ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతని సహాయకురాలు (21) ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు జానీ మాస్టర్ వ్యవహారంపై స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
(చదవండి: లైంగిక వేధింపుల కేసు.. ఆ ఊరిలో దాక్కున్న జానీ?)
ఇప్పటికే నటి పూనమ్ కౌర్, సింగర్ చిన్మయితో సహా పలువురు టాలీవుడ్ స్టార్స్ బాధితురాలికి అండగా నిలిచారు. తాజాగా యాంకర్, నటి అనసూయ కూడా ఈ వివాదంపై స్పందించారు. లేడి కొరియోగ్రాఫర్‌కు జరిగిన అన్యాయం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు ఇలాంటి వేధింపులు ఎదురైతే.. వెంటనే భయటపెట్టాలని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు.
సానుభూతి అవసరం లేదు
‘మహిళలకు సానుభూతి అవసరం లేదు. అన్యాయాన్ని పశ్నించే తత్వం ఉండాలి. మీకే కాదు మీకు తెలిసిన వాళ్లకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే బయటపెట్టండి. మీకు అందరూ అండగా ఉంటారు. బాధితురాలితో నేను కూడా కలిసి పని చేశాను. పుష్ప సెట్స్‌లో రెండు మూడు సార్లు ఆ అమ్మాయిని చూశాను. తను చాలా టాలెంటెడ్. ఇలాంటి క్లిష పరిస్థితులు ఆ అమ్మాయి టాలెంట్‌ను ఏమాత్రం తగ్గించలేవు.
(చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు!)
కానీ, మనసులో దాచుకొని బాధపడడం వల్ల ఎలాంటి లాభం లేదు. నేను పనిచేసే చోట మహిళలకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందిస్తాను. ఈ వ్యవహారంలో కూడా బాధితురాలికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్ తో పాటు ఓడబ్ల్యు సభ్యులకు కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఏ మహిళకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను’అని అనసూయ రాసుకొచ్చింది.
పరారీలో జానీ మాస్టర్!
జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు..అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జానీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదు విషయం తెలియగానే..హైదరబాద్ నుంచి నెల్లూరికి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం నార్సింగి పోలీసులకు తెలియడంతో.. నెల్లూరికి ఓ బృందాన్ని పంపించారట. జానీ మాస్టర్‌కి నోటీసులు అందించి, నేడో, రేపో అరెస్ట్ చేసే అవకాశం ఉందని మీడియా వర్గాలు తెలుపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment