బిల్డర్లతో ఉద్ధవ్ కుమ్మక్కు | AMC led to corruption | Sakshi
Sakshi News home page

బిల్డర్లతో ఉద్ధవ్ కుమ్మక్కు

Published Tue, Apr 28 2015 12:30 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

AMC led to corruption

- ఆరోపించిన కాంగ్రెస్ నేత నారాయణ్ రాణే
- ‘డీపీ’ని బిల్డర్లకు అనుగుణంగా మార్చారని విమర్శ
- ఏఎంసీ అవినీతి మయం: సంజయ్ నిరుపం
ముంబై:
వివాదాస్పద ‘అభివృద్ధి ప్రణాళిక’ (డీపీ) డ్రాఫ్టు విషయంలో ఉద్ధవ్ ఠాక్రే బిల్డర్లతో కుమ్మక్కయ్యారని సీనియర్ కాంగ్రెస్ నేత నారాయణ్ రాణే సోమవారం ఆరోపించారు. 4 నెలల్లోనే డీపీని మారుస్తామని ప్రభుత్వం విడుదల చేసిన జీఆర్‌తోనే అది పనికి రాకుండా పోయిందని రాణే  విమర్శించారు. అభివృద్ధి ప్రణాళికను స్థానిక సంస్థలు రూపొందిస్తాయని, అభ్యంతరాలను పరీక్షించి అనుమతి ఇవ్వడమే ప్రభుత్వ పనన్నారు. డీపీ డ్రాఫ్టునకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆశిశ్ షేలర్ డిమాండ్ చేయడం, బీజేపీ- శివసేన మధ్య ఉన్న ఆధిపత్య పోరుకు నిదర్శనమన్నారు.

ఉద్ధవ్‌కు డీపీ అంటే అర ్థం తెలుసో లేదో కాని, దాని వెనకు ఉన్న ఆర్థిక సమీకరణాలు మాత్రం కచ్చితంగా తెలిసుంటాయన్నారు. బిల్డర్లకు అనుగుణంగా డీపీని మార్చేందుకు ఉద్ధవ్ పీఏ వారికి ఫోన్లు కూడా చేస్తున్నారని రాణే ఆరోపించారు. ఎంఐఎం ఏఎంసీలో 25 స్థానాల్లో గెలుపుపై విలేకరులు ప్రశ్నించగా.. నవీముంైబె లో బీజేపీని ఓటర్లు తిరస్కరించారని ఆయన అన్నారు.

బీఎంసీ ఎన్నికలకు సిద్ధం కండి!
త్వరలో జరగబోయే బీఎంసీ ఎన్నికలకు ఇప్పటినుంచి సన్నద్ధం అవ్వాలని కార్పొరేటర్లకు, కార్యకర్తలకు రాణే పిలుపునిచ్చారు. సోమవారం కార్పొరేటర్లతో ఎంపీసీసీ అధ్యక్షుడు సంజయ్ నిరుపంతో కలసి ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంజయ్ నిరుపం.. అభివృద్ధి ప్రణాళికలో పలు లోపాలు ఉన్నట్లు సాక్ష్యాత్తు బీఎంసీ కమిషన ర్ సీతారం కుంటేనే స్టేట్‌మెంట్ ఇచ్చారని చెప్పారు. డీపీ లోపాలతో నిండి ఉందని, అది ముంబైని రోడ్డు మీదకు తీసుకొచ్చేందుకే ఉపయోగపడుతుందని ఆయన ఆరోపించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement