రాఘవ లారెన్స్ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఏ స్టూడియోస్ ఎల్‌ఎల్‌పీ, నీలాద్రిప్రోడక్షన్స్, హవీష్‌ప్రోడక్షన్స్‌పై కోనేరు సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. ‘‘బిగ్ యాక్షన్ అడ్వంచరస్‌గా రూపొందనున్న చిత్రమిది. రాఘవా లారెన్స్ కెరీర్‌లో 25వ సినిమాగా తెరకెక్కనుంది.
‘రాక్షసుడు, ఖిలాడీ’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత రమేశ్ వర్మ, కోనేరు సత్యనారాయణ కాంబినేషన్‌లో రానున్న మూడో సినిమా ఇది. భారీ వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు త్వరలోనే ప్రకటిస్తాం. నవంబర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి 2025 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని మేకర్స్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment