
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తనదైన శైలిలో బదులిస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. గతంలో రెండో పెళ్లిపై నాగబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కనీసం రెండో పెళ్లి ఆలోచన వచ్చినా చంపేస్తానని తన భార్య వార్నింగ్ కూడా ఇచ్చినట్లు నాగబాబు ఫన్నీగా బదులిచ్చారు. తాజాగా ఆస్క్ మి ఏ క్వశ్చన్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ నిర్వహించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో ఆన్సర్ చేశారు.
ఇందులో భాగంగా..మీ వాట్సాప్ డీపీ ఏంటి? అని ఓ నెటిజన్ అడగ్గా, రామ్‌గోపాల్ వర్మ, బాలకృష్ణ నవ్వుతూ సంభాషిస్తున్న ఓ ఫోటోను షేర్ చేశారు. అయితే గతంలో బాలకృష్ట, ఆర్జీవీపై నాగబాబు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం నాగబాబు షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ‘మీది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా?’ అని నెటిజన్లు ప్రశ్నించగా తనది పెద్దలు కుదిర్చిన వివాహమని పేర్కొన్నారు. అనంతరం అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ ప్రశ్నకు బదులిస్తూ..బన్నీకి స్టైలిష్‌స్టార్ ట్యాగ్ బాగుంటుందన్నారు. అలాగే, సాయిధరమ్ తేజ్.. చాలా మంచి వ్యక్తని, కష్టపడే గుణం కలిగిన వ్యక్తి అని చెప్పారు. మరో ప్రశ్నకు బదులిస్తూ.. న్యూజిలాండ్ తనకెంతో ఇష్టమైన ప్రదేశమని అన్నారు.
చదవండి : రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్ వైరల్
సాయి పల్లవితో వరుణ్ తేజ్ పెళ్లి.. నాగబాబు ఏమన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment