Viral Video: Actress Hema Funny Reply To Netizen In Instagram Live, See Why - Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో నెటిజన్‌ కామెంట్‌కు హేమ ఫన్నీ రిప్లై

Published Fri, May 7 2021 1:46 PM | Last Updated on Thu, Apr 14 2022 1:27 PM

Actress Hema Funny Reply To Netizen Who Says She is Hot In Insta live - Sakshi

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన నటి హేమ. ఈ మధ్య సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా కేబీఆర్‌ పార్కుకు వాకింగ్‌కు వెళ్లిన హేమ..అక్కడే ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. లైవ్‌ చాట్‌లో కరోనాపై జాగ్రత్తలు చెబుతూ సెకండ్‌ చాలా తీవ్రంగా ఉందని అందరూ మాస్కులు ధరించాలని కోరింది. కూతురితో కలిసి చింత చిగురు కోసిన నటి..తనకన్నా తన కూతురే ఫేమస్‌ అని, తనకు సోషల్‌ మీడియాలో తనకంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారని తెలిపింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ లైవ్‌లోనే హేమను హాట్‌ అంటూ కామెంట్‌ చేశాడు. దీనిపై స్పందించిన ఆమె..'నన్ను చూస్తే పిచ్చిదానిలా ఉన్నా.  ఎవరైనా చూస్తే చిల్లర వేస్తారు, అలాంటిది నీకు హాట్‌గా కనిపిస్తున్నానా' అంటూ ఫన్నీగా బదులిచ్చింది.

ప్రస్తుతం హేమ చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. చాలా స్పోర్టివ్‌గా రిప్లై ఇచ్చిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలుగు , తమిళ, హిందీ భాషల్లో కలిపి ఇప్పటివరకు దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించిన హేమ.. కరోనా వల్ల కొన్ని సినిమాలు ఆగిపోయాయని పేర్కొంది. త్వరలోనే పరిస్థితి అదుపులోకి రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఇక గతంలో బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొని మొదటి వారమే ఎలిమినేట్‌ అయి హౌస్‌ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లో గొడవలతో కాస్త అపఖ్యాతి కూడా మూటగట్టుకుంది. 

చదవండి : ఒక్క నెలలోనే 6కేజీలు తగ్గిన పాయల్‌.. ఏం చేసిందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement