యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా కంటిన్యూ అవుతూనే సినిమాల్లోనూ రాణిస్తుంది.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ తరచూ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటుంది. అయితే ఈమధ్య కాలంలో ఆమెపై ట్రోలింగ్ ఎక్కువైంది. ఆంటీ అంటూ కొందరు నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.
అలా ట్రోల్స్ చేసిన వాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా అరెస్ట్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ నెటిజన్లతో కాసేపు ముచ్చటించిన అనసూయ వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. అక్కా.. మిమ్మల్ని ఎవరన్నా ఆంటీ అంటే ఎందుకు అంత కోపం వస్తుంది అని అడిగారు.
దీనికి అనసూయ సమాధానమిస్తూ..ఎందుకంటే వాళ్ళ అర్దాలు వేరే ఉంటాయి కాబట్టి. అయినా ఇప్పుడు కోపం రావట్లేదు. అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా. అలాంటి వాళ్ళని కరెక్ట్ చేయడం కంటే కూడా నాకు అంతకంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఒక త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేస్తానని చెప్పి క్యూరియాసిటీని పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment