రొమాంటిక్ సినిమాల్లో న‌టిస్తా: నిహారిక‌ | Im Not Samantha, Doing A Romantic Film Says Niharika konidela | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ సినిమాల్లో న‌టిస్తా: నిహారిక‌

Published Wed, Apr 22 2020 5:13 PM | Last Updated on Wed, Apr 22 2020 6:14 PM

Im Not Samantha, Doing A Romantic Film Says Niharika konidela  - Sakshi

సినీ ప్ర‌ముఖులు లైవ్ ద్వారా అభిమానుల‌కు అందుబాటులో ఉంటూ కావాల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నారు. బుధ‌వారం మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా పెళ్లి త‌ర్వాత కూడా సినిమాల్లో న‌టిస్తారా అని  అడిగిన ఓ ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. నేనేమైనా స‌మంత‌నా? పెళ్ళి తర్వాత నటిస్తానా లేదా అనేది ముందుగానే చెప్పలేను అంటూ పేర్కొంది.  

అనంతరం రొమాంటిక్ జాన‌ర్‌లో నటించడం గురించి మాట్లాడుతూ.. గ్లామరస్ పాత్రలు కూడా పోషించబోతున్నా. తమిళ ప్రాజెక్టు రొమాంటిక్ చిత్రంగా రూపుదిద్దుకోబోతుంది. త్వరలోనే గోవాలో ఈ సినిమా షూటింగ్ జరగబోతుంది అని నిహారిక చెప్పుకొచ్చింది. మంచి  స్క్రిప్టులు సెల‌క్ట్ చేసుకొని  వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను అని తెలిపింది. కాగా ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నిహారిక.. ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ చిత్రాల్లో నటించారు. కానీ ఈ సినిమాలు ఆమెకు ఆశించినంత విజయాన్ని అందించలేదు. 2019లో వచ్చిన సైరా నరసింహా రెడ్డిలో చిన్న పాత్రలో త‌ళుక్కుమ‌న్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement