నాగ్ సాయం నిలబెడుతుందా..? | Nagarjuna Unveils Teaser of Tarun film idi na love story | Sakshi
Sakshi News home page

నాగ్ సాయం నిలబెడుతుందా..?

Published Fri, May 5 2017 11:25 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగ్ సాయం నిలబెడుతుందా..? - Sakshi

నాగ్ సాయం నిలబెడుతుందా..?

ఒకప్పుడు లవర్ బాయ్గా ఓ వెలుగు వెలిగిన యంగ్ హీరో తరుణ్, తరువాత వరుస ఫ్లాప్లతో ఫేడ్ అవుట్ అయిపోయాడు. మధ్యలో ఒకటి రెండు సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉండిపోయిన తరుణ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు.

కన్నడలో సూపర్ హిట్ అయిన ప్రేమకథను 'ఇది నా లవ్ స్టోరి' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. కన్నడ మలయాళ సినిమాల్లో బిజీగా ఉన్న ఓవియా ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. రమేష్ గోపి దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా టీజర్ను మన్మథుడు నాగార్జున రిలీజ్ చేయనున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సీనియర్ హీరో నాగ్ రిలీజ్ చేస్తే తరుణ్ సినిమాకు హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి కావచ్చిన ఈ సినిమాను మే చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement