కళ్యాణ్ రామ్ హీరోగా 'చిన్ని రామయ్య' | Kalyan ram Next movie with Ramesh Varma | Sakshi
Sakshi News home page

కళ్యాణ్ రామ్ హీరోగా 'చిన్ని రామయ్య'

Published Thu, Oct 27 2016 2:33 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

కళ్యాణ్ రామ్ హీరోగా 'చిన్ని రామయ్య'

కళ్యాణ్ రామ్ హీరోగా 'చిన్ని రామయ్య'

ఇజం సినిమాతో ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టాడు. ఇజం సినిమా కోసం తొలి సారిగా స్టార్ డైరెక్టర్ తో కలిసి పని చేసిన కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నాడు. అదే జోరులో మరో వెరైటీ సినిమాకు రెడీ అవుతున్నాడు ఈ నందమూరి అందగాడు. దర్శకనిర్మాత రమేష్ వర్మ డైరెక్షన్ లో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన కథా చర్చలు జరుగుతున్నాయి. బెంగాల్ టైగర్ నిర్మాత కెకె రాథామోహన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ ఏడాది నాగశౌర్య హీరోగా అబ్బాయితో అమ్మాయి సినిమాను రూపొందించిన రమేష్ వర్మ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. అందుకే కళ్యాణ్ రామ్ సినిమాతో హిట్ కొట్టి ప్రూవ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement