తరుణ్‌ లుక్‌ అందరికీ నచ్చుతుంది – నాగార్జున | Tarun look good for everyone - Nagarjuna | Sakshi
Sakshi News home page

తరుణ్‌ లుక్‌ అందరికీ నచ్చుతుంది – నాగార్జున

Published Sat, May 6 2017 12:19 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

తరుణ్‌ లుక్‌  అందరికీ నచ్చుతుంది  – నాగార్జున - Sakshi

తరుణ్‌ లుక్‌ అందరికీ నచ్చుతుంది – నాగార్జున

‘‘ఇది నా లవ్‌స్టోరి టైటిల్‌ బాగుంది. టీజర్‌ చాలా ఫ్రెష్‌గా ఉంది. తరుణ్‌ లుక్‌ అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రం పెద్ద హిట్‌ అయ్యి తనకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ టీమ్‌కి నా అభినందనలు’’ అని నాగార్జున అన్నారు. అభిరామ్‌ సమర్పణలో రామ్‌ ఎంటర్‌టైనర్స్‌ బ్యానర్‌పై రమేష్, గోపి దర్శకత్వంలో ఎస్‌.వి ప్రకాష్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరి’. తరుణ్, ఓవియా జంటగా నటించారు. ప్రస్తుతం పోస్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం అక్కినేని నాగార్జున ఆవిష్కరించారు.

‘‘నాగార్జునగారి ప్రోత్సాహం మా అందరిలో కొత్త ఉత్సాహన్ని నింపింది. కన్నడంలో ఘనవిజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగులో ‘ఇది నా లవ్‌స్టోరి’గా రిమేక్‌ చేశాం. ఒక అమ్మాయిని ఎంతకాలం ప్రేమించామన్నది కాదు, ఎంతగా ప్రేమించామన్నదే ముఖ్యం అన్న కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశాం. తరుణ్, ఓవియా అద్భుతంగా నటించారు. సినిమాను త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు ఎస్వీ ప్రకాష్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement