Oviya
-
లీక్డ్ వీడియోతో ఒవియా వైరల్.. బిగ్ ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో
ఒవియా హెలెన్.. కొద్దిరోజులుగా ఈ బ్యూటీ పేరు సౌత్ ఇండియాలో భారీగా ట్రెండ్ అవుతుంది. కేరళకు చెందిన ఒవియా తమిళ చిత్ర పరిశ్రమలో రాణిస్తుంది. తమిళ బిగ్‌బాస్ సీజన్ 1లో పాల్గొని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆమెకు సంబంధింఇచన లీక్డ్ వీడియో అంటూ ఒకటి నెట్టింట షేర్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఒవియా ఫోటోను లారెన్స్ షేర్ చేస్తూ సినిమా ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాంచన' ప్రాంచైజీ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు సుమారు 3 చిత్రాలు విడుదలయ్యాయి. అవన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. అయితే, 'కాంచన 4' ప్రాజెక్ట్‌ను త్వరలో లారెన్స్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో ఒవియాకు కీలక పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంచన 3 షూటింగ్ సమయంలో వారిద్దరూ కలిసి తీసుకున్న ఒక ఫోటోను తాజాగా ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం తీవ్రంగా ట్రోల్‌కు గురౌతున్న ఒవియాకు లారెన్స్ మరో సినిమా ఛాన్స్ ఇచ్చారంటూ ఆయన అభిమానులు మెచ్చుకుంటున్నారు. కాంచన బొట్టుతో ఉన్న ఒవియా ఫోటో నెట్టింట భారీగా వైరల్ అవుతుంది. లారెన్స్ దర్శకత్వంలో 2011లో విడుదలైన 'కాంచన' భారీ విజయాన్ని సాధించింది. హారర్ కామెడీ జానర్లో ట్రెండ్‌ని సెట్ చేసిన ఈ సినిమా 2015లో రెండో పార్ట్‌ను రిలీజ్ చేశారు. అది కూడా మంచి సూపర్ హిట్ కావడంతో 2019లో 'కాంచన-3'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మళ్లీ భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రం ఈ నవంబర్‌లో నాలుగో భాగం షూటింగ్ ప్రారంభించనున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే, అదికారికంగా మాత్రం ప్రకటన వెలువడలేదు. మూడు భాగాల్లో లారెన్స్ ప్రధానపాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు. కోవై సరళ, శరత్‌కుమార్ గత మూడు చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Raghava Lawrence Fans (@raghavalawrenceoffl) -
బిగ్ బాస్ బ్యూటీ లీక్డ్ వీడియో వైరల్.. ఎంజాయ్ అంటూ నటి కామెంట్
ఒవియా హెలెన్.. ఇండియన్ మోడల్ అయిన ఈమె పేరు అందరికీ తెలియకపోయినా తమిళ, మలయాళ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితురాలే. అయితే, తాజాగా ఆమె లీక్డ్ వీడియో అంటూ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తమిళ బిగ్‌బాస్ సీజన్ 1లో పాల్గొన్న ఈ కేరళ కుట్టి.. కోలీవుడ్‌లో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది. బిగ్ బాస్ షోను ఇష్టపడే తెలుగు వారికి కూడా ఆమె పేరు పరిచయమనే చెప్పవచ్చు. అలా సౌత్ ఇండియాలోని పలు భాషల్లో సినిమా ఛాన్సులు కూడా దక్కించుకుంది.ఒవియాకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో లీక్ అయిందిన నెటిజన్లు రెండురోజులుగా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని లింక్‌లు కూడా ఎక్స్ వేదికగా షేర్ చేస్తున్నారు. ఓవియా లీక్డ్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్లో వైరల్ చేస్తున్నారు.కొందరైతే ఓవియాకు కూడా సోషల్‌మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నారు. కేవలం 17 సెకండ్లు మాత్రమే వీడియో ఉందని ఆమెను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరే మాత్రం సుమారు ఒక నిమిషం పైగానే వీడియో ట్రెండ్ అవుతుందని ఒవియాకు మెసేజ్‌లు చేస్తున్నారు.ఒవియా మాత్రం తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. నెక్ట్స్ టైమ్ ఎక్కువ నిడివి ఉన్న వీడియో షేర్ చేస్తాలే అంటూ.. అప్పటి వరకు దీంతో ఎంజాయ్ చేయండి అని ఆమె తిరిగి సమాధానం చెప్పింది. ఒవియా పేరుతో డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారని ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేయవద్దని వారు పేర్కొంటున్నారు. ఈ విషయం గురించి ఒవియా ఇంకా ఎలాంటి సమాధానం చెప్పలేదు. కానీ, కేరళ సైబర్ క్రైమ్ విభాగంలో ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. -
బిగ్ బాస్ బ్యూటీ లీక్డ్ వీడియో వైరల్.. ఎంజాయ్ అంటూ నటి కామెంట్ (ఫోటోలు)
-
పెళ్లిపై కాంచన నటి ఆసక్తికర కామెంట్స్.. గట్టిగానే కౌంటర్!
‘కళవాణి’ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది తమిళ నటి ఓవియా. ఆ సినిమా సక్సెస్ సాధించినప్పటికీ ఆమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. కొన్ని చిత్రాల్లో నటించినా హిట్ టాక్ తెచ్చుకోలేదు. అయితే తమిళ బిగ్ బాస్ సీజన్లో పాల్గొన్న ఓవియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆమె అసలు పేరు హెలెన్ నెల్సన్ కాగా.. కేరళలోని త్రిసూర్‌లో జన్మించింది. మలయాళం, తమిళ, కన్నడ చిత్రాల్లో ఎక్కువగా కనిపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనిన ఓవియా.. తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. గతంలో ఆమె బిగ్ బాస్ విన్నర్ అరవ్‌తో డేటింగ్లో ఉందంటూ రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. బిగ్ బాస్ మొదటి సీజన్లో పాల్గొనిన ఓవియా సహా-కంటెస్టెంట్ ఆరవ్తో సన్నిహితంగా ఉందని చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్దఎత్తున వార్తలు వైరలయ్యాయి. అయితే వీటిపై ఇద్దరూ మౌనంగానే ఉంటూ వచ్చారు. బిగ్ బాస్ ముగిసిన తర్వాత వీరిద్దరూ తమ కెరీర్‌పైనే దృష్టి సారించారు. ఆ ఆ తర్వాత ఓవియా కాంచన -3, 90 ఎంఎల్ సహా చిత్రాల్లో నటించింది. రెండు సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కలేదు. పెళ్లి కాలేదు.. కానీ బిగ్ బాస్ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో ఓవియా పెళ్లి చేసుకోనున్నట్లు గాపిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఓవియా స్పందించింది. నాకు పెళ్లి ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని.. నటనపైనే దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది. మీకు పెళ్లై ఓ పాప కూడా ఉందని వార్తలొచ్చాయని ప్రశ్నించగా.. వాటికి ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది మలయాళీ భామ. ఓవియా మాట్లాడుతూ.. 'అవును నాకు ఓ పిల్లాడు ఉన్నాడు. కానీ నాకు పెళ్లి కాలేదు. అది నా కుక్కపిల్ల. దానిని నేను చిన్న పిల్లలానే చూసుకుంటా. అన్నం తినిపిస్తాను. అంతే కాకుండా కుక్కపిల్ల నా పక్కనే పడుకుంటుంది.' అని సమాధానమిచ్చింది. అయితే నెటిజన్స్ మాత్రం ఆమెపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తనకు పెళ్లయిందని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. -
బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి పని చేసింది ఆమె మాత్రమే
బిగ్ బాస్ ద్వారా స్టార్స్ అయిన వారు చాలా మంది ఉన్నారు. ప్రతి భాషలోనూ, ప్రతి సీజన్లోనూ అలాంటి స్టార్లు ఉంటారు. వారిలో నటి ఓవియా ఒకరు. మలయాళీ అయిన ఓవియా తమిళ బిగ్ బాస్ మొదటి సీజన్‌తో అలరించింది. ఓవియాకు దక్కిన పాపులారిటీ తమిళంలో మరే బిగ్‌బాస్ స్టార్‌కి లేదన్నది నిజం. అప్పట్లో ఓవియా కోసం చాలా ఆర్మీ గ్రూపులు ఏర్పడ్డాయి. ఆ ఇమేజ్ ద్వారా తమిళ, మలయాళంలో అమెకు పలు సినిమా అవకాశాలు కూడా దక్కాయి. ఇప్పటి వరకు సుమారు 25 సినిమాలకు పైగా నటించిన ఈ బ్యూటీ తెలుగులో మాత్రం 'ఇది నా లవ్ స్టోరీ' అనే మూవీలో మాత్రమే మెరిసింది. (ఇదీ చదవండి: బస్ డిపోలో రజనీకాంత్ సందడి.. ఫోటోలు వైరల్) తమిళ బిగ్‌బాస్ చరిత్రలో ఓవియా ఒక సంచలనమే అని చెప్పాలి. ఆ షోలో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం పెద్ద దుమారమే రేగింది. ఇలా బిగ్‌బాస్ చరిత్రలో జరగడం ఇదే తొలిసారి. దాంతో ఓవియా తమిళంలో సంచలనంగా మారింది. ఆ అలజడి కొద్దిరోజుల్లోనే ముగిసినా ఆమెకు ఎన్నో గొప్ప అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె చూయిగం అనే వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది. ఈ సీరిస్ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓవియా వివాహం గురించి పలు వ్యాఖ్యలు చేసింది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు) గతంలో ఓవియా పెళ్లిపై చాలా గాసిప్స్ వచ్చాయి. ఓవియా లెస్బియన్ కాబట్టి పెళ్లి చేసుకోలేదని ఒకప్పుడు ప్రచారం జరిగింది. దీన్ని ఓవియా తాజాగ ఖండించింది. 'నేను లెస్బియన్‌ని కాదు. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. అంతే కాకుండా ఇప్పుడు పెళ్లి గురించి నేను ఆలోచించడం లేదు. ఇప్పుడే కాదు, నా జీవితంలో ఇలాంటివి జరుగుతాయో లేదో కూడా తెలియదు. జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి అని నేనెప్పుడూ భావించలేదు. అందరూ అనుకుంటున్నట్లు నేను ఏ బిడ్డకు జన్మనివ్వలేదు. నేను ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను. పెళ్లయ్యాక బిడ్డను కనాలనే ఆలోచన కూడా నాకు లేదు. పెళ్లయ్యాక ఒత్తిడిలో ఉండి జీవితాన్ని నాశనం చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. నేను అలా ఉండాలనుకోను. నేను నా కోసమే జీవిస్తున్నాను' అని ఓవియా తెలిపింది. View this post on Instagram A post shared by Oviya (@happyovi) -
అభిమాని నుంచి అలాంటి ప్రశ్న, లైవ్‌లోనే మండిపడ్డ బిగ్‌బాస్ బ్యూటీ
సినిమాల్లో కాకున్నా సామాజిక మాధ్యమాల్లో తరచూ మెరుస్తున్న నటి ఓవియా. ఈ కేరళా బ్యూటీ తొలి రోజుల్లో కలవాని అనే తమిళ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా పలు చిత్రాల్లో నటించిన ఓవియా బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో మొదటి సీజన్లో పాల్గొని మరింత ప్రాచుర్యం పొందింది. అయితే ఆ తరువాత ఆ క్రేజ్‌ను ఉపయోగించడంలో ఫెయిల్ అవడంతో ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. అయితే తరచూ తన గ్లామర్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ అభిమానులతో చిట్‌చాట్ చేస్తూనే ఉంది. ఇటీవల తన స్నేహితుడొకరితో సన్నిహితంగా ఉన్న ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా ఈమెకు తరచూ ఎదురవుతున్న ప్రశ్న పెళ్లెప్పుడు చేసుకుంటారు అనేది. కాగా ఇటీవల ఓవియా తన ఫేస్బుక్ ద్వారా అభిమానులతో ముచ్చడించింది. అప్పుడు ఒక అభిమాని నుంచి పెళ్లెప్పుడనే ప్రశ్న ఎదురైంది. దీంతో నటి ఓవియాకు చిర్రెత్తుకొచ్చింది. కోపాన్ని ఆపుకోలేక మీకు అడగడానికి మరే టాపిక్ లేదా? ఎప్పుడూ అదే ప్రశ్నా అంటూ మండిపడింది. అసలు తనకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీయొద్దని సీరియస్ అయ్యింది. దీంతో అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. -
అభిమానులపై మండిపడ్డ బ్యూటీ
సినిమాల్లో కాకున్నా సామాజిక మాధ్యమాల్లో తరచూ మెరుస్తున్న నటి ఓవియా. ఈ కేరళా బ్యూటీ తొలి రోజుల్లో కలవాని అనే తమిళ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా పలు చిత్రాల్లో నటించిన ఓవియా బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో మొదటి సీజన్లో పాల్గొని మరింత ప్రాచుర్యం పొందింది. అయితే ఆ తరువాత ఆ క్రేజ్‌ను ఉపయోగించడంలో ఫెయిల్ అవడంతో ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. అయితే తరచూ తన గ్లామర్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ అభిమానులతో చిట్‌చాట్ చేస్తూనే ఉంది. ఇటీవల తన స్నేహితుడొకరితో సన్నిహితంగా ఉన్న ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా ఈమెకు తరచూ ఎదురవుతున్న ప్రశ్న పెళ్లెప్పుడు చేసుకుంటారు అనేది. కాగా ఇటీవల ఓవియా తన ఫేస్బుక్ ద్వారా అభిమానులతో ముచ్చడించింది. అప్పుడు ఒక అభిమాని నుంచి పెళ్లెప్పుడనే ప్రశ్న ఎదురైంది. దీంతో నటి ఓవియాకు చిర్రెత్తుకొచ్చింది. కోపాన్ని ఆపుకోలేక మీకు అడగడానికి మరే టాపిక్ లేదా? ఎప్పుడూ అదే ప్రశ్నా అంటూ మండిపడింది. అసలు తనకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీయొద్దని సీరియస్ అయ్యింది. దీంతో అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. -
మోదీపై ట్వీట్.. హాట్ బ్యూటీపై ఫిర్యాదు
సాక్షి, చెన్నై : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా హాట్ బ్యూటీ ఒవియా హెలెన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆమెపై వెంటనే పోలీసు కేసు నమోదు చేయాలని తమిళనాడు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ చీఫ్ డీ అలెక్స్ సుధాకర్ స్థానిక పోలీసుకు ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తమిళనాడు పర్యటించిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూ.3,770 కోట్లతో పూర్తయిన చెన్నై వాషర్మెన్ పేట–విమ్కోనగర్ మధ్య మెట్రో రైలు, రూ.293 కోట్లతో పూర్తి చేసిన చెన్నై బీచ్–అత్తిపట్టు మధ్య 4వ ట్రాక్‌లో, రూ.423 కోట్లతో విద్యుద్దీకరించిన విల్లుపురం–తంజావూరు – తిరువారూర్ మార్గంలో రైలు సేవలకు జెండా ఊపారు. చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్ని ప్రసంగించారు. ఈ క్రమంలో మోదీ రాకను నిరశిస్తూ నటి ఒవియా హెలెన్ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. గో బ్యాక్ మోదీ అనే హ్యాష్ ట్యాగ్‌తో చేసిన పోస్టు వివాదాస్పదంగా మారింది. ఈమె తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దేశద్రోహం, ఐటీ చట్టం కింద ఆమెపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇండియన్ మోడల్ అయిన ఒవియా పేరు అందరికీ తెలియకపోయినా తమిళ, మలయాళ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితురాలే.. విలక్షణ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యతగా వచ్చిన తమిళ బిగ్‌బాస్ సీజన్ 1లో ఈ కేరళ కుట్టి పాల్గొంది. బిగ్‌బాస్ షోతో ఒవియా కోలీవుడ్‌లో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో 40కి పైగా చిత్రాల్లో ఒవియా నటించారు. వరసగా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ కూడా చేస్తుంటుంది. -
బిగ్‌బాస్ ఫేం రొమాంటిక్ ఫోటో.. ఎవరతను?
ఒవియా హెలెన్.. ఇండియన్ మోడల్ అయిన ఈమె పేరు అందరికీ తెలియకపోయినా తమిళ, మలయాళ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితురాలే.. విలక్షణ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యతగా వచ్చిన తమిళ బిగ్‌బాస్ సీజన్ 1లో ఈ కేరళ కుట్టి పాల్గొంది. బిగ్‌బాస్ షోతో ఒవియా కోలీవుడ్‌లో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది. ఇందుకు హౌజ్‌లో ఒవియా, ఆరవ్ మధ్య నడిచిన ప్రేమాయణమే కారణం. హౌజ్‌లో ఈ జంట చేసిన రొమాన్స్ షోకు టాప్ రేటింగ్స్‌ని తీసుకొచ్చింది. అంతే కాదు ఒవియా కోసం అప్పట్లో ఓ ప్రత్యేక ఆర్మీ కూడా ఏర్పాటైంది. బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తొలి రోజుల్లోనే ఆరవ్తో ఒవియా చాలా సన్నిహితంగా గడిపింది. ఆరవ్‌ను ప్రేమిస్తున్నానంటూ పలుసార్లు తెలిపింది కూడా. అయితే తొలుత ఆమెతో సన్నిహితంగా ఉన్న ఆరవ్ ఆ తర్వాత క్రమంగా దూరం పెట్టాడు. ఆమె మంచి స్నేహితురాలు మాత్రమేనని, అంతుకుమించి తనకు స్పెషల్ ఫీలింగ్స్ లేవని చెప్పుకొచ్చాడు. దీంతో బిగ్‌బాస్ అనంతరం ఆరవ్ తనకు మంచి ప్రెండ్ అని, అంతేగాక తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నట్టు నటి పేర్కొంది. చదవండి: ‘ఆ చెత్త షోలో పాల్గొనేది లేదు’ తాజాగా ఒవియా తన ట్విటర్లో ఓ పోస్టు చేసింది. ఓ వ్యక్తితో రొమాంటిక్‌గా దిగిన ఫోటోను ఆమె ట్విటర్లో షేర్ చేయగా.. దీనికి ‘లవ్’ అనే క్యాప్షన్‌ను జతచేసింది. ఈ ఫోటోలో ఒవియా అతన్ని కిస్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. అయితే సింగిల్ అని చెప్పిన ఒవియా ఇలా ఒకరిని కిస్ చేస్తున్నట్లు కనిపించడంతో దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వ్యక్తి ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. అతనెవరనేది తెలుసుకోవాలని చాలా ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. ‘ఎవరు అతను ఒవియా.. ఎవరో మాకు చెప్పొచ్చుగా. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు శుభాకాంక్షలు’. అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో 40కి పైగా చిత్రాల్లో ఒవియా నటించారు. Love pic.twitter.com/MFJsQylQeJ — Oviyaa (@OviyaaSweetz) January 14, 2021 -
హీరోయిన్‌తో బిగ్‌బాస్ విన్నర్ పెళ్లి!
చెన్నై: తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 1 విన్నర్ ఆరవ్ నఫీజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన స్నేహితురాలు, మోడల్ రేహీని పెళ్లిచేసుకోనున్నాడు. వచ్చే నెల ఆరో తేదీన అత్యంత సన్నిహితుల సమక్షంలో చెన్నైలో వీరి వివాహం జరుగనున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో ఆరవ్.. నటి ఓవియాతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఈ జంట బిగ్‌బాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.(చదవండి:నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్) వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, రొమాన్స్ కారణంగా షో రేటింగ్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. వీరికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఆర్మీలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక కొన్నాళ్ల పాటు కలిసే ఉన్న ఆరవ్- ఓవియాల మధ్య అకస్మాత్తుగా విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఓవియా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కూడా అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. (చదవండి:తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి) ఇక గత ఏడాదికాలంగా రేహితో ప్రేమలో ఉన్న ఆరవ్.. ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. కెరీర్ విషయానికొస్తే.. ఆరవ్ నటించిన తొలి సినిమా రాజా భీమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. దర్శకుడు నరేశ్ సంపత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కావాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక రేహి విషయానికొస్తే మోడల్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె.. ప్రముఖ డైరెక్టర్ గౌతం మీనన్ రూపొందిస్తున్న ‘జోషువా ఇమాయి పోల్ కాకా’ అనే రొమాంటిక్ సినిమాతో హీరోయిన్గా పరిచయం కానుంది. -
ఇప్పటికైతే సింగిల్‌గానే ఉన్నా..
ఇక ముందు తాను నటించను అని అంటోంది నటి ఓవియా. కలవాని చిత్రంతో కోలీవుడ్‌కు కథానాయికగా పరిచయం అయిన మలయాళి కుట్టి ఈ బ్యూటీ. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా రాణించలేకపోయింది. ఆ మధ్య బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో పాల్గొని అందరినీ ఆకర్షించింది. ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు సినీ అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు. సామాజిక మాధ్యమాల్లో తన గ్లామర్ ఫొటోలను విడుదల చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండే ఓవియా ఈమధ్య వాటికి దూరంగా ఉంటూ వచ్చింది. అలాంటిది లాక్ డౌన్ కాలంలో మరోసారి తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు సంధించిన ప్రశ్నలకు ఓవియా తనదైన స్టైల్లో బదులిచ్చింది. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు గురించి అడిగిన ప్రశ్నకు రెండు వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు చెప్పింది. ఎవరినైనా ప్రేమిస్తున్నారా..? అన్న ప్రశ్నకు లేదు తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నట్టు చెప్పింది. అదేవిధంగా రాజకీయ వారసత్వం గురించి అడిగిన ప్రశ్నకు ఇప్పుడు రాజకీయం అన్ని రంగాల్లోనూ ఉందని పేర్కొంది. అదేవిధంగా ప్రస్తుత కరోనా కష్టాల గురించి మీరు ఎలా స్పందిస్తారు..? ప్రశ్నకు మన కష్టాలు ఇతరులకు ఎదురైనప్పుడే ఆ బాధ వారికి అర్థమవుతుందని చెప్పింది. కాబట్టి మన కష్టాన్ని మనమే ఎదుర్కోవాలని అంది. ఎవరో వచ్చి మనల్ని కాపాడాలని ఎదురు చూడరాదని పేర్కొంది. ప్రస్తుత జరుగుతున్న ఘటనపై ఎలా స్పందిస్తారు అన్న ప్రశ్నకు బదులిస్తూ నిజమైన నేరస్తులను శిక్షించే అధికారం తనకు లేదని, అలా జీవితంలో తాను నటించనని పేర్కొంది. అదేవిధంగా పెళ్లెప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు తనకు ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదని స్పష్టంగా చెప్పింది. (ప్రముఖ కమెడియన్‌కు లైంగిక వేధింపులు..) -
నా ఆర్మీ నాకుంది : బిగ్‌బాస్ భామ
చెన్నై : తనకు తన ఆర్మీ ఉందిగా అని చెప్పుకొచ్చింది నటి ఓవియ. కలవాని చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన మలయాళీ కుట్టి ఈ జాణ. తొలి చిత్రమే మంచి పేరు తెచ్చి పెట్టడంతో ఇక్కడ అవకాశాలు వరుసకట్టాయి. వాటిలో చాలా తక్కువ చిత్రాలే సక్సెస్ కావడంతో ఓవియ మార్కెట్ ఒక్క సారిగా పడిపోయ్యింది. అవకాశాలు సన్నగిల్లిపోయాయి. అలాంటి సమయంలో బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో రూపంలో ఈ అమ్మడికి మరోసారి క్రేజ్ వచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో సహ నటుడు ఆరవ్తో ప్రేమాయణం, అది బెడిసి కొట్టడం, ఆత్మహత్యాయత్నం వంటి సంఘటనలు ఓవియను సంచలన నటిగా మార్చేశాయి. దీంతో బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత నటిగా మరోసారి క్రేజ్ పెరిగింది. అయితే దాన్ని ఓవియ సరిగ్గా ఉపయోగించుకోలేదు. అదే సమయంలో 90 ఎంఎల్ వంటి గ్లామరస్ కథా చిత్రంలో నటించడం తన కెరీర్‌కు పెద్ద డ్యామేజ్ అయ్యింది. అందులో మద్యం తాగడం, పొగత్రాగడం వంటి సన్నివేశాల్లో నటించి తీవ్ర విమర్శలకు గురైంది. అయితే అలా నటించడాన్ని ఈ అమ్మడు సమర్థించుకుంది. దీంతో వచ్చే అవకాశాల ను కూడా కోల్పోయింది. ప్రస్తుతం అవకాశాల్లేని ఓవియ తరచూ ఫేస్బుక్లో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఈమెకు ఫేస్బుక్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. అలా అభిమానుల ప్రశ్నలకు బదులిస్తుంటుంది. సంచలన నటి పేరు రాజకీయంగా దుమారం రేపింది. కారణం ఈ మధ్య ఒక టీవీ చానల్‌కిచ్చిన భేటీలో రజనీకాంత్, కమలహాసన్ రాజకీయరంగప్రవేశం గురించి అడిగిన ప్రశ్న ఓవియను చిరెత్తించింది. అందుకు తాను బదులివ్వనని చెప్పింది. అయినా రజనీ, కమల్ రాజకీయాల గురించి తనను అడుగుతారేంటీ అని ఆవేశంగా ఎదురు ప్రశ్నవేసింది. అంతే కాదు ఈ విషయం గురించి తన ట్విట్టర్లో పేర్కొంటూ రాజకీయాలతో సంబంధం లేని నటీనటులను రాజకీయాల గురించి అడగడాన్ని మీడియా మానుకోవాలని హితవు పలికింది. ఇలాంటి ప్రశ్నలను ప్రజలను అడిగితే వేరే విధంగా సమాధానాలు వస్తాయని ట్విట్టర్లో పేర్కొంది. ఒక నెటిజన్ మీరు కూడా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించవచ్చుగా అని అన్నారు. అందుకు తనకంటూ ఒక ఆర్మీ ఉందిగా అని బదులిచ్చింది. -
పెళ్లితో పనేంటి?
చెన్నై : పెళ్లి, మంచి భర్త, పిల్లలు ఇలా అందమైన జీవితాన్ని కోరుకోని స్త్రీ ఉండదనేది గత మాట. మారుతున్న కాలంలో మనుషుల మనస్థత్వాలు మారుతున్నాయి. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం అని కొందరంటుంటే, పెళ్లిపై నమ్మకం లేదు అనేవారు మరికొందరు. ఇక నటి ఓవియ విషయానికొస్తే ఈ అమ్మడు రెండో కోవకు చెందింది. అసలు పెళ్లితో పనేంటి అని అంటోంది. ఈ మలయాళీ జాణ నటిగా రంగప్రవేశం చేసి దశాబ్దం దాటింది. స్టార్‌డమ్‌ను పెద్దగా పొందకపోయినా, పాపులారిటీని మాత్రం బాగానే పెంచుకుంది. వివాదాంశ పాత్రలతో వార్తల్లో సంచలన నటిగా ముద్రవేసుకున్న ఓవియ ఇటీవల 90 ఎంఎల్ అనే చిత్రంలో మగాడికి మగువ ఏ విషయంలోనూ తక్కువ కాదన్నట్లుగా విచ్చలవిడిగా నటించేసింది. తాజాగా ఈ అమ్మడు కథానాయకిగా నటించిన కలవాణి–2 చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా నటి ఓవియ ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొంటూ కలవాణి చిత్రం తన మనసుకు దగ్గరైన కథా చిత్రం అని పేర్కొంది. హెలన్ అనే తన అసలు పేరును ఓవియగా మార్చింది ఆ చిత్ర దర్శకుడు సర్గుణంనేనని తెలిపింది. తాజాగా ఆయన దర్శకత్వంలో నటించి కలవాణి–2లో నటించడం సంతోషంగా ఉందని అంది. ఇందులో తాను మహిళా సంఘం అధ్యక్షురాలిగా నటించానని చెప్పింది. నిజజీవితంలో తాను స్వేచ్ఛా జీవినని, వివాహ బంధంపై తనకు నమ్మకం లేదని చెప్పింది. కాబట్టి పెళ్లితో పని లేదని అంది. జీవితంలో పెళ్లే చేసుకోనని, స్వతంత్ర భావాలతో జీవించడం తనకు ఇష్టం అని పేర్కొంది. అందువల్ల మగతోడే అవసరం లేదని పేర్కొంది. జీవితాంతం నటిస్తూనే ఉండాలని ఆశపడుతున్నానని అంది. తనకు స్నేహితులంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరని, అలాగని శత్రువులూ లేరని అంది. అందరితోనూ ఒకేలా మసలుకుంటానని చెప్పింది. తనకు నచ్చితే ఎలాంటి పాత్రనైనా నటించడానికి రెడీ అని, అయితే సూపర్ ఉమెన్‌గా నటించాలన్న కోరిక మాత్రం ఉందని తెలిపింది.అలాంటి పాత్ర లభిస్తే సంతోషంగా నటిస్తానని అంది. నయనతార, కాజల్ అగర్వాల్, అమలాపాల్ వంటి నటీమణులు నిర్మాతలుగా మారారు. మీకు అలాంటి ఆలోచన ఉందా అని అడుగుతున్నారని, తాను నటిగా పరిచయం అయ్యింది ఇటీవలేనని, ఇంకా సంపాదించలేదని అంది. అందువల్ల సొంతంగా చిత్రాలు చేసే ఆలోచనలేదని స్పష్టం చేసింది. ఇక రాజకీయాలపై ఆసక్తి ఉందా అని అడుగుతున్నారని, తనకు రాజకీయాల గురించి తెలియదని, అందువల్ల ఆ ఆలోచనే లేదని ఓవియ చెప్పింది. -
బిగ్‌బాస్–3లో శ్రీరెడ్డి?
సాక్షి, చెన్నై : బిగ్‌బాస్–3లో వివాదాస్పద నటి శ్రీరెడ్డి పాల్గొననున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రముఖ నటుడు, మక్కళ్‌నీదిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటికే రెండు సీజన్లు జరిగిన షో కార్యక్రమం సీజన్–3 జూన్ రెండో వారంలో ప్రారభం కానుంది. ఇందుకు సంబంధించి కమలహాసన్ నటించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. తాజాగా నటి శ్రీరెడ్డి ఈ షోలో పాల్గొంటున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయట. శ్రీరెడ్డి గతంలో టాలీవుడ్లో తనతో లైంగిక చర్యలకు పాల్పడిన వారిలో కొందరి పేర్లు బయటపెట్టడంతో పాటు వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ అర్ధనగ్నంగా నడిరోడ్డుపై దీక్ష చేపట్టింది. ఆ తరువాత చెన్నైకి మకాం మార్చి కోలీవుడ్ సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసి వివాదాంశ నటిగా వార్తల్లోకి ఎక్కింది. ఇక బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో శ్రీరెడ్డి ఎంట్రీ ఇస్తే ఇక వీక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంటే. అయితే దీనిపై శ్రీరెడ్డి ఇంకా స్పందించలేదు. తాజాగా ప్రారంభం కానున్న బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్–3లో పాల్గొనే వారి ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే ఒరుకల్ ఒరుకన్నాడీ చిత్రంలో నటుడు సంతానంకు జంటగా నటించిన జాంగిరీ మధుమితను ఎంపిక చేసినట్లు తెలిసింది. కాగా బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్ ఒకటిలో నటి ఓవియ వివాదాస్పద చర్యలతో బాగా పాపులర్ అయ్యింది. అయితే ఆ షోలో విన్నర్‌గా మాత్రం ఆమె లవర్‌గా పాపులర్ అయిన నటుడు ఆరవ్ గెలుచుకున్నాడు. అలాగే సీజన్–2లో నటి ఐశ్వర్యదత్తు, యాషికలు పాపులర్ అయ్యారు. అయితే ఆ షోలో నటి రిత్విక విన్నర్‌గా నిలిచింది. -
అప్పుడు నావయసు 18 ఏళ్లు..
సినిమా: ప్రేమ పుట్టింది కానీ.. అంటోంది నటి ఓవియ. సమీప కాలంలో సంచలన నటిగా మారిందీ బ్యూటీ. 90 ఎంఎల్ అనే వివాదాస్పద కథా చిత్రంలో నటించి విమర్శలను ఎదుర్కొన్న ఓవియ ఇప్పటికి 25 చిత్రాల్లో నటంచింది. వాటిలో మలయాళం, కన్నడం చిత్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఈమె తన గురించి తెలుపుతూ సొంత ఊరు కేరళలోని తిరుచూర్. బీఏ చదివి 2007లో నటిగా రంగప్రవేశం చేశాను. కంగారు అనే మలయాళ చిత్రంతో కథానాయకిగా నటించాను. అలా కొన్ని చిత్రాల్లో నటించిన తరువాత 2010లో కలవాణి చిత్రంతో కోలీవుడ్‌కు ఎంటర్ అయ్యాను. కథానాయికల మధ్య పోటీ ఉన్నమాట నిజమే. అయితే అన్ని రంగాల్లోనూ పోటీ ఉంటుంది. నా అందం గురించి చాలా మంది అభినందించారు. అయితే నా ముఖం అందం కంటే మనసు ఇంకా అందం అని ధైర్యంగా చెప్పగలను. కళాశాలలో చదువుతున్నప్పుడే ప్రేమ పుట్టింది. అయితే దానిపై మనసు పెట్టలేదు. అప్పుడు నావయసు 18 ఏళ్లు. సినిమాల్లోకి వచ్చిన తరువాత నటనపైనే శ్రద్ధ పెడుతున్నాను. ప్రేమించడానికి సమయం లేదు.ఎవరికీ ఎందుకూ భయపడను. చిన్న వయసు నుంచే నాకు ధైర్యం ఎక్కువ. సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా అది తగ్గలేదు అని నటి ఓవియ చెప్పుకొచ్చింది. -
‘నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్’
వరుసగా హారర్ సినిమాలతో సత్తా చాటుతున్న కోలీవుడ్ డాన్సింగ్ స్టార్ రాఘవా లారెన్స్ మరోసారి భయపెట్టేందుకు రెడీ అయ్యాడు. ‘ముని’ సిరీస్‌లో ‘కాంచన 3’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగులో లైట్‌హౌస్ మూవీమేకర్స్ ఎల్ఎల్పీ పతాకంపై బి. మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్ బ్యానర్లో రాఘవ నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు.తాజాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ముని సిరీస్‌లోని గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా మరింతగా భయపెడుతుందంటున్నారు చిత్రయూనిట్. లారెన్స్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమాలో కబీర్ దుహన్ సింగ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓవియా, వేదిక, కోవై సరళ, సత్యరాజ్, శ్రీమాన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను మే 1న రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు ముందుగానే పూర్తవుతుండటంతో ఏప్రిల్ లోనే సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ఏప్రిల్ 19న కాంచన 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఏప్రిల్ 19న ‘కాంచన 3’
సౌత్‌లో సూపర్ హిట్ జానర్ అనిపించుకున్న హరర్ కామెడీ జానర్లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. వరుసగా హారర్ సినిమాలతో సత్తా చాటుతున్న కోలీవుడ్ డాన్సింగ్ స్టార్ రాఘవా లారెన్స్ మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ‘ముని’ సిరీస్‌లో ‘కాంచన 3’ రెడీ అవుతోంది. లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగులో లైట్‌హౌస్ మూవీమేకర్స్ ఎల్ఎల్పీ పతాకంపై బి. మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్ బ్యానర్లో రాఘవ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓవియా, వేదిక, కోవై సరళ, కబీర్ దుహన్ సింగ్, సత్యరాజ్, శ్రీమాన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్‌లుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఈ సినిమాను మే 1న రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు ముందుగానే పూర్తవుతుండటంతో ఏప్రిల్ లోనే సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ఏప్రిల్ 19న కాంచన 3 ప్రేక్షకుల ముందుకు కానుంది. -
ఓవియాపై మరో కేసు
పెరంబూరు: నటి ఓవియాపై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మరో కేసు నమోదైంది. బిగ్‌బాస్ రియాలిటీ షోతో పాపులర్ అయిన నటి ఓవియ ఇటీవల నటించిన చిత్రం 90 ఎంఎల్. మహిళా దర్శకురాలు అనితాఉదీప్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నటి ఓవియా విచ్చలవిడిగా నటించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ చిత్రంలో ఓవియా ధూమపానం చేయడం, మద్యం తాగడం, లిప్‌లాక్ సన్నివేశాలు, సహజీవనం లాంటి సన్నివేశాలు మన సంస్కృతి సంప్రదాయాలు మంటగలిపేలా ఉన్నాయంటూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ చిత్ర దర్శకురాలు అనితాఉదీప్, కథానాయకి ఓవియాలపై ఇప్పటికే పోలీస్స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా తిరువేర్కాడుకు చెందిన తమిళ్వేందన్ అనే వ్యక్తి బుధవారం స్థానిక వెప్పేరిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అందులో.. ఇటీవల పొల్లాచ్చిలో 100 మందికి పైగా విద్యార్థినులు అత్యాచారం, చిత్రవధకు గురయ్యారన్నాడు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సెల్‌ఫోన్ పరిజ్ఞానంతో ప్రేమ, పెళ్లి పేర్లతో కట్ర పన్ని ఆ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు చేసిన ఆకృత్యాలు మానవ జాతికే అవమానం అని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరిగేలా సినిమాలు రూపొందించడం అంతకంటే నీచంగా పేర్కొన్నారు. గత మార్చి 1వ తేదీన అనిత ఉదీప్ దర్శకత్వంలో నటి ఓవియ ప్రధాన పాత్రలో నటించిన 90ఏఎల్ చిత్రం విడుదలైందని, ఇందులో ఓవియ సభ్యసమాజం తల దించుకునేలా నటించిందని వివరించారు. తమిళ సంస్కృతిని నాశనం చేసేవిధంగా, మహిళలను తప్పుదోవ పట్టించే విధంగా 90 ఎంఎల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకురాలు అనిత ఉదీప్, అందులో నటించిన నటి ఓవియలను అరెస్ట్ చేయాలని కోరాడు. అతని ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
సూపర్ హిట్ హారర్ సీక్వెల్ ఎప్పుడంటే!
వరుసగా హారర్ సినిమాలతో సత్తా చాటుతున్న కోలీవుడ్ డాన్సింగ్ స్టార్ రాఘవా లారెన్స్ మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ‘ముని’ సిరీస్‌లో ‘కాంచన 3’ రెడీ అవుతోంది. లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగులో లైట్‌హౌస్ మూవీమేకర్స్ ఎల్ఎల్పీ పతాకంపై బి. మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్ బ్యానర్లో రాఘవ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓవియా, వేదిక, కోవై సరళ, కబీర్ దుహన్ సింగ్, సత్యరాజ్, శ్రీమాన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్‌లుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. అన్నికార్యక్రమాలు పూర్తి చేసి మే 1న సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా తెలిపారు. ముని సిరీస్‌లో గతంలో వచ్చిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించటంతో కాంచన 3పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
నటి ఓవియను అరెస్ట్ చేయాలి
పెరంబూరు: స్త్రీ స్వేచ్ఛను హరించడమే సమాజానికి చేటు అని నటుడు శింబు పేర్కొన్నారు. ఎప్పుడూ వివాదాల్లో ఉండే ఈ సంచలన నటుడు 90 ఎంఎల్ చిత్రంతో మరోసారి వార్తల్లోకెక్కారు. సంచలన నటి ఓవియా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 90 ఎంఎల్. మహిళా దర్శకురాలు అనితా ఉదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కిం చుకుంది. విమర్శకుల నుంచి మాత్రం తీవ్ర వ్యతి రేకతను ఎదుర్కొంటోంది. అందుకు కారణం చిత్రంలో అమ్మాయిలు మద్యం సేవించడం, పొగ తాగడం, సహజీవనం సాగించడం లాంటి పలు అంశాలు చోటు చేసుకోవడమే. 90 ఎంఎల్ చిత్రం సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ పొందింది. కాగా ఈ చిత్రానికి నటుడు శింబు సంగీతాన్ని అందించారు. ఈ విషయమే ఆయన్ని విమర్శల పాలు చేసింది. దీనికి స్పందించిన శింబు తొలిసారిగా మహిళల ఇతివృత్తంతో కూడిన చిత్రాల్లో మగవారిని కించపరచకుండా స్త్రీల స్వేచ్ఛ గురించి అనితా ఉదీప్ కథను తయారు చేశారని అన్నారు. అలాంటిది మనమే భావితరాలను, సమాజాన్ని నాశనం చేసే చిత్రం అని గగ్గోలు పెడుతున్నామన్నారు. స్త్రీ స్వేచ్ఛను అడ్డుకోవడమే సంప్రదాయాలకు చేటు అని పేర్కొన్నారు. తాను మహిళా వ్యతిరేకినని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారనీ, అందుకే ఈ చిత్రానికి మద్దతు ఇచ్చి, సంగీతాన్ని అందించాననీ చెప్పారు. దీన్ని అర్థం చేసుకున్న మగవారికి ధన్యవాదాలు అని శింబు పేర్కొన్నారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నటి ఓవియను అరెస్ట్ చేయాలి కాగా 90 ఎంఎల్ చిత్రంపైనా, దర్శకురాలు, హీరోయిన్ ఓవియలపై తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళలను కించపరచే సన్నివేశాల్లో నటించినందుకు గానూ నటి ఓవియను అరెస్ట్ చేయాలంటూ ఇండియా దేశీయ లీగ్ పార్టీ మహిళా విభాగ నిర్వాహకులు సోమవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
90ఎంఎల్‌పై విమర్శల వర్షం
పెరంబూరు: సమాజాన్ని భ్రష్టు పట్టించే చిత్రం అంటూ నటి ఓవియ నటించిన 90ఎంఎల్ చిత్రంపై విమర్శలు వెల్లువడుతున్నాయి. బిగ్‌బాస్ గేమ్ షో ఫేమ్ ఓవియ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 90 ఎంఎల్. దీన్ని మహిళా దర్శకురాలు అనితా ఉదీప్ తెరకెక్కించారు. నటుడు శింబు సంగీతాన్ని అందించడం విశేషం. శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందుతోంది. అయితే ఇందులో నటి ఓవియతో పాటు ఆమె స్నేహితురాళ్ల పాత్రలు మద్యం తాగడం, దమ్ము కొట్టడం, లిప్‌లాక్ చుంబనాలు, అదే విధంగా సహజీవనం, లెస్బియన్ సన్నివేశాలాంటివి చోటుచేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 90ఎంఎల్ చిత్రం గురించి నిర్మాత ధనుంజయన్ స్పందిస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టించే చిత్రం అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతే కాకుండా డబ్బు సంపాదన కోసం యువతరాన్ని నాశనం చేయకూడదని అన్నారు. ఈయన వ్యాఖ్యలకు 90ఎంఎల్ చిత్ర దర్శకురాలు అనితా ఉదీప్ బదులిచ్చేలా మీరు నిర్మించిన చంద్రమౌళి చిత్రంలో సందేశం ఇచ్చేలా అశ్లీల పాటను పొందుపరిచిన చిత్రానికి నేను దర్శకరాలిని కాదు అని వెటకారపు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. అందుకు ధనుంజయన్ నా చిత్రంలో పాట గ్లామరస్‌గా ఉందే కానీ అశ్లీలంగా మాత్రం లేదని అన్నారు. నా చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌నే పొందాను. మీ చిత్రం మాదిరి ఏ సర్టిఫికెట్ కాదు. అయినా చిత్రంలో పాటలు ఎలా ఉండాలన్నది దర్శకుడి నిర్ణయం అని, నేనెప్పుడూ పాటల విషయంలో సొంత నిర్ణయాలను తీసుకోలేదని బదులిచ్చారు. దీంతో దర్శకురాలు అనితా ఉదీప్ సార్ మీతో వివాదం బోర్ కొడుతోంది. కాస్త ఆసక్తికరంగా, కొంచెం స్మార్ట్‌గా మాట్లాడండి అని పేర్కొన్నారు. ఆ తరువాత ధనుంజయన్ నుంచి బదులు రాకపోవడంతో అనితా ఉదీప్ ప్లీజ్ పారిపోకండి. మీతో కొంచెం కామెడీ చేయాలని ఉంది అని ట్వీట్ చేశారు. వీరి వివాదం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. -
రాజకీయాల్లోకి రమ్మన్నారు : ఓవియా
తమిళసినిమా: నన్నూ రాజకీయాల్లోకి రమ్మన్నారని నటి ఓవియ చెప్పింది. ఈ కేరళా కుట్టి ఇప్పుడు వార్తల్లో హాట్‌హాట్‌గా నానుతోంది. కలవాణి చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయినా, అప్పట్లో అంతగా పాపులర్ కాలేకపోయింది. ఎప్పుడైతే బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొందో, అందులో నటుడు ఆరవ్తో ప్రేమ అంటూ వివాదాలకు తావిచ్చి హెడ్లైన్ వార్తల నటిగా మారిపోయింది. ఆ పాపులారిటీ సినీరంగంలోనూ పని చేసింది. తాజాగా ఈ అమ్మడు నటించిన 90 ఎంఎల్ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాంశంగా మారింది. అందుకు కారణం చిత్రంలో నటి ఓవియ పోషించిన పాత్రనే. మద్యం, పొగ తాగడం వంటి సన్నివేశాల్లో నటించి ఓవియ చర్చల్లో చిక్కుకుంది. అయితే ఇవన్నింటినీ ఈ భామ సమర్థించుకోవడం విశేషం. అసలీ అమ్మడు ఏమంటుందో చూద్దాం. పురుషాధిక్యత నుంచి బయటపడ్డ ఒక యువత స్వేచ్ఛగా జీవించాలనుకునే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం 90 ఎంఎల్. మహిళా దర్శకురాలు అనిత ఈ కథను చెప్పగానే వెంటనే నటించడానికి అంగీకరించాను. ఇందులో ద్వందర్థాల సంభాషణలు, మద్యం తాగడం, పొగతాగడం వంటి సన్నివేశాలు ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. అయితే అలాంటి అలవాట్లన్నీ నా నిజజీవితానికి సంబంధించినవి కాదు. చిత్రంలో ఒక పాత్రకు చెందిన అలవాట్లు. అందుకే ఈ చిత్రాన్ని వయసుకు వచ్చిన వాళ్లు చూస్తే చాలు అని చెబుతున్నాం. మళ్లీ ఈ తరహా పాత్రల్లో నటిస్తారా అని అడుగుతున్నారు. అయితే ఒక్కో చిత్రంలో ఒక్కో తరహా పాత్రలో నటించాలని కోరుకునే నటిని నేను. అది నాయకి పాత్ర అయినా, ప్రతి నాయకి పాత్ర అయినా సరే. పెళ్లి గురించి అడుగుతున్నారు. అది నాకు సరిపడదని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్నతనం నుంచి నా ఇష్టానుసారం స్వేచ్ఛగా జీవిస్తున్నాను. అయితే ఇకపై ఎం జరుగుతుందో చెప్పలేను. మనం అనుకున్నవన్నీ జరగవు కదా ఇకపోతే రాజకీయాల్లోకి వెళతారా అని అడుగుతున్నారు. ఇప్పుడికే కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు నన్ను కలిసి తమ పార్టీలో చేరమని కోరారు. అందుకు నేను నిరాకరించాను. అయితే నన్ను పార్టీలో చేరమని అడిగిందెవరన్నది చెప్పదలచుకోలేదు. కోటి రూపాయలు ఇస్తానంటే రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేస్తారా అని అడిగితే కచ్చితంగా చేయననే చెబుతాను. నేను నటిగా కోలీవుడ్‌లో నాకంటూ ఒక స్థానాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అని నటి ఓవియ పేర్కొంది. -
ఆయన నా లైఫ్‌లో ఉండాలి : ఓవియా
తమిళ బిగ్‌బాస్ షో తో ఫేమస్ అయిన ఓవియా.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా 90ఎమ్ఎల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో ఓవియా బోల్డ్‌గా నటించడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఓవియా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. హీరో శింబుతో కలిసి ఓవియా గతకొంతకాలంగా సన్నిహితంగా ఉంటోన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందిస్తూ.. ‘స్నేహానికి .. ప్రేమకి మధ్య చాలా తేడా వుంది. శింబు మంచి స్నేహితుడు .. నా వ్యక్తిగత విషయాలను నేను తనతో షేర్ చేసుకుంటాను. ఆయన సలహాలు .. సూచనలు తీసుకుంటాను. ఏ సాయం కోసమైనా .. ఏ సమయంలోనైనా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడేంత చనువు వుంది. ఎదుటివారి కష్ట సుఖాలను అర్థం చేసుకోగల మంచి మనసు శింబుకి వుంది. ఎదుటివారి సమస్యలకి తగిన పరిష్కారాలు సూచించగలగడంలో ఆయన ముందుటాడు. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఉండాలనే నేను కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
‘అలాంటి వారు నా సినిమాను చూడొద్దు’
తమిళసినిమా: అలాంటి వారు నా చిత్రాన్ని చూడొద్దు అంటోంది నటి ఓవియ. కలవాణి చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన మలయాళీ కుట్టి ఈ అమ్మడు. ఆ చిత్రంలో విమల్‌కు ప్రేమికురాలిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఓవియా ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. అలాంటిది బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొని సంచలన నటిగా చాలా పాపులర్ అయ్యింది. తాజాగా కథానాయకిగా బిజీ అయిపోయింది. లారెన్స్‌తో కాంచన–2, 90 ఎంఎల్ వంటి సంచలన చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు నెల రోజుల గ్యాప్‌లో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా 90 ఎంఎల్ చిత్రంపై వివాదం చెలరేగుతోంది. అందుకు కారణం ఈ చిత్ర ట్రైలర్లో ఓవియా మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం వంటి సన్నివేశాలు చోటు చేసుకోవడమే. దీనికి సంచలన నటుడు శింబు సంగీ తాన్ని అందించారు. చిత్రం మార్చిలో తెరపైకి రానుంది. వ్యతిరేకతపై నటి ఓవియా స్పందిస్తూ పాటలు, ట్రైలర్‌ను చూసి చిత్రాన్ని అంచనా వేయరాదని పేర్కొంది. చిత్రం విడుదలైన తరువాత అభిమానుల మధ్య తానీ చిత్రాన్ని చూడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. కారణం చిత్రం బాగుం టుందని, మహిళల సహజమైన జీవన విధానంలో వారి భావాలను ఆవిష్కరించే చిత్రంగా 90 ఎంఎల్ చిత్రం ఉంటుందని పేర్కొంది. అయితే సంస్కృతిపై నమ్మకం లేకపోతే పురుషాధిక్యం కోరుకునే వారెవరూ తన చిత్రాన్ని చూడవద్దు అని అంది. కాగా 90 ఎంఎల్ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చారన్నది గమనార్హం. -
నువ్విలాంటి సినిమా చేయడమేంటి?
చెన్నై : తమిళ హీరోయిన్ ఓవియాపై ప్రస్తుతం ఆమె అభిమానులతో పాటు, సినీ విమర్శకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ నుంచి ఇలాంటి సినిమాలు ఊహించలేదు అంటూ విమర్శిస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. ఓవియా నటించిన 90 ఎంఎల్ అనే సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం. మొదట వుమెన్-సెంట్రిక్‌గా తెరకెక్కుతున్న సినిమాగా 90ఎంఎల్‌ను ప్రచారం చేశారు. అయితే ట్రైలర్ చూసిన ప్రేక్షకులు మాత్రం.. ‘ఇది చాలా చెండాలంగా ఉంది. మీరు అడల్డ్ సినిమా చేయడమేమిటి’ అని ఓవియాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘యువతను పెడదారి పట్టించి డబ్బులు సంపాదించడానికి ఇలాంటి సినిమాలు తీయడం నిజంగా బాధాకరం. ఇలాంటి వాటిని నిషేధించాలి. నువ్వు అందరిలాంటి దానివి కాదు. ఎంతోమంది యువతులు నిన్ను అనుకరిస్తారు. అలాంటి వారికి నువ్విచ్చే సందేశం ఇదేనా. సారీ ఓవియా చాలా అప్సెట్ అయ్యాం’ అని ట్విటర్ వేదికగా ఆమెను విమర్శిస్తున్నారు. కాగా అభిమానుల కామెంట్లకు స్పందించిన ఓవియా.. ‘చూడండి. పండు రుచి చూడబోతూ విత్తనం ఎలా ఉంటుందో నిర్ణయించేయకండి. సినిమా విడులయ్యేదాకా ఆగండి. అప్పటి వరకు ఈ ట్రైలర్ ఎంజాయ్ చేయండి’ అని విషయాన్ని చాలా లైట్ తీసుకుంది. ఇక తమిళ బిగ్‌బాస్ షో ద్వారా ప్రాచుర్యం పొందిన ఓవియా నిరంతరం ఏదో ఒక కారణంతో నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆ షోలో తనతో పాల్గొన్న ఆరవ్తో ఈమె ప్రేమలో పడినట్లుగా వదంతులు ప్రచారమవుతున్నాయి. అయితే అదేమీ లేదని ఓవియా కొట్టిపారేసింది. ప్రస్తుతం 90 ఎంఎల్‌తో పాటుగా కలవాని-2, కాంచన-3 చిత్రాల్లో ఆమె నటిస్తోంది. இந்த மாதிரி படங்கள் தமிழ் சினிமாவின் சாபக்கேடு @itisprashanth ...I feel sad & angry people indulging in making such cinema to make money by titillating the youth. Down down such vulgar & crude films. Sorry to say this but I am so upset seeing these scenes #90MLTrailer ✍️✍️✍️👎👎 https://t.co/rmJylaUsEr — Dhananjayan BOFTA (@Dhananjayang) February 8, 2019 Actress @OviyaaSweetz is not just any other star . So many young girls follow her closely and are getting inspired by her. A movie like this - Only will guide them in the wrong direction. Sorry Oviya - Expected much more from you !! #90MLTrAiler — Prashanth Rangaswamy (@itisprashanth) February 8, 2019 -
‘అతన్ని ప్రేమిస్తే.. అందరికి చెప్తాను’
అతగాడితో ప్రేమలో పడితే తనే అందరికి చెబుతానని అంటోంది తమిళ నటి ఓవియ. ‘బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో’ ద్వారా బాగా ప్రచారం పొందిన నటి ఈ అమ్మడేనని చెప్పవచ్చు. తొలి చిత్రం ‘కలవాని’ విజయం సాధించినా ఆ తరువాత నటించిన చిత్రాలేవీ ఓవియ కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. అలాంటి తరుణంలో ‘బిగ్‌బాస్ గేమ్ షో’కు పిలుపొచ్చింది. అందులో పాల్గొన్న మరో నటుడు ఆరవ్తో ప్రేమ, వివాదం అంటూ వార్తల్లోకెక్కి బాగా ప్రచారం పొందింది ఓవియా. షో నుంచి బయటకు వచ్చిన తరువాత నటిగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. నటుడు, దర్శకుడు రాఘవలారెన్స్ తెరకెక్కిస్తున్న ‘కాంచన–3’లో ఓవియా, ఆయనతో జతకట్టింది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మార్చిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ‘90 ఎంఎల్’ అనే మరో చిత్రంలోనూ ఓవియ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఓవియా నటుడు ఆరవ్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందనే ప్రచారం జోరందుకుంది. ఈ సందర్భంగా ఓవియ ఒక ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఓవియా మాట్లాడుతూ.. ‘‘బిగ్‌బాస్ గేమ్ షో’లో పాల్గొనడం సంతోషకరం. ఆ తరువాత పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. అందులో నచ్చిన కథలనే అంగీకరిస్తున్నాను. నా సినీ పయనాన్ని ఇతరులతో పోల్చడం నాకిష్టం లేదు. నేను తీసుకున్న నిర్ణయాలు నాకు సంతృప్తినిస్తున్నాయి. నటుడు ఆరవ్తో నన్ను కలిపి చాలా వదంతులు ప్రచారం అవుతున్న విషయం తెలుసు. అయితే మా ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి’ అన్నారు. అంతేకాక ‘మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా అభిమానం ఉంది. దీన్ని స్నేహం అని చెప్పలేను. అందరూ అనుకున్నట్లు మా మధ్య ప్రేమ లాంటిది ఏమైనా పుడితే నేనే ఆ విషయం స్వయంగా అందరికీ చెబుతాను. ప్రస్తుతం మేం సినిమాల మీద దృష్టిపెడుతున్నాం. నేను ప్రస్తుతం ‘కలవాని–2’, ‘కాంచన–3’, ‘90 ఎంఎల్’ చిత్రాల్లో నటిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు ఓవియా. -
వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు
సినిమా: వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని అంటోంది నటి ఓవియ. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో కార్యక్రమంతో ప్రాచుర్యం పొందిన నటి ఈ అమ్మడు. అదే గేమ్ షోలో నటుడు ఆరవ్తో ప్రేమ, మనస్పర్థలు అంటూ కలకలంతో వార్తల్లోకెక్కిన ఓవియకు సినీ అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. మరోసారి నటుడు ఆరవ్తో కలిపి ఓవియపై వదంతులు జోరుగా సాగుతున్నాయి. ఈ వ్యవహారంపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన ఓవియ ఏమందో చూద్దాం. నేను రాజబీమా చిత్రంలో నటి ఓవియగానే ఒక కీలక పాత్రలో నటిస్తున్నాను. అందులో నటుడు ఆరవ్తో ఒక పాటకు డాన్స్ చేశాను. విశేషం ఏమిటంటే ఆ పాటను ఆరవ్‌నే రాశాడు. అదీ నన్ను పొగుడుతూ రాశాడు. నిజం చెప్పాలంటే ఒక స్నేహితుడిగా ఆరవ్ అంటే నాకు చాలా ఇష్టం. అదీ కాకుండా బిగ్‌బాస్ ఇంట్లో ఇద్దరం కలిసి ఉన్నాం. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడి చాలా గొడవపడ్డాం కూడా. అయితే ఆ కార్యక్రమం ముగిసిన తరువాత మా మధ్య విభేదాలు తొలగిపోయాయి. బయట కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నాం. అయితే మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోనున్నాం, సహజీవనం చేస్తున్నాం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. నిజంగా అలాంటి జీవితాన్ని గడిపే పక్షంలో దాన్ని దాచాల్సిన అవసరం నాకు లేదు. ఆరవ్‌కు సంబంధించినంతవరకూ అతను నాకు మంచి ఫ్రెండ్. ఈ విషయంలో ఎలాంటి మార్పులేదు. అతను నాకు సపోర్టుగా ఉన్నాడు. నాకు వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు. అది నా జీవితంలో అవసరం లేదు కూడా. నాకా జీవితం సెట్ కాదు అని పేర్కొంది. -
నన్ను అలా వాడుకుంటున్నారు!
సినిమా: నా పేరును ప్రచారానికి వాడుకుంటున్నారని నటి ఓవియ ఆరోపిస్తోంది. కలవాని చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన మాలీవుడ్ అమ్మడీమె. ఆ చిత్రం సక్సెస్‌తో వరుసగా పలు చిత్రాల అవకాశాలు టపటపా వచ్చేసినా వాటిలో ఏవీ పెద్దగా విజయం సాధించకపోవడంతో మంచి మార్కెట్‌ను సంపాదించుకోలేకపోయింది. అయితే బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో–1లో పాల్గొన్న ఓవియకు పిచ్చ పిచ్చగా క్రేజ్ వచ్చేసింది. అంతే ఆ తరువాత సినిమా అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం కలవాని 2, 9 ఎంఎల్, కాంచన–3 చిత్రాల్లో నటిస్తోంది. ఈ అమ్మడితో చిన్న ఇంటర్వ్యూ. ప్ర: ఓవియ ఎలాంటి అమ్మాయి? జ: చిన్న తనం నుంచి చాలా స్వేచ్ఛగా ఉండాలని అనుకునే అమ్మాయిని నేను. ఎవరిని ఎలాంటి సహాయం అడగను. నా చేతి కర్చులకు కూడా నేను సంపాదించుకునేదాన్ని. అలా ఆ వయసులో డబ్బు ఎలా సంపాదించాలన్న ఆలోచిస్తున్న సమయంలోనే మోడలింగ్ రంగంలో అవకాశం వచ్చింది. మోడలింగ్ నుంచే చిన్న చిన్న వాణిజ్య ప్రకటనల్లో నటించడం ప్రారంభించాను. ఆ సంపాదన నా పాకెట్ మనీకి సరిపోయేది. అలా నా మోడలింగ్ ఫొటోలను చూసిన దర్శకుడు సర్గుణం కలవాని చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం కల్పించారు. ఆ చిత్రంతో హెలెన్ అయిన నేను ఓవియగా మారాను. ప్ర: మీ జీవితాన్ని బిగ్‌బాస్ గేమ్ షోకు ముందు, ఆ తరువాత అని విడదీసి చూడవచ్చా? జ: చాలా మంది నేను రాత్రికి రాత్తే నటిగా పాపులర్ అయ్యాననుకుంటున్నారు. అది ఒక రకంగా నిజమే అయినా బిగ్‌బాస్ గేమ్ షో తరువాతనే నాకింత పేరు వచ్చింది. అయితే చాలా కష్టాలు, శ్రమ తరువాతనే నేనీ స్థాయికి చేరుకున్నాను. చాలా ఏళ్ల క్రితమే నటిగా పరిచయం అయ్యాను. అయితే మొదట్లో ఇంత పేరు రాలేదు. చాలా కాలం పోరాడాను. బిగ్‌బాస్ గేమ్ షో పూర్తి అయ్యి ఏడాది గడిచినా ప్రేక్షకులు నన్ను మరచిపోకపోవడం సంతోషంగా ఉంది. వెండితెర, బుల్లితెర ప్రేక్షకులు తనను వారి కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావిస్తున్నారు. ఇది నేను జీవితంలో మరచిపోలేని అనుభవం. అయితే కొందరు తన అభిమానుల్ని తప్పుదారి పటిస్తున్నారు. నేను చిన్న పాత్రల్లో నటించిన చిత్రాలకు కూడా నా పేరును ప్రచారానికి వాడుకుంటున్నారు. ఇదే వేదనకు గురిచేస్తోంది. ప్ర: హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించాలన్న ఆశ ఉందా? జ: కచ్చితంగా ఉంది. అయితే నయనతార నటించిన అరమ్ లాంటి కథా చిత్రాలు కాకుండా, నేను నేనుగా ఉండే చిత్రాలనే నా అభిమానులు కోరుకుంటారు. కాబట్టి నేను చేసే చిత్రాలు భిన్నంగా ఉండాలి. సందేశాలిచ్చేవిగా ఉండరాదు. ప్ర: న్యూ ఇయర్ వేడుకలు ఎలా జరుపుకుంటారు? జ: నేనెప్పుడూ స్నేహితురాళ్లతోనే జరుపుకుంటాను. అదే విధంగా ఈ సారి కూడా. అయితే ఆ తరువాత నాకు నచ్చిన ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నాను. అది హిమాలయాలు కూడా కావచ్చు. -
ఓవియ ఎందుకు లేదు?
తమిళసినిమా: కాటేరి చిత్రంలో నటి ఓవియ ఎందుకు నటించడంలేదు. ఆమెను తప్పించారా? తనే వైదొలగిందా? కోలీవుడ్‌లో జరుగుతున్న చర్చ ఇదే. తామిరుక్క భయమే వంటి సక్సెస్ఫుల్ చిత్రం ఫేమ్ డీకే తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాటేరి. వైభవ్ హీరోగా నటిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ కథా చిత్రంలో మొదట హన్సిక నటించనున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఓవియ పేరును వెల్లడించారు. చివరకు నటి వరలక్ష్మీ, సోనంబాజ్వా వచ్చి చేరారు. ఇలాఉండగా నటి ఓవియ కాటేరి నుంచి తొలగించబడిందా? తనే వైదొలగిందా? అన్న చర్చ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో తరువాత ఓవియ క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో అవకాశాలు వరుసగా తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం లారెన్స్‌తో కాంచన–3 చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు మరో తమిళ చిత్రం, ఒక తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది. కాటేరి చిత్ర నిర్మాత కేఇ.జ్ఞానవేల్‌రాజా బిగ్‌బాస్ గేమ్ షో ప్రారంభానికి ముందు నటి ఓవియను ఎంపిక చేశారట. అప్పుడు ఆమె పారితోషికం రూ.10 లక్షల లోపే. అయితే బిగ్‌బాస్ షోతో అనూహ్య క్రేజ్ రావడంతో ఓవియ రూ.50లక్షలు పారితోషికం కావలంటూ డిమాండ్ చేశారట. దీంతో నిర్మాతను పక్కన పెట్టి, కథలో కొన్ని మార్పులు చేసి నటి వరలక్ష్మీ, సోనంబాజ్వాలను ఎంపిక చేసినట్లు వారి వెర్సన్. అయితే పారితోషికం తనకు పెద్ద విషయం కాదని, కాటేరి చిత్రంలో తాను మాత్రమే కథానాయకినని చెప్పి, ఆ తరువాత మరో ఇద్దరిని చేర్చడంతోనే ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు ఓవియ చెబుతున్నారు. -
‘అందుకే ఓవియా నచ్చింది’
తమిళసినిమా: నటి ఓవియ తనకు నచ్చడానికి కారణం అదే అంటున్నాడు నటుడు ఆరవ్. వీరిద్దరి గురించి ఆ మధ్య పెద్ద చర్చే జరిగిందన్నది తెలిసిన విషయమే. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న వారి లో ఆరమ్, ఓవియ కూడా ఉన్న విషయం తెలిసిందే. అంతే కాదు వీరిద్దరి మధ్య ఆ గే మ్ షోలోనే ప్రేమ వ్యవహారం సాగిందని, అయితే ఓవియ పెళ్లి ప్రపోజల్ చేయగా ఆరవ్ రివర్స్ గేర్ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అంతే కాదు ఆరమ్ తన ప్రేమను నిరాకరించడంతో మానసిక వేదనకు గురైన ఓవియ ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్లు ప్రచారం హోరెత్తింది. దీంతో నటి ఓవియ మళ్లీ మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పట్టింది. అనంతరం ఆరవ్, ఓవియ సహజంగానే మసులుకోవడం మొదలెట్టారు. నటి ఓవియ ఆ గేమ్ షోలో గెలవకపోయినా, అంత కంటే ఎక్కువే ప్రాచుర్యం పొందింది. దీంతో కొత్తగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. అంతే కాదు వాణిజ్య ప్రకటనలు తలుపు తడుతున్నా యి. మొత్తం మీద ఓవియ సెలబ్రిటీ నటి అయిపోయింది. అప్పుడు తన ప్రేమను నిరాకరించిన ఆరవ్ ఇప్పుడు ఓవియానే తనకు ఇష్టమైన నటి తను అని అంటున్నాడు. ఈయన ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన భేటీలో ఓవియ తనకు నచ్చడానికి కారణం ఏమంటంటే యథార్థంగా ఉండడం ప్రపంచంలోనే కష్టమైన విషయం అన్నారు. నిజజీవితంలోనూ ఏదో విధంగా నటిస్తూనే ఉంటామన్నారు. అయితే నటి ఓవియ ఎప్పుడూ తనలాగే ఉంటుందని అందుకే ఆమె తనతో పాటు అందరికీ నచ్చుతుందని పేర్కొన్నాడు. -
‘ఇది నా లవ్ స్టోరి’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇది నా లవ్ స్టోరి జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : తరుణ్, ఓవియా సంగీతం : శ్రీనాథ్ విజయ్ దర్శకత్వం : రమేష్, గోపి నిర్మాత : ఎస్వీ ప్రకాష్ ఒకప్పుడు లవర్ బాయ్‌గా ఓ వెలుగు వెలిగిన తరుణ్, తరువాత వరుస ఫ్లాప్‌లు ఎదురవ్వటంతో కష్టాల్లో పడ్డాడు. దాదాపుగా ఇక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశాడనుకుంటున్న సమయంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఇది నా లవ్ స్టోరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడలో ఘనవిజయం సాధించిన సింపుల్లాగ్ ఒంద్ లవ్ స్టోరి ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రమేష్ గోపిలు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తన ఇమేజ్‌కు తగ్గట్టుగా లవర్ బాయ్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు తరుణ్. మరి లాంగ్ గ్యాప్ తరువాత తరుణ్ చేసిన ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..? ఇది నా లవ్ స్టోరి అయినా తరుణ్‌ను హిట్ ట్రాక్‌లోకి తీసుకువచ్చిందా..? కథ : అభిరామ్ (తరుణ్) యాడ్ ఫిలిం డైరెక్టర్. తల్లిదండ్రులు లేని అభిరామ్‌కు చెల్లెలంటే ప్రాణం. అందుకే చెల్లి ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లి ఫిక్స్ చేస్తాడు. అభిరామ్ చెల్లి.. తనకు కాబోయే మరదలిని తన అన్న పెళ్లి చేసుకుంటే బాగుంటుందని వాళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తుంది. చెల్లెలి మాట కాదనలేక అభిరామ్.. డాక్టర్ శృతిని చూసేందుకు ఒప్పుకుంటాడు. వెళ్లేదారిలో ఓ అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తీరా తనే శృతి (ఓవియా) అని తెలిసి ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఇంట్లో వాళ్లంతా గుడికి వెళ్లారని రావడానికి చాలా సమయం పడుతుందని శృతి చెప్పటంతో ఈ లోగా ఒకరి ఇష్టాఇష్టాలను ఇంకొకరు తెలుసుకోవచ్చిన గతం గురించి మాట్లాడుకోవటం మొదలపెడతారు. ఇద్దరు తమ తొలి ప్రేమకథలను పంచుకుంటారు. అదే సమయంలో శృతి కూడా అభిరామ్‌తో ప్రేమలో పడుతుంది. మరుసటి రోజు ఉదయం లేచేసరికి పోలీసులు అభిరామ్‌ను అరెస్ట్ చేస్తారు. శృతి కంప్లయిట్ ఇచ్చినందుకే తనని అరెస్ట్ చేశారని తెలిసి షాక్ అవుతాడు అభిరామ్. అసలు శృతి అలా ఎందుకు కంప్లయింట్ ఇచ్చింది..? ఆమె నిజంగా శృతినేనా..? చివరకు అభిరామ్‌కు తను ప్రేమించిన అమ్మాయి దక్కిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : చాలా కాలం తరువాత తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చిన తరుణ్, లవర్ బాయ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. కథా కథనాల పరంగా పెద్దగా పర్ఫామెన్స్‌కు స్కోప్ లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో తరుణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్గా నటించిన ఓవియా పరవాలేదనిపించింది. బిగ్‌బాస్ వివాదాలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ గ్లామర్‌తో ఆకట్టుకున్నా.. నటన పరంగా నిరాశపరిచింది. అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడే హీరో చెల్లెలి పాత్ర తప్ప సినిమాలో మరే క్యారెక్టర్‌కు పెద్దగా ఇంపార్టెన్స్లేదు. విశ్లేషణ : కన్నడలో విజయం సాధించిన రొమాంటిక్ కామెడీని తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించటంలో దర్శకులు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కథలో మంచి ఎమోషన్ పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు అలాంటి వాటిమీద ఏమాత్రం దృష్టి పెట్టలేదు. రెండు గంటల సినిమాలో ఒక్క సీన్‌ను కూడా ఆసక్తికరంగా రూపొందించలేకపోయారు. సినిమాకు మరో మేజర్ డ్రాబ్యాక్ డైలాగ్స్. అవసరం లేకపోయినా ఇరికించిన పంచ్ డైలాగ్, ఏ మాత్రం పేలకపోగా చాలా సందర్భాల్లో విసుగుతెప్పిస్తాయి. శ్రీనాథ్ విజయ్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకునే స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : ప్రీ క్లైమాక్స్‌లో తరుణ్ నటన నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ : కథా కథనం డైలాగ్స్ సంగీతం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అతిథి పాత్రలో మంచు హీరో
ఒకప్పుడు లవర్ బాయ్‌గా సత్తా చాటిన యంగ్ హీరో తరుణ్, లాంగ్ గ్యాప్ తరువాత చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఇది నా లవ్ స్టోరి’. సక్సెస్ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణ్ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వస్తానని నమ్మకంగా ఉన్నాడు. రమేష్, గోపిలు సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ సినిమాకు సంబందించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తరుణ్ సరసన బిగ్‌బాస్ ఫేం ఓవియా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు వారబ్బాయి మనోజ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. కన్నడ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో తరుణ్ తిరిగి ఫాంలోకి వస్తాడేమో చూడాలి. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరో
బాల నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా తన మార్క్ చూపించిన నటుడు తరుణ్. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలతో ఆకట్టుకున్నా.. తరువాత ఆ ఫాంను కొనసాగించటంలో ఫెయిల్ అయ్యాడు తరుణ్. దీంతో సినిమాలు తగ్గించేసి వ్యాపారాల మీద దృష్టి పెట్టాడు. ఇది నా లవ్ స్టోరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న తరుణ్, త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారట. తల్లి కోరిక మేరకు పెళ్లి అంగీకరించిన తరుణ్ ఈ ఏడాదిలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు. రమేష్ గోపి దర్శకత్వంలో తెరకెక్కిన ఇది నా లవ్ స్టోరి సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాలో కోలీవుడ్ నటి ఓవియా తరుణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. -
రాత్రివేళ ఓవియ ఏం చేసిందో తెలుసా?
తమిళసినిమా: నటి ఓవియ అంటే ఇప్పుడు ప్రేక్షకుల్లో పిచ్చి క్రేజ్. గత ఏడాది చివరిలో అధికంగా వార్తల్లో నానిన నటి ఈ అమ్మడు. తను నటించిన చిత్రాలు విజయం సాధించడంతో వచ్చిన క్రేజ్ కాదది. అంతా బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో పుణ్యం. ఆ షోలో పాల్గొన ఓవియ విన్నర్‌గా నిలబడకపోయినా అంత కంటే ఎక్కువ గుర్తింపునే తెచ్చుకున్నారు. చాలా సహజంగా ప్రవర్తించిన నటిగా ప్రేక్షకుల్లో చాలా మంచి పేరును సంపాదించుకుంది. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు ఓవియ బాగా దగ్గరైపోయింది. అంతే కాదు ఆ తరువాత వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. తమిళంలో రెండు చిత్రాలు, మలయాళంలో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం లారెన్స్‌తో కాంచన–3 చిత్రంలో నటిస్తున్న ఓవియ ఇటీవల రాత్రివేళ అనూహ్యంగా చెన్నైలోని ఒక అభిమాని ఇంటికి వెళ్లింది. ఈ ఊహించని ఓవియ ఆగమనానికి ఆ అభిమానితో పాటు ఆ ప్రాత ప్రజలు ఆచ్చెరువు చెందారు. ఓవియ వారందరితో ఫొటోలు దిగి వారిని సంతోషపెట్టడంతో పాటు, కాసేపు వారి పిల్లలతో ఆడి పాడారు. ఓమయ షడన్ విజిట్‌లో అంతరార్థం ఏమై ఉంటుందనే ఆరాను లాగే ప్రయత్నంలో కోలీవుడ్ వర్గాలు ఉన్నా, ఈ సంఘటనతో ఓవియ మాత్రం చాలా ప్రచారాన్నే పొందేసింది. తను అభిమానితో,అక్కడి పిల్లలతో దిగిన ఫొటోలిప్పుడు సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తున్నాయి. -
కాట్టేరికి టాటానా?
తమిళసినిమా: కాట్టేరి చిత్రానికి నటి హన్సిక టాటా చెప్పిందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈ ముంబై బ్యూటీ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అయ్యిపోయింది. ప్రస్తుతం చేతిలో రెండు చిత్రాలున్నాయి. అందులో ఒకటి డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేస్తున్న గులేభాకావళి చిత్రం ఒకటి. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే విడుదలకు ముస్తాబవుతోంది. అధర్వకు జంటగా ఒక చిత్రం చేస్తోంది. శాన్ ఆంథోని దర్శకుడు. కాగా వైభవ్ కథానాయకుడిగా డీకే. దర్శకత్వంలో స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న కాట్టేరి చిత్రంలో నటించడానికి హన్సిక అంగీకరించింది. ఇది హర్రర్ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం. కథ కూడా విని నటించడానికి ఓకే చెప్పిన ఈ భామ తాజాగా ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు సోషల్ మీడియాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. హన్సిక కొత్త సంవత్సరంలో మరో భారీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతుండడంతో కాట్టేరి చిత్రానికి టాటా చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రంలో ముందుగా నటి ఓవియ న టించనుందనే ప్రచారం జరిగింది. ఈ తరువాత ఆమె అవకాశాన్ని హన్సిక కొట్టేసిందన్నారు. తాజాగా ఈ బ్యూటీ కూడా వైదొలిగిందనే ప్రచారం హోరెత్తుతోంది. కాల్షీట్స్ సమస్య కారణంగానే కాట్టేరికి సారీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. హన్సిక ఐదేళ్లుగా న్యూఇయర్‌ను తన స్నేహితులతో కలిసి న్యూ యార్క్‌లో ఎంజాయ్ చేస్తూ వస్తోంది. ఈ సారి ఆ టూర్‌ను కూడా రద్దు చేసుకుందట. చేతి నిండా చిత్రాలుండడంతో హన్సిక ఈ ఏడాది హ్యేపీ న్యూ ఇయర్‌ను ముంబైలోనే తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోనుందట. -
విజయ్ చిత్రానికి నో!
తమిళసినిమా: కళవాణి చిత్రంతో నాయకిగా మంచి గుర్తింపు పొందిన నటి ఓవియ. ఆ చిత్రంతో మరిన్ని అవకాశాలు వచ్చినా అవన్నీ ఆశించిన విజయాలను సాధించకపోవడంతో వెనుకపడి పోయింది. అలాంటిది బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో ఈ జాణను ఒక్కసారిగా పాపులర్ చేసేసింది. ఆ గేమ్ షోలో నటుడు ఆరవ్తో ప్రేమ వ్యవహారం. అతను నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు దుమారం లాంటి సంఘటనలు ఆమెకు మైనస్ అవుతాయనుకున్న వాళ్లే షాక్ అయ్యేలా కథ రివర్స్ అయ్యింది. అలాంటి సంఘటనలు ఓవియకు బోలెడంత సింపతీని తెచ్చిపెట్టాయి. దీంతో అవకాశాలు వరస కడుతున్నాయి. ఇప్పటికే సిలుక్కువారుపట్టి సింగం, తెలుగులో ఇది నా లవ్‌స్టోరీ చిత్రాల్లో నటిస్తున్న ఓవియ తాజాగా లారెన్స్‌కు జంటగా కాంచన–3లో నటించే లక్కీచాన్స్‌ను కొట్టేసింది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇక ఓవియ విట్టయారు చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓవియకు ఇలయదళపతి విజయ్‌తో నటించే మరో పెద్ద అవకాశం తలుపు తడితే దాన్ని నిరాకరించినట్లు తాజా సమాచారం. విజయ్ తన 62వ చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించనుండగా సన్ ఫిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో విజయ్‌కు జంటగా నటి రకుల్‌ప్రీత్‌సింగ్ నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఇదే చిత్రంలో మరో ముఖ్యపాత్రకు నటి ఓవియను నటింపజేసే ప్రయత్నం చిత్ర వర్గాలు చేసినట్లు, అందుకు ఓవియ సారీ చెప్పినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. కథానాయకిగా బిజీగా ఉన్న సమయంలో సపోర్టింగ్ పాత్ర చేయడం ఇష్టం లేకే ఈ బ్యూటీ విజయ్‌తో నటించే అవకాశాన్ని వదులుకున్నట్లు సమాచారం. ఆ అవకాశాన్ని ఓవియతో పాటు బిగ్‌బాస్ గేమ్ షోలో పాల్గొన్న నటి రైసా అందుకున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. -
వడ్డీ సహా ఇచ్చేసా!
తమిళసినిమా: చిత్రాలను అంగీకరించడం, ఆ తరువాత ఏదో ఒక కారణంతో వైదొలగడం హీరోయిన్లకిప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. వీరంతా చెప్పేదొక్కటే తామా చిత్రాల్లో నటించలేదు. తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తామని. తాజాగా ఈ కోవలోకి నటి ఓవియ చేరింది. ఈ అమ్మడికి హీరోయిన్గా ఇంతకు ముందు పెద్ద పేరేమీ లేదు.అయితే ఎప్పుడైతే బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొందో అప్పటి నుంచి యమ క్రేజ్ వచ్చింది.ఈ గేమ్ షోలో సహ నటుడు ఆరవ్తో ప్రేమంటూ కలకలం, పోలీసుల వరకూ పరిస్థితి వెళ్లడంతో ఓవియా ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. దీంతో కొత్తగా అవకాశాలు తలుపు తడుతుండడం విశేషం. రాఘవ లారెన్స్‌తో నటించే అవకాశం ఓవియాను వరించింది. అయితే అదే సమస్యగా మారింది. కాంచన 3 షూటింగ్ ప్రారంభానికి ఆలస్యం కావడంతో అమ్మడు ఓవియ ఆ చిత్రం నుంచి వైదొలిగిందట. ఆ చిత్ర వర్గాలు ఓవియ గురించి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో కాంచన–3 చిత్రం షూటింగ్ ఆలస్యం కావడం కారణంగానే తానా చిత్రం నుంచి వైదొలిగినట్లు తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా వడ్డీ సహా తిరిగి చెల్లించినట్లు నిర్మాతల మండలికి వివరణ ఇచ్చి చేతులు దులుపుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ వదంతులేనని లారెన్స్ చెప్పారు. కాంచన–3 షూటింగ్ జరుగుతోందని అందులో ఓవియ నటిస్తోందని లారెన్స్ పేర్కొన్నారు. -
ప్రేమ వ్యవహారంపై పెదవి విప్పిన నటి
చెన్నై : ఆయనకు నేను, నాకు ఆయన అంటోంది నటి ఓవియ. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న తరవాత ఈ అమ్మడి క్రేజే వేరు. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా నటించినా రాని పాపులారిటీ బిగ్‌బాస్ గేమ్ షోతో వచ్చిపడింది. దీంతో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం లారెన్స్‌తో ఆయన తాజా చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. అయితే ఈ బ్యూటీ గురించి చాలా గ్యాసిప్స్ ప్రచారం అవుతున్నాయి. ఆమెతో పాటు బిగ్‌బాస్ గేమ్‌షోలో పాల్గొన్న నటుడు ఆరవ్తో కలిపి వదంతులు హోరెత్తుతున్నాయి. వీటి గురించి ఇటీవల ఒక టీవీకి ఇచ్చిన భేటీలో ఓవియ వివరణ ఇచ్చింది. తనకు పలు అకాశాలు వస్తున్న మాట నిజమేనని, అయితే ఒకే సమయంలో పలు చిత్రాలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. తాను ఆదాయం కోసం ప్రయత్నించి మోడలింగ్ రంగంలోకి వెళ్లానని చెప్పింది. ఆ తరువాత కళవాణి చిత్రంలో నటించే అవకాశం రావడంతో సినీరంగానికి పరిచయం అయ్యానని తెలిపింది. ప్రస్తుతం తాను లారెన్స్‌తో చేస్తున్న ఒక్క చిత్రాన్నే అంగీకరించానని చెప్పింది. ఇక నటుడు ఆరమ్‌తో ప్రేమ వ్యవహారం గురించి జరుగుతున్న ప్రచారం గురించి స్పందిస్తూ తనకు ఒక పార్ట్నర్ ఉన్నాడని, ఆయనకు తాను, తనకు ఆయన అంటూ తెలివిగా బదులిచ్చి ఆ ఆయన ఎవరన్నది చెప్పకుండానే మాట దాటవేసింది. -
‘ఆయనకు నేను.. నాకు ఆయన’
సాక్షి, చెన్నై : ఆయనకు నేను, నాకు ఆయన అంటోంది నటి ఓవియ. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న తరువాత ఈ అమ్మడి క్రేజే వేరు. కొన్ని చిత్రాలలో హీరోయిన్గా నటించినా రాని పాపులారిటీ బిగ్‌బాస్ గేమ్ షోతో వచ్చి పడింది. దీంతో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం లారెన్స్‌తో ఆయన తాజా చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది ఓవియ. అయితే ఈ బ్యూటీ గురించి చాలా గాసిప్స్ ప్రచారంలో ఉన్నాయి. ఆమెతో పాటు ‘బిగ్‌బాస్’లో పాల్గొన్న ఆరవ్తో కలిపి వదంతులు హోరెత్తుతున్నాయి. వీటి గురించి ఇటీవల ఒక టీవీకి ఇచ్చిన భేటీలో ఓవియ వివరణ ఇచ్చారు. తనకు చాలా అవకాశాలు వస్తున్న మాట నిజమేననీ, అయితే ఒకే సమయంలో అన్ని చిత్రాలు సాధ్యం కాదనీ పేర్కొంది. తాను ఆదాయం కోసం ప్రయత్నించి మోడలింగ్ రంగంలోకి వెళ్లానని, ఆ తరువాత కళవాణి చిత్రంలో నటించే అవకాశం రావడంతో సినీరంగానికి పరిచయం అయ్యాననీ ఆమె తెలిపింది. ప్రస్తుతం తాను లారెన్స్‌తో చేస్తున్న చిత్రాన్నే అంగీకరించాననీ చెప్పింది. ఇక నటుడు ఆరమ్‌తో ప్రేమ వ్యవహారంపై జరుగుతున్న ప్రచారం గురించి స్పందించింది. తనకు ఒక పార్టనర్ ఉన్నాడనీ, ఆయనకు తాను, తనకు ఆయన అంటూ తెలివిగా బదులిచ్చి ఆయన ఎవరన్నది చెప్పకుండానే వెళ్లిపోయింది. -
తమిళ ‘బిగ్‌బాస్’ విజేత ఎవరంటే..?
చెన్నై: తమిళంలో ఆసక్తికరంగా సాగిన సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ ముగిసింది. నటుడు ఆరవ్ విజేతగా నిలిచాడు. ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్ ఫైనల్లో అతడిని కార్యక్రమ వ్యాఖ్యాత కమల్‌హాసన్ విజేతగా ప్రకటించారు. అతడికి రూ.50 లక్షల నగదు బహుమతిని, ‘బిగ్ బాస్’ ట్రోఫీని అందజేశారు. ఫైనల్‌కు ప్రముఖ దర్శకుడు శంకర్, నిర్మాత దిల్‌రాజు అతిథులుగా హాజరయ్యారు. వీక్షకుల నుంచి ఈ షోకు మొత్తం 76.7 కోట్ల ఓట్లు వచ్చినట్టు కమల్‌హాసన్ వెల్లడించారు. స్టార్ విజయ్ చానల్లో 100 రోజులపాటు కొనసాగిన తమిళ బిగ్‌బాస్ షోలో చివరికి హౌస్‌లో ఆరావ్, హరీశ్ కళ్యాణ్, స్నేహన్, గణేశ్ వెంకట్రామన్ మిగిలారు. ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను గతవారం వీరంతా కలబోసుకున్నారు. అయితే గణేశ్ వెంకట్రామన్ విజేతగా నిలుస్తాడని సోషల్ మీడియాతో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆరావ్ ‘బిగ్‌బాస్’ అయ్యాడు. షో నుంచి అనూహ్యంగా బయటికెళ్లిన నటి ఓవియ మిగతా పోటీదారులతో కలిసి ఫైనల్ ఎపిసోడ్‌కు రావడం విశేషం. ‘నువ్వు కొంచెం బరువు తగ్గినట్టుగా కనిపిస్తున్నావ’ని ఆరవ్తో ఓవియ మాట కలిపింది. ప్రత్యేక ఆకర్షణ అదే... బిగ్‌బాస్ హౌస్‌లో నటి ఓవియ, ఆరవ్ మధ్య చిగురించిన ప్రేమ వ్యవహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి కారణంగా బిగ్‌బాస్ టీఆర్పీ రేటు బాగా పెరిగింది. ఓవియ అనుహ్యంగా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేయడం పెద్ద సంచలనానికే దారి తీసింది. ఆమెకు అభిమానులు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. జూన్ 25న 19 మంది పోటీదారులతో ప్రారంభమైన ’బిగ్‌బాస్’ సెప్టెంబర్ 30న ముగిసింది. రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని కమల్‌హాసన్ ప్రకటించడంతో రెండో సీజన్‌కు ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారనే చర్చ అప్పుడే మొదలైంది. కాగా, బిగ్‌బాస్ వేదికపైనే కమల్‌తో భారతీయుడు సీక్వెల్ చేయనున్నట్టు దర్శకుడు శంకర్ ప్రకటించారు. -
బిగ్‌బాస్ బ్యూటీతో యంగ్ హీరో..
సాక్షి, చెన్నై: తెలుగులో లవ్ల్లీ, ప్రేమకావాలి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో ఆది. త్వరలో హీరోయిన్ ఓవియాతో కలిసి కొలివుడ్కు పరిచయం అవుతున్నారు. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో తర్వాత మంచి పాపులారిటీ పెంచుకున్న నటి ఓవియా. ఈ భామకు చిత్రాల అవకాశాలు వరుస కడుతున్నాయి. అందులో ఒకటి కాటేరి. యామిరుక్క భయమే వంటి హారర్ కామేడీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు డీకే తాజాగా ఈ కాటేరికి దర్శకత్వం బాధ్యతలను చేపడుతున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి రాజా మాట్లాడుతూ.. కాటేరి ఎడ్వేంచర్ కామెడీ చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో హారర్ థ్రిల్లర్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని ఆయన అన్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు యువ నటుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉంటారనీ, అందులో ఒకరిగా ఓవియాను ఎంపిక చేసినట్లు ఆయన తెలపారు. మరో ముగ్గురిని ఎరన్నది త్వరలో వెల్లడిస్తామన్నారు. అదే విధంగా త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుందని డీకే తెలపారు. కాగా, ఈయన ఇంతకు ముందు జీవా, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన కవలైవేండామ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించక పోవడంతో తొలి చిత్రం యామిరుక్క భయమే చిత్ర నేపధ్యం అయినా హారర్నే తన తాజా చిత్రానికి నమ్ముకున్నారని చెప్పవచ్చు. -
కృష్ణతో మరోసారి..
తమిళసినిమా: దేశ వ్యాప్తంగా బుల్లితెర అభిమాన లోకాన్ని కట్టిపడేస్తున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షో తమిళ వెర్షన్లో పాల్గొని ఒక్కసారిగా భారీ స్టార్డమ్ సొంతం అందాల రాశి ఓవియా. ‘కలవాని’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అయినా అమ్మడు అనుకున్నంత స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ‘బిగ్ బాస్’ షోతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు తమ సినిమాలకు ఓవియాను బుక్ చేసుకోవాలని తహతహలాడుతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించే రీతిలో ఇది వరకే ఓవియా నటించిన ‘శీని’ చిత్రం టైటిల్ పేరు మార్చి తాజాగా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇలయదళపతి విజయ్ కొత్త చిత్రంలో ఓవియాను నటింపచేయాలని దర్శకుడు మురుగదాస్ నిర్ణయించినట్టు ఇటీవల వార్తలు వెల్లడయ్యాయి. అదేవిధంగా ‘సిలుక్కువార్‌పట్టి సింగం’, ‘ఇరవుక్కు ఆయిరం కన్గల్’ చిత్రాల్లో నటించిన ఓవియాను ‘అరిమా నంబి’ చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ తన కొత్త చిత్రంలో నటింపచేయాలని నిర్ణయించారట. ఓవిమా అభిమానుల మనస్సులో చెరగని ముద్రలా నిలిచిపోయిందని, ఆమెను తన తర్వాత చిత్రంలో నటింపచేసే అవకాశం ఉందని ఆయన ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ స్థితిలో ఇది వరకే నటించిన ‘యామిరుక్క భయమేన్’ రెండో భాగంలో కూడా తిరిగి ఓవియా నటిస్తున్నారు. కృష్ణ హీరో నటిస్తున్న ఈ చిత్రంలో ఓవియాతో పాటు మరి కొందరు నటీమణులు నటించారు. అయితే ఈ రెండో భాగంలో ఓవియా మాత్రమే ముఖ్య భూమికను పోషిస్తున్నారట. -
‘బిగ్‌బాస్’లోకి ఆమె మళ్లీ వస్తుందా?
చెన్నై: ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన అంశాల్లో బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో ఒకటి. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా విశ్వనటుడు కమలహాసన్ వ్యాఖ్యాత కావడం ఒకటైతే, అందులో పాల్గొనే తారలు మరొకటి. ముఖ్యంగా నటి ఓవియ కారణంగా బిగ్‌బాస్ టీఆర్పీ రేటు పెరిగిపోయిందట. దీంతో నిర్వాహకులు పిచ్చ హ్యాపీ అయిపోయారు. మధ్యలో నటి ఓవియ, ఆరవ్ల ప్రేమ వ్యవహారం పెద్ద సంచలనానికే దారి తీసింది. ఆ పర్వం కూడా ప్లస్ అవుతుందని భావించిన బిగ్‌బాస్ నిర్వాహకుల భావన బెడిసి కొట్టింది. ఓవియ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆరవ్తో ప్రేమ వ్యవహారమే ఆమెను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేలా చేసిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఓవియ అభిమానులు, సానుభూతి పరులు బిగ్‌బాస్ గేమ్ షోను చూడటం మానేశారట. ఫలితం బిగ్‌బాస్ టీఆర్పీ రేటు ఒక్క సారిగా పడిపోయిందంటున్నారు. అంతే కాదు ట్విట్టర్లలో బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో పై విమర్శలు పెరుగుతున్నాయట. దీంతో డైనమాలో పడ్డ బిగ్‌బాస్ నిర్వాహకులు నటి ఓవియను మళ్లీ గేమ్షోలోకి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకు చర్చలు కూడా మొదలయ్యాయని సమాచారం. ఇంతకు ముందు ఓవియకు వారానికి రూ.2.5 నుంచి రూ.3 లక్షలు పారితోషికం ఇచ్చేవారనీ, ఇప్పుడు తను మళ్లీ తిరిగొస్తే రూ.5 లక్షల వరకూ చెల్లించడానికి బిగ్‌బాస్ నిర్వాహకులు సిద్ధం అంటున్నారనీ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఈ ప్రచారంలో నిజం ఎంత? ఒక వేళ నిజం అయితే నటి ఓవియ మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇస్తుందా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మొత్తం మీద బిగ్‌బాస్ నటి ఓవియను పెద్ద సెలబ్రిటీని చేసిందనే అనాలి. -
బిగ్‌బాస్: మేం హౌజ్‌లో ఉండలేం బాబోయ్!
తమను పంపించాలని వేడుకుంటున్న కంటెస్టెంట్స్ తమిళ బిగ్‌బాస్ షోలో ఆసక్తికరమైన పరిణామాలు తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో కన్నా ముందే ప్రారంభమైన తమిళ బిగ్‌బాస్ షో విజయవంతంగా ఏడువారాలు పూర్తి చేసుకుంది. మొదట డల్‌గా ప్రారంభమైన ఈ షో పలు సంఘాల హెచ్చరికలు, వివాదాలు, ఒవియా ఆత్మహత్యాయత్నం ఎపిసోడ్‌తో ఊపందుకుంది. ఇప్పుడు తమిళనాట అత్యధిక మంది వీక్షిస్తున్న టీవీ షో ఇదే. దీని టీఆర్పీ రేటింగ్స్ ఆకాశాన్నంటుతున్నాయి. అయితే, గతవారం ఒవియా అనూహ్యరీతిలో హౌజ్ నుంచి తప్పుకోవడం, జూలీని ఎలిమినేట్ చేయడంతో షోలో ఎగ్జైట్మెంట్ తగ్గిపోయింది. ఈ వారం ప్రముఖ దర్శకుడు పీ వాసు తనయుడు, నటుడు శక్తి హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ జోన్లో ఉన్న ఆరవ్, బిందు మాధవి, గణేశ్ వెంకట్రామన్ మధ్య గట్టి పోటీ నెలకొన్నా.. అనూహ్య రీతిలో శక్తి షో నుంచి ఔట్ అయ్యాడు. పాపులారిటీ తెచ్చుకోవాలన్న తన లక్ష్యం ఈ షోతో నెరవేరిందని ఈ సందర్భంగా శక్తి పేర్కొన్నాడు. ఇక, డెంజర్ జోన్లో ఉన్న గాయత్రీ రఘురాం అనూహ్యంగా ఎలిమినేషన్ తప్పించుకోగా.. తమిళ బిగ్‌బాస్ షోలోని పలువురు కంటెస్టెంట్స్ మాత్రం తమను హౌజ్ నుంచి పంపించాలని వేడుకుంటున్నారు. బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంతమాత్రం ఉండలేమని చెప్తున్నారు. ముఖ్యంగా నటుడు, గీత రచయిత స్నేహన్ తనకు ఓటు వేయొద్దని అభిమానులను అభ్యర్థించాడు. తాను హౌజ్‌లో ఎంతమాత్రం ఉండలేనని, దయచేసి తనకు ఎవరూ ఓటు వేయొద్దని కోరాడు. తాను మరికొంత కాలం హౌజ్‌లో ఉంటే మరో వ్యక్తిలా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. అయినా అతన్ని ఎమిలినేట్ చేయలేదు. ఇక షోలోని ప్రముఖ కమెడియన్ వైయాపురి కూడా తనను హౌజ్ నుంచి పంపించమని వేడుకుంటున్నాడు. 'నటుడ్ని అయ్యేందుకు నేను ఎన్నో కష్టాలు పడ్డాను. ఇప్పుడు అవే కష్టాలు మళ్లీ ఎందుకు పడాలో అర్థం కావడం లేదు. హౌజ్‌లో స్థానం కోసం పోరాడాల్సిన ఖర్మ నాకు లేదు. దయచేసి నన్ను ఇంటికి పంపించండి. ఈ క్రూరమైన ఆట నేను ఆడలేకపోతున్నా' అంటూ వైయాపురి తన భార్యకు పంపిన మెసేజ్‌లో పేర్కొన్నాడు. మరోవైపు ఒవియా తప్పుకోవడంతో బిగ్‌బాస్ షోలో ఆసక్తి తగ్గిపోవడంతో ఆమెను మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా షోలోకి తీసుకొచ్చే అవకాశముందని అంటున్నారు. -
బిగ్‌బాస్ షో: హీరోయిన్‌కు సమన్లు
చెన్నై: మలయాళ హీరోయిన్ ఓవియ ఆత్మహత్యాయత్నం విచారణకు సంబంధించి పోలీసులు ఆమెకు శనివారం సమన్లు పంపారు. తమిళంలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొన్న నటి ఓవియ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూందమల్లి నజరత్‌పేట పోలీసులకు ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. 'బిగ్‌బాస్'లో పాల్గొన్న ఇతర సభ్యుల కారణంగా నటి ఓవియ ఈత కొలనులో దూకి ఆత్మహత్యాయత్నం చేశారని, దీనిపై తగిన విచారణ జరపాలని కోరారు. ఇదివరకే ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో నజరత్ పేట పోలీసు ఇన్స్పెక్టర్ జయచంద్రన్ బిగ్‌బాస్ ఇంటిలోకి వెళ్లి విచారణ జరిపారు. ఓవియ నేరుగా విచారణకు హాజరు కావాలంటూ సమన్లు పంపినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. తాను ఆత్మహత్యాయత్నం లాంటివి చేయలేదన్నట్లు ఇతర కంటెస్టెంట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మరోవైపు ఓవియ తీవ్ర అస్వస్థతకు గురి అవడంతో అర్థాంతరంగా షో నుంచి వెళ్లిపోయారు. నటి తన సొంత ఊరైన కొచ్చిన్ లో ఉంటున్నారు. అక్కడ మానసిక చికిత్స చేయించుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాలలో ఫొటోలు వైరల్ అయ్యాయి. కాగా తమిళ బిగ్‌బాస్‌కు ప్రముఖ నటుడు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. షోలో పాల్గొన్న వారి చర్యలు తమిళనాట చర్చనీయాంశంగా మారాయి. గాయత్రి రఘురాం స్లమ్ కల్చర్ వంటి పదాలను వాడటం వివాదాస్పదంగా మారింది. మరోవైపు స్టార్ హీరో ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న తెలుగు బిగ్‌బాస్ విజయవంతంగా కొనసాగుతోంది. -
బిగ్‌బాస్‌లో షాకింగ్ ఘటన.. సూసైడ్‌యత్నం!
బిగ్‌బాస్ షో.. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ప్రారంభమైన ఈ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇటు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్‌బాస్ షో ఇప్పుడిప్పుడు గాడిన పడుతుండగా.. అటు కమల్ హాసన్ వ్యాఖ్యతగా ఉన్న తమిళ బిగ్‌బాస్ మాత్రం అనూహ్య పరిణామాలకు వేదికగా మారింది. తమిళ బిగ్‌బాస్ సభ్యురాలైన ఒవియా ఏకంగా స్విమ్మింగ్‌పూల్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తమిళ బిగ్‌బాస్ హౌజ్మేట్లు అయిన ఒవియా, ఆరావ్ కొంతకాలంగా రొమాంటిక్‌గా గడిపారు. ఇటీవల ఒవియాను ఆరావ్ దూరం పెడుతుండటంతో మానసికంగా కుంగిపోయినట్టు కనిపించిన ఒవియా.. షో నుంచి తప్పుకొనేందుకు శుక్రవారం అనూహ్యరీతిలో తమ లివింగ్ క్వార్టర్స్‌కు సమీపంలో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకేసింది. ముక్కు మూసుకొని తల నీళ్లలోపల ఉంచి.. ఆత్మహత్యాయత్నం చేసింది. కిచెన్‌లో ఉన్న ఆరావ్తోపాటు ఇతర కంటెస్టెంట్స్ వెంటనే అప్రమత్తమై.. ఆమెను స్విమ్మింగ్‌పూల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో ఒకింత ఉద్వేగపూరితమైన వాతావరణం నెలకొంది. బిగ్‌బాస్ షోతో తమిళనాడులో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిపోయిన ఒవియా.. హౌజ్‌లోకి వెళ్లిన తొలిరోజుల్లోనే ఆరావ్తో ప్రేమలో పడింది. అతన్ని ప్రేమిస్తున్నానంటూ పలుసార్లు తెలిపింది. తొలుత ఆమెతో సన్నిహితంగా ఉన్న ఆరావ్... ఆ తర్వాత క్రమంగా దూరం పెట్టాడు. ఆమె మంచి స్నేహితురాలు మాత్రమేనని, అంతుకుమించి తనకు స్పెషల్ ఫీలింగ్స్ లేవని చెప్పుకొచ్చాడు. దీంతో అతని జీవితంలోకి మళ్లీ వెళ్లబోనని పేర్కొన్న ఒవియా.. ఆ తర్వాత మానసికంగా కుంగిపోయింది. ఈ రిలేషన్షిప్ నుంచి బయటపడి ఆమె కోలుకుంటుందని హౌజ్‌మేట్స్ భావించినా.. అది జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఒవియా స్మిమ్మింగ్పూల్లో దూకడం కలకలం రేపింది. ఆమె షోనుంచి తప్పుకున్నారని, పోలీసులు కూడా ఈ ఘటన విషయంలో జోక్యం చేసుకున్నారని కథనాలు వస్తున్నాయి. నెక్ట్స్ ఎపిసోడ్లో ఆమె ఉంటుందా? లేక షో నుంచి తప్పుకున్నదా? అన్నది కూడా నిర్వాహకులు ఇంకా వెల్లడించలేదు. -
ఓవియకు బిగ్‌బాస్ క్రేజ్
తమిళసినిమా: బిగ్‌బాస్‌తో నటి ఓవియకు పిచ్చ క్రేజ్ వచ్చేసింది. విశ్వనటుడు కమలహాసన్ తొలిసారిగా బుల్లితెరపై రంగప్రవేశం చేసి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియలిటీ షో బిగ్‌బాస్. ఈ షోలో 14 మంది సినీ కళాకారులు పోటీకి దిగిన విషయం తెలిసిందే. అందులో నటి ఓవియకు మాత్రం క్రేజ్ విపరీతంగా వచ్చేసింది. ఆమె ప్రవర్తనను చాలా మంది లైక్ చేస్తున్నారు. శింబు లాంటి నటులు కూడా ఓవియకు మద్దతు తెలుపుతున్నారంటే ఆమె ఎంతగా పేరు సంపాదించుకుంటుందో చూడండి. దీంతో ఇప్పటి వరకూ పెద్దగా అవకాశాలు లేని ఓవియకిప్పుడు అవి వరుస కడుతున్నాయి. ఇప్పటికే మెట్రో చిత్రం ఫేమ్ శిరీష్ తన తాజా చిత్రంలో ఓవియకు కథానాయకి అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాగా తాజాగా యామిరుక్క భయమే చిత్ర పార్టు–2లోనూ ఓవియను ఎంపిక చేసుకున్నారు. యామిరుక్క భయమే చిత్రంలో చిన్న పాత్రలో మెరిసిన ఓవియకు దాని సీక్వెల్లో ప్రాముఖ్యత కలిగిన పాత్ర ఇవ్వనున్నట్లు సమాచారం. అదే విధంగా విజయ్‌సేతుపతితో జత కట్టే అవకాశాన్ని ఓవియ కొట్టేసింది. విజయ్‌సేతుపతితో నడువుల కొంచెం పక్కత్తు కానోమ్ చిత్రాన్ని తెరకెక్కించిన బాలాజీ దరణీధరన్ తాజాగా ఆయనతో ఒక చిత్రం చేయనున్నారు. ఇందులో నటి ఓవియను నాయకిగా ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. అయితే తను బిగ్‌బాస్ షోలో పాల్గొనడం వల్ల ఈ అవకాశం చేజారినట్లు తాజా సమాచారం. అయితే ఈ భామ షో నుంచి బయటకు రాగానే మరి కొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇదంతా బిగ్‌బాస్ క్రేజేనని చెప్పక తప్పదు. -
హృదయాలను హత్తుకునే ప్రేమ
లవర్‌బోయ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇది నా లవ్ స్టోరీ’. ఓవియా కథానాయిక. రమేష్ గోపి దర్శకత్వంలో రామ్ ఎంటర్టైనర్స్ పతాకంపై ఎస్వీ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తరుణ్ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా రమేష్ గోపి చక్కగా తెరకెక్కించారు. శ్రీనాథ్ విజయ్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. నేపథ్య సంగీతం ఎక్స్ట్రార్డినరీగా కుదిరింది’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. తరుణ్గారి నటన సూపర్బ్. ఈ సినిమాలో ఆయన నటనలోని మరో కోణాన్ని చూస్తారు. మేకింగ్ విషయంలో నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు రమేష్ గోపి. ‘‘ఒక మంచి ప్రేమకథా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. పాటలన్నీ బాగున్నాయి’’ అన్నారు శ్రీనాథ్ విజయ్. ఈ చిత్రానికి సమర్పణ: అభిరామ్. -
6ఐటం గర్ల్‌గా ఓవియ
తమిళసినిమా: కథానాయికలు ఐటం సాంగ్స్‌లో నటించడం ఇప్పుడు పరిపాటిగా మారింది. అయితే ఐటం గర్ల్‌గా మారడం అన్నది అరుదే. కాగా విమల్‌కు జంటగా కళవాణి చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయమైన కేరళాకుట్టి ఓవియ. తొలి చిత్రమే మంచి విజయాన్ని అందుకోవడంతో తన భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఓవియ కలలు కంది. అనుకున్నట్లుగానే అమ్మడికి వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. ప్రముఖ దర్శకుడు సుందర్.సీ తెరకెక్కించిన కలగలపు చిత్రంలో కథానాయకిగా నటించిన ఓవియ ఆ చిత్రంలో మరోనాయకి అంజిలితో ఒక సాంగ్‌లో పోటీ పడి అందాలారబోసింది. అయితే అలా అందాలొలక బోసిన అంజలి ఆ ముద్ర నుంచి బయట పడగలిగింది కానీ, ఓవియ మాత్రం తప్పించుకోలేక పోయింది. అందుకు కారణం తను నటించిన చిత్రాలు వరుసగా అపజయాలను చవి చూడడం కావచ్చు. తాజాగా అరుళ్‌నిధి హీరోగా నటిస్తున్న ఇరవుక్కు ఆయిరం కన్గళ్ చిత్రంలో సింగిల్ సాంగ్‌తో పాటు, కొన్ని సన్నివేశాల్లో నటిస్తోంది. అదేవిధంగా విష్ణువిశాల్ కథానాయకుడిగా నటిస్తున్న సిలుక్కువార్‌పట్టి సింగం చిత్రంలో రెజీనా కథానాయకిగా నటిస్తుండగా ఓవియ ఐటమ్ సాంగ్‌లో నర్తించిందట.ఈ చిత్రాల విడుదల తరువాత ఓవియను ఐటమ్ గర్ల్ లిస్ట్‌లో పెట్టేసినా ఆశ్చర్యపడనక్కరేదు అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
సీనీతో ఒవియకు అదృష్టం కలిసొచ్చేనా?
దేనికైనా పెట్టి పుట్టాలంటారు. నటి ఓవియ విషయానికొస్తే ఆమెకు అదృష్టం వచ్చినట్లే వచ్చి దూరం అయ్యింది. మళ్లీ అది అందకపోదా అంటూ ఆశతో ఎదురు చూస్తోంది. ఈ మలయాళీ కుట్టి కలవాణి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయిది.ఆ చిత్రంలో గ్రామీణ యువతిగా తమిళప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఆ చిత్రం విజయంతో ఓవియకు మంచి భవిష్యత్ ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావించారు. అన్నట్టుగానే అప్పట్లో కమలహాసన్ చిత్రం మన్మథఅంబు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని నటి ఓవియ చంకలు కొట్టుకుంటూ ప్రచారం చేసుకుంది. తీరా ఆ చిత్రంలో ఒక్క సీన్లో కనిపించీ కనిపించనట్లుగా వచ్చి మాయం అయ్యింది. తన గోడును అప్పట్లో మీడియా ముందు వెళ్లగక్కినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక అప్పటి నుంచి అడపా దడపా తమిళ చిత్రాల్లో నటిస్తూ మంచి బ్రేక్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. ఆ మధ్య కలగలప్పు లాంటి ఒకటి రెండు హిట్ చిత్రాల్లో నటించినా ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. కొన్ని చిత్రాల్లో హద్దులు దాటి అందాలు ఆరబోసి ఆ విధంగానైనా మార్కెట్ పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక లాభం లేదు కేరళకు మూటా ముల్లు సర్దుకుని పోదామనుకున్న తరుణంలో సీనీ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చిందట. లక్కీగా ఈ చిత్రంలో పాటలకు, ప్రేమ సన్నివేశాలకు పరిమితం అయ్యే పాత్ర కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్ర అట. మదురై నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఓవియ చాలా ఆశలు పెట్టుకుందట. చేద్దాం ఈ అమ్మడి నమ్మకం ఏ మేరకు ఫలిస్తుందో. -
ఎంత బాగా ప్రేమించామన్నదే ముఖ్యం!
లవర్‌బోయ్ ఇమేజ్‌తో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ చాలా కాలం విరామం తర్వాత ఓ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తరుణ్, ఓవియా జంటగా రమేశ్-గోపి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇది నా లవ్ స్టోరీ’. ఎస్.వి.ప్రకాశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తరుణ్ మాట్లాడుతూ- ‘‘తక్కువ బడ్జెట్లో రూపొంది, భారీ వసూళ్లను రాబట్టిన కన్నడ చిత్రానికి ఇది రీమేక్. తెలుగులో ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. మంచి రొమాంటిక్ కామెడీ మూవీ ఇది’’ అని చెప్పారు. ‘‘ఒక అమ్మాయిని ఎంత కాలం ప్రేమించామన్నది కాదు, ఎంత బాగా ప్రేమించామన్నదే ముఖ్యం. అదే ఈ సినిమాలో చెబుతున్నాం’’ అని దర్శకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కథానాయిక ఓవియా, నిర్మాత ఎస్.వి.ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు స్నేహితులు.. ఒక ప్రయాణం!
‘‘ఈ మధ్యే భోగి సంబరాలు జరుపుకున్నాం. మళ్లీ నేను భోగి పండగ మూడ్‌లో ఉండబోతున్నా’’ అంటున్నారు త్రిష. అలా అనడానికి కారణం ఉంది. తెలుగు, తమిళ భాషల్లో త్రిష, పూనమ్ బజ్వా, ఓవియా కథానాయికలుగా ‘భోగి’ అనే చిత్రం రూపొందుతోంది. ముగ్గురు స్నేహితులు, ఒక ప్రయాణం నేపథ్యంలో సాగే మంచి థ్రిల్లర్ మూవీ ఇదని త్రిష పేర్కొన్నారు. -
తుది దశకు చేరిన చండమారుతం
చండమారుతం చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. శరత్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం చండమారుతం. విశేషమేమిటంటే ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. శరత్‌కుమార్ ద్విపాత్రాభినయం చేయడం కొత్తేమి కాకపోయినా ఈ చిత్రంలో నాయకుడు, ప్రతినాయకుడు ఆయనే కావడం విశేషం. ప్రతి నాయకుడంటే ఆషామాషి పాత్ర కాదట. క్రూరమైన విలన్‌గా నటిస్తున్నారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ పాత్ర అరాచకాలు తెరపై చూడాల్సిందే నంటున్నారు. సాధారణంగా ద్విపాత్రాభినయం అనగానే అన్నదమ్ములుగానో, తండ్రీకొడుకులుగానో నటిస్తుంటారు. ఈ చిత్రంలో అలాంటి సంబంధాలేవీ లేని రెండు విభిన్న పాత్రల్లో శరత్‌కుమార్ నటిస్తున్నారని తెలిపారు. నటి ఓవియా, మీరానందన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో దర్శకుడు సముద్రకని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో రాధారవి, తంబిరామయ్య, ఇమాన్ అన్నాచిచ, జార్జ్, నళిని, రామ్‌కుమార్, గానా ఉలగనాథన్, నరేన్, వెన్నిరాడై మూర్తి, ఆదవన్ శింగంపులి, ఢిల్లి గణేశన్ మొదలగు వారు నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ 80 శాతం పూర్తయిందని, మిగిలిన 20 శాతం పూర్తి చేసి త్వరలో చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి శరత్‌కుమార్‌నే కథను తయారు చేశారు. ఈ చిత్రాన్ని ఆయనతోపాటు రాధిక శరత్‌కుమార్, లిస్టిన్ స్టీఫెన్లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏ.వెంకటేష్ దర్శత్వం వహిస్తున్నారు. -
శరత్‌కుమార్‌కు జోడిగా ఓవియ
నటి ఓవియ బిగ్ ఆఫర్‌ను అందుకుంది. సుప్రీమ్ స్టార్ శరత్‌కుమార్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని అనూహ్యంగా పొందింది. కొంత విరామం తరువాత శరత్‌కుమార్ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఛండమారుతం. ఎ.వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో మొదట అవని మోడి, సరయు హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అయితే అవనిమోడి అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో అంగీకరించని నిర్మాతలు ఆమెను తొలగించి ఆ పాత్రలో ఓవియను ఎంపిక చేశారు. నటి అవనిమోడితో ఆరు రోజులు షూటింగ్ కూడా చేశారు. పారితోషికం డిమాండ్‌తోపాటు మలయాళ చిత్రంలో నటిస్తున్న అవనిమోడి కాల్షీట్స్ సమస్య కూడా తోడవ్వటంతో ఆమె ను తొలగించినట్లు యూనిట్ వర్గాలు తెలి పారుు. కాగా ఛండమారుతం చిత్రంలో ఓవి య, సరయుతోపాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందని చిత్ర వర్గం తెలిపింది. ఈ చిత్రం పక్కా కమర్షియల్ కథాంశంతో రూపొం దుతున్నట్లు వెల్లడించారు. నాట్టామై, సూర్యవంశం చిత్రాల తరువాత శరత్‌కుమార్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఇదన్నారు. చిత్ర షూటింగ్ ఆగస్టుకు పూర్తి చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. -
నా పాత్రను కత్తిరించకండి
తాను నటించిన సన్నివేశాలపై కత్తెర వేయకండి అంటోంది ఓవియా. ఈ కేరళ బ్యూటీ కలవాని చిత్రంతో కోలీవుడ్‌లో ప్రకాశించింది. అప్పుడప్పుడూ ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. ఆ మధ్య ఇద్దరు హీరోయిన్ల చిత్రంలో తన సన్నివేశాలను ఎడిటింగ్ రూమ్‌లో బుట్ట దాఖలు చేశారంటూ ఆరోపణలు గుప్పించింది. అంతేకాదు ఇకపై ఇద్దరు హీరోయిన్ల చిత్రాలలో నటించరాదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ భామ మదయానై కూటం, ఇరుక్కు ఆనాల్ ఇల్లై చిత్రాలలో నటిస్తోంది. ఇరుక్కు ఆనాల్ ఇల్లై చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తోంది. ఇద్దరు హీరోయిన్ల చిత్రాలలో నటించననే పాలసీకి తిలోదకాలిచ్చారా? అన్న మీడియూ ప్రశ్నకు ఆమె తనదైన శైలిలో బదులిచ్చింది. దర్శకులందరూ ఒకేలా ఉంటారని భావించకూడదంది. మన వద్ద ఏదైతే చెబుతారో దానిని అలాగే చిత్రంలో పొందుపరిచే దర్శకులూ ఉంటారని పేర్కొంది. తన సన్నివేశాలను కత్తిరించకూడదనే నిబంధనతోనే ఇరుక్కు ఆనాల్ ఇల్లైలో నటిస్తున్నట్లు వెల్లడించింది.