DP
-
'మనీషా, శివాని ఆత్మహత్య'పై.. ఇద్దరు అనుమానితులు అదుపులోకి..
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన బీఎస్సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు మనీషా, శివాని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నల్లగొండ టూటౌన్ పోలీసులు గురువారం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి వివరాలు రాబడుతున్నారు. విద్యార్థినుల ఇద్దరి ఫోన్లో కాల్ డేటా ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నారు. ఎవరితో ఎక్కువగా మాట్లాడారు? వాట్సాప్ చాటింగ్ ఎవరితో ఉంది? మెస్సేజ్‌ల వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బెదిరిస్తున్నాడని.. వాడు ఎవడో తెలియదని ఆ విద్యార్థులు మాట్లాడినట్లు ఫోన్ రికార్డు వైరల్ కావడంతో ఆ దిశగా దర్యాప్తు సాగుతోంది. పరువు పోతుందని ఫోన్లో ఏమైనా ఫొటోలు ఉంటే విద్యార్థులు డిలీట్ చేశారా? అనే కోణంలో ఫోన బ్యాకప్‌ను పరిశీలిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వివరాలను డిలీట్ చేసిన వివరాలను సైబర్ క్రైం విభాగం నుంచి బ్యాకప్ తీసి పరిశీలిస్తున్నారు. విద్యార్థులకు వచ్చిన ఇన్‌కం, అవుట్ గోయింగ్ ఫోన్ కాల్స్ కూడా పరిశీలిస్తున్నారు. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో బస్సు దిగిన విద్యార్థులు నడుచుకుంటూ ప్రకాశంబజార్కు అటునుంచి రాజీవ్పార్కులోకి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తే ఇద్దరు విద్యార్థినులు ఉత్సాహంగా నడుచుకుంటూ వెళ్తూ కనిపించారని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత పార్కులో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు సాంకేతికంగా ఉన్న అన్ని ఆధారాలనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. లోకేషన్ ఆధారంగా.. ఇద్దరు విద్యార్థులకు ఏ ప్రాంతాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి? ఆ సమయంలో వీరిద్దరు ఎక్కడ ఉన్నారని ట్రేస్ చేస్తున్నారు. డీపీలో ఫొటోలు పెట్టుకోవద్దు.. దర్యాప్తులో భాగంగా పోలీసులు గురువారం విద్యార్థినుల స్వగ్రామాలకు వెళ్లి విచారించారు. నక్కలపల్లి గ్రామంలో శివాని స్నేహితుల నుంచి, అమ్మనబోలు గ్రామానికి మనీషా క్లాస్మేట్లు, స్నేహితుల నుంచి పోలీసులు సమాచారం రాబట్టారు. అయితే, అమ్మాయిలు తమ ఇన్‌స్ట్రాగామ్‌లో డీపీగా ఫొటోలు పెట్టుకోవద్దని శివాని గ్రామంలోని స్నేహితులకు చెప్పినట్లు తెలిసింది. ఎందుకు పెట్టుకోవద్దని అడిగితే సమాధానం చెప్పలేదని ఆమె స్నేహితులు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. నక్కలపల్లిలో ఇటీవల ఓ మహిళ ఎస్సై ఉద్యోగం సాధించడంతో.. డిగ్రీ పూర్తి కాగానే మనం కూడా ఎస్సై ఉద్యోగం సాధించాలని ఇద్దరు విద్యార్థినులు నిర్ణయించుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. -
వాట్సాప్ డిస్ప్లే పిక్చర్లుగా అధికారుల ఫోటోలు...అమెజాన్ గిఫ్ట్ కూపన్ల పేరుతో వల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫొటోలను వాట్సాప్ డిస్ప్లే పిక్చర్లుగా (డీపీ) పెట్టి, అనేక మందికి సందేశాలు పంపిస్తూ, అమెజాన్ గిఫ్ట్ కూపన్లు కోరి టోకరా వేస్తున్న, వేయడానికి ప్రయత్నిస్తున్న కేటుగాళ్లు నైజీరియాలో ఉన్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ సహా ముగ్గురు ఉన్నతాధికారుల ఫొటోల దుర్వినియోగంపై నమోదైన కేసుల దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు ఆయా వాట్సాప్‌ల ఐపీ అడ్రస్‌లు తని ఖీ చేయగా అవన్నీ నైజీరియాలోనే ఉన్నట్లు తేలింది. ఇక్కడి నంబర్ అక్కడ వాట్సాప్.. దేశంలోనే ఉంటూ నేరాలు చేసే నైజీరియన్లు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిని వాడుతుంటారు. వీళ్లు బాధితులను బుట్టలో వేసుకోవడానికి అవసరమైన ఫోన్లు చేయడానికి బోగస్ వివరాలతో సిమ్‌కార్డులు తీసుకుంటారు. వీటిని వీళ్లు కేవలం బేసిక్ ఫోన్లలో వేసి వాడేలా సూత్రధారులైన నైజీరియన్లు జాగ్రత్తపడతారు. ఈ నంబర్లకు సంబంధించిన వాట్సాప్‌ను మాత్రం నైజీరియాలోని తమ అనుచరులతో యాక్టివేట్ చేయిస్తారు. అక్కడి వాళ్లు వైఫై ద్వారా వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటారు. అందుకు అవసరమైన కోడ్ మాత్రం ఇక్కడి వ్యక్తి దగ్గర ఉన్న నంబర్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది. దీన్ని వీళ్లు నైజీరియాలోని వారికి చెప్పడంతో వాళ్లు ఎంటర్ చేసుకుని వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటున్నారు. చిక్కకుండా గిఫ్ట్ కూపన్లు.. గతంలో సైబర్ నేరగాళ్లు తమ సందేశాలు అందుకున్న వారి నుంచి డబ్బు అడిగి ఆన్లైన్ ద్వారా లేదా వివిధ వ్యాలెట్స్‌కు పంపాలని కోరేవారు. విషయం పోలీసుల వరకు వెళ్లి దర్యాప్తు చేపడితే నగదు చేరిన నంబర్ ఆధారంగా వీరి వివరాలు బయటపడేవి. ఇటీవల కాలంలో ఎక్కువగా అమెజాన్ గిఫ్ట్ కూపన్లు పంపాలని కోరుతున్నారు. నిర్ణీత మొత్తానికి వీటికి ఖరీదు చేస్తున్న బాధితులు దానికి సంబంధించిన లింకులను షేర్ చేస్తున్నారు. వీటిని ప్రపంచంలో ఎక్కడ నుంచి అయినా రీడీమ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు ఫలానా దేశంలో కూపన్ రీడీమ్ అయిందని గుర్తించినా చర్యలు సాధ్యంకాదు. అధికారిక వెబ్సైట్లే ఆధారం.. వాట్సాప్ సిద్ధం చేసుకుంటున్న నైజీరియన్లు అధికారిక వెబ్సైట్ల ద్వారానే ప్రముఖ సంస్థల, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల వివరాలు, ఫొటోలు సంగ్రహిస్తున్నారు. ప్రొఫైల్ నేమ్, అబౌట్ తదితరాలను డీపీగా ఎంచుకున్న ఫొటోకు తగ్గట్టే సిద్ధం చేసుకుంటారు. ఈ నంబర్ నుంచి సదరు అధికారి కింద పని చేసే వారికి సందేశాలు పంపుతారు. ఇవీ నేరగాళ్ల చేతికి ఆయా వెబ్సైట్ల ద్వారానే తెలుస్తున్నాయి. కేవలం డీపీలు మాత్రమే చూస్తూ ఆ సందేశం తమ అధికారి నుంచే వచ్చినట్లు భావించి స్పందిస్తున్నారు. ఈ తరహా స్కామ్స్ దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. సంప్రదించి సరిచూసుకోవాలి డీపీ ఫ్రాడ్స్‌ల్లో ఉన్నతాధికారులు, సెలబ్రెటీల ఫొటోలు వినియోగిస్తారు. ఎవరికైనా తమ పై అధికారులు, పరిచయస్తుల నుంచి డబ్బు, గిఫ్ట్ కూపన్లు పంపాలంటూ సందేశాలు వస్తే గుడ్డిగా నమ్మొద్దు. కేవలం డీపీలు చూసి ఆ సందేశం ఫలానా వారే పంపారని భావించద్దు. ఆ వాట్సాప్‌కు సంబంధించిన ఫోన్ నంబర్‌ను పరిశీలించాలి. అది వాళ్లు నిత్యం వినియోగించేది కాకపోతే వ్యక్తిగతంగా లేదా ఫోన్ ద్వారా సంప్రదించిన తర్వాతే ముందుకు వెళ్లాలి. – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ (చదవండి: ఫారిన్ ట్రేడింగ్ మాయాజాలం.. రూ.152 కోట్లతో పలాయనం) -
నాగబాబు వాట్సాప్ డీపీ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తనదైన శైలిలో బదులిస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. గతంలో రెండో పెళ్లిపై నాగబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కనీసం రెండో పెళ్లి ఆలోచన వచ్చినా చంపేస్తానని తన భార్య వార్నింగ్ కూడా ఇచ్చినట్లు నాగబాబు ఫన్నీగా బదులిచ్చారు. తాజాగా ఆస్క్ మి ఏ క్వశ్చన్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ నిర్వహించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో ఆన్సర్ చేశారు. ఇందులో భాగంగా..మీ వాట్సాప్ డీపీ ఏంటి? అని ఓ నెటిజన్ అడగ్గా, రామ్‌గోపాల్ వర్మ, బాలకృష్ణ నవ్వుతూ సంభాషిస్తున్న ఓ ఫోటోను షేర్ చేశారు. అయితే గతంలో బాలకృష్ట, ఆర్జీవీపై నాగబాబు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం నాగబాబు షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ‘మీది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా?’ అని నెటిజన్లు ప్రశ్నించగా తనది పెద్దలు కుదిర్చిన వివాహమని పేర్కొన్నారు. అనంతరం అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ ప్రశ్నకు బదులిస్తూ..బన్నీకి స్టైలిష్‌స్టార్ ట్యాగ్ బాగుంటుందన్నారు. అలాగే, సాయిధరమ్ తేజ్.. చాలా మంచి వ్యక్తని, కష్టపడే గుణం కలిగిన వ్యక్తి అని చెప్పారు. మరో ప్రశ్నకు బదులిస్తూ.. న్యూజిలాండ్ తనకెంతో ఇష్టమైన ప్రదేశమని అన్నారు. చదవండి : రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్ వైరల్ సాయి పల్లవితో వరుణ్ తేజ్ పెళ్లి.. నాగబాబు ఏమన్నారంటే.. -
వైరలవుతున్న నటుడి ఫోటో
బాలీవుడ్ క్లాసిక్ హీరో ఇర్ఫాన్ ఖాన్ అరుదైన ‘న్యూరో ఎండోక్రైనో’ అనే క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్న ఈ హీరో ఆదివారం తన డీపీ(డిస్ప్లే పిక్చర్)ని చేంజ్ చేశారు. అయితే ఈ ఫోటో అభిమానులను విపరీతంగా కదిలించడమే కాక తెగ వైరల్ అవుతుంది. సాధరణంగా క్యాన్సర్ వ్యాధికి చికిత్స అంటే ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. కానీ ఇర్ఫాన్ ఫోటో చూసిన వారికి కూడా ఆ బాధ ఎలా ఉంటుందో బాగానే అర్ధం అవుతుంది. ఇర్ఫాన్ ఖాన్ షేర్ చేసిన ఈ ఫోటోలో అతను బాగా నీరసించి, బక్కచిక్కపోయి ఉన్నట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. కానీ ఇంతటి విచారాన్ని కూడా ఈ నటుడు చిరునవ్వుతో భరిస్తున్నాడు. శరీరం ఎంత బలహీన పడినా ఇర్ఫాన్ ధైర్యం మాత్రం తగ్గలేదు. అందుకు నిదర్శనం అతని మోముపైన చిరునవ్వే. ఇర్ఫాన్ న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఈ ఏడాది మార్చిలో తెలిసింది. దాంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తనకొచ్చిన అరుదైన వ్యాధి గురించి ఇర్ఫాన్ ఖాన్ ఒక భావోద్వేగపూరితమైన లేఖను రాశారు. ఈ లేఖలో ‘ఊహించని ఉపద్రవాలతో కూడిందే జీవితం. మనం ఏదో అనుకుంటాం, కానీ మనం అనుకోనిదేదో జరుగుతుంది. ఇలాంటి అనుకోని సంఘటనలే మన జీవితాన్ని మార్చివేస్తాయి. గత కొన్ని రోజుల్లోనే ఈ విషయం నాకు బాగా అర్ధమయ్యింది. నేను అరుదైన న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. కానీ నా చుట్టూ ఉన్న వారి ప్రేమ, ఆశీస్సులే నాకు బలానిస్తున్నాయి. అవే నాకు నమ్మకాన్ని కల్గిస్తున్నాయి. ఈ ప్రయాణంలో భాగంగా(చికిత్స కోసం) నేను దేశం దాటి వెళ్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని కోరేది ఒక్కటే మీ ఆశీస్సులను నిరంతరం నాకు అందిస్తూనే ఉండండి. త్వరలోనే వచ్చి నా ఈ ప్రయాణానికి సంబంధించిన మరిన్ని కబుర్లు మీకు చెబుతాను అంటూ లేఖలో తెలిపారు. లండన్ వెళ్లిన తర్వాత ఈ నటుడు కర్వాన్‌లో తనతో పాటు నటించిన దుల్కర్ సల్మాన్, మిథిలా పాకర్‌కు శుభాకాంక్షలు తెలిపడం కోసం తొలిసారి సోషల్ మీడియాలోకొచ్చారు. ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది. -
కోడుమూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
కర్నూలు సీక్యాంప్: తాజా చేరికలతో టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీలో చేరడంతో ఆ నియోజకవర్గంలో విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులంతా కలిసి శుక్రవారం కర్నూలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాము అండగా నిలిచామని, అయితే ఇంకో వర్గం తనను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే మణిగాంధీ ద్వారా రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మణిగాంధీని టీడీపీ ఇన్చార్జ్ ఇస్తే తనతోపాటు తన వర్గీయులైన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పార్టీకి రాజీనామా చేస్తారని హెచ్చరించారు. తమ మద్దతుతోనే జిల్లాలో టీడీపీ..ఎమ్మెల్సీ పదవిని కైవసం చేసుకుందన్నారు. త్యాగాలు చేసిన తమను కాదని, ఇంకొకరికి పార్టీ పదవి ఎలా ఇస్తారని మండిపడ్డారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ తాగుబోతు, తిరుగుబోతని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు తీవ్ర విమర్శలు చేశారు. జనాకర్షణ లేని నాయకుడని మండిపడ్డారు. తమ మద్దతు లేకుండా మణిగాంధీకి పార్టీలో ఎలాంటి అవకాశం కల్పించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
బిల్డర్లతో ఉద్ధవ్ కుమ్మక్కు
- ఆరోపించిన కాంగ్రెస్ నేత నారాయణ్ రాణే - ‘డీపీ’ని బిల్డర్లకు అనుగుణంగా మార్చారని విమర్శ - ఏఎంసీ అవినీతి మయం: సంజయ్ నిరుపం ముంబై: వివాదాస్పద ‘అభివృద్ధి ప్రణాళిక’ (డీపీ) డ్రాఫ్టు విషయంలో ఉద్ధవ్ ఠాక్రే బిల్డర్లతో కుమ్మక్కయ్యారని సీనియర్ కాంగ్రెస్ నేత నారాయణ్ రాణే సోమవారం ఆరోపించారు. 4 నెలల్లోనే డీపీని మారుస్తామని ప్రభుత్వం విడుదల చేసిన జీఆర్‌తోనే అది పనికి రాకుండా పోయిందని రాణే విమర్శించారు. అభివృద్ధి ప్రణాళికను స్థానిక సంస్థలు రూపొందిస్తాయని, అభ్యంతరాలను పరీక్షించి అనుమతి ఇవ్వడమే ప్రభుత్వ పనన్నారు. డీపీ డ్రాఫ్టునకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆశిశ్ షేలర్ డిమాండ్ చేయడం, బీజేపీ- శివసేన మధ్య ఉన్న ఆధిపత్య పోరుకు నిదర్శనమన్నారు. ఉద్ధవ్‌కు డీపీ అంటే అర ్థం తెలుసో లేదో కాని, దాని వెనకు ఉన్న ఆర్థిక సమీకరణాలు మాత్రం కచ్చితంగా తెలిసుంటాయన్నారు. బిల్డర్లకు అనుగుణంగా డీపీని మార్చేందుకు ఉద్ధవ్ పీఏ వారికి ఫోన్లు కూడా చేస్తున్నారని రాణే ఆరోపించారు. ఎంఐఎం ఏఎంసీలో 25 స్థానాల్లో గెలుపుపై విలేకరులు ప్రశ్నించగా.. నవీముంైబె లో బీజేపీని ఓటర్లు తిరస్కరించారని ఆయన అన్నారు. బీఎంసీ ఎన్నికలకు సిద్ధం కండి! త్వరలో జరగబోయే బీఎంసీ ఎన్నికలకు ఇప్పటినుంచి సన్నద్ధం అవ్వాలని కార్పొరేటర్లకు, కార్యకర్తలకు రాణే పిలుపునిచ్చారు. సోమవారం కార్పొరేటర్లతో ఎంపీసీసీ అధ్యక్షుడు సంజయ్ నిరుపంతో కలసి ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంజయ్ నిరుపం.. అభివృద్ధి ప్రణాళికలో పలు లోపాలు ఉన్నట్లు సాక్ష్యాత్తు బీఎంసీ కమిషన ర్ సీతారం కుంటేనే స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పారు. డీపీ లోపాలతో నిండి ఉందని, అది ముంబైని రోడ్డు మీదకు తీసుకొచ్చేందుకే ఉపయోగపడుతుందని ఆయన ఆరోపించారు. -
తల్లకిందులుగా దేశం తపస్సు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏఎస్ రామకృష్ణ గెలుపు కోసం ఆ పార్టీ నేతలు తల్లకిందులుగా తపస్సు చేస్తున్నారు. ఫలితాలు వ్యతిరేకంగా వస్తే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై ప్రభావం చూపే ప్రమాదం ఉండటం తోఅభ్యర్థి గెలుపు బాధ్యతను ముఖ్యనేతలు తమ భుజాన వేసుకున్నారు. కొందరు శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లాలో ఉన్న సమయంలో పార్టీ నేతలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడక కాదన్న సమాచారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందడంతో ఆయన మూడుసార్లు హైదరాబాద్‌లో జిల్లానేతలతో సమీక్షించారు. ఎట్టిపరిస్థితుల్లో అభ్యర్థి గెలవాలని, అందుకు అనువుగా నేతలు శ్రమించాలని హెచ్చరించారు. దీంతో పార్టీనేతలంతా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థి గెలుపునకు దోహదపడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలకు అవసరమైన నిధులు సమకూర్చడంతోపాటు వారి అసోసియేషన్ కార్యాలయాల భవన నిర్మాణాలు, ఇతర సమస్యల పరిష్కారానికి హామీలు గుప్పిస్తున్నారు. కొన్ని చోట్ల పరోక్షంగా బెదిరింపులకు దిగుతున్నారు. ప్రత్యర్థి అభ్యర్థి గెలిస్తే సమస్యల పరిష్కారానికి తమ వద్దకే రావాల్సి ఉంటుందని, దీనిపై ఉపాధ్యాయులు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నరసరావుపేట ఎంపీ రాాయపాటి సాంబశివరావు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రస్తుతం జరుగుతున్న చట్ట సభలకు హాజరుకాకుండా జిల్లాలో ప్రచారం కొనసాగిస్తున్నారు. మూడోసారి పోటీ చేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు ఉపాధ్యాయ సంఘాల సహకారంతో ముందుకు దూసుకుపోతున్నారు. నిర్ధిష్ట ప్రణాళికతో హడావుడి లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో తాను చేసిన సేవలను పరిగణనలోకి తీసుకోవాలని, ఉపాధ్యాయులకు నిత్యం అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో తన కృషిని ఒకసారి మననం చేసుకుని ఓటు హక్కు వినియోగి ంచాలని ఉపాధ్యాయులను కోరుతున్నారు. లక్ష్మణరావు గెలుపు బాధ్యతలను యుటిఎఫ్ పూర్తిగా తీసుకోగా, సీపీఎం, ఎస్ఎఫ్ఐలు ప్రత్యక్షంగా, మరికొన్ని పార్టీలు పరోక్షంగా ఆయనకు సహకరిస్తున్నాయి. ఆయన ఇప్పటికే రెండు జిల్లాల్లో ఓ విడత ప్రచారాన్ని పూర్తిచేశారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులను వ్యక్తిగతంగా కలిసి గెలుపునకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడ మాజీ మేయరు, మాజీ ఉపాధ్యాయిని తాడి శకుంతల ఆలస్యంగా ఎన్నికల బరిలోకి దిగినా అన్ని వర్గాల ఓటర్లను కలుస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు బలపరిచిన అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. -
దేశం అనాసక్తి!
గిరాకీలేని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు కంటే స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. పది రోజుల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నప్పటికీ సీటు ఆశించే వారి సంఖ్య ఆ పార్టీలో పరిమితంగా ఉంది. ఎక్కువ మంది నాయకులు స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనేక కారణాలు వినపడుతున్నాయి. యూటీఎఫ్ బలపరిచిన ప్రస్తుత ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు బలమైన అభ్యర్థి కావడం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కంటే, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రాజకీయంగా ప్రాధాన్యం ఉంటుందనే అభిప్రాయం ఉండటంతో ఈ సీటు కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. గత ఎన్నికల సమయానికి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో మొత్తం 12,850 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉన్నారు. గుంటూరులో 6,800 మంది, కృష్ణా జిల్లాలో 6,050 ఉన్నారు. మార్చిలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఇటీవల దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులతో కలిపి ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ఈ నెల 15,16 తేదీల్లో విడుదల చేయనుంది. 20 తరువాత నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్‌కు ముందే ప్రస్తుత ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మళ్లీ పోటీ చేసేం దుకు సమాయత్తం అవుతున్నారు. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ తాను చేసిన సేవలను వివరిస్తున్నారు. యూటీఎఫ్ మద్దతుతో రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన లక్ష్మణరావు మూడోసారి ఇతర వర్గాలను కలుపుకునే యత్నంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తారనే అభిప్రాయం కూడా వినపడుతోంది. ఈ నేపథ్యంలోనే పీఆర్టీయూ, ఎస్టీయూ, ఏపీటీఎఫ్, ఆర్‌యూపీపీ, హెచ్ఎంఏ, పీఈటీ తదితర ఉపాధ్యాయ సంఘాలన్నీ ఓ అభ్యర్థిని నిలిపేందుకు సిద్ధమవుతున్నాయి. వాస్తవంగా టీడీపీలో నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ సీట్లను ఆశించే నాయకుల సంఖ్యకు కొదవ లేదు. గత ఎన్నికల్లో సీటు ఆశించినవారు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి చిరకాలంగా సేవ చేస్తున్న సీనియర్లు ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు కంటే స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకే ప్రాధాన్యం ఇస్తూ ఈ సీటు కోసం ప్రయత్నించడంలేదు. ఇద్దరు ముగ్గురు నాయకులు తమకే సీటు అని చెప్పుకుంటున్నా, జిల్లా మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు అభ్యర్థిని ఖరారు చేయలేదని, అధినేత చంద్రబాబు వద్ద ఇంకా చర్చ జరగలేదంటున్నారు. ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో సీపీఐ మద్దతుతో పోటీచేసిన డాక్టర్ ఏఎస్ రామకృష్ణ ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం గుంటూరులో ఉపాధ్యాయులతో ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసి తాను టీడీపీ మద్దతుతో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు, పార్టీలోని ముఖ్యుల మద్దతు కూడా తనకు ఉన్నట్టు ప్రకటించుకున్నారు. ఈ పరిస్థితులను అంచనా వేసుకుని టీడీపీలోని ముఖ్యులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. సీటు వచ్చినా బరిలో బలమైన అభ్యర్థులు ఉండే అవకాశాలు కనపడటం, ఎన్నికల ఖర్చు కూడా రూ.3 కోట్ల వరకు అయ్యే అవకాశాలు ఉండటం, గెలిచినా ఆ పదవి వల్ల రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం ఉండదనే భావన టీడీపీ నేతల్లో ఉండటంతో సీటుకోసం పోటీపడే నేతల సంఖ్య పరిమితమైంది. -
‘దేశం’లో రచ్చ..రచ్చ!
సాక్షి, ఒంగోలు: సంతనూతలపాడు (ఎస్సీ) నియోజకవర్గాన్ని టీడీపీ ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించింది. ఈ వ్యవహారం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి రగిలించింది. ఇప్పటికే జిల్లా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన తెలుగుతమ్ముళ్లు అధినేతతో అమీతుమీకి సిద్ధపడుతున్నారు. నిన్నటి వరకు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీలో చేరిన బీఎన్ విజయ్‌కుమార్‌ను పార్టీ తరఫున పోటీకి నిలపాలని, లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించి బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు.దీనిపై సోమవారం సాయంత్రం కొందరు హైదరాబాద్ చేరుకుని టీడీపీ నేతలు సుజనాచౌదరి, కంభంపాటి రామ్మోహనరావును కలిశారు. సీనియర్లు మౌనం.. ఎన్నికలొచ్చిన ప్రతీసారి పొత్తుల పేరిట చంద్రబాబు తన మిత్రపక్షానికి సంతనూతలపాడునే కేటాయించడం వెనుక మతలబేంటనేది ఆ పార్టీ శ్రేణులకు ప్రశ్నగా మిగిలింది. 1989, 1994, 2009లోనూ ఆ సీటును ఇతరులకే అప్పగించారు. అక్కడ గెలుపు నమ్మకం లేకపోవడంతోనే త్యాగం చేస్తున్నారా, లేక పార్టీ నేతల ఆధిపత్యపోరు నేపథ్యంలో సంతనూతలపాడు నేతలు, కార్యకర్తలు బలవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై సీనియర్ నేత కరణం బలరాం, జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ నోరు మెదపలేదు. కష్టపడినా పార్టీలో సరైన గుర్తింపు లేనప్పుడు తాజా ఎన్నికల్లో పనిచేయడం వృథా ప్రయాస అని నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర నియోజకవర్గాల నేతల్లో భయం.. ఒకవేళ సంతనూతలపాడుపై చంద్రబాబు తన నిర్ణయం మార్చుకుంటే, అనంతరం ఏ నియోజకవర్గానికి ఎసరు పెడతారనే భయం జిల్లా నేతల్లో మొదలైంది. ఉప ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మరోమారు టికెట్ ఆశిస్తుండగా, అక్కడ అతని ప్రాధాన్యతను తగ్గించే వ్యూహాలు నడుస్తున్నాయి. ఈ విషయంలో దామచర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు కరణం బలరాంను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. కనిగిరికి కదిరి బాబురావును ఖరారు చేశారో లేదోననే అయోమయంతో అక్క డ పార్టీ శ్రేణులు అనుమానంగానే పనిచేస్తున్నాయి. గిద్దలూరుకు సాయికల్పనారెడ్డి పేరును కాదని, ఆమె కొడుకు అభిషేక్‌రెడ్డికి సీటు కేటాయింపుపై ఆలోచిస్తున్నామని చెబుతున్నారు. దర్శిలో శిద్దా రాఘవరావుది అదే పరిస్థితి. చీరాలలో పోతుల సునీతకు ప్రత్యామ్నాయంగా కాపు సామాజికవర్గ అభ్యర్థిని తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంతనూతలపాడు బీజేపీకి వెళ్లడం వెనుక జిల్లా పార్టీలో ఉన్న కీలకనేతలు చక్రం తిప్పినట్లు కేడర్ ఆరోపిస్తుండగా, చంద్రబాబు నిర్ణయంలో మార్పువస్తే, కొండపి నియోజకవర్గాన్ని బీజేపీకి అప్పగిస్తారనే ఊహాగానాలూ లేకపోలేదు.