Viral Video: Suma Kanakala Reacts To Trollings Over Her Calf Video.- Sakshi
Sakshi News home page

ఒక్క వీడియోతో ట్రోలర్స్‌ నోరు మూయించిన సుమ కనకాల

Published Sat, May 1 2021 3:03 PM | Last Updated on Sat, May 1 2021 5:06 PM

Anchor Suma Kanakala Clarifies On Negative Comments On Calf Video - Sakshi

యాంకర్‌ సుమ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు కెరీర్‌పై ఎలాంటి నెగటివ్ లేకుండా హాయిగా ఉన్న సుమ‌.. తాజాగా నెటిజ‌న్ల ట్రోల్స్‌కు గుర‌యిన సంగతి తెలిసిందే. లేగ దదూడ మూతికి అడ్డంగా వెదురు బుట్టి కట్టడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దూడ మూతిని పాలు తాగకుండా అలా కట్టేసారేంటి? ఇంతటి క్రూరత్వమా అంటూ సుమను తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరో వర్గం మాత్రం సుమను సపోర్ట్‌ చేస్తూ అండగా నిలిచారు.


దూడ ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుందని, మోతాదుకు మించి ఎక్కువ పాలు తాగితే ప్రమాదకరమని, కాబట్టి అలా మూతికి అడ్డుకడతారని ట్రోలర్స్‌కు బుదులిచ్చారు. అయినప్పటికీ కొందరు సుమపై నెగిటివి మాత్రం ఆగలేదు. తాజాగా తనపై వస్తోన్న ట్రోల్స్‌పై సుమ స్పందించింది. అక్కడి పాలేరు వద్దకు వెళ్లి రాముడి(లేగ దూడ)మూతికి మొన్న చిక్కం (వెదురు బుట్టి) ఎందుకు కట్టారు? అని సుమ అడగ్గా.. అది మట్టిని తినకుండా ఉండేందుకు అలా కట్టాను అని అతను సమాధానమిచ్చాడు.

అలాగే ఆవును పెంచుకోవడానికి గల కారణాలను వివరిస్తూ..గోమూత్రంతో మంచి ఎరువు వస్తుందని, ఆవు అంటే శుభం అనే ఉద్దేశంతో ఆవును పెంచుకుంటున్నామనే తప్పా వ్యాపారం కోసం కాదు అని పేర్కొన్నారు. ఈ వీడియోను సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ తనపై వస్తోన్న నెగిటివికి చెక్‌ పెట్టారు. 'లేగదూడ మూతికి వెదురు బుట్టి కట్టడంపై చాలా మందికి అనుమానాలు తలెత్తాయి. ఈ వీడియాతో మీ అందరికి సమాధానం దొరికొందని ఆశిస్తున్నాను.. మనం ప్రకృతితో పాటు జంతు ప్రేమికులం కూడా..' అంటూ ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చారు.

చదవండి : మొద‌టిసారి సుమ‌ను ట్రోల్ చే‌స్తున్న‌ నెటిజన్లు‌.. కార‌ణం ఏంటంటే!
HBD Ajith : బైక్‌ మెకానిక్‌ నుంచి సూపర్‌ స్టార్‌గా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement