
సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా.. వరుసగా చిత్రాలను చేస్తూ ఉన్నాడు యువహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తాజాగా కవచం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ హీరో.. సీత చిత్రంలో త్వరలోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఈ హీరో ఓ రీమేక్ చిత్రంలో కూడా నటించనున్నాడన్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్ హిట్ మూవీ రాక్షసన్‌ను.. తెలుగులో రాక్షసుడుగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రేపు విడుదల చేయనున్నట్లు.. ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. సైకో కిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అనుపమా పరమేశ్వరణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రైడ్, వీర ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Here is the Pre-Look of Bellamkonda Sai Sreenivas & Anupama Parameswaran’s #Rakshasudu. First look will be out tomorrow at 11am. Directed by Ramesh Varma Penmetsa. Produced by Satyanarayana Koneru. A Havish Lakshman Koneru Production.@BSaiSreenivas @anupamahere pic.twitter.com/Bcq7seNwOo
— ABHISHEK PICTURES (@AbhishekPicture) 5 April 2019
Comments
Please login to add a commentAdd a comment