్ అయ్యారు. ఆర్టిస్ట్‌గా పేరు రావడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్నను గర్వపడేలా చేయాలనుకున్నాను. అందరూ హీరోగా నా జాబ్ ఈజీ అనుకుంటారు. ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఇక్కడ పేరు తెచ్చుకుంటే నాన్నకు అది సంతోషం ఇస్తుంది. రీమేక్ సినిమా హిట్ చేయడం చాలా కష్టం. ఇందులో నేను చేసిన పాత్ర మిగతా సినిమాల్లా కాదు. చాలా అండర్ ప్లే చేయాల్సిన క్యారెక్టర్ నాది. అందుకే ప్రయోగాత్మక సినిమా అని చెప్పొచ్చు. ఇక పై కూడా మంచి కథల్ని ఎంపిక చేసుకుంటూ అలరిస్తాను’’ అన్నారు. ‘మా అబ్బాయి సినిమాల్లో నేనెక్కువగా ఇన్వాల్స్ అవుతానని అందరూ అనుకుంటారు. కానీ పెద్దగా జోక్యం చేసుకోను. సెట్‌కి కూడా తక్కువ వెళ్తాను. తమిళ ‘రాక్షసన్’లో ఓ ఎమోషనల్ సీన్ ఉంది. ఆ సీన్ మా అబ్బాయి ఎలా చేస్తాడా? అనుకున్నా. ఆ సీన్ తీశాక చూశాను. అప్పుడే హిట్ అవుతుందనుకున్నా. మా రెండో అబ్బాయి గణేశ్‌ని కూడా హీరోని చేయబోతున్నాను. కథ, డైలాగ్ వెర్షన్ రెడీ అయ్యాయి’ అని బెల్లంకొండ సురేష్ అన్నారు. -
రాక్షసుడు సంతృప్తి ఇచ్చింది
‘‘తెలుగు రాష్ట్రాల్లో ‘రాక్షసుడు’ సినిమా పేరు మార్మోగుతోంది. కొన్ని థియేటర్స్ కూడా పెంచాం. అనుకున్న ఫలితాన్ని సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించారు. అభిషేక్ నామా ఈ నెల 2న ఈ సినిమాని విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ–‘‘రాక్షసుడు’ బాగుందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సాయిశ్రీనివాస్ ఇదివరకు హీరోయిజం ఉన్న సినిమాలు చేశారు. ‘రాక్షసుడు’ లో హీరో పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. రమేష్ వర్మ నా పేరును నిలబెట్టాడని గర్వంగా చెప్పగలను. ఈ సినిమాను లెక్కలు వేసుకుని తీయలేదు. మంచి సినిమా తీశారని అందరూ ప్రశంసిస్తుంటే సంతృప్తిగా ఉంది. చేసే పనిలో మనం ఆనందం వెతుక్కుంటే డబ్బు దానంతటదే వస్తుంది’’ అన్నారు. ‘‘రాక్షసన్’కి ‘రాక్షసుడు’ పర్ఫెక్ట్ రీమేక్. రమేష్‌వర్మ సిన్సియర్‌గా తీశారు’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘‘రాక్షసన్’ లాంటి సినిమాను ధైర్యంగా తెలుగులో రీమేక్ చేశారు రమేష్‌గారు. సాయి ఇలాంటి పాత్రలు మరెన్నో చేయాలి. ఈ సినిమా వందరోజుల వేడుకలో పాల్గొనాలని ఉంది’’ అన్నారు నటి అమలా పాల్. ‘‘కొన్ని సినిమాలు కమర్షియల్‌గా హిట్ సాధిస్తాయి. మరికొన్ని విమర్శకుల ప్రసంశలు దక్కించుకుంటాయి. మా సినిమాకు ఆ రెండూ వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు సాయి శ్రీనివాస్. ‘ ‘తొలివారంలో ‘రాక్షసుడు’ చిత్రం దాదాపు 32కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. సెకండ్వీక్లోనూ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. బయ్యర్స్ హ్యాపీ’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘సాయితో నేను బాగా నటింపజేశానని అందరూ అంటున్నారు.. కానీ సాయి అంత బాగా నటించాడు’’ అన్నారు రమేష్‌వర్మ. ‘‘సత్యనారాయణగారిలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం’’ అన్నారు నిర్మాత భరత్ చౌదరి. నిర్మాత మల్టీడైమెన్షన్ వాసు, కెమెరామేన్ వెంకట్ పాల్గొన్నారు. -
ఫిట్ అవడానికే హీరోగా చేస్తున్నా
‘‘నేను హీరోగా పరిచయం చేసిన సాయి శ్రీనివాస్‌కి ‘రాక్షసుడు’ సినిమాతో హిట్ రావడం చాలా ఆనందంగా ఉంది. తనకంటే కూడా నాకే ఎక్కువ సంతోషంగా అనిపించింది. దానికి కారణమైన రమేశ్ వర్మకి నా అభినందనలు’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ నామా ఈ నెల 2న విడుదల చేశారు . ఆ సినిమా మంచి హిట్ కావడం సంతోషంగా ఉందని వినాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘రాక్షసుడు’ నిర్మాత కోనేరు సత్యనారాయణగారి అబ్బాయి హవీష్ కూడా హీరోనే. అయినా కూడా ‘రాక్షసుడు’ కథకి సాయి కరెక్ట్‌గా సరిపోతాడని, నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా ఓ సూపర్‌హిట్ సినిమాని సాయికి అందించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరూ రీమేక్ చేయడం చాలా ఈజీ అంటారు.. కానీ చాలా కష్టం. ‘రాక్షసన్’ తమిళ సినిమా నేను చూశా. మొదటి నుంచి చివరి వరకు ఆ సినిమా టెంపోని ఎక్కడా మిస్ అవకుండా రమేశ్ చాలా బాగా తెరకెక్కించాడు. డైరెక్షన్ వైపు ఎందుకొచ్చావని రమేశ్‌ని అడిగితే.. దాదాపు 800 సినిమాలకు డిజైనర్‌గా పనిచేశాను.. బోర్ కొట్టి డైరెక్షన్ వైపు వచ్చానని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. అయితే డైరెక్షన్ ఎప్పుడూ బోర్ కొట్టదు.. నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. సాయితో మళ్లీ హిట్ సినిమా తీయాలి. సాయికి ఇంకా మంచి హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ.... ► ఓ కమర్షియల్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలంటే ఏ అంశాలు అవసరమో అవన్నీ సాయితో తీసిన ‘అల్లుడు శీను’లో ఉన్నాయి. కొన్ని కథకి అవసరం లేకున్నా యాడ్ చేశాం.. ఎందుకంటే హీరోని (సాయి శ్రీనివాస్) ఎలివేట్ చేయడానికి చేసిన మ్యాజిక్ అది.. సినిమాకి అది బాగా వర్కవుట్ అయింది. ► ఈ మధ్య పేపర్లో చదివా.. ‘మా అబ్బాయి శ్రీనుని ‘రాక్షసుడు’ సినిమాతో ప్రేక్షకులు నటుడిగా గుర్తించారు’ అని బెల్లంకొండ సురేశ్‌గారు అన్నారు. అది అబద్ధం. ‘అల్లుడు శీను’ నుంచి ‘రాక్షసుడు’ వరకూ అన్ని సినిమాలకు సాయిని నటుడిగా గుర్తించారు ప్రేక్షకులు. ► తొలి సినిమా ‘అల్లుడు శీను’కే ది బెస్ట్ ఇచ్చాడు. వినోదం పండించడం చాలా కష్టం.. కానీ ఆ సినిమాలో బాగా చేశాడు. ‘రాక్షసుడు’లో కథ టెంపో ఏ మాత్రం తగ్గకుండా, బాగా ఇన్వాల్వ్ అయి నటించాడు.. దాంతో తనకు మంచి పేరొచ్చింది. తను ఏ పాత్ర అయినా చేయగలడు. ► ‘అల్లుడు శీను’ సినిమా వచ్చి ఐదేళ్లు అయిందంటే రోజులు ఎంత స్పీడుగా అయిపోతున్నాయా అనిపిస్తోంది. ఆ సినిమా నిన్నకాక మొన్ననే విడుదల చేసినట్లుంది నాకు. ప్రతి ఒక్కరూ సినిమా సినిమాకి కొంచెం నేర్చుకుంటూ ఉంటారు. సాయి మాత్రం అనుభవం ఉన్నవాడిలా అన్నీ ఒకే టేక్‌లోనే చేసేవాడు. నాకు చాలా సంతోషంగా, పెద్ద హీరోతో చేసినట్టు అనిపించింది. అప్పటికీ ఇప్పటికీ తనలో నాకు తేడా కనిపించడం లేదు. కథకు ఏది అవసరమో దాన్ని చేస్తున్నాడు. నేను–సాయి కలిసి మళ్లీ సినిమా చేయాలనుంది. అయితే పెద్ద సినిమా తీయాలి. అందుకు మంచి కథ కుదిరితే చేస్తాం. ► నేను సినిమా చేస్తున్నదే ఫిట్ అవడానికి.. అంతేకానీ హీరో అయిపోవాలని కాదు (నవ్వుతూ). బాడీ ఫిట్ అవడానికి ఏదో ఓ కారణం కావాలి.. అందుకు సినిమాని కారణంగా పెట్టుకుని చేస్తున్నా’’ అంటూ హీరోగా తాను ఓ సినిమా కమిట్ అయిన విషయం గురించి చెప్పారు వినాయక్. -
వాటిని మరచిపోయే హిట్‌ని రాక్షసుడు ఇచ్చింది
‘‘నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లయింది. సినిమాలు నిర్మించడం ప్రారంభించి 21 సంవత్సరాలైంది. ఇన్నేళ్లలో 25 స్ట్రయిట్ సినిమాలు నిర్మించా.. 8 చిత్రాలు డబ్బింగ్ చేశా. అవేవీ నాకు ఆనందం ఇవ్వలేదు. మా అబ్బాయి చేసిన ‘రాక్షసుడు’ సినిమాకి అందరి ప్రశంసలు దక్కడంతో చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకూ తను చేసిన ఆరు సినిమాలు ఒక ఎత్తయితే ‘రాక్షసుడు’ మరో ఎత్తు. ఫస్ట్ టైమ్ ఓవర్సీస్లో మా సినిమాకి 100 ప్రీమియర్ షోలు పడటం విశేషం’’ అని నిర్మాత బెల్లంకొండ సురేశ్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసు డు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ నామా గత శుక్రవారం విడుదల చేశారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న సందర్భంగా బెల్లంకొండ సురేశ్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.. ఆ విశేషాలు. ► మా అబ్బాయి ఈ ఐదేళ్లలో 7 సినిమాలు చేశాడు. ‘అల్లుడు శీను’ సినిమాకి చాలా మంది హీరోలకి తీసిపోని విధంగా ఎక్స్ట్రార్డినరీ ఓపెనింగ్స్‌తో 6 రోజుల్లో 34కోట్ల షేర్ వచ్చింది. అన్ని వాణిజ్య అంశాలతో వీవీ వినాయక్‌గారి దర్శకత్వంలో ఆ సినిమాలో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేశా. ఆ తర్వాత బోయపాటి శ్రీనుగారి సినిమాని భారీ బడ్జెట్‌తో, భారీ నటీనటులతో నిర్మించాం. కానీ, వాటికి దర్శకులకు, తోటి నటీనటులకు పేరొచ్చింది. అయితే ‘రాక్షసుడు’ మాత్రం మా అబ్బాయికి మంచి పేరు తీసుకొచ్చింది. రెవెన్యూ సైడ్ కూడా సూపర్ హిట్ అయింది. మాకు ఇంత పెద్ద సూపర్ హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ► ‘రాక్షసుడు’ కచ్చితంగా హిట్ అవుతుంది.. తెలుగులో మంచి పేరు వస్తుందని నెలన్నర పాటు రమేశ్ వర్మ తమిళ ‘రాక్షసన్’ హక్కుల కోసం ప్రయత్నించాడు.. నేను కూడా తనకు సపోర్ట్‌గా ప్రయత్నించాను. ఈ రోజుల్లో స్ట్రయిట్ సినిమా తీయడం ఈజీ కానీ, రీమేక్ తీయడం చాలా కష్టం. సరిగ్గా తీయకపోతే మంచి సినిమాని చెడగొట్టారంటూ తిడతారు. రమేశ్ వర్మకి కోనేరు సత్యనారాయణ వంటి మంచి నిర్మాత కుదిరారు. మా అబ్బాయికి మంచి సినిమా ఇచ్చినందుకు నిర్మాతకి పాదాభివందనం. సాయిని అందంగా, యూత్‌ఫుల్‌గా చూపించిన కెమెరామేన్ వెంకట్‌కి హ్యాట్సాఫ్. ► మా అబ్బాయి ‘అల్లుడు శీను, జయ జానకి నాయక’ సూపర్ హిట్స్.. స్పీడున్నోడు, కవచం, సీత’ వంటి ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ మరచిపోయేలా ‘రాక్షసుడు’ హిట్ కొట్టింది. సౌత్ నుంచి హిందీలో డబ్బింగ్ అయిన íహీరోల సినిమాల్లో నంబర్ వన్‌గా ఉన్నవన్నీ మా అబ్బాయి సినిమాలే. కావాలంటే యూ ట్యూబ్‌లో చూసుకోవచ్చు. ‘జయ జానకి నాయక’ సినిమాకి సరైన విడుదల తేదీ, థియేటర్లు దొరక్కపోవడం వల్ల కొంచెం నష్టం జరిగింది. లేకుంటే ఆ సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సింది.. దీంతో హిట్‌తోనే సరిపెట్టుకున్నాం. ► సాయితో బాలీవుడ్లో స్ట్రయిట్ హిందీ సినిమా చేస్తామంటూ హాలీవుడ్ సినిమాలు తీసే ఓ పెద్ద కంపెనీ నుంచి సోమవారమే మెయిల్ వచ్చింది. మేమింకా ఓకే చెప్పలేదు. అన్నీ కుదిరితే తప్పకుండా చేస్తాం. లేదంటై వచ్చే ఏడాది మా సొంత బ్యానర్లో తెలుగులో హిట్ అయిన ఓ సినిమాని హిందీలో రీమేక్ చేస్తాం. ఇప్పటి వరకూ మా అబ్బాయి ఫైట్స్, డ్యాన్సులు బాగా చేయగలడనే పేరుంది.. ‘రాక్షసుడు’తో బాగా నటించగలడని పేరొచ్చింది. ► హీరో అవ్వాలని ఐదో తరగతిలోనే సాయి అనుకున్నాడు. అప్పటి నుంచే ఓ వైపు చదువుతూనే మరోవైపు డ్యాన్స్, ఫైట్స్, జిమ్నాస్టిక్ నేర్చుకున్నాడు. నిర్మాత కొడుకు హీరోగా ఎదగడం చాలా కష్టం. కానీ, మా అబ్బాయిది ఎంతో కష్టపడే తత్వం.. దానికి దేవుడి ఆశీర్వాదం, ప్రేక్షకులు అభిమానం తోడవడంతో సక్సెస్ అందుకున్నాడు. దానికితోడు మంచి సినిమాని ఎప్పుడూ మన ప్రేక్షకులు ఆదరిస్తారు. ► ‘రాక్షసన్’ రీమేక్ చేయాలనుకున్నప్పుడు వెంకటేశ్‌బాబు రీమేక్ సినిమాల్లా ఏం మార్పులు చేయకుండా చేస్తే సరిపోతుందని చెప్పా. అలా చేయడం వల్లే ‘రాక్షసుడు’ మంచి విజయం సాధించింది. ఇకపై మంచి కథా చిత్రాలే చేయాలనుకున్నాం. మా అబ్బాయి తర్వాతి సినిమాని నిర్మాత ‘దిల్’ రాజుగారికి అప్పచెప్పా.. ఆయనే నిర్మిస్తారు. ఆ తర్వాత మా సొంత బ్యానర్లో ఓ సినిమా ఉంటుంది. -
‘ఐదేళ్లుగా ఇలాంటి సక్సెస్ కోసం వెయిట్ చేశాను’
భారీ క్యాస్టింగ్‌తో, హై బడ్జెట్ చిత్రాలతో సినిమాలు చేస్తూ మాస్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాడు బెల్లంకొండ శ్రీనివాస్. తాజాగా రాక్షసుడు చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. మాస్ మంత్రం జపిస్తూ వచ్చిన ఈ హీరో.. తన పంథాను మార్చుకుని ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ..‘ ‘రాక్షసుడు’ సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ‘అల్లుడు శీను।.. అప్పట్లో చాలా మంది హీరోలకు సమానంగా రూ.34 కోట్లు షేర్ వచ్చింది. గ్రాండియర్, కమర్షియల్ వేల్యూస్ ఉన్న ఈ సినిమాతో వి.వి.వినాయక్ డైరెక్షన్ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యారు. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన `జయజానకి నాయక` భారీ క్యాస్టింగ్, బడ్జెట్‌తో రూపొందింది. అవన్నీ డైరెక్టర్‌కి, ఇతర క్యాస్టింగ్‌కి పేరుని తెచ్చిపెట్టాయి. అయితే `రాక్షసుడు` సినిమా మా అబ్బాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా నుంచి మా అబ్బాయి ప్రతి సినిమాకు జర్నలిస్ట్ అసోసియేషన్‌కు రూ.10 లక్షలను ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. -
రీమేక్ చేయడం సులభం కాదు
‘‘నా చిన్నప్పటి నుంచి సూపర్‌గుడ్ ఫిలిమ్స్‌లో చాలా రీమేక్‌లు చేయడం చూశా. అవన్నీ సక్సెస్‌లే. నేనెప్పుడూ రీమేక్ సినిమా చేయాలనుకోలేదు. కానీ, ‘రాక్షసుడు’ కథ నచ్చింది. ఒక పెయింటింగ్‌ని మళ్లీ వేయడం మామూలు విషయం కాదు. అలాగే రీమేక్ చేయడం కూడా ఈజీ కాదు. ఇండియాలో రీమేక్ అవుతున్న సినిమాలన్నీ హిట్ అయ్యాయా? నేను సక్సెస్ అయ్యాను’’ అని రమేష్ వర్మ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మెత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా రమేష్ వర్మ పంచుకున్న విశేషాలు... ► సాయిశ్రీనివాస్‌కి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చింది నేనే అని వింటుంటే చాలా ఆనందంగా ఉంది. బెల్లంకొండ సురేష్‌గారు వాళ్లబ్బాయిని నా చేతిలో పెట్టినప్పుడు ‘రాక్షసుడు’ సినిమాను ఎంపిక చేసుకున్నా. దీనికన్నా ముందు ఆయన ఓ లవ్ స్టోరీతో డబుల్ బడ్జెట్ ఉన్న సినిమా ఇచ్చారు. ఇద్దరు హీరోయిన్లు, దేవీశ్రీ మ్యూజిక్, లండన్‌లో సినిమా... ఇలా చాలా బెటర్ అవకాశం ఇచ్చారు. కానీ గమ్యం నన్ను ‘రాక్షసుడు’ వైపు తీసుకెళ్లింది. ► ‘కవచం’ సినిమా తర్వాత నేను సాయి శ్రీనివాస్‌కి ఈ కథ చెబితే ‘మళ్లీ పోలీస్‌గా చేయను’ అన్నాడు. బెల్లంకొండ సురేష్గారి దగ్గరకు వెళ్లి ‘రాక్షసన్’ సినిమా చూడమని చెప్పా. వాళ్ల ఫ్యామిలీ మొత్తం చూశారు.. అందరికీ నచ్చడంతో ‘రాక్షసుడు’ ఓకే అయింది. ► ఈ సినిమాలో ఫైట్స్ పెట్టాలని శ్రీనివాస్ కొంచెం ఒత్తిడి చేశాడు. కానీ, నేను ఒప్పుకోలేదు. ‘ఎందుకండీ రమేశ్‌తో రిస్క్. మీ అబ్బాయి హవీశ్‌తో చేసుకుని, వేరే పెద్ద డైరెక్టర్ని పెడితే, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’ అని కొందరు సత్యనారాయణగారితో అన్నారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ► ఇండియాలో టాప్ గ్రాసర్ సినిమాను ఓ సౌత్ ఇండియన్ డైరెక్టర్ తీస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. ఐఎండీబీలో టాప్ సెకండ్ సినిమాను మేం చేశాం.. ప్రూవ్ చేసుకున్నాం. ‘రాక్షసుడు’ తో ఆత్మసంతృప్తి కలిగింది. ‘మా అబ్బాయికి బ్లాక్ బస్టర్ ఇచ్చావు’ అని సురేష్‌గారు మెసేజ్ చేయడం హ్యాపీ. ► ప్రస్తుతానికి ‘రాక్షసుడు’ సినిమాను ఇంకా ప్రమోట్ చేసుకోవాలని ఉంది. ‘రాక్షసుడు’ టైమ్‌లో నితిన్ వాళ్ల నాన్నగారు సుధాకర్రెడ్డిగారిని కలిసి కథ చెప్పా.. వాళ్లకు నచ్చింది. అయితే మీడియాలో ఆ విషయం రావడం వల్ల డిస్టర్బెన్స్ జరిగింది. ఆ కథను, ఆ ప్రేమకథని నితిన్‌తో చేయాలని ఉంది. -
‘రాక్షసుడు’కి సాధ్యమేనా!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాక్షసుడు. తమిళ సినిమా రాక్షసన్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీకి తెలుగులోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా కాలం తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో చిత్రయూనిట్ హ్యాపీగా ఉన్నారు. అయితే కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో లేవు. సాయి శ్రీనివాస్ గత చిత్రం ‘సీత’ డిజాస్టర్ కావటంతో ఈ మూవీపై పెద్దగా అంచనాలు లేవు. దీనికి తోడు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు వసూళ్ల మీద ప్రభావం చూపిస్తున్నాయి. తొలి రోజు ఈ సినిమా కేవలం 2.3 కోట్ల షేర్ మాత్రమే సాధించగలిగింది. వీకెండ్లోనే పరిస్థితి ఇలా ఉంటే సోమవారం నుంచి వసూళ్లు మరింతగా పడిపోతాయన్న టెన్షన్ నిర్మాతల్లో కనిపిస్తుంది. దీనికి తోడు వచ్చే వారం మూడు ఇంట్రస్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘మన్మథుడు 2’, భారీ పౌరాణిక చిత్రం ‘కురుక్షేత్రం’తో పాటు అనసూయ లీడ్ రోల్లో నటించిన ‘కథనం’ చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ పరిస్థితుల్లో రాక్షసుడు సేఫ్ జోన్లోకి వస్తాడా లేదా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 17 కోట్లకు పైగా షేర్ సాధించాల్సి ఉంటుంది. మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ స్థాయిలో వసూళ్లు సాధిస్తాడో లేదో చూడాలి. -
‘రాక్షసుడు’ సక్సెస్ సెలబ్రేషన్
-
వసూళ్ల వర్షం పడుతోంది
‘‘ఈ రోజు నాకు చాలా మెమొరబుల్. ఇలాంటి రోజు కోసమే రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాను. నాకు ‘రాక్షసుడు’తో మంచి హిట్ ఇచ్చిన సత్యనారాయణగారికి రుణపడి ఉంటాను’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘రాక్షసుడు’. నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిన్న (శుక్రవారం) విడుదల చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అందరూ సినిమా గురించి పాజిటివ్‌గా చెబుతున్నారు. కమర్షియల్‌గానే కాదు.. క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. సత్యనారాయణగారు ఖర్చుకు వెనకాడకుండా తెలుగు రీమేక్ రైట్స్ కొని మాపై నమ్మకంతో మాకు ఇవ్వడమే బిగ్గెస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాం. టీమ్ అంతా బాగా కష్టపడ్డాం. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు.‘‘నాపై నమ్మకంతో సినిమా చేసిన సత్యనారాయణగారికి, బెల్లంకొండ సురేశ్, హీరో సాయి శ్రీనివాస్‌కు థ్యాంక్స్. ఈ సినిమా రిజల్ట్ గురించి మూడు రోజులుగా టెన్షన్ పడ్డాను. సినిమా చూసిన తర్వాత నా శ్రీమతి ఫోన్ చేసి ‘బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు’ అని చెప్పింది. నా సక్సెస్‌లో భాగమైన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు రమేశ్ వర్మ. ‘‘ఈ సినిమాను రమేష్ వర్మ ఓ కసితో డైరెక్ట్ చేశాడు. సాయి కూడా ఈ సినిమాతో హిట్ కొట్టాలని వెయిట్ చేశాడు. మామూలు వర్షమే కాదు.. కలెక్షన్ల వర్షం కూడా పడుతోంది. సత్యనారా యణగారు మమ్మల్ని పట్టుదలగా ముందుకు నడిపించారు’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘సాయి తన ఇమేజ్ను పక్కనపెట్టి కంటెంట్ ఉన్న సినిమా చేయడానికి అంగీకరించినప్పుడే సక్సెస్ డిసైడై పోయింది’’ అన్నారు మల్టీ డైమన్షన్ వాసు. సినిమా టోగ్రఫర్ వెంకట్ మాట్లాడారు. -
‘రాక్షసుడు’ మూవీ రివ్యూ
-
‘రాక్షసుడు’ మూవీ రివ్యూ
టైటిల్ : రాక్షసుడు జానర్ : సస్పెన్స్ క్రైమ్ థిల్లర్ తారాగణం : బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరణ్, రాజీవ్ కనకాల తదితరులు సంగీతం : గిబ్రాన్ నిర్మాత : కోనేరు సత్యనారాయణ దర్శకత్వం : రమేష్ వర్మ మాస్ ఫాలోయింగ్ పెంచుకుందామని రొటీన్ సినిమాలను చేస్తూ వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ సారి మాత్రం క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ఇంతవరకు సరైన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ హీరో.. మొదటి సారి ఓ రీమేక్(తమిళ మూవీ రాక్షసన్)ను ఎంచుకున్నాడు. రాక్షసుడు చిత్రంతో ఈ శుక్రవారం ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ హీరోకు.. విజయం లభించిందా? లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. కథ స్కూల్ ఏజ్ అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అరుణ్ (బెల్లంకొండ శ్రీనివాస్) సినీ రంగంలో తన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటాడు. దర్శకత్వం చేపట్టాలని ప్రతీ ఆఫీస్ గడప తొక్కుతూ ఉంటాడు. తన సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కోసం ప్రపంచంలో నలుమూలలా జరిగే సైకో హత్యల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అయితే అరుణ్‌కు సినీ రంగంలో అవకాశాలు రాక.. చివరకు కుటుంబం ఒత్తిడి మేరకు పోలీస్ ఉద్యోగంలో చేరతాడు. అరుణ్.. పోలీస్ ఆఫీసర్‌గా జాయిన్ అయిన తరువాత మళ్లీ ఓ హత్య జరగుతుంది. ఇక ఆ హత్యలను చేసేది ఎవరనే విషయాన్ని అరుణ్ కనిపెట్టాడా? అసలు ఆ హత్యలు చేసే వ్యక్తి ఎవరు? ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? అనేదే మిగతా కథ. నటీనటులు ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్.. యాక్షన్ సీన్స్‌తోపాటు, ఎమోషనల్ సీన్స్‌లోనూ బాగా నటించాడు. ఇంతకుముందు కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించినా.. ఈ మూవీలో మాత్రం ఇంటెన్సిటీతో నటించాడు. ఇక టీచర్‌గా కృష్ణవేణి పాత్రలో అనుపమా.. లుక్స్‌తో బాగానే ఆకట్టుకుంది. కనిపించింది తక్కువే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాజీవ్ కనకాల మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్‌లో తన అనుభవాన్ని చూపించాడు. రాక్షసుడు పాత్రను తెరపై చూస్తేనే ఆ థ్రిల్‌ను ఫీల్ అవ్వొచ్చు. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు మెప్పించారు. విశ్లేషణ సినిమాకు కథ ముఖ్యం. కథే సినిమాను నడిపించాలి. అలా ఓ కథ.. ఒక భాషలో విజయవంతం అయినా.. మిగతా భాషల్లో అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందా అంటే చెప్పలేం. అయితే హారర్, సైకో థ్రిల్లర్, క్రైమ్ ఇలాంటివాటికి భాషతో పని ఉండదు. ఇలాంటి వాటిని ఓ వార్గం వారు మాత్రమే ఇష్టపడతారు. అలా తమిళంలో హిట్ కొట్టిన రాక్షసన్ చిత్రాన్ని ‘రాక్షసుడు’గా తెలుగు ప్రేక్షకులకు అందించారు. రీమేక్ చేయడం కత్తి మీద సాములాంటింది. కొత్తవి చేరిస్తే.. పాడు చేశారు అంటారు. ఉన్నవి తీసేస్తే ఫీల్ మిస్ చేశారంటారు. అలా రీమేక్‌ను జాగ్రత్తగా తెరకెక్కించాల్సి వస్తుంది. రాక్షసుడు చిత్రానికి కూడా అలాంటి సమస్యే వచ్చింది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఎలాంటి రిపేర్ చేయకుండా యథాతథంగా తెరకెక్కించారు. అయినా సరే థ్రిల్లింగ్‌కు గురి చేసే ఎన్నో అంశాలు ఉండటం.. సీటు అంచున కూర్చోబెట్టే మూమెంట్స్ ఉండటం సినిమాకు కలిసొచ్చే అంశాలు. ఫస్ట్ టైమ్ ఈ చిత్రాన్ని చూస్తున్నవారికి మాత్రమే అలాంటి థ్రిల్‌కు గురవుతారు. థ్రిల్లర్ మూవీతో వచ్చే చిక్కే అది.. ఓ సారి కథాకమామీషు తెలిశాక సినిమాను చూడలేం. తమిళ్లో ఓ మూవీ హిట్ అయింది.. బాగుంది అని తెలిశాక మనవాళ్లు చాలామంది చూసేస్తున్నారు. మరి అలా చూసిన వారిని ఈ సినిమా అంత ఆశ్చర్యానికి గురి చేయకపోవచ్చు. మాతృకను చూడని వారిని రాక్షసుడు మాత్రం కచ్చితంగా భయపెట్టిస్తాడు.. థ్రిల్‌కు గురిచేస్తాడు. ఇక గిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రతీ సన్నివేశాన్ని ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ సినిమాకు చక్కగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కథ, కథనం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్ పాయింట్స్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం తమిళ వర్షన్ చూసినవారికి థ్రిల్లింగ్‌గా అనిపించకపోవడం బండ కళ్యాణ్, సాక్షి వెబ్‌డెస్క్. -
బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కష్టపడాల్సిందే
‘‘నేనెప్పుడూ కథని నమ్ముతా.. హీరోయిజాన్ని కాదు. నా తొలి, మలి సినిమాలు ‘అల్లుడు శీను, స్పీడున్నోడు’ హీరోయిజం కోసం చేశాను. ఆ తర్వాత కథకి ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తున్నా. అవి సరిగ్గా ఆడినా, ఆడకున్నా ఆయా పాత్రల్లో నా కష్టం మాత్రం 100 శాతం ఉంటుంది. ప్రతిదీ నా తొలి సినిమాలానే భావిస్తా’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించారు. అభిషేక్ నామా విడుదల చేస్తున్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు. ► ‘రాక్షసన్’ తమిళ సినిమా చూశా. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కావడంతో చాలా బాగా నచ్చింది. కిడ్నాప్ లాంటి సంఘటనలు సమాజంలో ఎన్నో జరుగుతుండటం పేపర్లలో, టీవీల్లో చూస్తున్నాం. అందుకే ఈ చిత్రాన్ని మనసు పెట్టి చేశా. బయట శవాల మధ్య, మార్చురీలో ఎక్కువ షూటింగ్ చేశాం. చిత్రీకరణ తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ ఉండేవి. ► టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చే సైకో కిల్లర్‌ని పట్టుకుని, హత మార్చే పోలీసు అధికారి పాత్రలో నటించాను. 2018 డిసెంబరులోనే తమిళ సినిమా ‘రాక్షసన్’ చూశా.. విపరీతంగా నచ్చడంతో రీమేక్ హక్కుల కోసం రెండు నెలలు ప్రయత్నించాం. మనకు తెలిసిన, మనతో ఉన్న అమ్మాయిలకు ఏమైనా జరిగితే తట్టుకోలేం. అలాంటి పాయింట్‌నే ఈ సినిమాలో చర్చించాం. నా మరదలు పాత్ర చేసిన సిరి కిడ్నాప్‌కి గురై చనిపోతుంది. సినిమాలో రెండవ భాగం మొత్తం నా పాత్ర చాలా సీరియస్‌గా, భావోద్వేగంగా సాగుతుంది. ► ఈ సినిమాకి కథే హీరో. ఆ తర్వాతే నేను. గ్లామర్, కమర్షియల్ అంశాలు ఉండవు. ఇదొక తమిళ చిత్రం కంటే మా సినిమాలో సీన్స్‌ని ఇంకా బాగా తీశాం. రీమేక్ సినిమా చేయడం 90 శాతం సులభం, 10 శాతం ఒత్తిడి ఉంటుంది. గత జూలై నుంచి ఈ జూలైకి మూడు పెద్ద సినిమాలు చేశా.. చాలా కష్టపడ్డా.. అందుకే ఓ నెల సరదాగా అమెరికా వెళుతున్నా. ► నా ఫ్రెండ్స్ అంతా నెట్‌ఫ్లిక్స్ బ్యాచ్. ‘రాక్షసుడు’ ప్రివ్యూ చూసి, ‘నిజమైన పోలీస్ అనిపించావ్.. గర్వంగా ఉంది’ అన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తమిళ్ కంటే తెలుగులోనే బాగా చేశారని అన్నారు. ఇంత మంచి కథ నాకు ఎప్పుడూ దొరకలేదు. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నా. ఇందులో అంతర్జాతీయ స్థాయి క్లయిమాక్స్ ఉంటుంది. ► రమేష్ వర్మ బాగా తీశాడు. నేనెప్పుడూ దర్శకత్వంలో కల్పించుకోను. డైరెక్టర్లు ఎలా చెబితే అలా చేస్తా. వీవీ వినాయక్, బోయపాటి శీనుగార్ల వంటి మాస్ డైరెక్టర్లతో కమర్షియల్ సినిమాలు చేశా. నటుడిగా నేనేంటో నిరూపించుకోవాలి. అందుకే ‘సీత, రాక్షసుడు’ వంటి వైవిధ్యమైన సినిమాలు ఎంచుకున్నా. సినిమా సినిమాకి వైవిధ్యమైన పాత్రలు చేయాలనుంది. కానీ, టాలీవుడ్లోనే కాదు.. ఇతర భాషల్లోనూ కొత్త కథలు దొరకడం కష్టమైపోతోంది. నా ‘సాక్ష్యం, కవచం, సీత’ సరిగ్గా ఆడనప్పుడు ‘ఇంత కష్ట పడ్డాం. ఎందుకిలా?’ అని బాధపడ్డా. అయితే సక్సెస్‌కంటే ఫెయిల్యూర్స్‌తోనే ఎక్కువ నేర్చుకుంటాం. ► నాన్నగారు (బెల్లంకొండ సురేశ్) పక్కా కమర్షియల్ నిర్మాత. ‘సీత, రాక్షసుడు’ వంటి కథలతో ఆయన సినిమాలు తీయరు. ఇండస్ట్రీ నేపథ్యం ఉన్నవారైనా, లేనివారైనా ఇక్కడ కష్టపడాల్సిందే. కొన్ని కథలను మనం జడ్జ్ చేయలేం. మనకి బాగా అనిపించినవి ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. ఈ మధ్య రెండు మూడు కథలు విన్నా ఏదీ ఫైనల్ చేయలేదు. రెండు బాలీవుడ్ అవకాశాలొచ్చాయి. కానీ, హిందీపై నాకు అంత పట్టు లేదు. అందుకే చేయలేదు. -
రాక్షసుడు నా తొలి సినిమా!
‘‘అల్లుడు శీను’ సినిమా ఐదేళ్ల క్రితం విడుదలైంది. అభిమానుల ప్రేమ, ప్రోత్సాహం వల్లే ఇంత దూరం రాగలిగాను. చిన్న చిన్న తప్పులు చేశాను. ఇకపై ఓటమి లేకుండా ఉండటానికి కృషిచేస్తా. మంచి సినిమాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ నామా రేపు (ఆగస్ట్ 2) విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ‘రాక్షసుడు’ ట్రైలర్‌ను నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్ విడుదల చేశారు. తొలి టికెట్‌ను సాయిశ్రీనివాస్, అనుపమ, కోనేరు సత్యనారాయణ విడుదల చేయగా, తలసాని సాయి యాదవ్ కొన్నారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అభిమానుల ప్రేమ, ఆదరణ పొందడానికి ఇంకా కష్టపడతాను. ఇప్పటి నుండి మన కెరీర్ స్టార్ట్ అయింది. ‘రాక్షసుడు’ నా మొదటి సినిమా. రెండో సినిమా కోసం వేచి చూడండి. నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన సినిమా ‘రాక్షసుడు’. అరుదుగా దొరికే కథ ఇది. ఇంత మంచి స్క్రిప్ట్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ– ‘‘తొలి సినిమా ‘అల్లుడు శీను’తోనే ఏ ఇతర హీరోల సినిమాలకు తీసిపోని విధంగా రికార్డు కలెక్షన్స్‌ను సాధించాడు మా అబ్బాయి శ్రీనివాస్. సొంత ప్రతిభతో పైకి వస్తున్నాడు. కొన్ని సినిమాలకు తెలిసోతెలియకో తప్పులు చేశాం. ఇకపై ఆ తప్పులు చేయకూడదని, అభిమానులను నిరుత్సాహ పరచకూడదనిపించి ఇంత వరకు మరో సినిమాకి కమిట్ కాకుండా ‘రాక్షసుడు’ సినిమాపైనే ఫోకస్ పెట్టాడు. ఇకపై ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఇష్టపడతారో అలాంటివాటిలోనే నటిస్తాడు. తనను ఓ మెట్టు పైకి ఎక్కించే సినిమా ‘రాక్షసుడు’’ అన్నారు. ‘‘చాలా ఉద్విగ్నంగా ఉండే చిత్రం ‘రాక్షసుడు’. చిత్రీకరణలో అస్సలు రాజీపడలేదు. రీషూట్స్ కూడా చేశాం. ఈ సినిమాకు కథే మూలం. ఇలాంటి కథతో నాలుగేళ్లుగా సౌతిండియాలో ఏ సినిమా రాలేదు’’ అన్నారు కోనేరు సత్యనారాయణ. ‘‘ఈ ఏడాది బెస్ట్ హిట్ మూవీస్‌లో ‘రాక్షసుడు’ ఉంటుంది. ఈసారి వందశాతం గట్టిగా హిట్ కొడుతున్నాం’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘మా సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్’’ అని రమేశ్‌వర్మ పెన్మత్స అన్నారు. ‘‘రాక్షసుడు’ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. శ్రీనివాస్ కెరీర్‌కు ఇది టర్నింగ్ పాయింట్’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. ‘‘బెల్లంకొండ సురేశ్‌గారు నన్ను దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్నారు. కానీ అప్పుడు నేను సిద్ధంగా లేకపోవడంతో కుదరలేదు. హీరోగా ఎదిగే క్రమంలో సాయి ప్రతి సినిమాకు కొత్తగా ప్రయత్నిస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. నిర్మాత మల్టీడైమన్షన్ వాసు, డైరెక్టర్ సాగర్, నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, నల్లమలుపు బుజ్జి, నటులు మాదాల రవి, రాజీవ్ కనకాల, కెమెరామేన్ వెంకట్, ఎడిటర్ అమర్, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
‘రాక్షసుడు’ ప్రీ రిలీజ్ వేడుక
-
కాలేజీకి చేసినదే సినిమాకి చేశాను
‘‘40 ఏళ్లుగా కేఎల్ యూనివర్శిటీలు నడిపిస్తున్నాం. హైదరాబాద్‌లో కొత్త బ్రాంచ్ కూడా ప్రారంభించాం. మా అబ్బాయి హవీష్ చేసిన ‘జీనియస్’కు నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాను. కానీ నిర్మాణంలో ఇన్వాల్వ్ కాలేదు. పూర్తిస్థాయి ప్రొడక్షన్లోకి వద్దామనుకొని ‘ఏ స్టూడియోస్’ బ్యానర్ స్థాపించాం’’ అన్నారు కోనేరు సత్యనారాయణ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాక్షసుడు’. కేఎల్యు సంస్థల చైర్మన్ కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కోనేరు సత్యనారాయణ చెప్పిన విశేషాలు. ► తమిళంలో ‘రాక్షసన్’ రిలీజ్ అయిన వారంలోనే చూశాను. గ్రిప్పింగ్‌గా ఉంది. మా అబ్బాయితో రీమేక్ చేయాలనుకున్నాను. అప్పటికే మావాడు థ్రిల్లర్ జానర్లో ‘7’ సినిమా చేస్తున్నాడు. దాంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బావుంటాడనుకున్నాం. సాయి శ్రీనివాస్ చాలా బాగా చేశాడు. ► ‘ఒరిజినల్లో ఉన్నదానికి ఒక్క సీన్ కూడా మార్చకుండా తీయండి’ అని దర్శకుడితో అన్నాను. ఉన్నది ఉన్నట్టు తీయడం కూడా కష్టమే! రమేష్ వర్మ చాలా కష్టపడ్డాడు. సినిమాను ఎలా తీయాలనుకున్నామో అలానే తీశాం. ► నా చిత్రాల్లో మెసేజ్ ఉండాల నుకుంటాను. ‘జీనియస్’లో హీరోలను, క్రికెటర్స్‌ను అభిమానించండి.. ఆరాధిం చొద్దని చెప్పాం. ‘రాక్షసుడు’లో ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాం. ► కాలేజీలో ఒక పని చేయాలంటే చాలామంది ఉంటారు. ఒకరికి చెబితే పని అయిపోతుంది. షూటింగ్‌లోనూ అదే అప్లై చేశాను. సినిమా బిజినెస్ పూర్తయింది. థియేట్రికల్ రైట్స్ అభిషేక్ పిక్చర్స్ వాళ్లకి ఇచ్చేశాం. నెక్ట్స్ 2, 3 సినిమాలు అనుకుంటున్నాం. వాటిలో హవీష్‌తో ఓ సినిమా ఉంటుంది. ► ఎంటర్టైన్మెంట్ యూనివర్శిటీ స్థాపించాలనుకుంటున్నాను. ఆ యూనివర్శిటీలో సినిమా, టీవీ, యానిమేషన్, గ్రాఫిక్స్ అన్నీ నేర్చుకునేలా ఏర్పాటు చేస్తాం. -
సమంతలా నటించలేకపోయేదాన్నేమో!
‘‘రాక్షసుడు’ కథ నచ్చింది. ఇది తమిళ ‘రాక్షసన్’ సినిమాకి రీమేక్. నేను తమిళ సినిమా చూడలేదు. మా నాన్నగారు చూసి ‘రాక్షసన్’ చాలా బాగుంది.. చూడమంటే చూశా. కథ అద్భుతంగా ఉంది’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించారు. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ పంచుకున్న విశేషాలు. ► క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. నాకు థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టం. అందుకే ఈ కథకి బాగా కనెక్ట్ అయ్యాను. ఇందులో నేను టీచర్ పాత్రలో కనిపిస్తాను. సినిమాలో ఎక్కువ భాగం చీరలో ఉండటం సౌకర్యంగానే అనిపించింది. ఎందుకంటే ఐదో తరగతి నుంచే నాకు చీరలు కట్టుకోవడం అలవాటు. డ్యాన్స్, ఇతర ప్రోగ్రామ్స్ టైమ్‌లో చీరలో ఉండేదాన్ని. సినిమాలో నన్ను చూసి ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో అనే టెన్షన్ ఉంది. ► తమిళ ‘రాక్షసన్’లో అమలా పాల్ చేశారు. ఆమె కళ్లు చాలా బాగుంటాయి. అమలా పాల్ పాత్ర నేను చేయడం హ్యాపీగా ఉంది. అయితే ఆమెలా కాకుండా నా శైలిలో నటించాను. ఈ సినిమాకి నేనే డబ్బింగ్ చెప్పాను. ఆ సమయంలో నా వాయిస్ బాగాలేదు. ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించమని రమేష్ వర్మగారితో అంటే, ఆయన నేనే చెప్పాలనడంతో చెప్పాను. ► దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్న ఓ మలయాళ సినిమాకి డైరెక్టర్ శ్యాంసు జ్యభ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. ఓ సినిమా కోసం యూనిట్ పడే కష్టం ఏంటో తెలుసుకోవాలి.. అప్పుడే వృత్తిపై నాకు మరింత గౌరవం పెరుగుతుందని అసిస్టెంట్‌గా చేశా. వైవిధ్యమైన అనుభూతి కలిగింది. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తా. కొన్ని ఐడియాలు ఉన్నాయి. నేను దర్శకత్వం వహించే సినిమాల్లో జీవితం కనిపించాలి. ► నా మాతృభాష మలయాళం అయినా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి ఇక్కడే నాకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు రెండో ఇల్లు లాంటిది. నటిగా సంతృప్తి ఉండదు. మంచి సినిమాలు, పాత్రలు వస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకూ నాకు చాలెంజింగ్ పాత్ర రాలేదు. తెలుగు ‘నిన్ను కోరి’ తమిళ్ రీమేక్‌లో నటిస్తున్నా. నివేదా థామస్ పాత్రను నా శైలిలో చేయనున్నా. ఇది నాకు చాలెంజిగ్ పాత్ర అనుకుంటున్నా. ‘ఫిదా’ సినిమాలో సాయిపల్లవి, ‘మహానటి’లో కీర్తీ సురేశ్ చేసిన పాత్రలంటే చాలా ఇష్టం. నటిగా నేనేంటో నిరూపించుకునే అలాంటి పాత్రలు చేయాలనుంది. ‘రంగస్థలం’ సినిమా అవకాశం కోల్పోవడం కొంచెం బాధగానే ఉంది. అయితే ఆ పాత్రలో సమంతకంటే నేను బాగా చేయలేనేమో? అనిపించింది. -
నేనంటే భయానికి భయం
‘నేనంటే భయానికే భయం.. నన్ను పట్టుకోవాలనుకోకు... పట్టుకుందామనుకున్నా అది నేనవను’ అంటూ పోలీస్ అధికారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఓ కిల్లర్ వార్నింగ్ ఇస్తున్న డైలాగ్‌తో ప్రారంభమైన ‘రాక్షసుడు’ ట్రైలర్ ఉత్కంఠ రేకెత్తించేలా ఉంది. ‘మనం వెతుకుతున్నవాడు రేపిస్టో, కిడ్నాపరో లేకపోతే వన్‌సైడ్ లవరో కాదు... పథకం ప్రకారం హత్యలు చేసే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి’, ‘మనం ఊహించిన దానికంటే ఈ కేసులో ఏదో సీరియస్‌నెస్ ఉంది మేడమ్’ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. ఎ హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘రాక్షసుడు’ ట్రైలర్‌ని విడుదల చేశారు. కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘ఏడాది క్రితం నేను, రమేష్ వర్మ కలిసి చెన్నైలో తమిళ చిత్రం ‘రాక్షసన్’ని చూశాం. బాగా నచ్చడంతో రీమేక్ చేశాం. హీరోగా నలుగురైదుగురు పేర్లు అనుకుని, సాయిశ్రీనివాస్‌ను తీసుకున్నాం. పోలీసాఫీసర్ పాత్రలో బాగా నటించాడు. ఒక మంచి సినిమా తీశామనే తృప్తి కలిగింది’’ అన్నారు. ‘‘సాయిశ్రీనివాస్ కెరీర్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘డైరెక్టర్‌గా చాన్స్ ఇచ్చిన కోనేరు సత్యనారాయణగారికి, బెల్లంకొండ సురేశ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు రమేశ్ వర్మ. ‘‘కవచం’ సమయంలో రమేష్ వర్మ ఈ రీమేక్ గురించి చెప్పారు. మళ్లీ పోలీస్ పాత్రే అనుకుని ముందు ఆసక్తి చూపలేదు. కానీ, తమిళ సినిమా చూశాక అద్భుతంగా అనిపించింది. ఇలాంటి సినిమాను మిస్ చేసుకోకూడదనిపించి చేశా. అద్భుతమైన థ్రిల్లర్. కోనేరు సత్యనారాయణలాంటి నిర్మాత ఈ చిత్రానికి లభించడం అదృష్టం. ఈ బ్యానర్లో తొలి చిత్రం నాదే కావడం హ్యాపీ. రమేష్ వర్మతో సహా అందరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నటుడు కాశీ విశ్వనాథ్, బేబీ దువా కౌశిక్, కెమెరామేన్ వెంకట్ సి. దిలీప్, ఎడిటర్ అమర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిజాయతీ పోలీస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ‘రైడ్, వీర’ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. ఎ. హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హవీష్ కోనేరు మాట్లాడుతూ–‘‘తమిళంలో హిట్ అయిన ‘రాక్షసన్’ చిత్రాన్ని ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్ చేశాం. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. బెల్లంకొండ శ్రీనివాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ ఈ చిత్రంతో మాటల రచయితగా పరిచయం అవుతున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్. -
‘రాక్షసుడు’ వాయిదా పడనుందా!
యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాక్షసుడు. తమిళ నాట ఘనవిజయం సాధించిన రాక్షసన్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 18న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే తాజా సమాచారం ప్రకారం రాక్షసుడు విడుదలను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. జూలై 18న రామ్, పూరిల ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అవుతుండటంతో రిలీజ్‌ను వాయిదా వేస్తే బెటర్ అని భావిస్తున్నారట. పూర్తి స్థాయి రీమేక్‌లా కాకుండా చాలా భాగం సన్నివేశాలను తమిళ్లో తెరకెక్కించినవే వాడుతూ రూపొందించిన ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. ఈ పరిస్థితుల్లో మంచి అంచనాలతో రిలీజ్ అవుతున్నా ఇస్మార్ట్ శంకర్‌తో పోటి పడటం కన్నా వాయిదా వేయటమే బెటర్ అని భావిస్తున్నారట. ముందుగా అనుకున్నట్టుగా జూలై 18న కాకుండా ఆగస్టు 2న సినిమాను రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. -
‘రాక్షసుడు’ మూవీ స్టిల్స్
-
‘రాక్షసుడు’ని భయపెడుతున్నారు!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్. పూరి, రామ్‌ల కెరీర్‌కు కీలకం కావటంతో ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్రయూనిట్. అందుకే సినిమాను వారం పాటు వాయిదా వేసి మరి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాను ముందుగా జూలై 12న రిలీజ్ చేయాలని భావించినా తాజాగా జూలై 18న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో అదే రోజు రిలీజ్ అవుతున్న రీమేక్ సినిమా రాక్షసుడుకి కష్టాలు తప్పేలా లేవు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ రూపొందిస్తున్న సినిమా రాక్షసుడు. తమిళ సూపర్ హిట్ రాక్షసన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ అవ్వటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ సినిమా పోటి వస్తే రాక్షసుడుకు ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు. రీమేక్ సినిమా కావటంతో పాటు చాలా సన్నివేశాలు ఒరిజినల్లోవే వాడటంతో రాక్షసుడుపై పెద్దగా అంచనాలు లేవు. దీనికి తోడు బెల్లంకొండ చివరి సినిమా ‘సీత’కు దారుణమైన రిజల్ట్ రావటం కూడా సినిమా మీద హైప్ రాకపోవటానికి కారణమన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఫస్ట్ నుంచి ఈ సినిమా సోలో రిలీజ్ ఉండేలా జాగ్రత్త పడ్డారు చిత్రయూనిట్, ఇప్పుడు సడన్‌గా ఇస్మార్ట్ శంకర్ పోటి రావటంలో రాక్షసుడు టీం ఆలోచనలో పడ్డారు. -
రాక్షసుడు రెడీ
‘రాక్షసుడు’ అనగానే రామాయణ, మహాభారతాల్లోని విలన్లే గుర్తుకు వస్తారు. సినిమా వాళ్లకు అయితే గతంలో చిరంజీవి హీరోగా నటించిన సూపర్‌హిట్ సినిమా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మరోసారి అదే టైటిల్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. ఏ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది. హీరో హవీశ్ ప్రొడక్షన్లో రమేశ్ వర్మ దర్శకత్వం వíß ంచారు. చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా ప్రసుత్తం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 18న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత కోనేరు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఫిబ్రవరి 21న ప్రారంభమైన మా ‘రాక్షసుడు’ చిత్రం సింగిల్ షెడ్యూల్లో 85రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడే సినిమా రష్ చూశాను. అద్భుతంగా ఉంది. సినిమా మొదలు పెట్టిన రోజు నుండే ఓ మంచి సినిమా తీస్తున్నామనే ఫీలింగ్ ఉండేది. ఈ రోజు రష్ చూశాక బ్లాక్‌బస్టర్ సినిమా తీశాం అని నమ్మకంగా ఉంది’’ అన్నారు. రమేశ్‌వర్మ మాట్లాడుతూ– ‘‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత సత్యనారాయణగారికి కృతజ్ఞతలు. మంచి టీమ్ కుదరడంతో అనుకున్న ప్రకారం సినిమాను ముగించగలిగాం’’ అన్నారు. -
‘రాక్షసుడు’ బాగానే రాబడుతున్నాడు!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న రీమేక్ మూవీ రాక్షసుడు. తమిళ్లో ఘన విజయం సాధించిన రాక్షసన్ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన రాక్షసుడు టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో హిందీ డబ్బింగ్ రైట్స్‌కు భారీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన కొన్ని సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్లు యూట్యూబ్‌లో భారీగా వ్యూస్ సాధించాయి. దీంతో రాక్షసుడు హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం 12.5 కోట్లు ఆఫర్ చేశారు. కంటెట్పరంగా కూడా యూనివర్సల్ అప్రోచ్ ఉంటుందన్న నమ్మకంతో భారీ ఆఫర్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ కూడా 6 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఎక్కువ సన్నివేశాలు తమిళ ఒరిజినల్ వర్షన్లో చిత్రీకరించినవే వాడుతున్నారు. కేవలం హీరో హీరోయిన్లు కనిపించే సీన్స్‌ను మాత్రమే రీ షూట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. -
మాటల రచయితగా మారిన సింగర్
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ మాటల రచయితగా అవతారమెత్తాడు. ఇప్పటివరకు పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించిన సాగర్.. ఇకపై మాటలతోనూ పలకరించనున్నాడు. తన సోదరుడు డైలాగ్ రైటర్‌గా మారిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. సింగర్‌గా ఉన్న తన సోదరుడు ‘రాక్షసుడు’ చిత్రంతో మాటల రచయితగా మారాడని.. ఈ విషయాన్ని పంచుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తమ తండ్రి (రచయిత సత్యమూర్తి) వారసత్వాన్ని కొనసాగించేందుకు అందరి ఆశీస్సులు కావాలని ట్విటర్ వేదికగా కోరారు. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరణ్ కాంబోలో తమిళ సూపర్‌హిట్ రాక్షసన్‌కు రీమేక్‌గా ‘రాక్షసుడు’ చిత్రం తెరకెక్కుతోంది. Am Glad 2 share dat my brother @sagar_singer whom U all know as a SINGER is bein introduced as a DIALOGUE WRITER in #RAKSHASUDU 😁🎶 Need all ur blessings 4 him to take up my Father’s Love 4 Writing n continue his Legacy🙏🏻❤️@BSaiSreenivas @anupamahere https://t.co/HbgmZO1rt7 — DEVI SRI PRASAD (@ThisIsDSP) June 8, 2019 -
ఇంతకీ రాక్షసుడు ఎవరు?
అమాయకులను అన్యాయంగా, రాక్షసానందం కోసం చంపుతుంటాడు ఓ సైకో. అతడిని పట్టుకోవడానికి పరిగెత్తే పోలీస్. ఇంతకీ రాక్షస సైకో ఎవరు? అతడిని ఈ పోలీస్ పట్టుకున్నాడా? లేదా? తెలియాలంటే ‘రాక్షసుడు’ సినిమా చూడాలంటున్నారు చిత్రబృందం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాక్షసుడు’. ఎ హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ శనివారం రిలీజ్ అయింది. టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని చిత్రబృందం తెలిపింది. ఈ సందర్బంగా నిర్మాత హవీష్ మాట్లాడుతూ – ‘‘తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘రాక్షసన్’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం. ఇందులో సాయి శ్రీనివాస్ సీరియస్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. షూటింగ్ దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై 18న మా చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: వెంకట్ సి. దిలీప్. -
‘రాక్షసుడు’ కోసం వేట!
కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన థ్రిల్లర్ మూవీ రాక్షసన్. విష్ణు విశాల్, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. రాక్షసుడు పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకోవటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రీయూనిట్. జూలై 18న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్‌ను విడుదలైంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతమందిస్తున్నాడు. హవీష్ పిక్చర్స్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. -
‘రాక్షసుడు’ టీజర్ వచ్చేస్తోంది
ఈ ఏడాది కవచం, సీత చిత్రాలతో పలకరించిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన సీత సినిమా కాస్త పర్వాలేదనిపించినా.. మంచి విజయాన్ని మాత్రం నమోదు చేయలేకపోయింది. ఇక ఇదే ఏడాది మరో చిత్రంతో ఈ హీరో పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ హిట్ చిత్రం రాక్షసన్‌ను తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరణ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె విడుదల చేసిన ‘రాక్షసుడు’ టైటిల్ లోగోకు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేయనున్నుట్లు చిత్రబృందం ప్రకటించింది. జూన్ ఒకటో తేదీన ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తుండగా.. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఈద్‌కు రాక్షసుడు
డిఫరెంట్ సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. లేటెస్ట్గా తమిళ చిత్రం ‘రాక్షసన్’ తెలుగు రీమేక్ ‘రాక్షసుడు’లో నటిస్తున్నారు. శనివారం ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎ హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మిస్తున్నారు. ‘‘ఇదో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ రచయితగా పరిచయం అవుతున్నారు. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈద్‌కు రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత హవీష్. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ సి. దిలీప్, సంగీతం: జిబ్రాన్. -
సైకో కిల్లర్ ముందు యంగ్ హీరో..!
‘కవచం’ సినిమాతో రీసెంట్గా పలకరించిన యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. చిత్ర ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నాడు. తాజాగా మరో చిత్రం నుంచి ఫస్ట్‌లుక్ ను విడుదల చేశారు. తమిళ హిట్ మూవీ రాక్షసన్‌ను తెలుగులో రాక్షసుడుగా బెల్లంకొండ హీరో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఉగాది కానుకగా.. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. సైకో థ్రిల్లర్నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులో వీర, రైడ్ ఫేమ్ రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరణ్ హీరోయిన్గా నటిస్తోంది. డైరెక్టర్ తేజ కాంబినేషన్లో రాబోతోన్న ‘సీత’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. తాజాగా రిలీజ్ చేసిన ‘సీత’ మూవీ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. Here comes the first look poster of #Rakshasudu an interesting and unique psycho thriller on the way !!@anupamahere #kaushik#RakshasuduFirstLook#HappyUgadi #eid2019 release 😃 pic.twitter.com/H3HG6jMSWr — Sai bellamkonda (@BSaiSreenivas) April 6, 2019 -
రేపే రాక్షసుడు ఫస్ట్‌లుక్
సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా.. వరుసగా చిత్రాలను చేస్తూ ఉన్నాడు యువహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తాజాగా కవచం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ హీరో.. సీత చిత్రంలో త్వరలోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఈ హీరో ఓ రీమేక్ చిత్రంలో కూడా నటించనున్నాడన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ హిట్ మూవీ రాక్షసన్‌ను.. తెలుగులో రాక్షసుడుగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రేపు విడుదల చేయనున్నట్లు.. ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. సైకో కిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అనుపమా పరమేశ్వరణ్ హీరోయిన్గా నటిస్తోంది. రైడ్, వీర ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. Here is the Pre-Look of Bellamkonda Sai Sreenivas & Anupama Parameswaran’s #Rakshasudu. First look will be out tomorrow at 11am. Directed by Ramesh Varma Penmetsa. Produced by Satyanarayana Koneru. A Havish Lakshman Koneru Production.@BSaiSreenivas @anupamahere pic.twitter.com/Bcq7seNwOo — ABHISHEK PICTURES (@AbhishekPicture) 5 April 2019 -
రాక్షసుడు
‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. మల్లి జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని.. చూడకుంటే నాకు వెన్నెలేది...’ పాట వినగానే చిరంజీవి నటించిన ‘రాక్షసుడు’ సినిమా గుర్తుకురాకమానదు. రాధ, సుహాసిని హీరోయిన్లుగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమా 1986లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘రాక్షసుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘రైడ్, వీర’ చిత్రాల ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘రాచ్చసన్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. హవీష్ లక్ష్మణ్ ప్రొడక్షన్లో ఏ స్టూడియోస్ పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్‌లో సినిమా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్. -
‘రాక్షసుడు’గా బెల్లంకొండ
కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన థ్రిల్లర్ మూవీ రాక్షసన్. విష్ణు విశాల్, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రీమేక్‌చేసే ఆలోచనలో ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమాకు రైడ్, వీర చిత్రాల ఫేం రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘రాక్షసుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. కథా కథనాల పరంగా ఈ టైటిల్ పర్ఫెక్ట్ అన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలోవెల్లడించనున్నారు. మీడియం రేంజ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీత సినిమాలో నటిస్తున్న బెల్లంకొండ, ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. ఈ సినిమాతో పాటే రాక్షసన్ రీమేక్‌లో నటించేందుకు బెల్లంకొండ ఓకే చెప్పాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీత సినిమా పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఈ నెలలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన
రాష్ట్రంలో రాక్షస పాలన రాష్ట్రం, రాక్షస, పాలన, rastram, rakshasudu, palana అధికార పార్టీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళుతున్నందుకే ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు ఆదివారం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు, నాయకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. వంద పేజీల ఎన్నికల మెనిఫెస్టోలో వెయ్యి అబద్ధాలను చెప్పిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ దురాగతాలను ఎండగట్టేందుకు చేపట్టిన గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమంతో అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. రాబోయే కాలం తమదేనని, కార్యకర్తలు అధైర్యపడకుండా మనోధైర్యంతో ఉండాలన్నారు. కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నగరి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపును టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. అందుకే తెలుగుదేశం నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. కేసులతో నాయకులను భయపెట్టాలనుకుంటే అది భ్రమ మాత్రమేనన్నారు. నగరిలో చాలామంది కార్యకర్తలపై కేసులు పెట్టారని వారిలో కొంత మంది కూడా టీడీపీ చేరలేదని గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. టీడీపీ అక్రమాలకు ఎదురు నిలిచి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ వెంటే ఉన్నారనీ.. కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి అన్నారు. కేసులకు భయపడే ప్రసక్తేలేదని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను మానుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ పూర్తిగా కనుమరగవుతుందని హెచ్చరించారు. టీడీపీ నాయకులు అధికార మదంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. అవినీతిపై పోరాటం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులపై టీడీపీ ద్వితీయ శ్రేణి కూడా దాడులకు తెగబడుతున్నా పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారని వాపోయారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. పూతల పట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో కుప్పం తరువాత నగరి, పూతలపట్టు నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలుస్తుందని ఆశించి భంగపడ్డంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఆగడాలు మితిమీరుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు అటవిక పాలన సాగిస్తున్నారని అన్నారు. సీఎం ప్రతి పక్షాన్ని గౌరవించే పద్ధతిని నేర్చుకోవాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'రాక్షసుడు' రివ్యూ
చిత్రం - 'రాక్షసుడు', తారాగణం - సూర్య, నయనతార, ప్రేమ్‌జీ అమరన్, సముద్రకణి, పార్తీబన్, కథ - స్క్రీన్‌ప్లే అసిస్టెంట్ - డి.ఎస్. కన్మణి, మాటలు - శశాంక్ వెన్నెలకంటి, పాటలు - వెన్నెలకంటి, చంద్రబోస్, శ్రీమణి, రాకేందు మౌళి, కెమేరా - ఆర్.డి. రాజశేఖర్, ఎడిటింగ్ - ప్రవీణ్ కె.ఎల్, నిర్మాతలు - కె.ఇ. జ్ఞానవేల్ రాజా, ఎం.ఎస్.ఆర్, మిర్యాల రాజాబాబు (కృష్ణారెడ్డి), దర్శకత్వం - వెంకట్ ప్రభు ................................. హాలీవుడ్ సినిమాలు బాగుంటాయి. వీలుంటే, అనుకరించడానికి మరీ బాగుంటాయి. వాటిని ఎవరు తొందరగా, ఎంత మన నేటివిటీకి దగ్గరగా, కాపీ కొట్టిన విషయం కనపడకుండా ఎలా పని కానిచ్చారన్నది కీలకం. ఇంటర్నెట్లు, స్మార్ట్ఫోన్లు, ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్ల తరంలో ఇది చాలా ఇంపార్టెంట్. కానీ, వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సూర్య తాజా సినిమా ఆ సంగతి సరిగ్గా అంచనా వేయలేకపోయినట్లుంది. హాలీవుడ్ చిత్రాలు 'ఘోస్ట్ టౌన్' 'ఘోస్ట్ బస్టర్స్' లాంటి అనేక చిత్రాల కిచిడీగా ఈ చిత్రం తయారైందని సినీప్రియులు సీన్స్ వారీగా చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే, ఇటీవలే తెలుగులో వచ్చిన 'వారధి' చిత్రం కాన్సెప్ట్ కూడా అచ్చంగా ఇదే. చనిపోయిన వ్యక్తుల ఆత్మలు తమ తీరని కోరికలను హీరో ద్వారా తీర్చుకోవడమనే ఈ కాన్సెప్ట్‌ను అచ్చంగా ఒక చోట నుంచే రెండు భాషల్లోని ఇద్దరు వేర్వేరు దర్శకులూ 'స్ఫూర్తి'గా తీసుకున్నారని సంతృప్తిపడాలి. ఆ విషయంలో ఒక చిన్న తెలుగు చిత్రం, మరో భారీ తమిళ హీరో సినిమా కన్నా ముందే వచ్చేసిందని సంబరపడాలి. కథ ఏమిటంటే... మాసు అని అందరూ పిలిచే మధుసూదన్ (సూర్య) అనాథగా పెరిగిన వ్యక్తి. చిన్నప్పటి నుంచీ అతనికో ఫ్రెండ్ (ప్రేమ్‌జీ అమరన్). వీళ్ళిద్దరూ కలసి, జట్టుగా దొంగతనాలు చేస్తూ ఉంటారు. ప్రేమించిన నర్సు మాలిని (నయనతార)కి ఉద్యోగం కోసం మూడున్నర లక్షలు కావాలంటే, భారీ దొంగతనం ప్లాన్ చేస్తారు. డబ్బు కొట్టేసి, పారిపోతున్న సమయంలో పెద్ద యాక్సిడెంట్. అందులో ఫ్రెండ్ చనిపోతాడు కానీ, మృత్యువు అంచుల దాకా వెళ్ళిన హీరో ప్రాణాలతో బయటపడతాడు. ఈ అనుకోని ప్రమాదం తరువాత హీరోకు ఒక అతీతమైన శక్తి లాంటిది వస్తుంది. చనిపోయిన ఫ్రెండ్‌తో సహా అనేక ఇతర ఆత్మలు కనిపిస్తుంటాయి. తమ కోరికలను తీర్చడానికి హీరోను సాయం అడుగుతుంటాయి. హీరో ఆ ఆత్మలతో కలసి చేసే కామెడీ పనులతో కొంత సినిమా నడుస్తుంది. ఇంతలో అచ్చం హీరో లాగానే ఉండే బిజినెస్ మ్యాగ్నెట్ శివకుమార్ (సూర్య) ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మ, హీరోతో ఒకర్ని హత్య కూడా చేయిస్తుంది. అసలింతకీ ఆ ఆత్మ ఎవరు? దానికీ, హీరోకూ ఉన్న సంబంధం ఏమిటి? అన్ని ఆత్మలూ మామూలు కోరికలు కోరుతుంటే, ఈ ఆత్మ హత్యల దాకా ఎందుకు వెళుతోంది లాంటివన్నీ సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్, దాని పర్యవసానాలతో తెలుస్తుంది. ఎలా చేశారంటే... హీరో సూర్య ఇటు అల్లరి చిల్లరి దొంగగా, అటు ఆత్మగా ఏకకాలంలో బాగా చేశారు. కానీ, పాత్ర చిత్రణల్లోనూ, కథనంలోనూ ఉన్న లోపాల వల్ల సినిమాను తన భుజాలపై మొత్తం మోయలేకపోయారు. నయనతారది గెస్ట్రోల్కు ఎక్కువ... హీరోయిన్‌కు తక్కువ తరహా పాత్ర. సినిమాలో చాలా సేపు ఆమె లేకుండానే జరిగిపోతుంటుంది. అడపా దడపా నేనున్నానంటూ తెరపైకి వచ్చి, మెరిసి మాయమవుతుంది. సినిమా అయిపోయాక, రోలింగ్ టైటిల్స్‌లో కానీ, సూర్య, నయనతారల మధ్య మాస్ మెచ్చే గ్రూప్ సాంగ్ ప్రత్యక్షం కాదు. హీరో మిత్రుడి వేషంలో దర్శకుడు వెంకట్ ప్రభు సోదరుడు ప్రేమ్‌జీ అమరన్ (ఇద్దరూ ఇళయరాజా తమ్ముడైన సంగీత దర్శకుడు గంగై అమరన్ కుమారులు) కాసేపు నవ్వించడానికి ప్రయత్నించారు కానీ, సక్సెస్ కాలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్ వగైరా తమిళానికి సెట్ అయినట్లుగా తెలుగులో కుదరలేదు. తమిళంలోని నేటివిటీ నిండిన డైలాగుల పస తెలుగులో తర్జుమా కాదు... కాలేదు కూడా! వెరసి, తమిళ బోర్డులు తెలుగులోకి మార్చి చూపించినా, డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగే మిగులుతుంది. ఒకప్పటి తమిళ హీరో పార్తీబన్ తన భారీ కాయంతో పోలీసు అధికారిగా కనిపించారు. దర్శక - నటుడు సముద్రకణి విలన్ రాధాకృష్ణ పాత్రలో బాగున్నారు. ఎలా ఉందంటే... శశాంక్ వెన్నెలకంటికి అనువాద రచయితగా ఇది 200వ సినిమా. జననం... మరణం... అంటూ జీవితం తాలూకు ఫిలాసఫీని చెబుతూ సెకండాఫ్‌లో వచ్చే పాట సాహిత్యపరంగా బాగుందనిపిస్తుంది. కెమేరా పనితనం, ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఘట్టాల్లో కనిపిస్తుంది. యాక్షన్ పార్ట్, ఇతర విషయాల్లో నిర్మాణ విలువలు బాగున్నాయి. కథలో పెద్ద దమ్ము లేకపోవడం, ఆత్మల కోరికలు తీర్చే ఘట్టాలను ప్రేక్షకుణ్ణి ఆసక్తిగా కూర్చోబెట్టేలా చెప్పలేకపోవడం మైనస్. ఆ మేరకు రచన, దర్శకత్వాలను నిందించాలి. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయానికీ, ఆత్మల విషయం అర్థమయ్యేలా చేయడానికీ సరిపోయింది. ద్వితీయార్ధంలోనే ప్రధాన కథ నడుస్తుంది. హీరో తండ్రి ఫ్లాష్‌బ్యాక్ ఘట్టం పట్టుగా నడుస్తుంది. కానీ, అప్పటికే రిలీఫ్ లేకుండా సుదీర్ఘమైన సినిమా చూసేసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. చివరకొచ్చేసరికి, రొటీన్‌గా తండ్రి పగను కొడుకు తీర్చుకున్న ఫార్ములా చట్రంలో సినిమా ముగుస్తుంది. తండ్రినీ, తల్లినీ (ప్రణీత) చంపినవాళ్ళపై కొడుకు పగతీర్చుకోవడమనే రెవెంజ్ ఫార్ములాకు, ఆత్మల నేపథ్యం జోడించిన విసుగెత్తించే ప్రయత్నంగా 'రాక్షసుడు' మిగిలింది. మొత్తం మీద, హాలీవుడ్లో కాకపోయినా, కనీసం తెలుగు తెరపై 'వారధి' ద్వారా ఇప్పటికే చూసేసిన ఈ ఆత్మల కోరికలు తీర్చే కాన్సెప్ట్‌ను పెద్ద హీరో, కాస్తంత భారీ నిర్మాణ విలువలు, టెక్నికల్ అంశాలతో చూడాలనుకుంటే తెరపై రెండున్నర గంటల పైగా 'రాక్షసుడు'ను భరించవచ్చు. - రెంటాల జయదేవ -
కొత్త సూర్యుడు
హీరోగా ఎంతో సంపాదిస్తాం... పేరు, ఇమేజ్, డబ్బు... ఎట్సెట్రా... ఎట్సెట్రా... మరి, మనిషిగా ఏం సంపాదించాలి? తెలుగునాడు దాకా విస్తరించిన తమిళ హీరో సూర్యను అడిగి చూడండి. చాలా చెబుతాడు... ‘ఎదిగినకొద్దీ ఒదిగి ఉండమ’నే ఫిలాసఫీకి నిదర్శనంగా నిలుస్తాడు. సినిమా నుంచి జీవితం దాకా కొత్త సూర్యుడు కనిపిస్తాడు. కొత్త దర్శకులు, కొత్త తరహా సినిమాలతో ఇటీవల తమిళ చిత్రసీమలో చాలా మార్పులొచ్చాయి. గతంలో ప్రతి ఆరేడేళ్ళకు మార్పు వచ్చేది. ఇప్పుడు ప్రతి రెండున్నరేళ్ళకు ఐడియాల్లో, ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వస్తోంది. మారుతున్న టెక్నాలజీ, ఇంటర్నెట్ వల్ల - షార్ట్ ఫిల్మ్స్‌ను యూ ట్యూబ్‌లో పెట్టడం, ఫిల్ము పోయి సినిమా డిజిటలైజ్ కావడం, 5డి కెమేరాతో కూడా సినిమాలు తీయడం, కోటి బడ్జెట్ లోపలే రెండు గంటల సినిమా తీయగలగడం సాధ్యమయ్యాయి. రెగ్యులర్ మెలోడ్రామా పక్కనపెట్టి, కొత్త కంటెంట్‌ను జనం కోరుతున్నారు. ఇదంతా వెల్కమ్ చేయాల్సిన మార్పు. సమకాలీన తమిళ హీరోల గురించి మీరేమంటారు? ఒకే కథ, స్క్రిప్ట్‌ను ఒక్కో హీరో, ఒక్కో దర్శకుడు ఒక్కో రకంగా తీస్తారు. అలాగే, కొత్త జనరేషన్ వాళ్ళు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే తీరు, వాళ్ళకు సినిమా ద్వారా చెప్పే విషయాలు, ఆ ఎక్స్ప్రెషన్స్ వేరుగా ఉంటాయి. ఒక యాడ్‌లా ఫాస్ట్‌గా చెప్పాలనుకుంటారు. ఎమోషన్ ఒక్క సెకన్లో అలా వచ్చి, వెళ్ళిపోవాలి. ఎమోషన్స్‌ను ఎక్స్టెండ్ చేయకూడదు. ఇప్పుడంతా టీ-20 జనరేషన్. న్యూ జనరేషన్ సినిమాకు మీరెలా సిద్ధమవుతున్నారు? ఒకటే మంత్రం. కొత్త ఆలోచనల్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండాలి. కొత్త దర్శకులతో పనిచేయాలి. వాళ్ల కొత్త ఐడియాలతో, ఎడ్వెంచరస్‌గా ముందుకెళ్ళాలి. ఈ సినిమాను మీరే నిర్మించడానికి కారణం? మలయాళంలో వచ్చిన ‘హౌ ఓల్డ్ ఆర్ యు’ నచ్చి, ‘జో’ మళ్ళీ తెర మీదకు రావాలంటే ఇలాంటి బలమైన ఉమన్ సెంట్రిక్ ఫిల్మే సరైనదని రీమేక్ చేశాం. నిర్మాణం మరొక రికి అప్పగించి, రాజీ పడే కన్నా బాగా తీసి, జనానికి మంచి కంటెంట్ ఇవ్వాలనుకుని, సొంతంగా నిర్మించా. చాలామంది స్త్రీలకు స్ఫూర్తి నిస్తోంది. పత్రికలన్నీ ‘ఎల్లా ఆన్గళుమ్ పార్క వేండియ పడమ్’ (మగవాళ్ళంతా చూడాల్సిన సినిమా) అని రాశాయి. తెలుగులో రిలీజ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ‘జో’కు ఇక్కడ మంచి మార్కెటుంది. జనానికి తను బాగా తెలుసు. రీమేక్ చేయలేను. డబ్ చేయాలనుంది. రానున్న మీ చిత్రం తమిళంలో ‘మాస్’, తెలుగులో ‘రాక్షసుడు’ అంటున్నారు. సంబంధమే ఉన్నట్లు లేదు. (నవ్వేస్తూ...) రెండు టైటిల్స్కూ అండర్ కరెంట్‌గా ఒక సంబంధం ఉంది. తమిళంలో నా పాత్ర పేరు - మాసిలామణి. అందుకు తగ్గట్లుగా అక్కడ ‘మాస్’ అని పెట్టాం. తెలుగులో హీరో నాగార్జున గారు ‘మాస్’ పేరుతో ఒక సూపర్‌హిట్ చిత్రం చేసేశారు. దాంతో, కథకూ, పాత్రకూ తగ్గట్లు ‘రాక్షసుడు’ అని పెట్టాం. ఈ సినిమా హార్రర్ అనీ, థ్రిల్లర్ అనీ రకరకాలుగా... దర్శకుడు వెంకట్ ప్రభు కానీ, నేను కానీ గతంలో ఎప్పుడూ చేయని తరహా సినిమా. ఇది హార్రర్ సినిమా కాదు. దెయ్యాలు, భూతాల లాంటివి ఉండవు. భయ పెట్టే యాక్షన్ థ్రిల్లర్, ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. నయనతారతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ‘గజిని’తో మొదలుపెడితే... నయన్‌తో నాకిది మూడో సినిమా. ఆమెలో ఎంతో మెచ్యూరిటీ వచ్చింది. ఆమె నడుచుకుంటూ వచ్చి, కెమేరా ముందు నిల్చొనే విధానం, పనిచేసే తీరు ఎంతో మారింది. మీరు, దర్శకుడు వెంకట్ ప్రభు మంచి ఫ్రెండ్సనుకుంటా? (నవ్వుతూ...) మేమిద్దరం స్కూల్మేట్లం. అతను నా కన్నా కేవలం నాలుగు నెలలు చిన్న. అయినా సరే, నన్ను ‘అన్నా’ అని పిలుస్తాడు. (నవ్వులు...) నన్ను అలా పిలిచే మొట్టమొదటి దర్శకుడు అతనే! నేను, మహేశ్‌బాబు, వెంకట్ ప్రభు, యువన్ శంకర్‌రాజా, కార్తీక్ రాజా, తమ్ముడు కార్తీ - మేమందరం చెన్నైలో సెయింట్ బీట్స్ స్కూల్లో చదువుకున్నవాళ్ళమే. సినిమా అంటే దర్శకుడితో దాదాపు పది నెలలు కలిసి ప్రయాణించాలి. ముందు నుంచి స్నేహితులం కాబట్టి, మేము కలిసి పనిచేయడం ఈజీ అవుతుంటుంది. మీరు, మహేశ్, వెంకట్ ప్రభు కలసి చేయనున్నారని... (నవ్వేస్తూ...) అది మహేశ్‌బాబుతో కాదు. రవితేజ సార్, నేను, వెంకట్ ప్రభు కలసి సినిమా చేయాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్ళలేదు. సినిమా కథలో దర్శకుడికి కరెక్షన్స్ చెబుతారట! (ఒక్క క్షణం ఆగి...) అలాగని కాదు... దర్శకుల శక్తిసామర్థ్యాలు, వాళ్ళు అంతకు ముందు చేసిన ప్రాజెక్ట్‌లు నాకు తెలుసు. కాకపోతే, వాళ్ళ బెస్ట్ నా సినిమాకు ఇచ్చేలా చేయాలని చూస్తుంటా. ఆ విషయంలో నేను కొంత స్వార్థపరుణ్ణి. (నవ్వులు...) అందుకే, ఆ సినిమా కథ, స్క్రీన్‌ప్లే పరిధిలోనే ఎంత వరకు వెళ్ళవచ్చు, ఏయే కొత్త ఎలిమెంట్స్ తీసుకొచ్చి కలపవచ్చనేది చూస్తుంటాం. బేసిక్‌గా నా సబ్జెక్ట్‌లు నా కన్నా పెద్దవిగా ఉండాలని కోరుకుంటా. అంతే తప్ప నేను స్క్రిప్ట్‌నూ, కథనూ డామినేట్ చేయాలనుకోను. మీకు గ్రాఫిక్స్ మీద అవగాహన ఉందట? అంతలేదు. ‘అదెల్లా ఓవర్ బిల్డప్ సర్!’ (అదంతా మరీ ఓవర్‌గా బిల్డప్ ఇవ్వడం సార్). నాకో మంచి ఫ్రెండ్ ఉన్నాడు. అతను లండన్ వెళ్ళి, 15 ఏళ్లు అనుభవం సంపాదించి, చెన్నైకి తిరిగివచ్చాడు. అతను నా తాజా సినిమా గ్రాఫిక్స్‌కు హెల్ప్ చేశాడు. సినిమా మీద ఇంత అవగాహన ఉంది. దర్శకత్వం చేపట్టే ఛాన్సుందా? నాట్ ఎట్ ఆల్! అయామ్ హ్యాపీ విత్ మై డెరైక్టర్స్. కాకపోతే, నేను నటించలేకున్నా, మంచి విషయం ఉన్న చిన్నతరహా సినిమాలను నిర్మించాలని అనుకుంటున్నా. ఎందుకంటే, అలాంటి కథల్ని మన హీరో ఇమేజ్‌కు తగ్గట్లు మార్చడం, విషయాన్ని డైల్యూట్ చేయడం సరైనది కాదు. అందుకే, ఆ సినిమాల్లో నేను నటించకుండా, కేవలం నిర్మించాలనుకుంటున్నా. ఆస్కార్ సినిమాలు చూస్తుంటారా? ఇటీవల నచ్చిన హాలీవుడ్ హీరోలు? అంత లెవల్ లేదు సార్! నిజం చెప్పాలంటే, నేను అంత శ్రద్ధగా, రోజూ రాత్రి హాలీవుడ్ సినిమా చూసి పడుకొనే రకం కాదు. ఎక్కువగా స్క్రిప్టులు చదువుతుంటా. ప్రాంతీయ భాషా సినిమాలు చూస్తుంటా. వాటి గురించి తెలుసుకుంటూ ఉంటా. అంతే తప్ప, విదేశీ సినిమాలను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవడం ఉండదు. ఆ మధ్య ఆస్కార్ వచ్చిన ‘బర్డ్ మ్యాన్’ చూశా. బాగుంది. కాకపోతే, ఆ సినిమా బాగా అర్థం కావడానికి, ఆ పాత్ర లాగా కనిపించడానికి అతని ప్రయత్నం గురించి అర్థం చేసుకోవడానికి ఒకటికి, నాలుగుసార్లు చూడాలి. మీ ఇంట్లోనే తమ్ముడు కార్తీ నుంచి మంచి పోటీ! నటుడిగా మీకూ, అతనికీ పోలికలు, తేడాలు? కార్తీ సినిమాలు తెగ చూస్తాడు. స్క్రీన్‌ప్లే, స్క్రిప్ట్, షాట్ డివిజన్ లాంటివి బాగా ఎనలైజ్ చేయగల సమర్థుడు. ఆ విషయంలో వాడికి నా కన్నా బెటర్ నాలెడ్జ్ ఉంది. నిజానికి, వాడు దర్శకుడు కావాలనుకున్నాడు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. అందుకే, వాడికి సినిమా మేకింగ్‌లో విషయాలు తెలుసు. ఫలానా షాట్ ఎలా తీశారనేది అబ్జర్వ్ చేసి, అప్రీషియేట్ చేయడం ఒక్కోసారి నాకు తెలియదు. కానీ, కార్తీ అలా కాదు. వాడు సినిమాలు ఎంచుకొనే విధానం నాకు నచ్చుతుంది. వాడైనా, నేనైనా మా దగ్గరకొచ్చిన ఏ మంచి స్క్రిప్ట్‌నూ వదులుకోం. నాలుగైదేళ్ళుగా చేస్తున్నదదే. ధనుష్ లాగా బాలీవుడ్‌కు వెళ్ళాలని మీకెప్పుడూ అనిపించలేదా? నేనిక్కడ హ్యాపీగా ఉన్నా. ఇక్కడ ఎలాంటి వ్యాక్యూమ్ లేదు. అలాంటప్పుడు ఇక్కడ వదిలేసి, మరోచోటికి వెళ్ళడమెందుకు? మీ కుటుంబం సేవాకార్యక్రమాలు చేస్తారనీ, దిగువ తరగతికి చెందిన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నారనీ విన్నాం. అవును. ‘అగరమ్ ఫౌండేషన్’ (అగరమ్ డాట్ ఇన్) అని సంస్థను 2006లో ప్రారంభించాం. 2010 నుంచి దానిలో ‘విదై’ అని ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ ప్రారంభించాం. అందులో గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివే ఫస్ట్ జనరేషన్ కిడ్స్ను ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళు కాలేజ్ చదువు దాకా వెళ్ళి, డిగ్రీ పూర్తి చేసేవరకు సమస్తం మేము సమకూరుస్తాం. పిల్లలకు సైకోమెట్రిక్ టెస్ట్‌లు కూడా పెట్టి, వాళ్ళకు ఏది బాగా వస్తుందో ఆ కోర్సులో చేర్పిస్తాం. వాళ్ళకు ఏదో ఫీజు కట్టేసి వదిలేయడం కాకుండా, వాళ్ళు ప్రొఫెషనల్ డిగ్రీ చదివే నాలుగేళ్ళూ వాళ్ళ గురించి పట్టించుకొనే వలంటీర్లు ఉంటారు. ప్రతి వారం వాళ్ళకు వర్క్‌షాపులు పెడతాం. ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లతో ఇంటరాక్షన్ పెడతాం. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుస్తాం. అలా సమగ్రమైన విద్యను అందించడం మా ప్రాజెక్ట్ లక్ష్యం. దాని వల్ల వాళ్ళు బాగా చదువుకొని, మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మళ్ళీ ‘అగరమ్’కు వచ్చి, వలంటీర్లుగా పనిచేస్తున్నారు. నటులుగా కన్నా, వ్యక్తులుగా మా కుటుంబానికి ఎక్కువ తృప్తినిస్తున్న పని ఇది. మీ నాన్న గారైన... ఆ తరం ప్రముఖ హీరో శివకుమార్ ప్రభావం మీ మీద ఏ మేరకు ఉంది? నాన్న గారి ప్రభావం చాలా ఉంది. మాలోని మంచి లక్షణాలన్నిటికీ మా అమ్మా నాన్నే కారణం. మాకు కొన్ని విలువలు నేర్పారు. చాలామంది నటీనటుల జీవితాల్లో ఏం జరిగిందో మా నాన్న గారు మాతో పంచుకునేవారు. ‘ఈ ఇమేజ్, ఈ జీవితం అంతా ఒక నీటి బుడగ లాంటిది. ఏ క్షణమైనా ఈ బుడగ పేలిపోతుంది. కోట్ల మంది చూసి, మెచ్చుకొనే సినీ జీవితం ఒక అదృష్టం. అయితే, అంతా మన ప్రతిభ అనుకొంటే పొరపాటు. మనకు తెలియని అతీత శక్తి ఆశీర్వాదం వల్ల ఈ పేరు ప్రతిష్ఠలు, డబ్బు వచ్చాయని గ్రహించాలి. ‘సక్సెస్, ఫెయిల్యూర్... ఏదీ శాశ్వతం కాదు. ప్రతిదీ వెళ్ళిపోతుంద’ని గుర్తుంచుకోవాలి’ అని చెబుతుంటారు. అదే నా జీవన సూత్రం. -
ఈ ‘రాక్షసుడు’ చాలా విభిన్నం : సూర్య
‘‘ముందు ఓ ప్రేమకథ చేయాలనుకున్నాం. కానీ, కొన్ని వైవిధ్యమైన అంశాలు జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఓ డిఫరెంట్ జానర్లో ఈ సినిమా ఉంటుంది’’ అని సూర్య అన్నారు. ఆయన హీరోగా స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో వెంకట్ ప్రభు తమిళంలో నిర్మించిన ‘మాస్’ చిత్రం ‘రాక్షసుడు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార, ప్రణీత కథానాయికలు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ ప్రభు మాట్లాడుతూ -‘‘రవితేజ-సూర్య కాంబినేషన్లో ఓ సినిమా రూపొందించాలనుకున్నాం కానీ, కుదర్లేదు. ఇప్పుడు సూర్యతో చేసిన ఈ సినిమా చాలా కొత్త జానర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికీ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది’’ అన్నారు. ఈ సినిమాలో మంచి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత జ్ఞానవేల్ రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో రచయిత వెన్నెలకంటి, ఛాయాగ్రాహకుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘రాక్షసుడు’ స్టిల్స్