
ఒవియా హెలెన్.. కొద్దిరోజులుగా ఈ బ్యూటీ పేరు సౌత్ ఇండియాలో భారీగా ట్రెండ్ అవుతుంది. కేరళకు చెందిన ఒవియా తమిళ చిత్ర పరిశ్రమలో రాణిస్తుంది. తమిళ బిగ్‌బాస్ సీజన్ 1లో పాల్గొని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆమెకు సంబంధింఇచన లీక్డ్ వీడియో అంటూ ఒకటి నెట్టింట షేర్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఒవియా ఫోటోను లారెన్స్ షేర్ చేస్తూ సినిమా ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాంచన' ప్రాంచైజీ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు సుమారు 3 చిత్రాలు విడుదలయ్యాయి. అవన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. అయితే, 'కాంచన 4' ప్రాజెక్ట్‌ను త్వరలో లారెన్స్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో ఒవియాకు కీలక పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంచన 3 షూటింగ్ సమయంలో వారిద్దరూ కలిసి తీసుకున్న ఒక ఫోటోను తాజాగా ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం తీవ్రంగా ట్రోల్‌కు గురౌతున్న ఒవియాకు లారెన్స్ మరో సినిమా ఛాన్స్ ఇచ్చారంటూ ఆయన అభిమానులు మెచ్చుకుంటున్నారు. కాంచన బొట్టుతో ఉన్న ఒవియా ఫోటో నెట్టింట భారీగా వైరల్ అవుతుంది.

లారెన్స్ దర్శకత్వంలో 2011లో విడుదలైన 'కాంచన' భారీ విజయాన్ని సాధించింది. హారర్ కామెడీ జానర్‌లో ట్రెండ్‌ని సెట్ చేసిన ఈ సినిమా 2015లో రెండో పార్ట్‌ను రిలీజ్ చేశారు. అది కూడా మంచి సూపర్ హిట్ కావడంతో 2019లో 'కాంచన-3'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మళ్లీ భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రం ఈ నవంబర్‌లో నాలుగో భాగం షూటింగ్ ప్రారంభించనున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే, అదికారికంగా మాత్రం ప్రకటన వెలువడలేదు. మూడు భాగాల్లో లారెన్స్ ప్రధానపాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు. కోవై సరళ, శరత్‌కుమార్ గత మూడు చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment