ముందు ఇబ్బంది పడ్డా: అనసూయ | Anchor Anasuya Live Chat With Fans | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 15 2018 12:26 PM | Last Updated on Fri, Jun 15 2018 3:21 PM

Anchor Anasuya Live Chat With Fans - Sakshi

అనసూయ భరద్వాజ్‌ (ఫైల్‌ ఫొటో)

‘రంగస్థలం’లో రంగమ్మత్తగా అలరించిన బుల్లితెర హాట్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌.. ఆ పాత్ర చేయడానికి ముందు ఇబ్బంది పడ్డానని తెలిపారు. ట్విటర్‌లో లైవ్‌ చాట్‌ చేసిన అనసూయ అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చారు. ఈ సందర్భంగా ఓ అభిమాని రంగస్థలంలో వయసుకు మించిన పాత్ర చేయడానికి ఇబ్బంది పడలేదా అని ప్రశ్నించాడు. దీనికి అనసూయ బదులిస్తూ.. ‘నిజంగా ముందు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఒకసారి ఒప్పుకుంటే వెనుదిరిగి చూసే టైప్‌ కాదు నేను. డబ్బింగ్‌ చెప్పెటప్పుడే నా భయమంతా పోయిందని’ తెలిపారు. ఇక జీవితంలో చివరి రోజు ఏం చేస్తారని మరో అభిమాని ప్రశ్నించగా.. కుటుంబంతో గడుపుతానని బదులిచ్చారు. మిమ్మల్ని ఆంటీ అని పిలవడంపై  రియాక్షన్‌ ఏమిటని అడగగా.. కొంచెం ఎదగండయ్యా అని సమాధానమిచ్చారు. 

‘రంగస్థలం’ సినిమాలో ‘రంగమ్మత్త’గా విలక్షణ పాత్ర పోషించి ప్రేక్షకలోకాన్ని మెప్పించడంతో.. ఆమె క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపయ్యింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement