
యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాక్షసుడు. తమిళ నాట ఘనవిజయం సాధించిన రాక్షసన్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 18న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.
అయితే తాజా సమాచారం ప్రకారం రాక్షసుడు విడుదలను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. జూలై 18న రామ్, పూరిల ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అవుతుండటంతో రిలీజ్‌ను వాయిదా వేస్తే బెటర్ అని భావిస్తున్నారట. పూర్తి స్థాయి రీమేక్‌లా కాకుండా చాలా భాగం సన్నివేశాలను తమిళ్‌లో తెరకెక్కించినవే వాడుతూ రూపొందించిన ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు.
ఈ పరిస్థితుల్లో మంచి అంచనాలతో రిలీజ్ అవుతున్నా ఇస్మార్ట్ శంకర్‌తో పోటి పడటం కన్నా వాయిదా వేయటమే బెటర్ అని భావిస్తున్నారట. ముందుగా అనుకున్నట్టుగా జూలై 18న కాకుండా ఆగస్టు 2న సినిమాను రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment