నటి ఓవియను అరెస్ట్‌ చేయాలి | Hero Simbhu React on 90ml Movie | Sakshi
Sakshi News home page

స్త్రీ స్వేచ్ఛను హరించడమే చేటు

Published Tue, Mar 5 2019 1:11 PM | Last Updated on Tue, Mar 5 2019 1:11 PM

Hero Simbhu React on 90ml Movie - Sakshi

శింబు

పెరంబూరు: స్త్రీ స్వేచ్ఛను హరించడమే సమాజానికి చేటు అని నటుడు శింబు పేర్కొన్నారు. ఎప్పుడూ వివాదాల్లో ఉండే ఈ సంచలన నటుడు 90 ఎంఎల్‌ చిత్రంతో మరోసారి వార్తల్లోకెక్కారు. సంచలన నటి ఓవియా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 90 ఎంఎల్‌. మహిళా దర్శకురాలు అనితా ఉదీప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కిం చుకుంది. విమర్శకుల నుంచి మాత్రం తీవ్ర వ్యతి రేకతను ఎదుర్కొంటోంది. అందుకు కారణం చిత్రంలో అమ్మాయిలు మద్యం సేవించడం, పొగ తాగడం, సహజీవనం సాగించడం లాంటి పలు అంశాలు చోటు చేసుకోవడమే. 90 ఎంఎల్‌ చిత్రం సెన్సార్‌ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్‌ పొందింది. కాగా ఈ చిత్రానికి నటుడు శింబు సంగీతాన్ని అందించారు.

ఈ విషయమే ఆయన్ని విమర్శల పాలు చేసింది. దీనికి స్పందించిన శింబు తొలిసారిగా మహిళల ఇతివృత్తంతో కూడిన చిత్రాల్లో మగవారిని కించపరచకుండా స్త్రీల స్వేచ్ఛ గురించి అనితా ఉదీప్‌ కథను తయారు చేశారని అన్నారు. అలాంటిది మనమే భావితరాలను, సమాజాన్ని నాశనం చేసే చిత్రం అని గగ్గోలు పెడుతున్నామన్నారు. స్త్రీ స్వేచ్ఛను అడ్డుకోవడమే సంప్రదాయాలకు చేటు అని పేర్కొన్నారు. తాను మహిళా వ్యతిరేకినని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారనీ, అందుకే ఈ చిత్రానికి మద్దతు ఇచ్చి, సంగీతాన్ని అందించాననీ చెప్పారు. దీన్ని అర్థం చేసుకున్న మగవారికి ధన్యవాదాలు అని శింబు పేర్కొన్నారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

నటి ఓవియను అరెస్ట్‌ చేయాలి
కాగా 90 ఎంఎల్‌ చిత్రంపైనా, దర్శకురాలు, హీరోయిన్‌ ఓవియలపై తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళలను కించపరచే సన్నివేశాల్లో నటించినందుకు గానూ నటి ఓవియను అరెస్ట్‌ చేయాలంటూ ఇండియా దేశీయ లీగ్‌ పార్టీ మహిళా విభాగ నిర్వాహకులు సోమవారం నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement