ఒవియా హెలెన్.. ఇండియన్ మోడల్ అయిన ఈమె పేరు అందరికీ తెలియకపోయినా తమిళ, మలయాళ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితురాలే. అయితే, తాజాగా ఆమె లీక్డ్ వీడియో అంటూ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తమిళ బిగ్‌బాస్ సీజన్ 1లో పాల్గొన్న ఈ కేరళ కుట్టి.. కోలీవుడ్‌లో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది. బిగ్ బాస్ షోను ఇష్టపడే తెలుగు వారికి కూడా ఆమె పేరు పరిచయమనే చెప్పవచ్చు. అలా సౌత్ ఇండియాలోని పలు భాషల్లో సినిమా ఛాన్సులు కూడా దక్కించుకుంది.
ఒవియాకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో లీక్ అయిందిన నెటిజన్లు రెండురోజులుగా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని లింక్‌లు కూడా ఎక్స్ వేదికగా షేర్ చేస్తున్నారు. ఓవియా లీక్డ్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో వైరల్ చేస్తున్నారు.కొందరైతే ఓవియాకు కూడా సోషల్‌మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నారు. కేవలం 17 సెకండ్లు మాత్రమే వీడియో ఉందని ఆమెను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరే మాత్రం సుమారు ఒక నిమిషం పైగానే వీడియో ట్రెండ్ అవుతుందని ఒవియాకు మెసేజ్‌లు చేస్తున్నారు.
ఒవియా మాత్రం తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. నెక్ట్స్ టైమ్ ఎక్కువ నిడివి ఉన్న వీడియో షేర్ చేస్తాలే అంటూ.. అప్పటి వరకు దీంతో ఎంజాయ్ చేయండి అని ఆమె తిరిగి సమాధానం చెప్పింది. ఒవియా పేరుతో డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారని ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేయవద్దని వారు పేర్కొంటున్నారు. ఈ విషయం గురించి ఒవియా ఇంకా ఎలాంటి సమాధానం చెప్పలేదు. కానీ, కేరళ సైబర్ క్రైమ్ విభాగంలో ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment