దమ్ముంటే వారిని అనండి.. అనసూయ ట్వీట్‌ వైరల్‌ | Anasuya Bharadwaj Latest Satirical Cryptic Tweet Goes Viral On Social Media, Tweet Inside | Sakshi
Sakshi News home page

దమ్ముంటే వారిని అనండి.. అనసూయ ట్వీట్‌ వైరల్‌

Published Thu, Jul 25 2024 12:05 PM | Last Updated on Thu, Jul 25 2024 12:45 PM

Anasuya Bharadwaj Latest Tweet Goes Viral

యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుంందో అందరికి తెలిసిందే. ప్రతి రోజు తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అంతేకాదు తన వ్యక్తిగత విషయాలను, సమాజంలో జరుగుతున్న సంఘటనలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంది. ఆమె చేసే ట్వీట్లు చాలా సార్లు కాంట్రవర్సీకి దారి తీశాయి. అయినా కూడా అనసూయ ఎక్కడ తగ్గట్లేదు. తనను నచ్చిన విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్‌ ఒకటి మళ్లీ చర్చనీయాంశంగా మారింది.  ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్‌ చేసిందో తెలియదు కానీ..అది కాస్త వైరల్‌ అయి మళ్లీ అనసూయ వార్తల్లో నిలిచింది.

అనసూయ చేసిన ట్వీట్‌ ఏంటంటే..
‘మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలాగండి? నిజంగా మీకు దమ్ముంటే నా మీద కాదు..  తరచూ నేను ఏం చేసినా ఆ టాపిక్‌ లాగేవారిని అనండి. కానీ మీరు అలా చేయరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది. 

(చదవండి: రెండోసారి గుడ్‌ న్యూస్‌ చెప్పిన హీరోయిన్‌)

కాగా, గతంలో ఓ యంగ్‌ హీరోని ఉద్దేశించి  అనసూయ చేసిన ట్వీట్‌పై ఇప్పటికీ ట్రోల్స్‌ నడుస్తూనే ఉంటున్నాయి. అనసూయ పెట్టే ప్రతి ప్రెస్‌ మీట్‌లోనూ ఆ వివాదం గురించి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అయితే అనసూయ కూడా తప్పించుకోకుండా ఓపిగ్గా సమాధానం చెబుతూనే ఉంటుంది.  ఇప్పుడు చేసిన ట్వీట్‌ కూడా ఆ వివాదం గురించేనని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు.  కాగా, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన సింబా సినిమా ఆగస్ట్‌ 9న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement