
సినిమాల్లో కాకున్నా సామాజిక మాధ్యమాల్లో తరచూ మెరుస్తున్న నటి ఓవియా. ఈ కేరళా బ్యూటీ తొలి రోజుల్లో కలవాని అనే తమిళ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా పలు చిత్రాల్లో నటించిన ఓవియా బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో మొదటి సీజన్‌లో పాల్గొని మరింత ప్రాచుర్యం పొందింది. అయితే ఆ తరువాత ఆ క్రేజ్‌ను ఉపయోగించడంలో ఫెయిల్ అవడంతో ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. అయితే తరచూ తన గ్లామర్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ అభిమానులతో చిట్‌చాట్ చేస్తూనే ఉంది.
ఇటీవల తన స్నేహితుడొకరితో సన్నిహితంగా ఉన్న ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా ఈమెకు తరచూ ఎదురవుతున్న ప్రశ్న పెళ్లెప్పుడు చేసుకుంటారు అనేది. కాగా ఇటీవల ఓవియా తన ఫేస్‌బుక్ ద్వారా అభిమానులతో ముచ్చడించింది. అప్పుడు ఒక అభిమాని నుంచి పెళ్లెప్పుడనే ప్రశ్న ఎదురైంది. దీంతో నటి ఓవియాకు చిర్రెత్తుకొచ్చింది. కోపాన్ని ఆపుకోలేక మీకు అడగడానికి మరే టాపిక్ లేదా? ఎప్పుడూ అదే ప్రశ్నా అంటూ మండిపడింది. అసలు తనకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీయొద్దని సీరియస్ అయ్యింది. దీంతో అభిమానులు చాలా హర్ట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment