అతిథి పాత్రలో మంచు హీరో | Manchu Manoj Guest role in Tarun Idi Na love Story | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 13 2018 10:21 AM | Last Updated on Tue, Feb 13 2018 10:21 AM

Manchu Manoj - Sakshi

మంచు మనోజ్‌

ఒకప్పుడు లవర్‌ బాయ్‌గా సత్తా చాటిన యంగ్ హీరో తరుణ్‌, లాంగ్‌ గ్యాప్‌ తరువాత చేస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇది నా లవ్‌ స్టోరి’. సక్సెస్‌ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణ్‌ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వస్తానని నమ్మకంగా ఉన్నాడు. రమేష్‌, గోపిలు సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్‌ కానుంది.

ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ సినిమాకు సంబందించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తరుణ్ సరసన బిగ్‌బాస్‌ ఫేం ఓవియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు వారబ్బాయి మనోజ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. కన్నడ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో తరుణ్ తిరిగి ఫాంలోకి వస్తాడేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement