స్టార్‌ హీరో ‘అడిగితే’ నో చెప్పా.. చాలా కోల్పోయా: అనసూయ | Anasuya Bharadwaj Shocking Revelation That Star Hero And Director Asked For Commitment, Deets Inside | Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: బికినీ వేసుకోవాలా వద్దా అనేది నా ఇష్టం

Published Sun, Feb 2 2025 2:23 PM | Last Updated on Sun, Feb 2 2025 4:37 PM

Anasuya Bharadwaj Says Star Hero, Direct Ask Commitment But She Rejected

ఆడ, మగ జాతల మధ్య అట్రాక్షన్‌ అనేది కామన్‌. ఏ రంగంలోనైనా ఇది ఉంటుంది. సినిమా అనేది రంగుల ప్రపంచం కాబట్టి ఇక్కడ స్పెషల్‌ ఫోకస్‌ ఉంటుంది. చాన్స్‌ల పేరుతో అమ్మాయిలను లోబర్చుకునే అవకాశం ఇక్కడ ఎక్కువ. అలా కాకుండా కళను నమ్మి అవకాశాలు ఇచ్చే రోజులు రావాలి. ఆ అమ్మాయి మనదగ్గరకు ‘రాకపోతే’ ఏంటి.. క్యారెక్టర్‌ బాగా చేస్తుంది కదా అని హీరోతో పాటు దర్శకనిర్మాతలు అనుకోవాలి. అప్పుడే చాలా మంది అమ్మాయిలు సినిమా రంగంలో రాణిస్తారు’ అని అంటోది యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌(Anasuya Bharadwaj ). ఎలాంటి విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే అనసూయ..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా రంగంలో అమ్మాయిలపై ఎలాంటి దృష్టికోణం ఉంది? అమ్మాయిలు ఎలా ఉండాలి? తదితర విషయాలపై ఓపెన్‌గా మాట్లాడింది.

‘నో’ చెప్పడం కాదు..ఎదుర్కొవాలి
చాన్స్‌ల పేరుతో వాడుకునేందుకు చాలా మంది హీరోలతో పాటు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తారు. నా విషయంలో కూడా అలా జరిగింది. ఓ స్టార్‌ హీరో ‘అడిగితే’ నో చెప్పాను. అలాగే ఓ పెద్ద డైరెక్టర్‌ అడిగితే సున్నితంగా తిరస్కరించాను. దాని వల్ల నాకు సినిమా చాన్స్‌లు పోయాయి. నో చెప్పడం కాదు అలా చెప్పడం వల్ల వచ్చే సమస్యలను కూడా ఎదుర్కొనే ధైర్యం అమ్మాయిల్లో ఉండాలి. ప్రపోజల్స్‌ అనేవి వస్తూనే ఉంటాయి. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడే ప్రపోజ్‌ చేశారు. నో చెప్పాను. అలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి ప్రపోజల్స్‌ వచ్చాయి. అప్పుడు ఎలా నో చెప్పానో ఇప్పుడు అలానే చెప్పాను. వాళ్లు కోరుకునేది ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అలా చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. దాని కోసం కాకుండా కళను చూసి పాత్రలు ఇస్తే బాగుంటుంది. ‘ఆమె రాకపోతే ఏంటి..ఆ క్యారెక్టర్‌ అయితే బాగా చేస్తుంది కదా’అని అనుకోవాలి. అప్పుడే చాలా మంది అమ్మాయిలు ఈ రంగంలోకి వస్తారు.

ఈజీ కాదు.. కరెక్ట్‌ అనిపించేదే చెయ్‌
చాలా మంది ఎన్నో ఆశలలో సినిమా రంగంలోకి వస్తారు. కానీ ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. చాన్స్‌ల కోసం ఈజీ పద్దతి వెతుకుతారు. అది తప్పు. ఏది కరెక్ట్‌ అయితే అదే చెయ్‌. పది మంది తప్పు చేస్తున్నారు కదా..నేను కూడా తప్పు చేస్తా అనడం కరెక్ట్‌ కాదు. నువ్వు తప్పు చేయకుండా ఉండు. ఈజీ వేలో కాకుండా నీ కష్టాన్ని, కళను నమ్ముకొని ప్రయత్నించు. అలాంటి వారిని ప్రోత్సహించే రోజులు రావాలి.

నాపై మీ పెత్తనం ఏంటి?
ఇక సోషల్‌ మీడియాలో అనసూయ పెట్టె పోస్టులు ఎంత వైరల్‌ అవుతాయో అందరికి తెలిసిందే. హాట్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ తన అభిమానుల్ని అలరిస్తారు. ఆమె డ్రెస్సింగ్‌పై కొంతమంది నెగెటివ్‌ కామెంట్స్‌ కూడా చేస్తారు. తాజాగా దీనిపై కూడా అనసూయ స్పందించింది. ‘నన్ను ఇష్టపడేవాళ్ల కోసం నేను ఇన్‌స్టాలో ఫోటోలు షేర్‌ చేస్తుంటాను. నేను ఎలాంటి ఫోటోలు అయినా షేర్‌ చేస్తా. అది నా ఇష్టం. నేను ఏం డ్రెస్‌ వేసుకోవాలి? బికినీ వేసుకోవాలా లేదా మొత్తం విప్పి తిరుగాలా’ అనేది నా ఇష్టం. దాన్ని వల్ల నేను ఇవరిని ఇబ్బంది పెట్టలేదు. కానీ నెగెటివ్‌ కామెంట్స్‌ పెట్టడం వల్ల నన్ను ఇబ్బంది పెడుతున్నారు కదా? అయినా నాపై మీ పెత్తనం ఏంటి? అంటూ అనసూయ మరోసారి నెటిజన్స్‌పై మండిపడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement