‘ఐదేళ్లుగా ఇలాంటి సక్సెస్ కోసం వెయిట్ చేశాను’ | Bellamkonda Suresh On Rakshasudu Success Meet | Sakshi
Sakshi News home page

‘రాక్షసుడు’ హిట్‌ చేసినందుకు కృతజ్ఞతలు : బెల్లంకొండ సురేష్‌

Published Mon, Aug 5 2019 6:02 PM | Last Updated on Mon, Aug 5 2019 6:02 PM

Bellamkonda Suresh On Rakshasudu Success Meet - Sakshi

భారీ క్యాస్టింగ్‌తో, హై బడ్జెట్‌ చిత్రాలతో సినిమాలు చేస్తూ మాస్‌ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. తాజాగా రాక్షసుడు చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. మాస్‌ మంత్రం జపిస్తూ వచ్చిన ఈ హీరో.. తన పంథాను మార్చుకుని ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీలో నటించాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది.

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ..‘ ‘రాక్షసుడు’ సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ‘అల్లుడు శీను।.. అప్పట్లో చాలా మంది హీరోలకు సమానంగా రూ.34 కోట్లు షేర్ వచ్చింది. గ్రాండియర్, కమర్షియల్ వేల్యూస్ ఉన్న ఈ సినిమాతో వి.వి.వినాయక్ డైరెక్షన్‌ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యారు. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన `జయజానకి నాయక` భారీ క్యాస్టింగ్, బడ్జెట్‌తో రూపొందింది. అవన్నీ డైరెక్టర్‌కి, ఇతర క్యాస్టింగ్‌కి పేరుని తెచ్చిపెట్టాయి. అయితే `రాక్షసుడు` సినిమా మా అబ్బాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా నుంచి మా అబ్బాయి ప్రతి సినిమాకు జర్నలిస్ట్ అసోసియేషన్‌కు రూ.10 లక్షలను ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. రమేష్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరణ్‌ హీరోయిన్‌గా నటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement