Live chat
-
అభిమాని నుంచి అలాంటి ప్రశ్న, లైవ్‌లోనే మండిపడ్డ బిగ్‌బాస్ బ్యూటీ
సినిమాల్లో కాకున్నా సామాజిక మాధ్యమాల్లో తరచూ మెరుస్తున్న నటి ఓవియా. ఈ కేరళా బ్యూటీ తొలి రోజుల్లో కలవాని అనే తమిళ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా పలు చిత్రాల్లో నటించిన ఓవియా బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో మొదటి సీజన్లో పాల్గొని మరింత ప్రాచుర్యం పొందింది. అయితే ఆ తరువాత ఆ క్రేజ్‌ను ఉపయోగించడంలో ఫెయిల్ అవడంతో ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. అయితే తరచూ తన గ్లామర్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ అభిమానులతో చిట్‌చాట్ చేస్తూనే ఉంది. ఇటీవల తన స్నేహితుడొకరితో సన్నిహితంగా ఉన్న ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా ఈమెకు తరచూ ఎదురవుతున్న ప్రశ్న పెళ్లెప్పుడు చేసుకుంటారు అనేది. కాగా ఇటీవల ఓవియా తన ఫేస్బుక్ ద్వారా అభిమానులతో ముచ్చడించింది. అప్పుడు ఒక అభిమాని నుంచి పెళ్లెప్పుడనే ప్రశ్న ఎదురైంది. దీంతో నటి ఓవియాకు చిర్రెత్తుకొచ్చింది. కోపాన్ని ఆపుకోలేక మీకు అడగడానికి మరే టాపిక్ లేదా? ఎప్పుడూ అదే ప్రశ్నా అంటూ మండిపడింది. అసలు తనకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీయొద్దని సీరియస్ అయ్యింది. దీంతో అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. -
యూఎస్ ఫ్యాన్స్ ప్రేమ చూసి ఎమోషనల్ అయిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన చిరు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. వాల్తేరు వీరయ్యగా అటు క్లాస్, ఇటు మాస్ ఆడియెన్స్‌ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేశారు. మూవీ రిలీజ్ అయిన తొలిరోజు నుంచే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 200కోట్లకు పైగా కలెక్షన్లకు రాబట్టింది. చిరంజీవి కెరీర్లో మైలురాయిగా నిలిచిన వాల్తేరు వీరయ్య ఇంకా బాక్సాఫీస్ వద్ద ఊచకోత సృష్టిస్తోంది. చిరు స్టామినా ఏమాత్ర తగ్గలేదంటూ మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ హోరెత్తిస్తున్నారు. ఇక అమెరికాలో సైతం మెగా ఫ్యాన్స్ ఈ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో చిరు లైవ్‌లో ఉన్నప్పుడే కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. లాస్ ఏంజెల్స్, ఫీనిక్స్, డెన్వర్, షికాగో, డాలస్, హ్యూస్టన్ సహా 27 అమెరికన్ సిటీస్ ప్రాంతాలకు చెందిన అభిమానులతో చిరు లైవ్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానుల కేకలు, సంతోషం చూసి కాస్త ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
దీప్తి సునయన బ్లాక్ చేసింది.. అప్పటివరకు వదలను: షణ్నూ
-
ఫేస్బుక్ యూజర్లకు శుభవార్త..! ఇప్పుడు మరింత సులువుగా..
సోషల్‌మీడియా యాప్స్‌లో అత్యంత ప్రజాదరణను పొందిన యాప్‌గా ఫేస్బుక్ నిలుస్తోంది. సుమారు 3 బిలియన్ల యూజర్లు ఫేస్బుక్ సొంతం. యూజర్లకు మరింత దగ్గరవ్వడం కోసం ఎల్లప్పుడూ సరికొత్త అప్డేట్స్తో ఫేస్బుక్ వస్తోంది. తాజాగా ఫేస్బుక్ మరో సరికొత్త అప్డేట్ను తీసుకువచ్చింది. ఇప్పుడు మరింత సులభం..! ఫేస్బుక్ ఖాతాలను యాక్సెస్ చేయలేని వారు, బ్లాక్ ఐనా ఖాతాలను తిరిగి యూజర్లు పొందేందుకు లైవ్ చాట్ సపోర్ట్ ఫీచర్‌ను ఫేస్బుక్ యాడ్ చేసింది. దీంతో ఆయా యూజర్లు తమ ఖాతాలను పొందేందుకు తోడ్పడనుంది. లైవ్ చాట్ సపోర్ట్ కేవలం ఇంగ్లీషులోనే అందుబాటులో ఉంది. ఫేస్బుక్ సపోర్ట్‌పై క్లిక్ చేస్తే ఫేస్‌బుక్‌కు చెందిన కస్టమర్ ఎగ్జిక్యూటివ్‌తో యూజర్లు చాట్ చేయవచ్చును. మరిన్ని సాధనాలు..! ఫేస్బుక్ తన బ్లాగ్‌లో అశ్లీలత కీవర్డ్‌ను నిరోధించే సాధనాలు, సస్పెండ్/బ్యానింగ్ నియంత్రణలతో సహా అనేక కామెంట్ మోడరేషన్ సాధనాలను రూపొందిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఫేస్బుక్ యూజర్ల కోసం ప్రత్యేక భద్రతా సాధనాలను ప్రారంభించడంతో పాటుగా, వారి ఖాతాల నుంచి లాగ్ అవుట్ ఐనా వ్యక్తుల కోసం లైవ్ చాట్ సపోర్ట్ సిస్టమ్‌ను కూడా ప్రకటించింది. చదవండి: గూగుల్ కీలక ప్రకటన.. బిల్లింగ్ విధానానికి మారేందుకు గడువు పెంపు -
పిచ్చిదానిలా ఉన్నా..నీకు హాట్‌గా కనిపించానా : నటి హేమ
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన నటి హేమ. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా కేబీఆర్ పార్కుకు వాకింగ్‌కు వెళ్లిన హేమ..అక్కడే ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. లైవ్ చాట్‌లో కరోనాపై జాగ్రత్తలు చెబుతూ సెకండ్ చాలా తీవ్రంగా ఉందని అందరూ మాస్కులు ధరించాలని కోరింది. కూతురితో కలిసి చింత చిగురు కోసిన నటి..తనకన్నా తన కూతురే ఫేమస్ అని, తనకు సోషల్ మీడియాలో తనకంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారని తెలిపింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ లైవ్‌లోనే హేమను హాట్ అంటూ కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన ఆమె..'నన్ను చూస్తే పిచ్చిదానిలా ఉన్నా. ఎవరైనా చూస్తే చిల్లర వేస్తారు, అలాంటిది నీకు హాట్‌గా కనిపిస్తున్నానా' అంటూ ఫన్నీగా బదులిచ్చింది. ప్రస్తుతం హేమ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా స్పోర్టివ్‌గా రిప్లై ఇచ్చిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలుగు , తమిళ, హిందీ భాషల్లో కలిపి ఇప్పటివరకు దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించిన హేమ.. కరోనా వల్ల కొన్ని సినిమాలు ఆగిపోయాయని పేర్కొంది. త్వరలోనే పరిస్థితి అదుపులోకి రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఇక గతంలో బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని మొదటి వారమే ఎలిమినేట్ అయి హౌస్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లో గొడవలతో కాస్త అపఖ్యాతి కూడా మూటగట్టుకుంది. View this post on Instagram A post shared by Hema_Kolla (@urshemakolla) చదవండి : ఒక్క నెలలోనే 6కేజీలు తగ్గిన పాయల్.. ఏం చేసిందంటే.. -
సీక్రెట్ పుట్టుమచ్చను షేర్ చేసిన స్టార్ హీరోయిన్
ముంబై : బాలీవుడ్ బ్యూటీ దిశా తరుచూ వార్తల్లో నిలుస్తోంది. స్టార్ హీరో టైగర్ ఫ్రాఫ్‌తో ప్రేమాయణం ఈ బ్యూటీని మరింత పాపులర్ చేసింది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారని, కొంతకాలంగా టైగర్- దిశా పటానీ డేటింగ్ చేస్తున్నారని బీ-టౌన్లో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇద్దరూ కలిసి పలు పార్టీలు, డిన్నర్లలో పాల్గొంటూ పలు సార్లు కెమెరాలకు చిక్కారు. దీంతో ఈ లవ్ కపుల్‌కి బాలీవుడ్లో యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్‌మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే దిశా పటానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో 'ఆస్క్ మై ఎనీథింగ్' సెషన్‌ను నిర్వహించింది. ఇందులో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆన్సర్ చేసింది. కాగా ఇతరులకుచ, మీకు ఉన్న తేడా ఏంటీ? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా దిశా షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు కంటి కింద పుట్టుమచ్చ ఉందని, ఇదే తనను అందరి కంటే ప్రత్యేకంగా చూపిస్తుందని పేర్కొంది. ఇక సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'రాధే' చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం మే 13న విడుదల కానుంది. చదవండి : యాక్షన్ హీరోకు గాయాలు, పరిగెత్తుకొచ్చిన ప్రియురాలు డిలీట్ చెయ్, లేదంటే చంపేస్తాం: యాంకర్‌కు బెదిరింపులు -
నాగబాబు వాట్సాప్ డీపీ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తనదైన శైలిలో బదులిస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. గతంలో రెండో పెళ్లిపై నాగబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కనీసం రెండో పెళ్లి ఆలోచన వచ్చినా చంపేస్తానని తన భార్య వార్నింగ్ కూడా ఇచ్చినట్లు నాగబాబు ఫన్నీగా బదులిచ్చారు. తాజాగా ఆస్క్ మి ఏ క్వశ్చన్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ నిర్వహించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో ఆన్సర్ చేశారు. ఇందులో భాగంగా..మీ వాట్సాప్ డీపీ ఏంటి? అని ఓ నెటిజన్ అడగ్గా, రామ్‌గోపాల్ వర్మ, బాలకృష్ణ నవ్వుతూ సంభాషిస్తున్న ఓ ఫోటోను షేర్ చేశారు. అయితే గతంలో బాలకృష్ట, ఆర్జీవీపై నాగబాబు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం నాగబాబు షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ‘మీది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా?’ అని నెటిజన్లు ప్రశ్నించగా తనది పెద్దలు కుదిర్చిన వివాహమని పేర్కొన్నారు. అనంతరం అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ ప్రశ్నకు బదులిస్తూ..బన్నీకి స్టైలిష్‌స్టార్ ట్యాగ్ బాగుంటుందన్నారు. అలాగే, సాయిధరమ్ తేజ్.. చాలా మంచి వ్యక్తని, కష్టపడే గుణం కలిగిన వ్యక్తి అని చెప్పారు. మరో ప్రశ్నకు బదులిస్తూ.. న్యూజిలాండ్ తనకెంతో ఇష్టమైన ప్రదేశమని అన్నారు. చదవండి : రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్ వైరల్ సాయి పల్లవితో వరుణ్ తేజ్ పెళ్లి.. నాగబాబు ఏమన్నారంటే.. -
అందుకు ఓ ఎగ్జాంపుల్ నా పెళ్లి: రానా
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన రానా ఎవరూ ఊహించని విధంగా ‘మిహికాతో ప్రేమలో ఉన్నాను’ అని ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఎవరీ మిహికా? రానా, మిహికా ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలుసుకోవాలని కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రానాతో శుక్రవారం లక్ష్మీ మంచు జరిపిన ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో సమాధానాలు దొరికాయి. ► లక్ష్మి: ఎవరీ మిహికా.. ఎప్పటినుండి ఈ లవ్, ఏంటి కథ? రానా: వెంకటేశ్ బాబాయి పెద్దమ్మాయి ఆశ్రిత క్లాస్మేట్ మిహికా బజాజ్. నా ప్రేమ గురించి చెప్పాలంటే జస్ట్ లాక్డౌన్ ముందే జరిగింది. మిహికా నా ప్రేమికురాలిగా అందరికీ ఇప్పుడు తెలిసినా వాళ్ల ఫ్యామిలీ, ఆ అమ్మాయి చాలా ఏళ్లుగా మా కుటుంబానికి తెలుసు. ► లక్ష్మి: ఈ పెళ్లితో చాలామంది అమ్మాయిలనే కాకుండా అబ్బాయిలను కూడా ఇబ్బందుల్లోకి నెట్టినట్లున్నావు? రానా: అది ఎలా? అబ్బాయిలకు వచ్చిన బాధ ఏంటి? ► లక్ష్మి: ఇప్పటివరకు పెళ్లికాని అబ్బాయిలను పెళ్లి చేసుకోమంటే ‘అప్పుడే మాకు పెళ్లేంటి? మా ముందు రానా ఉన్నాడు’ అని నీ పోస్టర్ పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు నువ్వు లేకుండా పోయావు. అది వాళ్ల బాధ. రానా: ఒక వయసు దాటిన తర్వాత అలాంటి పోస్టర్లకు విలువ ఉండదు. ఒక సమయం తర్వాత పోస్టర్లు మారాలి (నవ్వులు). ► లక్ష్మి: కొందరు నీ పక్కన చాలామందిని ఊహించుకుంటే, సడెన్‌గా మిహికా వచ్చింది. నువ్వెలా డిసైడ్ చేసుకున్నావు ఈమె నా వైఫ్ అని? రానా: మంచి పనులు జరుగుతున్నప్పుడు వాటిని అలా జరగనివ్వాలి. ఎక్కువగా ప్రశ్నలు, లెక్కలు వేయకూడదు. (నవ్వుతూ) అలా ఫ్లోలో వెళ్లిపోవాలంతే. నేను అలా ఫ్లోలో వెళ్లిపోయాను. ► లక్ష్మి: మీ పేరెంట్స్ రియాక్షన్? రానా: అమ్మా, నాన్న ఇద్దరూ షాక్డ్ టు జాయ్. ఫైనల్‌గా వాళ్లు చాలా హ్యాపీ. ► లక్ష్మి: ప్రేమ గురించి తనకు చెప్పేటప్పుడు నెర్వస్ ఫీలయ్యావా? రానా: చాలా చిన్న వయసులో జరిగితే అలాంటి ఫీల్ ఉండేదేమో. పెరిగాను కదా.. అలాంటి ఫీలింగేమీ లేదు. ► లక్ష్మి: మిహికా తెలుగు మాట్లాడుతుందా? రానా: మాట్లాడుతుంది కానీ మనంత క్లియర్‌గా కాదు. ఆమె ఇక్కడే పుట్టి పెరిగింది. హైదరాబాద్‌లో తనకు ‘డ్యూడ్రాప్’ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది. షీ ఈజ్ డూయింగ్ ఫైన్ అండ్ నైస్ థింగ్స్. ► లక్ష్మి: కావాలనే ఇండస్ట్రీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదా? రానా: అసలు అంత అలోచించలేదు. నేను ఆ అమ్మాయిని కలిశాను, నచ్చింది, ఓకే అనుకున్నాం. ► లక్ష్మి: అవునట.. మీ అమ్మ లక్ష్మీగారు చెప్పారు. మొత్తం ఆరు నిమిషాల్లోనే అంతా ఫైనలైజ్ అయిందని. అది కూడా మూడు రోజులు రోజుకి రెండు... రెండు... రెండు నిమిషాలు మీ ప్రేమ గురించి ఇంట్లో మాట్లాడుకున్నారట. రానా: నిజంగా మేం మాట్లాడుకుంది ఆరు నిముషాలే. ► లక్ష్మి: ఇక పెళ్లి గురించి వెయిటింగా? రానా: ప్రపంచంలో ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. చూడాలి ఏం జరుగుతుందో. అందరిలానే నేను వెయిటింగ్. కానీ జస్ట్ లాక్‌డౌన్‌కి ముందు లవ్ కన్ఫర్మ్ అయింది. అంతవరకూ హ్యాపీ. సింపుల్‌గా ఏ కాంప్లికేషన్ లేకుండా జరిగిపోయింది. ► లక్ష్మి: నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే నీకు ఏమనిపిస్తుంది? రానా: హైదరాబాద్‌లో పిచ్చి, పిచ్చిగా తిరిగిన పిచ్చి పిల్లాడు రానా. ఫస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్‌ని తీసుకుంటే వీఎఫ్క్స్, సినిమాలు, ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్... ఇలా అనేక రకాలుగా రూపాంతరం చెందాను. ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు ఎదుటివారి గురించి కూడా ఆలోచించడం అలావాటు అవుతుంది. నీ జీవితాన్ని కూడా అవతలి వారి దృష్టికోణంలో నుంచి చూడటం అలవాటవుతుంది. పెళ్లెప్పుడు చేసుకుంటావు? అని నన్నో ఫ్రెండ్ అడిగితే, పెళ్లికి రెడీ అయ్యాననుకున్నప్పుడు చేసుకుంటానన్నాను. ఆ టైమ్ ఇప్పుడు వచ్చిందనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఎన్నో ఊహించుకుంటాం. ఎన్నో లెక్కలేసుకుంటాం. అవన్నీ తప్పే. ఏం జరగాలో అదే జరుగుద్ది. అందుకు ఓ ఎగ్జాంపుల్ నా పెళ్లి. -
రొమాంటిక్ సినిమాల్లో నటిస్తా: నిహారిక
సినీ ప్రముఖులు లైవ్ ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటూ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్నారు. బుధవారం మెగా డాటర్ కొణిదెల నిహారిక ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తారా అని అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. నేనేమైనా సమంతనా? పెళ్ళి తర్వాత నటిస్తానా లేదా అనేది ముందుగానే చెప్పలేను అంటూ పేర్కొంది. అనంతరం రొమాంటిక్ జానర్లో నటించడం గురించి మాట్లాడుతూ.. గ్లామరస్ పాత్రలు కూడా పోషించబోతున్నా. తమిళ ప్రాజెక్టు రొమాంటిక్ చిత్రంగా రూపుదిద్దుకోబోతుంది. త్వరలోనే గోవాలో ఈ సినిమా షూటింగ్ జరగబోతుంది అని నిహారిక చెప్పుకొచ్చింది. మంచి స్క్రిప్టులు సెలక్ట్ చేసుకొని వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను అని తెలిపింది. కాగా ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన నిహారిక.. ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ చిత్రాల్లో నటించారు. కానీ ఈ సినిమాలు ఆమెకు ఆశించినంత విజయాన్ని అందించలేదు. 2019లో వచ్చిన సైరా నరసింహా రెడ్డిలో చిన్న పాత్రలో తళుక్కుమన్నారు. -
‘నా భార్యకు హెల్ప్ చేస్తున్న జానీ సార్’
ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ పెట్టిన ఫన్నీ కామెంటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ నటులు బొమన్ ఇరానీ, జానీలు మానవత్వంపై ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం రాత్రి లైవ్ చాట్‌ను నిర్వహించారు. కాగా లైవ్ చాట్ కొనసాగుతుండగా రణ్వీర్ మధ్యలో ‘నేను నా భర్యకు సాయం చేస్తున్నాను జానీ సార్!!!’ అంటూ కామెంటు చేశాడు. అయితే లైవ్‌లో జరుగుతున్న సంభాషణకు పొంతన లేకుండా రణ్వీర్ కామెంట్ పెట్టి నవ్వులు పూయించాడు. (గత రిలేషన్‌షిప్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు) Ranveer left a comment on Boman Irani’s live with Johny Lever❤️ #deepveer (tfs @RanveersNour ) Ranveer: Main biwi ki help kar raha hoon Johnny sir !!! (I am helping my wife Johnny sir !!!) pic.twitter.com/SQIFHzmaas — #DeepVeerwale - Ranveer Deepika FC (@DeepVeer_FC) April 7, 2020 ఇక ఈ కామెంటుకు సంబంధించిన ఫొటోను దీప్‌వీర్ ఫ్యాన్స్ ట్విటర్ పేజీలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా లాక్డౌన్ నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న రణ్వీర్ తన భార్య దీపికా పదుకొనెతో ఇంటి పనుల్లో బిజీగా ఉన్నట్లు తన కామెంట్ ద్వారా చెప్పకనే చెప్పాడు. కాగా ప్రస్తుతం రణ్వీర్ హీరోగా రాబోయే స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘83’ లో బొమన్ ఇరానీ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ ప్రపంచకప్ గెలిచిన ఇతివృత్తంలో ఈ సినిమాను దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు. (లాక్డౌన్: ‘ప్రజలకు వైద్యంతోపాటు అవి కూడా ముఖ్యం’) -
ముందు ఇబ్బంది పడ్డా: అనసూయ
‘రంగస్థలం’లో రంగమ్మత్తగా అలరించిన బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. ఆ పాత్ర చేయడానికి ముందు ఇబ్బంది పడ్డానని తెలిపారు. ట్విటర్లో లైవ్ చాట్ చేసిన అనసూయ అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చారు. ఈ సందర్భంగా ఓ అభిమాని రంగస్థలంలో వయసుకు మించిన పాత్ర చేయడానికి ఇబ్బంది పడలేదా అని ప్రశ్నించాడు. దీనికి అనసూయ బదులిస్తూ.. ‘నిజంగా ముందు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఒకసారి ఒప్పుకుంటే వెనుదిరిగి చూసే టైప్ కాదు నేను. డబ్బింగ్ చెప్పెటప్పుడే నా భయమంతా పోయిందని’ తెలిపారు. ఇక జీవితంలో చివరి రోజు ఏం చేస్తారని మరో అభిమాని ప్రశ్నించగా.. కుటుంబంతో గడుపుతానని బదులిచ్చారు. మిమ్మల్ని ఆంటీ అని పిలవడంపై రియాక్షన్ ఏమిటని అడగగా.. కొంచెం ఎదగండయ్యా అని సమాధానమిచ్చారు. Honestly mundu ibbandi paddanu.. but okasari accept cheste nenu venutirigi chuse type kadu🙈 But na bhayamanta dubbing cheppeppudu poindi😊 https://t.co/oyhvP4BGTI — Anasuya Bharadwaj (@anusuyakhasba) June 14, 2018 Grow up!🙄 https://t.co/4wSjl3bj1P — Anasuya Bharadwaj (@anusuyakhasba) June 14, 2018 ‘రంగస్థలం’ సినిమాలో ‘రంగమ్మత్త’గా విలక్షణ పాత్ర పోషించి ప్రేక్షకలోకాన్ని మెప్పించడంతో.. ఆమె క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపయ్యింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. -
ఆమెతో కలిసి నటించాలని ఉంది: వరుణ్ తేజ్
మెగా వారసుడు, టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో లైవ్ చాట్ చేశారు. తన లేటెస్ట్ మూవీ 'కంచె' విశేషాలతోపాటు అభిమానులు సంధించిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. వాటిలో కొన్ని మీకోసం.. అభిమాని: డైరెక్టర్ క్రిష్‌లో మీకు బాగా నచ్చే అంశం? వరుణ్ తేజ్ : అతని కమిట్మెంట్ అభిమాని : మీ ఆల్ టైం ఫేవరెట్ మూవీ ? వరుణ్ తేజ్ : రుద్రవీణ అభిమాని : మెగాస్టార్ సినిమాల్లో దేన్నైనా రీమేక్ చేసే ఛాన్స్ వస్తే మీరు ఏ సినిమాని సెలక్ట్ చేసుకుంటారు? వరుణ్ తేజ్ : ఛాలెంజ్.. నా ఫేవరెట్ మూవీస్‌లో ఒకటి అభిమాని : 'కంచె' సినిమా ద్వారా ఏం నేర్చుకున్నారు ? వరుణ్ తేజ్ : కులం, మతం, రంగులాంటి వాటితో మనుషులపై వివక్ష చూపకూడదని, మనుషులంతా ఒక్కటేనని అభిమాని : మీ డ్రీమ్ యాక్ట్రెస్ ఎవరు ? ఏ నటీమణితో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ? వరుణ్ తేజ్ : రమ్యకృష్ణ గారు అభిమాని : ఎవరితో డేటింగ్ చేయాలని కలలు కంటున్నారు ? వరుణ్ తేజ్ : ఏంజెలినా జోలీ అభిమాని : పవర్ స్టార్ పాటల్లో ఏదైనా రీమిక్స్ చేయాలనుకుంటే ఏ పాట సెలక్ట్ చేసుకుంటారు ? వరుణ్ తేజ్ : తమ్ముడు సినిమాలో 'మేడ్ ఇన్ ఆంధ్రా స్టూడెంట్ అంటే..' అభిమాని : అల్లు అర్జున్‌ని మీరు ఏమని సంబోధిస్తారు ? అన్నా లేక బావ? వరుణ్ తేజ్ : బన్ని అన్న అభిమాని : మీ జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలు ? వరుణ్ తేజ్ : 'ముకుంద' సినిమా ఫస్ట్ డే షూట్ అభిమాని : మీ చెల్లెలు నిహారిక సినిమాల్లోకి రావడం పట్ల మీ ఫీలింగ్ ? వరుణ్ తేజ్ : హ్యాపీ అభిమాని : కొత్త సినిమాకి సైన్ చేసేమందు స్టోరీ ఎవరితో డిస్కస్ చేస్తారు ? వరుణ్ తేజ్ : నాన్నతో అభిమాని : మీ అన్నయ్య రామ్ చరణ్ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ? వరుణ్ తేజ్ : మగధీర