Ramesh Varma
-
యాక్షన్‌కి సై
రాఘవ లారెన్స్ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఏ స్టూడియోస్ ఎల్ఎల్పీ, నీలాద్రిప్రోడక్షన్స్, హవీష్ప్రోడక్షన్స్పై కోనేరు సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. ‘‘బిగ్ యాక్షన్ అడ్వంచరస్‌గా రూపొందనున్న చిత్రమిది. రాఘవా లారెన్స్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కనుంది.‘రాక్షసుడు, ఖిలాడీ’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత రమేశ్ వర్మ, కోనేరు సత్యనారాయణ కాంబినేషన్లో రానున్న మూడో సినిమా ఇది. భారీ వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు త్వరలోనే ప్రకటిస్తాం. నవంబర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి 2025 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని మేకర్స్ తెలిపారు. -
ఖిలాడి డైరెక్టర్‌తో రవితేజ వివాదం, రమేష్ వర్మ భార్య షాకింగ్ కామెంట్స్
Khiladi Director Ramesh Varma Wife Shocking Comments On Ravi Teja: ‘మాస్ మహారాజా’ రవితేజపై ‘ఖిలాడి’ డైరెక్టర్ రమేష్ వర్మ భార్య రేఖ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవితేజను ఉద్దేశిస్తూ ఆమె చీప్ యాక్టర్ అంటూ ఆమె షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్‌టాపిక్ మారాయి. ఇదిలా ఉంటే ఇటీవల ‘ఖిలాడి’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో రవితేజ, రమేష్ వర్మపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అవి కాస్తా సటైరికల్‌గా ఉన్నప్పటికి రమేష్ వర్మ వాటిని పెద్దగ పట్టించుకోలేదు. అంతేకాదు అంతా బాగానే ఉన్నట్లు ఇద్దరూ వ్యవహరించారు. అయినప్పటికీ రవితేజ వ్యాఖ్యలు చూస్తుంటే వారిద్దరి మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నట్లు అనుమానాలు తలెత్తాయి. చదవండి: ఆ సినిమా నా కెరీర్‌ను నాశనం చేసింది: బిగ్‌బాస్ కౌశల్ షాకింగ్ కామెంట్స్ ఈ క్రమంలో ఆయన భార్య చేసిన ఇన్‌స్టా స్టోరీ పోస్టులు ఈ అనుమానాలకు మరింత బలకం చేకూరేలా కనిపిస్తున్నాయి. ఇంతకి అసలేం జరిగిందంటే.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ, డైరెక్టర్‌పై కాస్తా అసహనం చూపించాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. నిర్మాత సత్యన్నారాయణను ఉద్దేశించి ఖిలాడీ సినిమాకు సంబంధించి మీరే దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోవాల్సిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతకు ముందు దర్శకుడు మహర్జాతకుడని, సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతతో కారు కూడా కొనిపించుకున్నాడంటూ సైటిరికల్గా వ్యాఖ్యలు చేశాడు రవితేజ. ఇక రచయిత శ్రీకాంత్ విస్సా కారణంగానే ఖిలాడి సినిమా చేయడానికి ఒప్పుకున్నా అని డైరెక్ట్‌గా చెప్పేశాడు. చదవండి: ‘ఖిలాడి’ మూవీ రివ్యూ ఇలా ఇద్దరి మధ్య చిన్న పాటి యుద్ధం నడుస్తుండగా రమేశ్ వర్మ భార్య చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లుగా ఉన్నాయి. ఆమె తన స్టోరీలో ‘గతంలో దర్శకుడు అజయ్ భూపతి రవితేజను చీప్ యాక్టర్ అని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది’ అంటూ రేఖవర్మ పోస్ట్ పెట్టారు. దీంతో రవితేజ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. అసలు రవితేజకు, రమేష్ వర్మకు మధ్య ఏం జరిగిందనేది చర్చనీయాంశ కాగా.. ఈ వివాదంలోకి రమేష్ వర్మ రేఖ రావడం మరింత హాట్‌టాపిక్ మారింది. మరి ఇది ఎంతవరకు వెళుతుంది, ఆమె వ్యాఖ్యలపై రవితేజ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తిగా మారింది. కాగా రవితేజ, రమేశ్ వర్మలు కాంబినేషన్లో గతంలో వీరా మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ పదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఖిలాడీ మూవీ వచ్చింది. -
ఖిలాడీ ట్విటర్ రివ్యూ, ఎలా ఉందంటే?
మాస్ మహారాజ రవితేజ తాజాగా నటించిన చిత్రం ఖిలాడీ. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లు. రిలీజ్ డేట్ దగ్గర పడ్డాక ప్రమోషన్ల స్పీడు పెంచి సినిమాకు హైప్ తెచ్చింది చిత్రయూనిట్. అదృష్టాన్ని కాకుండా కష్టాన్నే నమ్ముతానన్న రవితేజ ఈ సినిమా విజయాన్ని అందుకోవడం తథ్యమని ఎంతో ధీమాగా ఉన్నాడు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ కమర్షియల్ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 11న) థియేటర్లలో రిలీజైంది. మరి ఈ సినిమా హిట్టయ్యిందా? ఫట్టయ్యిందా? ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కథ ఎలా ఉంది? ఎవరెలా చేశారు? హిట్టా? యావరేజా? పలు అంశాలను ట్వీట్ల రూపంలో తెలియజేస్తున్నారు. అవేంటో ఓ సారి చూసేద్దాం.. ఖిలాడీ యావరేజ్ సినిమా అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం సూపర్ హిట్ బొమ్మ అని పొగిడేస్తున్నారు. ఫస్టాఫ్ అంతా రొటీన్ కామెడీతో సాగిందని, పెద్దగా కొత్త కంటెంట్ ఏం లేదని పెదవి విరుస్తున్నారు. ఇటలీ చేజింగ్ సీన్లో కెమెరా వర్క్ తప్ప అంతా రోతనే కనిపిస్తుందని విమర్శిస్తున్నారు. కొన్ని సాంగ్స్ మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయని, దేవిశ్రీప్రసాద్ మిగతా సాంగ్స్ కూడా అదిరిపోయేలా ఇచ్చుంటే బాగుండేదంటున్నారు. మొత్తంగా ఖిలాడి సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తున్నట్లు కనిపిస్తోంది. #Khiladi Review Routine commercial potboiler with twists adding to it. Director failed to engage. Flop, 2/5 ! — Desi Box Office (@DesiBoxOffice) February 11, 2022 Telugu lo Manchi talk osthundi Hindi lo kuda Manchi talk vaste #Khiladi pic.twitter.com/C9Jaybo7iK — T🇦🇦ʀᴜɴ འaل KᴜᴍⒶR (@TarunRajKumarAA) February 11, 2022 Stuff account lu oka 2 days pandaga. Anasuya in Interval 😂 #Khiladi — Silent GuaRRRdian (@Kamal_Tweetz) February 11, 2022 Not even single point or scene is interesting in entire first half #Khiladi — Team RRR (@kiran_nine) February 11, 2022 Interval ,second half mass action s superhit 💥💥 Mahesh Babu fans #Khiladi — Mahesh Anna (@Vijay12425550) February 11, 2022 40 mins in to the movie…Comedy scenes going on decent so far #Khiladi — Rakita (@Perthist_) February 11, 2022 #Khiladi Hit talk nadustunde 🔥🔥 Weekend vellali 😍 CONGRATULATIONS @RaviTeja_offl annaaaaaaa — పోకిరి🔔 (@Pokiri_Freak) February 11, 2022 Done with the show First half : above average, comedy seems to be routine but internal bang Face screaming in fearCollision symbol Second half: Racy action sequences and twists Fire... blockbuster 2nd half Overall BOMMA HIT @DirRameshVarma @AstudiosLLP#Khiladi — su DHEER Varma ALLURI (@suDheerVarmaAA) February 11, 2022 Positive response from Overseas 💥💥#Khiladi Can't wait to watch 🤩🤩 Evening show planned 😁👍 Krack movie la ne blockbuster avvali 💥💥 — Raghava Reddy (@Raghava_Reddy_) February 11, 2022 #Khiladi@RaviTeja_offl First Half Report: So far, the movie is average and it takes time to get into the main story. Some comedy scenes are good. A decent interval block. Let's see what the film holds in the second half. — Charan (@ursCharanDevil) February 11, 2022 Sandhya 35mm#Khiladi 🔥🔥🤙🤙🤙 pic.twitter.com/6nCiP6DdFJ — Raviteja Era (@RavitejaEra) February 11, 2022 Movie hit @Khiladi 🔥❤ https://t.co/3woXro31KB — Rowdy Kanna (@KannaBangaram7) February 11, 2022 #Khiladi movie pakka hit .. Reasons mass ki connect avutundi 1 hr average ..next movie good to very good Songs baaga nacchutai .. Solo release ..no other movie watch — JMB (@EmiratesBabu) February 11, 2022 -
హీరోయిన్‌కు సారీ చెప్పిన 'ఖిలాడి' డైరెక్టర్
Khiladi Director Ramesh Varma Says Sorry To Heroine: మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు రమేశ్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'ఖిలాడి'. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి - డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ రమేశ్ వర్మ.. స్టేజ్‌పైనే హీరోయిన్ మీనాక్షి చైదరికి క్షమాపణలు చెప్పారు. ఖిలాడీ ట్రైలర్ సహా ఇతర ప్రమోషన్స్‌లోనూ డింపుల్ హాయాతినే ఎందుకో కాస్త ఎక్కువగా చూపించారు. ఈ విషయంలో ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ.. సినిమా చూశాక నువ్వు సంతోషిస్తావు. సినిమాలో ఇద్దరికీ సమాన ప్రాధన్యత ఉంటుంది అంటూ పేర్కొన్నారు. రమేశ్ వర్మ మాటలకు కన్విన్స్ అయిన మీనాక్షి చిరునవ్వుతోనే సరే అన్నట్లుగా సమాధానం చెప్పింది. -
అరగంటలో అన్ని సాంగ్స్ కంపోజ్ చేసిన దేవిశ్రీప్రసాద్
‘‘ఏ సినిమాని కూడా నేను నటునిగా చూడను.. ఒక ప్రేక్షకునిగా చూస్తాను. నేను కూడా మీలో(ఆడియన్స్) ఒక్కణ్ణే. ఓ ప్రేక్షకునిగా నాకు ‘ఖిలాడీ’ నచ్చింది కాబట్టి మీకూ నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అని హీరో రవితేజ అన్నారు. రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఖిలాడీ’. రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘నేను జాతకాన్ని, అదృష్టాన్ని పెద్దగా నమ్మను. వందశాతం కష్టాన్నే నమ్ముతాను. అయితే ఒకటి లేదా రెండు శాతం నాకు లక్ ఉండి ఉంటుంది.. ఆ మాత్రం లక్ కూడా లేకపోతే ఇక్కడి వరకు రాలేను. రమేష్ వర్మకి జాతకం, అదృష్టం శాతాలను పెంచాలనిపిస్తోంది. ఆ జాతకానికి, అదృష్టానికి ఓ పేరు ఉంటే కోనేరు సత్యానారాయణగారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. మీనాక్షి, డింపుల్ హయతి భవిష్యత్‌లో స్టార్ హీరోయిన్స్ అవుతారనే నమ్మకం ఉంది. నేను ‘ఖిలాడీ’ ఒప్పుకోవడానికి ఒక కారణం రచయిత శ్రీకాంత్ విస్సా, మరోకారణం సత్యనారాయణగారు. ఈ సినిమాలో నేను బాగున్నాను అంటే ఆ క్రెడిట్ జీకే విష్ణుగారికి వెళ్తుంది’’ అన్నారు. కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘ ఖిలాడీ’ ఈ నెల 18న విడుదల చేద్దామనుకున్నాం. కానీ 11న రిలీజ్ చేద్దామని ఐదు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నాం. ప్రీ రిలీజ్ వేడుకకి చిరంజీవి, బాలకృష్ణగార్లను ఆహ్వానించాం.. వారు బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు. ‘ఖిలాడీ’తో రవితేజ వందశాతం పాన్ఇండియా హీరో అయిపోయారు. ఈ మూవీ చూస్తే రాజమౌళిగారి సినిమాలా అనిపించింది. రమేశ్ వర్మతో ఈ చిత్రం చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు. డైరెక్టర్ రమేష్ వర్మ మాట్లాడుతూ – ‘‘కథ చెప్పిన 15 నిమిషాలకే సినిమా చేద్దామని చెప్పిన రవితేజకు థ్యాంక్స్. అరగంటలో అన్ని సాంగ్స్ ఇచ్చేశాడు దేవిశ్రీ ప్రసాద్. డింపుల్, మీనాక్షిలకు సమానమైన క్యారెక్టర్స్ ఉంటాయి. నాకు అవకాశం ఇచ్చిన సత్యనారాయణగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘చిన్నగ్యాప్ తర్వాత రవితేజగారితో వర్క్ చేశాను.‘ఖిలాడి’ లో కొన్ని సీన్స్ చూసినప్పుడు ఇంగ్లీష్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ వేడుకలో నిర్మాత దాసరి కిరణ్ కుమార్, డైరెక్టర్స్ బాబీ, నక్కిన త్రినాథరావు, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటి అనసూయ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రవితేజ ‘ఖిలాడీ’ మూవీ స్టిల్స్
-
డైరెక్టర్‌కు రేంజ్ రోవర్ కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
సాధారణంగా సినిమా రిలీజ్ అయ్యాక మంచి సక్సెస్ అయితే డైరెక్టర్స్‌కి హీరోలు, నిర్మాతల నుంచి బహుమతులు వస్తుంటాయి. కానీ రిలీజ్‌కు ముందే ఖిలాడి డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ అందింది. మాస్‌రాజా రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్వకత్వంలో రూపొందుతున్న సినిమా ఖిలాడి. ఫిబ్రవరి11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ విజయంపై ఇప్పటికే మేకర్స్ చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌కు ముందే డైరెక్టర్ రమేశ్ వర్మకు నిర్మాత కోనేరు సత్యనారాయణ అదిరిపోయే బహుమతి ఇచ్చారు. కోటిన్నర రూపాయల విలువైన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో కనిపించనున్నారు. -
'డైరెక్టర్ కంటే డిజైనర్‌గానే ఎక్కువ సంపాదించా'
‘‘నేను డైరెక్టర్ కాక ముందు డిజైనర్‌గా ప్రతి ఏడాదీ వంద సినిమాలకు పని చేసేవాడిని. ఒక రకంగా చెప్పాలంటే డిజైనర్‌గానే నేనెక్కువ సంపాదించాను. ముందు చంటిగారు..ఆ తర్వాత బెల్లంకొండ సురేశ్‌గారు డైరెక్టర్‌గా అవకాశాలు ఇచ్చారు. డైరెక్టర్‌గా నా జర్నీని మొదట్లో సీరియస్‌గా తీసుకోలేదు. ‘రాక్షసుడు’ సినిమా నుంచి సీరియస్‌గా తీసుకున్నా’’ అని అన్నారు రమేశ్ వర్మ. ఆదివారం రమేశ్ వర్మ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. జీవితంలో డబ్బు ముఖ్యమా? లేక భావోద్వేగాలు ముఖ్యమా? లేక రెండూ అవసరమా? అనే అంశాల ఆధారంగా ‘ఖిలాడి’ కథ ఉంటుంది. నా కెరీర్లో కూడా ‘ఖిలాడి’ హయ్యస్ట్ బడ్జెట్ మూవీ. దాదాపు 65 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం. నిర్మాత కోనేరు సత్యానారాయణ నా పై నమ్మకంతో అప్పుడు ‘రాక్షసుడు’ చిత్రానికీ, ఇప్పుడు ‘ఖిలాడి’కీ చాన్స్ ఇచ్చారు. ‘రాక్షసుడు 2’ కోసం విజయ్ సేతుపతిని సంప్రదించాం. నేను, మారుతి కలిసి ఓ సినిమాను నిర్మించనున్నాం’’ అని అన్నారు. చదవండి : చిరు బర్త్‌డే : స్పెషల్ సాంగ్‌తో చాటుకున్న అభిమానం Chiru154 : పూనకాలు లోడింగ్.. అదిరిపోయిన పోస్టర్ -
'రాక్షసుడు'ను మించిపోయేలా సీక్వెల్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సీక్వెల్ ప్లాన్ చేశాడు డైరెక్టర్. ఈ మేరకు టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. రాక్షసుడు సినిమాకు కొనసాగింపుగా రాక్షసుడు 2 రాబోతుందంటూ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ‘హోల్డ్ యువర్ బ్రీత్’ అనేది ట్యాగ్‌లైన్. ఇక టైటిల్ పోస్టర్ విషయానికి వస్తే... ఓ సైకో చేతిలో గొడ్డలి పట్టుకుని శవాన్ని మోసుకుపోతున్నాడు. తన వెనకాల చైన్‌కు రక్తంతో తడిసిన పదునైన కత్తి వేలాడుతుండడం చూడొచ్చు. క్రియేటివ్‌గా ఉన్న ఈ పోస్టర్‌లోని అంశాలు సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాక్షసుడు కంటే మరింత థ్రిల్లింగ్‌గా, హర్రర్‌గా ఉండనున్నట్లు కనిపిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో మరోసారి హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తాడా? లేదా వేరే స్టార్ హీరో నటిస్తాడా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. రాక్షసుడు సినిమాకు పనిచేసిన సాంకేతికబృందమే 'రాక్షసుడు 2' సినిమాకు కూడా పనిచేయనున్నారు. హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ఏ స్టూడియోస్’ అధినేత కోనేరు సత్యనారాయణ ‘రాక్షసుడు 2’ సినిమాను నిర్మించనున్నాడు. Hold your breath.. Going to be More Thrilling 😉#Rakshasudu2 is On!! 👍@idhavish #KoneruSatyaNarayana@SrikanthVissa @sagar_singer@GhibranOfficial #VenkatCDileep Shoot Begins Soon pic.twitter.com/EX89zyiv8b — Ramesh Varma (@DirRameshVarma) July 13, 2021 జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ సి దిలీప్ కెమెరామేన్. శ్రీకాంత్ విస్సా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నాడు. దర్శకుడు రమేష్ వర్మ ‘రాక్షసుడు 2’ చిత్రానికి స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సెస్‌ను రామ్ లక్ష్మణ్ పర్యవేక్షిస్తారు. మరోవైపు రాక్షసుడు హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రమేష్ వర్మ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. -
థియేటర్స్‌లోనే మాస్ మహరాజా ‘’ఖిలాడి‘’
క్రాక్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం ఖిలాడి ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . రమేష్ వర్మ దర్శకత్వంలో హవీష్ ప్రొడక్షన్స్ , పెన్ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా .. యాక్షన్ కింగ్ అర్జుతో పాటు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు .షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28 న విడుదల కు సిద్దం చేశారు .ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ కారణంగా వాయిదా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ' ఖిలాడి ' సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానుందనే న్యూస్ సినీ వర్గాల్లో వినిపిస్తుండగా , ఈ విషయంపై మూవీ మేకర్స్ స్పష్టతనిచ్చారు . రవితేజ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం పూర్తిగా అవాస్తమని , ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి ఆస్వాదించేలా రూపొందిస్తున్నామని నిర్మాత కోనేరు సత్యనారాయణ వెల్లడించారు . ఇటలీలో తీసిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తాయని పేర్కొన్నారు . కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు . కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి , డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు . (చదవండి:టైసన్, అది నువ్వేనా? షాక్‌లో ఫ్యాన్స్!) -
డ్యాన్స్ ప్లస్ యాక్షన్ కోసం ఇటలీలో ఖిలాడి
రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఖిలాడి’. ‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్‌లైన్ . ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు రెండు పాటలను చిత్రీకరించేందుకు చిత్రబృందం ప్లాన్ చేసిందని తెలిసింది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘ఖిలాడి’ చిత్రంలో అర్జున్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘ఖిలాడి’ చిత్రం మే 28న విడుదల కానుంది. ‘క్రాక్’తో కిరాక్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహారాజ ఇటీవలే తన 68వ చిత్రాన్ని ఫైనల్ చేశాడు. ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఈ సినిమాను చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేర్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చదవండి: మెగా కోడలు ఉపాసనకు అరుదైన గౌరవం రేటు పెంచేసిన మాస్ మహారాజా.. నిర్మాతలకు షాకే! -
దూసుకొస్తున్న ఖిలాడి.. రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజ్ రవితేజ ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఆయన నటించిన క్రాక్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే జోష్‌లో తన తదుపరి సినిమా ‘ఖిలాడి’ మొదలు పెట్టేశాడు. ఇందులో రవితేజ డ్యూయోల్ రోల్లో నటించనున్నాడు. రమేశ్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఖిలాడి షూటింగ్ జరుపుకోంటుంది. చదవండి:‘ రవితేజ కొత్త సినిమాలో ముగ్గురు హీరోయిన్లట! తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించింది చిత్ర యూనిట్. మే 28న థియేటర్లలలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు చేతిలో గన్ పట్టుకొని రవితేజ నడుచుకుంటూ వస్తున్న కొత్త పోస్టర్‌ను పరిచయం చేస్తూ ‘ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో మే 28 నుంచి ఖిడాడీ రిలీజ్ కానుంది’ అని రవితేజ ట్విటర్లో పేర్కొన్నారు. ఇక అదే నెలలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య(మే13), వెంకటేష్ నటిస్తున్న నారప్ప(మే 14) చిత్రాలు కూడా రిలీజ్ కానున్నాయి. కాగా జనవరి 26న గణతంత్ర్య దినోత్సవం రోజు రవితేజ బర్త్‌డే సందర్భంగా ‘ఖిలాడి’ ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో రవితేజ ఎప్పటిలాగే మాస్ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. చేతులో రాడ్ పట్టుకొని తనదైన శైలీలో నడుస్తూ నయా లుక్‌లో అదరగొట్టాడు. ఎటువంటి డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. Let’s play from 28th May in cinemas.#Khiladi pic.twitter.com/om7LuTmsRj — Ravi Teja (@RaviTeja_offl) January 30, 2021 -
‘ఖిలాడి’ సర్ప్రైజ్.. బీజీఎంతో చింపేశాడుగా
‘క్రాక్’ హిట్ మాస్ మహారాజా రవితేజలో జోష్ని నింపింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇదే జోష్ లో తన తదుపరి సినిమా ‘ఖిలాడి’ మొదలు పెట్టేశాడు. రమేశ్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. (చదవండి : బర్త్‌డే స్పెషల్: రవితేజ గురించి ఆసక్తికరమైన విషయాలు) రవితేజ బర్త్‌డే సందర్భంగా మంగళవారం ‘ఖిలాడి’ ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో రవితేజ ఎప్పటిలాగే మాస్ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. చేతులో రాడ్ పట్టుకొని తనదైన శైలీలో నడుస్తూ నయా లుక్‌లో అదరగొట్టాడు. ఎటువంటి డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇందులో రవితేజ డ్యూయోల్ రోల్లో నటించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ వేసవిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఆ హీరోయిన్‌తో రవితేజ లిప్‌లాక్!
సినిమాల్లో లిప్‌లాక్ సీన్స్ ఇప్పడు కామన్ అయిపోయాయి. అసలు ముద్దులేని సినిమాలు రావడమే గగనమైపోయింది. ఇక బాలీవుడ్ సినిమాల్లో అయితే కనీసం ఒక్కటైనా ముద్దు సీన్ ఉండాల్సిందే. అక్కడ కథ లేని సినిమాలు వస్తున్నాయేమో కానీ ముద్దు లేని సినిమాలు మాత్రం రావడంలేదు. ఇక ఈ లిప్‌లాక్‌లు ఇప్పుడు టాలీవుడ్లో కూడా కామనైపోయింది. ముఖ్యంగా విజయ్‌దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ తర్వాత తెలుగు సినిమాల్లో ముద్దు సీన్లు ఎక్కువైపోయాయి. (చదవండి : ముద్దు పెట్టలేదని రిజెక్ట్ చేసింది: అక్షయ్) మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలు కూడా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. తాజాగా రామ్ పోతినేని కూడా ‘రెడ్’తో ఆ జోన్లోకి వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు మాస్ మహా రాజా రవితేజ కూడా ఇంగ్లీష్ ముద్దు పెట్టబోతున్నాడట. ‘క్రాక్’ సూపర్ హిట్ తర్వాత రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ మినాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘ఖిలాడి’లో రవితేజ ఒక లిప్‌లాక్ సీన్లో నటించారట. బాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరితో కలిసి ముద్దు సనివేశంలో నటించారట మన మాస్ మహారాజా. ఈ సీన్ షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. వాస్తవానికి లిప్‌లాక్ సీన్ చేయడానికి రవితేజ మొదట్లో ఒప్పుకోలేదట. కానీ, డైరెక్టర్ రమేశ్ వర్మ చాలా కష్టపడి రవితేజను ఒప్పించాడట. ఇష్టంలేకున్నా దర్శకుడి బలవంతం మేరకు లిక్‌లాక్ సీన్‌కు రవితేజ అంగీకరించాడట. మొత్తానికి మాస్ మహారాజా కూడా ఇంగ్లీష్ ముద్దు ఇచ్చి ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చేశాడన్నమాట. -
డబుల్ ధమాకా
రవితేజ హీరోగా రమేష్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తారు. ఇందులో రవితేజ తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారట. ఎన్ఆర్ఐ బిజినెస్‌మేన్‌గా, చార్టెడ్ అకౌంటెంట్‌గా రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని టాక్. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘క్రాక్’ చిత్రంలో నటిస్తున్నారు రవితేజ. కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. అలాగే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్లో రవితేజ హీరోగా ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. -
మా నమ్మకం నిజమైంది
‘‘రాక్షసుడు’ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఆడపిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సందేశాత్మకంగా చూపించిన సినిమా ఇది’’ అన్నారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘రాక్షసుడు’. ఆగస్టు 2న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. మరో రెండు వారాల వరకూ వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మా ‘ఏ స్టూడియోస్ బ్యానర్’పై తొలి చిత్రంగా తెరకెక్కిన ‘రాక్షసుడు’ ఇంత పెద్ద విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘కథపై నమ్మకంతో ఈ సినిమా చేశాం. ఈ రోజు మా నమ్మకం నిజమైంది. ఒరిజినల్ కంటెంట్‌లోని అంశాలను మిస్ చేయకుండా మనకు తగ్గట్లు చేశాం’’ అన్నారు రమేష్ వర్మ. ‘‘ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కెరీర్లకు మంచి సినిమా ఎప్పుడూ ఉపయోగపడుతూనే ఉంటుంది. అలాంటి సినిమానే ‘రాక్షసుడు’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. -
‘ఐదేళ్లుగా ఇలాంటి సక్సెస్ కోసం వెయిట్ చేశాను’
భారీ క్యాస్టింగ్‌తో, హై బడ్జెట్ చిత్రాలతో సినిమాలు చేస్తూ మాస్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాడు బెల్లంకొండ శ్రీనివాస్. తాజాగా రాక్షసుడు చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. మాస్ మంత్రం జపిస్తూ వచ్చిన ఈ హీరో.. తన పంథాను మార్చుకుని ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ..‘ ‘రాక్షసుడు’ సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ‘అల్లుడు శీను।.. అప్పట్లో చాలా మంది హీరోలకు సమానంగా రూ.34 కోట్లు షేర్ వచ్చింది. గ్రాండియర్, కమర్షియల్ వేల్యూస్ ఉన్న ఈ సినిమాతో వి.వి.వినాయక్ డైరెక్షన్ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యారు. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన `జయజానకి నాయక` భారీ క్యాస్టింగ్, బడ్జెట్‌తో రూపొందింది. అవన్నీ డైరెక్టర్‌కి, ఇతర క్యాస్టింగ్‌కి పేరుని తెచ్చిపెట్టాయి. అయితే `రాక్షసుడు` సినిమా మా అబ్బాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా నుంచి మా అబ్బాయి ప్రతి సినిమాకు జర్నలిస్ట్ అసోసియేషన్‌కు రూ.10 లక్షలను ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. -
‘రాక్షసుడు’ బాగానే రాబడుతున్నాడు!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న రీమేక్ మూవీ రాక్షసుడు. తమిళ్లో ఘన విజయం సాధించిన రాక్షసన్ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన రాక్షసుడు టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో హిందీ డబ్బింగ్ రైట్స్‌కు భారీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన కొన్ని సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్లు యూట్యూబ్‌లో భారీగా వ్యూస్ సాధించాయి. దీంతో రాక్షసుడు హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం 12.5 కోట్లు ఆఫర్ చేశారు. కంటెట్పరంగా కూడా యూనివర్సల్ అప్రోచ్ ఉంటుందన్న నమ్మకంతో భారీ ఆఫర్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ కూడా 6 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఎక్కువ సన్నివేశాలు తమిళ ఒరిజినల్ వర్షన్లో చిత్రీకరించినవే వాడుతున్నారు. కేవలం హీరో హీరోయిన్లు కనిపించే సీన్స్‌ను మాత్రమే రీ షూట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. -
అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ‘సెవెన్’ రిలీజ్
హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సెవెన్. కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడక్షన్లో రమేష్ వర్మ నిర్మాణంలో డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. రెహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. రమేష్ వర్మ కథ అందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటికే శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన ‘సంపోద్దోయ్ నన్నే’, పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన ‘ఇదివరకెపుడు తెలియదు’ పాటలు విడుదలయ్యాయి. ఇటీవల సినిమా ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ కాపీ చూసిన అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా క్రేజీ ఆఫర్ ఇచ్చి ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అభిషేక్ నామా మాట్లాడుతూ ‘ఇటీవల సెవెన్ ఫస్ట్ కాపీ చూశాను. మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్. థ్రిల్లర్ ఫిల్మ్స్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందీ సినిమా. ఒక ట్విస్ట్ వెనుక మరొక ట్విస్ట్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయి. రమేష్ వర్మగారు ఫెంటాస్టిక్ స్టోరీ, స్క్రీన్ ప్లే రాశారు. నిర్మాణంలోనూ రాజీ పడలేదు. రిచ్‌గా సినిమా తీశారు. ఆయన కథ సినిమాకు ఒక హైలైట్ అయితే... హవీష్ యాక్టింగ్ మరో హైలైట్. నటుడిగా కొత్త హవీష్ ను ప్రేక్షకులు ఈ సినిమాలో చూస్తారు. మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు. రమేష్ వర్మ కథకు నిజార్ షఫీ న్యాయం చేశారు. ఆయన సినిమాటోగ్రఫీ సూపర్. ఆరుగురు హీరోయిన్ల పాత్రలు కథలో భాగంగా సాగుతాయి. ప్రేక్షకులకు ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుంది. ఫస్ట్ కాపీ చూశాక... విపరీతంగా నచ్చడంతో సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాను. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా మా సంస్థ ద్వారా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. -
సెప్టెంబర్‌లో ‘7’
తమిళ, తెలుగు చిత్రాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన నిషార్ షఫి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘7’. ఈ చిత్రంలో రెజినా, నందితా సహా ఏడుగురు కథానాయకిలు నటిస్తున్నారు. తమిళం, తెలుగు రెండు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రం గురించి నిషార్ షఫి మాట్లాడుతూ ‘7లో కథను నడిపించేందుకు ఏడు మహిళా కథా పాత్రలు ఉంటాయన్నారు. కనిపించకుండాపోయిన భర్త ఆచూకీ కనిపెట్టి ఇవ్వాలని పలువురు మహిళలు ఫిర్యాదు చేస్తారని, వీరి ఫిర్యాదులన్నీ పార్థిబన్ పాత్ర చుట్టే తిరుగుతాయని తెలియజేశారు. రెజినా, నందిత, అనిషా ఆంబ్రోస్, సునితా చౌదరి, అతిథి ఆర్య, పూజిత, పొన్నాడా కథానాయకిలుగా నటిస్తున్నట్లు తెలిపారు. తెలుగు నటుడు హవిష్, పార్తిబన్ తో పాటు మరో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారని, సినిమా సెప్టెంబర్‌లో విడుదల కానున్నట్లు తెలిపారు. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సెవెన్’
ఆరుగురు అమ్మాయిలు... ఆరు ప్రేమకథలు! ప్రతి ప్రేమ కథలోనూ అబ్బాయి ఒక్కడే! ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న అతడు మంచోడా? చెడ్డోడా? ప్రతి అమ్మాయి అతడే కావాలని ఎందుకు కోరుకుంటోంది? అనే ఇంట్రస్టింగ్ పాయింట్‌తో తెరకెక్కిన సినిమా సెవెన్. రమేష్ వర్మ స్వయంగా కథ అందించి ఈ సినిమాను నిర్మించారు. హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రెహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ నాలుగో వారంలో సినిమాలో తొలి పాటను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రమేష్ వర్మ మాట్లాడుతూ ‘ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. సినిమా బాగా వచ్చింది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల ఊహలకు అందని మలుపులతో కథనం సాగుతుంది. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి ట్విస్ట్ వెనుక కథలో భాగంగా ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఏప్రిల్ నాలుగో వారంలో హవీష్, రెజీనాపై తెరకెక్కించిన తొలి పాటను విడుదల చేస్తున్నాం. మేలో సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు. -
‘రాక్షసుడు’గా బెల్లంకొండ
కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన థ్రిల్లర్ మూవీ రాక్షసన్. విష్ణు విశాల్, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రీమేక్‌చేసే ఆలోచనలో ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమాకు రైడ్, వీర చిత్రాల ఫేం రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘రాక్షసుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. కథా కథనాల పరంగా ఈ టైటిల్ పర్ఫెక్ట్ అన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలోవెల్లడించనున్నారు. మీడియం రేంజ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీత సినిమాలో నటిస్తున్న బెల్లంకొండ, ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. ఈ సినిమాతో పాటే రాక్షసన్ రీమేక్‌లో నటించేందుకు బెల్లంకొండ ఓకే చెప్పాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీత సినిమా పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఈ నెలలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
బిజీ నితీన్
‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా తర్వాత ‘ఛలో’ ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రంలో నటించనున్నారు నితిన్. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుండగా మరో రెండు సినిమాలను ప్రకటించారాయన. ‘‘చంద్రశేఖర్ యేలేటిగారి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్‌గారు ఈ చిత్రం నిర్మిస్తారు. ఎం.ఎం. కీరవాణిగారు సంగీతం అందించనున్నారు. ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నా. ఏప్రిల్‌లో చిత్రీకరణ ప్రారంభం అవుతుంది’’ అన్నారు నితిన్. అలాగే ‘రైడ్, ఒక ఊరిలో, వీర’ వంటి సినిమాలను తెరకెక్కించిన రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం అంగీకరించారు నితిన్. హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్లో ‘ఎ’ స్టూడియోస్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. ‘‘రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. నితిన్ నటించిన ‘ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాల తరహాలో ఉంటుంది. ఆగస్ట్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. నటరాజన్ సుబ్రహ్మణ్యం (నట్టి) కెమెరామేన్‌గా పని చేయనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
రమేష్ వర్మ దర్శకత్వంలో నితిన్
సక్సెస్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్న యంగ్ హీరో నితిన్ మరో సినిమాకు ఓకె చెప్పాడు. అ ఆ తరువాత లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కల్యాణం సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వటంతో తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. త్వరలో ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. రైడ్, వీర లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రమేష్ వర్మతో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు నితిన్. ఈ సినిమాను ఏ స్టూడియోస్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించనున్నారు. -
సూపర్ హిట్ రీమేక్‌లో బెల్లంకొండ
మీడియం రేంజ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీత సినిమాలో నటిస్తున్న బెల్లంకొండ, ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు కూడా బెల్లంకొండ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన థ్రిల్లర్ మూవీ రాక్షసన్. విష్ణు విశాల్, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రీమేక్‌చేసే ఆలోచనలో ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమాకు రైడ్, వీర చిత్రాల ఫేం రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.